Sep 19, 2017

సమర్థవంతంగా గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం అమలు

       ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రధాన ఉద్దేశం రైతులకు అన్ని విధాల సహాయపడటం. ఈ సంస్థ మినీ ఫీడ్ మిక్చర్ ప్లాంట్లను సమకూరుస్తుంది. అలాగే ఘనజీవామృతం, వెర్మీకంపోస్ట్ తయారు చేయడానికి సహకరించడంతోపాటు విత్తనాలు పంపిణీ చేస్తుంది. సేంద్రీయ ఎరువులు, పోషక విలువలున్న మొక్కల పెంపకం, కోళ్ల ఫారాలు, రూరల్ రిటైల్ చైన్ మార్ట్స్ వంటి విషయాలలో రైతులకు సహాయపడుతుంది. వివిధ పంటలు పండించే రైతులతోపాటు కూరగాయలు, మామిడితోటలు, జీడిమామిడితోటలు, చింతమండు, వేరుశనగ, గొర్రెలు,మేకలు పెంపకం, కోళ్ల పెంపకం, డెయిరీ, అన్న సంజీవనీ జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వివిధ జిల్లాల్లో చేపట్టిన పనులను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాను మే 29న ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం) జిల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారుజిల్లాలోని అన్ని మండలాల్లో లక్ష్యం మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు(ఐహెచ్ హెచ్ ఎల్) నిర్మించారు. చింతలపూడి, గోపాలపురం, తాళ్లపూడి,డి.తిరుమల, పెనుగొండ,జీలుగుమిల్లి, బుట్టాయి గూడెం, పోలవరం మండలాల్లో లక్ష్యం మేరకు కూరగాయ విత్తనాల సంచులు పంపిణీ చేశారు. ఆగస్ట్ నాటికి 124 గ్రామ పంచాయతీల్లో 866 రైతు ఉత్పత్తిదారుల బృందాలు ఏర్పాటు చేశారు. ఆ గ్రూపుల్లో 9,508 మంది రైతులను చేరారు.
తూర్పుగోదావరి జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు 10 ఏర్పడ్డాయి. కాట్రేనికొండ మండలంలో మరో సంస్థ ఏర్పాటుకు కమిషనర్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ జిల్లాలో 1197 రైతు ఉత్పత్తిదారుల గ్రూపులు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా కాగా, 1182 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో 17,035 మంది సభ్యులు ఉన్నారు. ఈ జిల్లాలో ఎక్కువమంది జీడి మామిడి తోటల రైతులు ఉన్నారు. ఈ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 26 గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జనరహిత ప్రాంతం)గా ప్రకటించారు. 2018 జూన్ నాటికి మొత్తం జిల్లాను ఓడీఎఫ్ గా ప్రకటించాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో 13 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో 1542 గ్రూపులు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంకాగా, 14,926 మందిని చేర్పించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 31,357 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. మిగిలిన మరుగుదొడ్లు కూడా చురుకుగా నిర్మిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని 5 మండలాల్లో  5 రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో 666 రైతు ఉత్పత్తిదారుల బృందాలు, 7,810 మంది రైతులు  ఉన్నారు. ఒక్కో బృందానికి రూ.10వేల రూపాయల చొప్పున 245 బృందాలకు ఆర్థిక సహాయం అందించారు.

విజయనగరం జిల్లాలోని 8 మండలాల్లో  8 రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో 922 రైతు ఉత్పత్తిదారుల బృందాలు, 10,475 మంది రైతులు  ఉన్నారు. ఒక్కో బృందానికి రూ.10వేల రూపాయల చొప్పున 164 బృందాలకు ఆర్థిక సహాయం అందించారు. రెండు మండలాల్లో రూరల్ రిటైల్ మార్ట్స్ ఏర్పాటు చేశారు.
 ప్రకాశం జిల్లాలోని 15 మండలాల్లోని 305 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం అమలవుతోంది. 15 రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో 1774 బృందాలు, 19,997 మంది రైతులు ఉన్నారు.

కడప జిల్లాలో 10 మండలాల్లో 11 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేశారు. వాటిలోని 626 బృందాలు రివాల్వింగ్ ఫండ్ తీసుకున్నాయి. ఈ జిల్లాలో 6 మండలాల్లో మహిళా చైన్ కిరాణా వర్తక సంఘాల ద్వారా 277 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లాలో 8 మండలాల పరిధిలో 7 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేశారు. 116 గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 778 బృందాల్లో 8,754 మంది రైతులు ఉన్నారు. 625 బృందాలు బ్యాంకు ఖాతాలు తెరవగా, 463 బృందాలు రివాల్వింగ్ ఫండ్ తీసుకున్నాయి. రూరల్ రిటైల్ చైన్ ద్వారా 246 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో  8 మండలాల్లో 26,368 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు.  104 గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్ గా ప్రకటించారు.

 కర్నూలు జిల్లాలో 16 మండలాల్లో ఏర్పాటు చేసిన 17 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు అనుబంధంగా ఉన్న 1318 రైతు ఉత్పత్తిదారుల బృందాల్లో 20,970 మంది రైతులు ఉన్నారు. వీరంతా వ్యవసాయ ఉత్పత్తులను పెంచి తద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిలోని 512 బృందాలకు రూ.51.20 లక్షల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేశారు.

గుంటూరు జిల్లాలో 31,446 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించగా,  53 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్ గా ప్రకటించారు. 10 మండలాల్లో ఏర్పాటు చేసిన 11 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు అనుబంధంగా ఉన్న 1286 రైతు ఉత్పత్తిదారుల బృందాల్లో 14,122 మంది రైతులు ఉన్నారు. 624 బృందాలకు రూ.6.24 లక్షల రివాల్వింగ్ ఫండ్ విడుదలైంది.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...