Dec 2, 2017

మ్యానిఫెస్టో అమలుకు కృషి


ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి
సచివాలయండిసెంబర్ 2: ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. కాపుశెట్టిబలిజఒంటరి కులాల వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక ప్రకారం ఆ కులాల వారికి విద్యవైద్యంఉద్యోగఉపాధిసంక్షేమ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని 9వ షెడ్యూల్ లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేస్తుందని చెప్పారు. బోయ(వాల్మీకి) కులస్థులను ఎస్టీల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేస్తుందన్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో తమ ప్రభుత్వం ముందుందన్నారు. 84 లక్షల మందికి రూ.24 వేల కోట్ల రుణమాఫీ ఒక అసాధారణ రికార్డు అని తెలిపారు. రేషన్ కార్డు ద్వారా ఒక్కో పేదవానికి ఇచ్చే బియ్యం 4 కిలోల నుంచి 5 కిలోలకు పెంచినట్లు చెప్పారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు రూ.70 వేల కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి 2017-18 బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించామని,  దానికి సంబంధించి విధివిధానాలు రూపొందింస్తున్నారనిత్వరలో దానిని అమలు చేస్తామని మంత్రి పల్లె చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...