Ø ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయ ఋణ ఉపశమన పథకం – 2014 అమలు
Ø 2 విడతల్లో 57.27 లక్షల మంది రైతులకు రూ.11.84 వేల కోట్లు చెల్లింపు
Ø
10 శాతం
వడ్డీతో రైతుల ఖాతాల్లో జమ
Ø 3వ విడత రూ.3,600 కోట్లు విడుదల

రాష్ట్రం అనేక విధాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం
రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే వస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 57.27 లక్షల మంది
రైతులకు రెండు వాయిదాలలో 11 వేల 84 కోట్ల
రూపాయలు విడుదల చేశారు. ఇందులో గిరిజన సహకార సంఘాల ద్వారా రుణం పొందిన 2761 మంది గిరిజన రైతులకు కూడా
రూ.1.88 కోట్లు విడుదల
చేశారు. మూడవ విడత మొత్తం రూ.3600 కోట్లు అవసరమవుతాయని
అధికారులు అంచనావేశారు. ఇందులో తొలి దఫాగా రూ.1000 కోట్లను రైతుసాధికార సంస్థ పీడీ ఖాతాకు
ఇప్పటికే జమ చేశారు. మిగిలిన
మొత్తాన్ని ఈ నెలాఖరులోపల మరో రెండు దఫాలుగా విడుదల చేస్తారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రూ.50 వేల లోపు
బాకీ ఉన్న రైతులకు ఏక మొత్తంలో రుణ ఉపశమనం ద్వారా లబ్ది
చేకూర్చారు. రాజధాని
ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణకు తోడ్పడిన రైతులకు,
అదే విధంగా చనిపోయిన రైతు ఖాతాలకు రూ. 1.50 లక్షల లోపు బాకీ ఉన్నట్లయితే ఏక మొత్తంలో ఋణ ఉపశమనం ద్వారా లబ్ది కల్పించారు. ఆ విధంగా 23.76 లక్షల మంది రైతులు ఏక మొత్తం చెల్లింపు ద్వారా లబ్ది పొందారు. వారికి ఖాతాలకు రూ. 4493 కోట్లు జమ
చేశారు. రైతు మిత్ర గ్రూపు
(ఆర్ఎంజీ), ఉమ్మడి బాధ్యత
గ్రూపు (జేఎల్జీ)కు చెందిన కౌలు
రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. 72,966 మంది కౌలు రైతులకు ఋణ ఉపశమనం కింద రూ.144 .53 కోట్లు
చెల్లించారు. ఈ రెండు
విభాగాల్లో 1.43 లక్షల మంది
రైతులకు ఋణ ఉపశమనం కింద రూ. 255.39 కోట్లు
విడుదల చేశారు.
ఈ పథకం కింద ఉపశమనం పొందడానికి అర్హత ఉన్నవారికి ఋణ ఉపశమన అర్హత పత్రా(ఆర్ యుఏపీ) లు
అందజేస్తున్నారు. రైతు కుటుంబ సభ్యుని పేరు,
బ్యాంకు ఖాతా వివరాలతో సెక్యూర్డ్ బాండ్స్ రూపంలో 14 .80 లక్షల పత్రాలు
పంపిణీ చేశారు. మూడవ వాయిదా
విడుదలకు బడ్జెట్ (2017-18)
లో ప్రతిపాదించిన విధంగా రూ.3,600 కోట్ల
రూపాయిలు వచ్చే నెలలో రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది. ఉద్యాన పంటలు ఉపశమనం ముందుగా ప్రకటించిన ప్రకారం
ఉద్యాన రైతులకు ఏక మొత్త ఋణ విమోచన ప్రయోజనం కల్పించడానికి
ఎకరానికి రూ. 10 వేల
చొప్పున ఒక్కో రైతుకు రూ. 50,000 వరకు, అలాగే కుటుంబ పరిమితికి లోబడి మొత్తం రూ.1.5 లక్షల వరకు ఇచ్చారు. 2.23 లక్షల మంది ఉద్యానవన రైతుల ఖాతాలకు రూ.384 కోట్లు జమ చేశారు.
-శిరందాసు
నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్.
No comments:
Post a Comment