సచివాలయం,
అక్టోబర్ 25: దివంగత మాజీ ప్రధాన
మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజును ప్రభుత్వం ‘రాష్ట్రీయ సంకల్ప దివాస్’ నిర్వహించాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్వి (సీఎస్) దినేష్ కుమార్ బుధవారం
ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది ఆమె
వర్ధంతి రోజైన 31 అక్టోబర్ నాడు రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తుంటారని, అదేమాదిరి ఈ ఏడాది కూడా సచివాలయంలోని అన్ని శాఖల, శాఖాధిపతుల కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో
రాష్ట్రీయ సంకల్ప దివాస్ సందర్భంగా ర్యాలీలు, జాతీయ,
దేశభక్తి గీతాలు ఆలపించడం, ముఖ్యమైన వ్యక్తులు, యువజన నేతలతో ప్రసంగాలు వంటి కార్యక్రమాలు
నిర్వహించాలని ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ
కార్యక్రమాలు స్థానిక అధికారుల, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించడానికి యువజన, పర్యాటక,
సాంస్కృతి శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఆయా శాఖల బడ్జెట్ లో కేటాయించిన మేరకు శాఖా కార్యాలయాలు, జిల్లాల్లోని అధికారులు ఈ
కార్యక్రమాలకు నిధులు వినియోగించాలని తెలిపారు. సచివాలయంలో ‘రాష్ట్రీయ సంకల్ప దివాస్’ నిర్వహించడానికి సాధారణ
పరిపాలనా శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment