Oct 23, 2017

అవగాహనలేని విమర్శలు తగదు


మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
సచివాలయం, అక్టోబర్ 23: ముఖ్యమంత్రి విదేశీపర్యటనపై వైఎస్ఆర్ సీపీ, కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అవగాహన లేకుండా మాట్లాడటం తగదని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హితవుపలికారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడులు రాబట్టాలంటే రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రజంటేషన్ రూపంలో తెలియజేయవలసిన అవసరం ఉందని, ఆ క్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలో తీరికలేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.2.60 లక్షల కోట్ల పెట్టుబడులు, మూడు లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఇంటర్ నెట్ లో చూస్తే వాస్తవాలు  తెలుస్తుందన్నారు. దుబాయ్ లో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో విమానాశ్రయాలు, రహదారుల నిర్మాణానికి రెండు బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు (ఎంఓయులు) జరిగాయని చెప్పారు. ఆలోచన, అవగానలేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. సైబరాబాద్ పై  ఆనాడు హాస్యాస్పదంగా మాట్లాడారని, ఈ రోజు దానిని చూస్తే వారికి నోట మాటరాదని చెప్పారు. ఆదాయ వనరుల పెంచుకొని అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో ఇజ్రాయిలో వెళ్లారని, ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు. ఓక్స్ వ్యాగన్ మరో ప్రాంతానికి తరలి వెళ్లిందన్నారు. ఐఏఎస్ లు, మంత్రులు, వ్యాపారవేత్తలు జైళ్లకు వెళ్లారని, ఈ విధంగా ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏవిధంగా ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. ఏడాదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితులను గాడిలోకి తీసుకువచ్చి, పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించి పెట్టుబడులు రాబడుతున్నరని చెప్పారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడులు వస్తాయన్నారు.
ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని అతి తక్కువ కాలంలో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు సమీకరించారని, 5 కోట్ల మంది ప్రజలు గర్వపడేవిధంగా, తరతరాలు గుర్తుంచుకునేవిధంగా రాజధాని నిర్మిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపు వస్తుందన్నారు. తక్కువ కాలంలోనే సచివాలయం, శాసనసభ నిర్మాణం పూర్తి చేసి చూపించాని గుర్తు చేశారు. ఒక పక్క వీరంతా విమర్శిస్తుంటే, మరో పక్క నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి పుల్లారావు అన్నారు.
పెట్టుబడులను అడ్డుకుంటూ ఉద్యోగాలు కావాలంటారు: లింగారెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత పాదయాత్రకు అనుమతి కావాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ ఎం.లింగారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు రాబడుతుంటే, వైఎస్ హయాంలో సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతి సిమెంట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారన్నారు. విశాఖలో జరిగిన సదస్సు వద్ద ఆందోళన చేసి పెట్టుబడులు రాకుండా  అడ్డుకుంటూ ఉద్యోగాలు కావాలని అడగటం తల్లిదండ్రులను చంపి పిల్లలు అనాధలయ్యారని అన్నట్లు ఉందని  లింగారెడ్డి విమర్శించారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...