Oct 6, 2017

వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత


శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి
మంత్రి కొత్త చాంబర్ ప్రారంభం
సచివాలయం, అక్టోబర్ 5: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్, మొదటి అంతస్తులోని 208 రూమ్ లో శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి తన కొత్త ఛాంబర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రధమ ప్రాధాన్యత  వ్యవసాయమేనని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి  సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి, భూసారం, వాతావరణం ప్రాతిపదికగా ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు చిన్న, సన్నకారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం  అందించేందుకు బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ఆ ఫౌండేషన్ తో ప్రభుత్వం త్వరలో ఒక ఒప్పందం కూడా  చేసుకోనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత ఎక్కువగా పనిచేస్తామని మంత్రి చెప్పారు. కొత్త ఛాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల శాసనసభ్యుడు భూమా బ్రహ్మానంద రెడ్డి, పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దామోదర్ నాయుడు, ఉద్యానవన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...