రాత్రి, పగలు వేగంగా సాగుతున్న‘పోలవరం’ పనులు
Ø ఎన్నికల ముందే 2019 నాటికి పూర్తి
Ø
చరిత్రలో నిలిచిపోయేవిధంగా సీఎం పనుల సమీక్ష
Ø
రూ.58,319 కోట్లకు చేరిన అంచనా వ్యయం
Ø
కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి తీవ్ర ప్రయత్నాలు
Ø
నదులు అనుసందాలించాలన్న దృఢ సంకల్పంతో
చంద్రబాబు
Ø కేంద్రం కూడా అత్యంత ప్రధాన్యత
ఇస్తున్న ప్రాజెక్ట్

1941లో ప్రతిపాదించిన ఈ
ప్రాజెక్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గోదావరి
నదీజలాల పంపిణీ కోసం ఉమ్మడి ఏపి,
ఉమ్మడి ఎంపీ, మహారాష్ట్రల మధ్య 1969లో ట్రిబ్యునల్
ఎర్పాటైంది. ఈ మూడు
రాష్ట్రాల మధ్య 1978 ఆగస్టు
ఏడున పోలవరం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 150 ప్లస్ అడుగులతో పోలవరం నిర్మించేందుకు1979 నవంబర్ 27న ఈ మూడు
రాష్ట్రాలు గోదావరి ట్రిబ్యునల్ ముందు అంగీకారం తెలిపాయి. 1980లో అప్పటి ఏపీ సీఎం అంజయ్య పోలవరం ప్రాజెక్టు
నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాస్తవానికి1982లోనే దీని నిర్మాణ పనులను
ప్రారంభించారేగానీ, తగిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు పనులలో వేగం పెంచి రాష్ట్రానికి జీవనాడి
వంటి ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా
ప్రకటించారు. గోదావరి,
కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామాయప్పేట
వద్ద నిర్మాణంలో ఉన్న బహుళార్థసాథక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిస్సా,
చత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్ణాటక,
తమిళనాడు కూడా లబ్ది పొందుతాయి. విశాఖపట్నం,
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలలో 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు,
540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది ప్రజలకు
త్రాగునీటిని అందిస్తుంది. పారిశ్రామిక
అవసరాలకు 23. 44 టిఎంసీల నీటి
సరఫరాతోపాటు 960 మోగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాక
జలరవాణాకు, చేపల పెంపకానికి ఉపయోగపడే ఓ బృహత్తర ప్రాజెక్టు
ఇది. గంగా-కావేరి నదుల అనుసంధానంలో పోలవరం పథకం కూడా ఒక భాగం. ఈ పథకంలో భాగంగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి
మళ్లిస్తారు. మిగులు జలాలు
అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత ఉండే నదులకు మళ్లిస్తారు.
ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు 1946-47లో ఇచ్చిన నివేదిక
ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 129 కోట్లు. అప్పట్లో భద్రాద్రి రాముని పేరు మీద దీనిని ‘రామపాద సాగరం’
అని పిలిచేశారు. ప్రాజెక్టు
నిర్మాణ అంచనా వ్యయం 1985-86లో రు.2,665 కోట్లు కాగా,
2009లో ప్రణాళికా సంఘం 2005-06 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు
అంచనా వ్యయాన్ని రూ.10,151.04 కోట్లుగా
పేర్కొంది. అయితే కేంద్ర
జలవనరుల శాఖ సలహా కమిటీ 2011 జనవరిలో
అప్పటి ధరలలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్లుగా నిర్ధారించింది. నూతన భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూసేకరణకు,
పునరావాస పథకం వ్యయంతో కలిపి లెక్కిస్తే మొత్తం రూ.58,319 కోట్లకు చేరుతుందని అంచనా. బహుళార్థసాఃధక ప్రాజెక్టు అవడం,
భూసేకరణ, పునరావాసాల వ్యయం అనూహ్యంగా పెరగడం వల్ల కూడా
ప్రాజెక్ట్ వ్యయం అంచనాలకు మూడు రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యం అవుతున్నా
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనులను ఆపకుండా జోరుమీద కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు అయిన వ్యయాన్ని కేంద్రం నుంచి
రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మన ఎంపీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇటీవల ఢిల్లీ పర్యటలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి, నాగపూర్ వెళ్లి గట్కారీకి ప్రాజెక్ట్ పురోగతిని
వివరించి, తాజా అంచనాల ప్రకారం భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని
నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కూడా సానూకూలంగా స్పందించారు. పనులు చేయించడంలో, చేయడంలో ఈ వేగం ఇలాగే కొనసాగితే 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్
పూర్తి అవడం ఖాయం.
- శిరందాసు
నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment