Oct 17, 2017

బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ


సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు
సచివాలయం, సెప్టెంబర్ 16: వెనుకబడిన కులాల(బీసీ)కు తొలి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయంలో  ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష వైసీపి నేత జగన్మోహన రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వందల కోట్ల రూపాయల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు. ఫీజులు చెల్లించడానికి బీసీ విద్యార్థులు రక్తం అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.
టీడీపీ పార్టీ పుట్టుకతోనే బీసీల ఆత్మగౌరం ప్రారంభమైందన్నారు. టీడీపీ బలం, బలగం, వెన్నుముక బీసీలేనని చెప్పారు. మూడున్నర దశాబ్దాలుగా బీసీలు టీడీపీతోనే ఉన్నారని, తమ భ్యవిష్యత్ టీడీపీతోనేనని వారు నమ్ముతున్నట్లు తెలిపారు. మంత్రి పదవులు ఇవ్వడంలో టీడీపీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, ఉప ముఖ్య మంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్థిక  మంత్రి యనమల రామకృష్ణుడు వంటి వారు కీలక పదవులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వైఎస్ కాలంలో ఒక్క బీసీ నేత ఉన్నారా అని ప్రశ్నించారుతమ ప్రభుత్వం నిర్థిష్టమైన పాలసీని రూపొందించుకొని అమలు చేస్తుందని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీసీల కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీసీల స్వయం ఉపాధికి రూ.930 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.2 వేల కోట్లు, హాస్టళ్లకు రూ. 350 కోట్లు, స్కాలర్ షిప్ లకు రూ. 330 కోట్లు, ఎన్టీఆర్ విద్యా పథకం కింద విదేశీ విద్యకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
తమ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావు బీసీలకు అత్యుత్తమ విద్య అందించడానికి గురుకుల పాఠశాల ఏర్పాటుకు రూపకల్పన చేశారని, ఆ తరువాత చంద్రబాబు నాయుడు మారుమూల ప్రాంతాల్లో కూడా గురుకుల పాఠశాలలు నెలకొల్పారని చెప్పారుఇప్పుడు రూ. 2380 కోట్లతో కొత్తగా 65 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, 7 వేల మంది సిబ్బందిని నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేదలు ఈ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావించి, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అయిదున్నరేళ్ల కాలంలో బీసీలకు ఎంత ఖర్చు చేశారో చర్చకు రావాలని వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. రూ.3600 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉంచారని, చేనేత, ఇతర చేతి వృత్తుల వారు 2వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నరని, బీసీల పేరు ఎత్తడానికి వైఎస్ఆర్ సీపీకి అర్హతలేదన్నారు. టీవీ చానెల్ ఉందిగదా అని గోబెల్స్ ప్రచారం చేస్తే నమ్మే ప్రజలు లేరని మంత్రి కాలవ అన్నారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...