Sep 21, 2017

అమరావతిలో భూముల కేటాయింపు


Ø రైతులకు ప్లాట్లు అప్పగింత
Ø అక్టోబర్ లో పరిపాలన, న్యాయ నగరాలకు శంకుస్థాపన
          అంతర్జాతీయ స్థాయి మహానగరాల సరసన చేరేవిధంగా నిర్మించతలపెట్టిన నూతన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన సంస్థలకు భూ కేటాయింపులలో ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ), ఏడీసీ(అమరావతి అభివృద్ధి సంస్థ)లు చురుకుగా పనులు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన రహదారుల నిర్మాణం జరిగిపోవడం, మరికొన్ని జరుగుతుండటంతో నూతన నిర్మాణాలకు కావలసిన మెటీరియల్ రవాణాకు వీలు ఏర్పడింది. రాజధాని నిర్మాణ తొలి దశలో మొత్తం 21 ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సహా మొత్తం 19 ప్రధాన రహదారులకు ఏడీసీ టెండర్లు పిలిచింది. రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కూడా టెండర్లు పిలిచారు. విద్యుత్‌, కమ్యూనికేషన్‌ కేబుళ్లు, ఇతర పైప్‌లైన్‌లు వెళ్లేందుకు అవసరమైన మార్గాలను(డక్ట్‌) కూడా వీటిలో భాగంగానే నిర్మిస్తారు. కొన్ని టెండర్లు ఖరారై నిర్మాణాలు జరుగుతుండగా, మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ఓ పక్క ప్రైవేటు రంగంలో విద్యా సంస్థల భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి.  భూములు కేటాయిస్తే భవననిర్మాణ పనులు వెంటనే మొదలుపెడతామని ఆర్బీఐ, ఎస్ బీఐ వంటి బ్యాంకులు, ఇతర సంస్థలు తెలియజేశాయి. దాంతో భూముల కేటాయింపు, వాటి ధరల నిర్ణయం ప్రతిపాధనలను సీఆర్డీఏ సిద్ధం చేసింది. భూ సమీకరణలో భాగంగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు అందరికీ ప్లాట్లు ఇచ్చారు. వాటి రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయిఅమరావతిలో ముందుగా పరిపాలన, న్యాయ నగరాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహాలు, సూచన మేరకు లండన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ పరిపాలన, న్యాయ వ్యవస్థల భవనాల తుది ఆకృతులను రూపొందిస్తోంది. ప్రభుత్వ భవనాలను 1350 ఎకరాల్లో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తారు. సెంట్రల్ విస్టా కృష్ణానది నుంచి శాఖమూరు పార్క్ వరకూ విస్తరించి ఉంటుందిముందు తరాలను దృష్టిలోపెట్టుకొని మన సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో అత్యద్భుతంగా నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఆకృతుల రూపకల్పనకు పరిధులు విధించకుండా  తగిన సమయం కూడా ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పోరేషన్లు, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, విద్య, వైద్య సంస్థలు, ప్రైవేటు వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద  సంస్థలకు కేటాయించవలసిన భూములు, వాటి ధరలను మంత్రి మండలి ఉపసంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం భూముల కేటాయింపు ప్రతిపాదనలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

వరుస సంఖ్య
సంస్థ పేరు
అడిగిన
భూమి
ప్రతిపాదించిన
భూమి
ఎకరా ధర
రూ.కోట్లలో
1
వల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం. నిర్మాణం, తరగతులుప్రారంభం

200 (వంద ఎకరాల అప్పగింత)
0.50
2
ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. కాలేజీ/హాస్పటల్

150
0.50
3
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడి)

50
0.50
4
సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)

5
0.50
5
ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం. నిర్మాణం, తరగతులు ప్రారంభం

200
వంద ఎకరాల అప్పగింత
0.50
6
అమృత విశ్వవిద్యాలయం

200
0.50
7
సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ (సీపీడబ్లూడీ)
కార్యాలయలు/నివాసం

28

8
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)
కార్యాలయలు/నివాసం
27
11
2 నుంచి 4
9
బీఎస్ఆర్ మెడిసిటీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్. విశ్వవిద్యాలయం, ఆస్పత్రి

100
0.50
10
సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం

1.50

11
ఇండియన్ నేవీ - కార్యాలయలు/నివాసం

15

12
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫేషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్ టీ)

