Oct 18, 2017

గంజాయి సాగుపై ఉక్కుపాదం


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సచివాలయం, సెప్టెంబర్ 18:       రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు పగడ్భందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సీఎస్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులతో గంజాయి సాగుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. గంజాయి సాగును నిర్మూలించేందుకు పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఉమ్మడి టాస్క్ ఫోర్స్, చెక్ పోస్టులు ఏర్పాటు వంటి అంశాలను సమావేశంలో చర్చించారు.
గంజాయి సాగుకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట  గంజాయి సాగు ఎక్కువగా జరుగుతోందని చెప్పారుదీంతో ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు సిబ్బందికి కష్టంగా ఉందని, కొండ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన ప్రయాణ సౌకర్యం లేకపోవడం కూడా గంజాయి సాగును అరికట్టేందుకు అడ్డంకిగా మారిందని వివరించారు. సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు,  సిబ్బంది మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎండిన గంజాయి ఆకుని సీజ్ చేయడం, గంజాయి తోటలను ధ్వంసం చేయడంతో పాటు మాదకద్రవ్యాల చట్టం  కింద కేసులు  నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డీజీపీ నండూరి సాంబశివ రావు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...