Dec 2, 2017

శాసనసభ మీడియా పాయింట్ 02.12.2017 శనివారం


విష్ణు కుమార్ రాజు, బీజేపీ శాసనసభ పక్ష నేత
1.   పోలవరం విషయంలో గత రెండు రోజుల నుండి మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఏమి లేని దానికి రాద్ధాంతం చేస్తున్నారు.
2.     రాష్ట్ర జలవనరుల శాఖ నవంబర్ 16న  పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి రూ.1395 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 4వ తేదీ లోపల టెండర్ దాఖలు చేయాలని తెలిపారు. కానీ 22 తేదీ వరకు ఆన్ లైన్ ఇ-ప్రొక్యూర్ మెంట్ సైట్ లో  టెండర్ డాక్యుమెంట్ అప్ లోడ్ చెయ్యలేదు.
3.    టెండర్ దాఖలుకు కేవలం 18 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. కనీసం 45 రోజులు ఇవ్వాలి.
4.   విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారి  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
5.   నవంబర్ 30న వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన  టెండర్ విలువను రూ.1483 కోట్లుగా పేర్కొన్నారు. టెంబర్ నెంబర్ మార్చలేదు. అందులో విలువ పెంచారుదాంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
 6.    ఒక ఎంపీ గారు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్  ఆపితే ఎమ్మెల్యేలు  ఆస్తులు అమ్మి నిర్మాణం చేస్తామన్నారు.
7.     ఆస్తులు అమ్మి పోలవరంకి ఖర్చు పెట్టవలసిన పని లేదు. ప్రజల ధనాన్ని దోచుకోకుండా ఉంటే చాలు పోలవరం మేము నిర్మాణం చేస్తాం.
8.   ఇది టెక్నికల్ గా తలెత్తిసన సమస్యేకానీ మరొకటికాదు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.
9.   సీఎంకి వాస్తవాలు చెప్పి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు.
10.                     పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన ప్రాజెక్ట్. దీనిని కేంద్రం పూర్తి చేస్తుంది. ఈ విషయంలో తగ్గేదిలేదు.
11.                       బీజేపీ కబ్జా లు చెయ్యదు.  కబ్జాలు చేసే వారికి చెక్ పెడుతుంది.
 -------------------------------------------------
శాసనసభ మీడియా పాయింట్ 02.12.2017 శనివారం
స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి
1.    అగ్రిగోల్డ్ బాధితులు వివిధ రాష్ట్రాల్లో 19.50 లక్షల మంది ఉన్నారు.
2.    రూ.7వేల కోట్లు చెల్లించాలి.
3.    150 మంది బాధితులు మరణించారు.
4.   మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ఇప్పటివకు ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలి.
5.    సంస్థ ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారం చెల్లించాలి.
6.     2003లో డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలివారి పోటీ పరీక్ష ఫలితాలు 2 నెలలు ఆలస్యం అవడం వలన వారిని కొత్త పెన్షన్ విధానం కిందకు వచ్చారు.
7.     రాష్ర్టంలో 11 జిల్లాలు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటికీ సురక్షిత మంచి నీటిని సరఫరా చెయ్యాలని ప్రశ్నోత్తరాల సమయంలో అడుగగా 2019 నాటికి అన్ని గ్రామాలకు సురక్షిత నీరు అందిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
---------------------------------------------------------------
శాసనసభ మీడియా పాయింట్ 02.12.2017 శనివారం
పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి, రాము సూర్యారావు
1.   రాష్ట్రం విడిపోయిన తరువాత ఇంకా 5 వేల మంది ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులు తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు.
2.    వారిని ఇక్కడకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
3.    భార్యాభర్తలు, మ్యూచ్చువల్  తెచ్చుకున్న వారిని ఇక్కడకు తెస్తామని అంటున్నారు. అటువంటివారు 387 మంది  మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు అందరూ  అక్కడే ఉంటే ముందు ముందు సమస్యలు తలెత్తుతాయి. వారి పిల్లలు తెలంగాణ లోకల్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
4.    వన్ టైం సెటిల్ మెంట్ క్రింద వారిని అందరిని రాష్ట్రానికి తీసుకురావాలి.
5.    శాసన మండలిలో ఒకే రోజు14 ప్రశ్నలు, 8 బిల్లులు, 2 స్వల్పకాలిక చర్చలు పెట్టారు. మండలిపై కూడా వత్తిడి పెరుగుతోంది. ప్రశాంతంగా చర్చ జరిగే అవకాశం లేదు.
6.    మండలిలో తక్కువ సభ్యులు ఉంటారు. విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కాని పరిస్థితి ఇలాగే ఉంటే సభలో మాట్లాడే విషయాలు బయట మాట్లాడవలసి వస్తుంది.
---------------------------------------------
శాసనసభ మీడియా పాయింట్ 02.12.2017 శనివారం
తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి
1.   నిరుద్యోగంపై స్వల్పకాలిక చర్చ మాత్రమే జరిగింది.
2.   కరువు ప్రాంత ప్రాజెక్టులైన వెలుగొండ, హంద్రీ నివా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
3.   రాష్ట్రంలో లక్షా 80వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
4.   అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరతగా ఉంది.
5.   30వేల ఉపాధ్యాయ, 3 వేలు కాజీలే, 5వేలు డిగ్రీ కాలేజీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
6.   35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
7.   నిరుద్యోగ భృతి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
8.   నిరుద్యోగ సమస్యపై భారీ ఉద్యమం చేపడతాం.
9.   విశ్వవిద్యాలయాలు అనాధ శరణాలయాలుగా మారాయి.
10.                     నిరుద్యోగుల పోరుబాట
11.                     మండలిలో సమస్యలు చర్చించడానికి ఎక్కువ సమయం కావాలి.

శాసనసభ మీడియా పాయింట్ 02.12.2017 శనివారం
బీజేపీకి చెందిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్
1.   సమావేశాలు సజావుగా జరిగాయి.
2.   ప్రతిపక్షం లేనిలోటు కనిపించింది.
3.   పొగడ్తలకు ఎక్కువ సమయం కేటాయించారు.
4.   ఆత్మహత్యలపై సమగ్ర చర్చ జరగాలి.
5.   ఇంటర్ విద్య సంస్కరణలకు ఇది సరైన సమయం.
6.   పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు.
7.   ఒక్క బోటు ప్రమాదంపై సరైన రీతిలో చర్చ జరిగింది.
8.   కాపుల రిజర్వేషన్ ను స్వాగతిస్తున్నాం.  ఈ అంశంపై ఎక్కువ చర్చకు అవకాశం లేకుండాపోయింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...