10

13
కేంద్రీయ విద్యాలయం-1

5

14
కేంద్రీయ విద్యాలయం-2

5

15
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్

0.30

16
పోస్టల్ డిపార్ట్ మెంట్- కార్యాలయలు/నివాసం

5.50

17
నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం

25

18
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సీఐ)
కార్యాలయలు/నివాసం

1.10


19
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)

0.75

20
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ)
కార్యాలయలు/నివాసం

3.30

21
ఆంధ్రాబ్యాంక్ - కార్యాలయలు/నివాసం

2.65

22
బ్యాంక్ ఆఫ్ ఇండియా - కార్యాలయలు/నివాసం

1.50

23
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
ఫ్యూయల్ రిటైల్ అవుట్ లెట్

0.40

24
నబార్డ్ - కార్యాలయలు/నివాసం

4.30
1 నుంచి 2
25
స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం

8

26
ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్
ఫ్యూయల్ రిటైల్ అవుట్ లెట్

0.40

27
పీవి సింధు

0.20
 నివాస ప్లాట్

28
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా.
కార్యాలయలు/నివాసం
27
17


29
రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)
3
1
2 నుంచి 4
30
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)
5
2
2
31
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్  - కార్యాలయలు/నివాసం
10
1


32
స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్ మెంట్ అండ్ ట్రైనింగ్ (ఎస్ఐఈఎంఏసీ
2
0.5

33
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం

20

34
స్టేట్ ఫోరెన్సిట్ సైన్స్ లేబరేటరీ
కార్యాలయలు/నివాసం

3

35
న్యూఇండియా ఎస్సూరెన్స్ కంపెనీ
2.5
2
4
36
హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్
3
0.5
2 నుంచి 4
36
సిండికేట్ బ్యాంక్ - కార్యాలయలు/నివాసం
2
1.3

38
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగుసొసైటీ(ఏపీఎన్ఆర్ టీ)
10
4.50
4
39
ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్
13
4
0.50 నుంచి 2
40
నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్
36
26
0.50
41
జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్
125
30

42
కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కెఐఎంఎస్)
100
40
0.50
43
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి
20
12.5
0.50
44
పుల్లెల గోపిచంద్ అకాడమీ
16
12.5
0.50
45
బ్రహ్మకుమారీల శాంతి సరోవర్ ప్రాజెక్ట్
25
10
0.50
46
ఆర్ట్ ఆఫ్ లివింగ్ (వ్యక్తివికాస కేంద్రం)
30
16
0.50
47
ప్రైవేటు హోటల్స్


4 నుంచి 5

          ఆయా సంస్థల నిర్వహణా సామర్థ్యం ఆధారంగా కార్యాలయాలకు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నివాస ప్రాంతాలకు భూములు కేటాయిస్తారు. విశ్వవిద్యాలయాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. భూ కేటాయింపులన్నీ 60 ఏళ్లు లీజుకు మాత్రమే ఇస్తారు. ఎకరాలకు నిర్ణయించిన ధర ముందుగా చెల్లించాలి. ఆ తరువాత నామ మాత్రంగా అద్దె చెల్లించవలసి ఉంటుంది. నిర్ణయించిన ధర చెల్లించిన తరువాత మాత్రమే భూమిని స్వాధీనం చేస్తారుభూమి ధరను ఆయా సంస్థలు ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడతాయో పరిశీలించి విద్య, వైద్య సంస్థలకు ఒక రకంగా, ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక రకంగా, ప్రభుత్వ రంగంలోనే నవరత్నాలు వంటి వాణిజ్య సంస్థలకు ఒక రకంగా, హోటల్స్ వంటి ప్రైవేటు వాణిజ్య సంస్థలకు మరో రకంగా ధరలు నిర్ణయిస్తారుభూమిపై పూర్తి హక్కులు మాత్రం ఎవ్వరికీ ఇవ్వరు. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎందుకు వినియోగించడానికి ఆ భూమి కేటాయించారో అందుకు కావలసిన భవన నిర్మాణాలు పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత మాత్రమే ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆయా రంగాల్లో తగినంత ప్రావీణ్యత లేకుండా భూముల కోసం కొన్ని సంస్థలు చేసుకున్న దరకాస్తులను తిరస్కరించారు. మంత్రి మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్న తరువాత భూములు కేటాయిస్తారు. కొన్ని సంస్థలు వెంటనే నిర్మాణాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్మాణాలకు కూడా అక్టోబర్ లో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 2018 నాటికి నూతన రాజధానికి ఒక రూపు వస్తుంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...