Sep 18, 2017

20 నుంచి 2రోజులు కలెక్టర్ల సమావేశం


సచివాలయం, సెప్టెంబర్ 13: విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 20,21 తేదీలలో రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను ప్రత్యేకంగా కలెక్టర్లకు తెలియజేస్తామన్నారు. కలెక్టర్లతోపాటు శాఖాధిపతులు ఎవరైతే తప్పనిసరిగా హాజరు కావలసిన అవసరం ఉంటుందో వారు మాత్రమే రావాలని పేర్కొన్నారు. తక్కువ మంది శాఖాధిపతులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించవలసిందిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను  డాక్టర్ మన్మోహన్ సింగ్ కోరారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...