Oct 11, 2017

కోర్టు అనుమతిలేకుండా జగన్ పాదయాత్ర తేదీ ఏలా ప్రకటిస్తారు?


గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య
దేశంలో పటిష్టంగా ఉన్న న్యాయవ్యవస్థ
న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పాలి
           

             సచివాలయం, అక్టోబర్ 11: గౌరవ న్యాయస్థానం అనుమతిలేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డి తన పాద యాత్ర తేదీని ఎలా ప్రకటిస్తారని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య ప్రశ్నించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీసెల్ లో బుధవారం ఉదయం ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల పట్ల ఆయన వైఖరి అర్ధం కావడంలేదన్నారు. 11 కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావలసిన అవసరం ఉందని, కోర్టు అనుమతిలేనిదే ఆయన ఎక్కడికీ వెళ్లలేరని, ఆయన స్వేచ్ఛాజీవికాదని అన్నారు. తన 6 నెలల పాదయాత్రకు అనుమతి ఇవ్వవసిందిగా ఆయన కోర్టును అభ్యర్థించారని, కోర్టు అనుమతించకుండానే నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించడమంటే, న్యాయవ్యవస్థపై పెత్తనం చేయాలని చూస్తున్నట్లుగా ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏ ఉద్దేశంతో తేదీ ప్రకటించారో చెప్పాలన్నారు. ఈ విధంగా తేదీ ప్రకటించడం కోర్టులపై వత్తిడి పెంచడమేనని పేర్కొన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, ఆ వ్యవస్థపై గౌరవంగా లేకుండా ప్రవర్తించడం భావ్యం కాదన్నారు. న్యాయవ్యవస్థకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ కూడా దీనిని తీవ్రంగా పరిగణించాలన్నారు. కోర్టు అనుమతిస్తే తమకు అభ్యంతరంలేదని, కోర్టులపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అతనిపై ఉన్న కేసుల విషయంలో కోర్టులు తీర్పు ఇస్తే జైలుకు వెళ్లవలసి వస్తుందని అతని న్యాయవాదులతోపాటు పీకే కూడా చెప్పడంతో భయం పట్టుకుందని, దాంతో జగన్ తప్పటడుగులు వేస్తున్నారని రామయ్య అన్నారు

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...