Sep 14, 2017

18న ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం


సచివాలయం, సెప్టెంబర్ 13: ఈ నెల 18వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశ మందిరంలో ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం జరుగుతుందని ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శులు అందరూ హాజరయ్యే ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. సచివాలయంలోనూ, డిపార్ట్ మెంట్ హెడ్స్ కార్యాలయాల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ పనితీరు, -ఫైలింగ్ అమలు, ఫైళ్ల పరిష్కారం, బయోమెట్రిక్ హాజరు సమీక్షిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులు ఏ స్థితిలో ఉన్నాయో, వివిధ  కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల అంశాలను చర్చిస్తారని పేర్కొన్నారు. ప్రణాళికా శాఖ అందించే సమాచారాన్ని సమీక్షిస్తారని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన జీఓ ప్రకారం కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు గ్రామాల సందర్శనను సమీక్షిస్తారనిరాష్ట్ర విభజనకు సంబంధించి 9, 10 షెడ్యూల్ లోని సంస్థల విభజన, 13వ షెడ్యూల్ లోని సంస్థల పరిస్థితి, ఇంకా మిగిలి ఉన్న శాఖల తరలింపు అంశాలపై చర్చిస్తారని వివరించారు. వాజ్య విధానం అమలుతీరు, కోర్టు కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలపైన, ఇంకా ఇతర అంశాలు, కార్యదర్శుల అభిప్రాయాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ సమాచారాన్ని అందరికి తెలియజేయవలసిందిగా, సమావేశానికి ముందుగా సమగ్ర నివేదికను సాధారణ పరిపాలన(జీపీఎం అండ్ ఏఆర్) విభాగానికి పంపవలసిందిగా అందరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను, ముఖ్య కార్యదర్శులను, కార్యదర్శులను శ్రీకాంత్ ఆ ప్రకటనలో కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...