సచివాలయం,
సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్
జలవనరుల విభాగం ఇంజనీర్లకు ఈ నెల 20, 21వ తేదీల్లో రెండు రోజుల పాటు ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఆల్టర్నేట్ డిస్పూట్ రిజొల్యూషన్ -
ఏడీఆర్) పద్ధతులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యామ్నాయ
వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం(ఐసీఏడీఆర్) కార్యదర్శి జెఎల్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడలోని నీటిపారుదల కాంపౌండ్ లోని రైతు శిక్షణ
కేంద్రంలో 20వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వర్క్ షాప్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా ఏపి జలవనరుల విభాగం
కమిషనర్ ఎం.గిరిధర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఐసీఏడీఆర్ సుప్రీం కోర్టు పరిధిలో పనిచేసే స్వయంప్రతిపత్తిగల
సంస్థ అని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి ముఖ్య నిర్ధేశకులుగా ఉంటారని
తెలిపారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు, ఇటీవల కాలంలో వచ్చిన సవరణలపై ఈ వర్క్ షాప్
నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంజనీర్లకు మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)కు సంబంధించిన నైపుణ్యతలు, మెళకువలు, లాభాలు ప్రధాన శిక్షకులు వివరిస్తారని మూర్తి
పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment