Dec 21, 2017

బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రాధాన్య ఇవ్వండి


ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో సీఎం
              సచివాలయం, డిసెంబర్ 20: బడ్జెట్ ప్రతిపాదనకు శాఖాధిపతులు  చేసే కసరత్తు ప్రభుత్వ పథకాలు సక్రమమైన రీతిలో అమలు చేయడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనకు ప్రభుత్వ శాఖలు అనుసరించవలసిన విధానాలను, బడ్జెట్ పోర్టల్ లో డేటా అప్ డేట్ చేసే పద్దతులను తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలకు అత్యంత ప్రాధానత ఇచ్చి పూర్తి బడ్జెట్ సమాచారాన్ని త్వరగా అప్ డేటా చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. పథకాల అమలు విషయంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని ప్రాంతాలకు ప్రధాన్యత ఇవ్వాలని, సమానంగా ఖర్చు చేయాలని సీఎస్ చెప్పారు.
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించి సీనియర్ స్థాయి అధికారులకే కాకుండా అందరికీ తెలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని శాఖాధిపతులతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిపాదనలు తయారు చేయడం ఉమ్మడి బాధ్యత అన్నారు. కొన్ని శాఖ వారు వివిధ పథకాల కింద చేసిన ఖర్చులను ఒకే ఖాతా కింద చూపుతున్నార, అలా కాకుండా వేరువేరు ఖాతాలు నిర్వహించాలని చెప్పారు.
బడ్జెట్ పోర్టల్ లో శాఖాధిపతులు లాగిన్ అవడం, పాస్ వర్డ్ మార్చడం, బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఏర్పాటు చేసిన అంశాలను, ఎంపిక చేసుకుకోవడం, వాటిని ఉపయోగించే విధానాలను ఆర్థిక శాఖాధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వంలో వివిధ కేటగిరీల కింద పని చేసే హోం గార్డ్స్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, అంగన్ వాడీ కార్యకర్తలు వంటి వారి పూర్తి వివరాలు పోర్టల్ లో అప్ డేట్ చేసే విధానం వివరించారు.  అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించి పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నింపవలసి ఉంది. అలాగే ఖర్చులకు సంబంధించి వాహనాలు, పెట్రోల్ వంటి వివరాలు 9 రకాల పద్దతులలో ఎలా నింపాలో వివరించారువ్యయానికి సంబంధించి వివిధ ఖాతాల వివరాలు  తెలిపారు. శాఖాధిపతులు అడిగిన అనుమానాలను వివృత్తి చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...