Sep 14, 2017

15న సీఎంతో ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం


సచివాలయం, సెప్టెంబర్ 13: ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమవుతారని ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులు, శాఖాధిపతులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యదర్శులు అందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని, తమ పరిధిలోని శాఖాధిపతులు కూడా హాజరవడానికి వారికి సమాచారం అందించాలని, అలాగే సలహాదారులకు ఈ సమాచారం తెలియజేయాలని కోరారు. మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి  అఖిలభారత సర్వీసులకు చెందినవారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మాత్రమే హాజరుకావాలని తెలిపారు. మిగిలినవారందరూ గ్రౌండ్ ఫ్లోర్ లోని సాధారణ పరిపాలన శాఖ సమావేశ మందిరంలో కూర్చోవాలన్నారు. పైన జరిగే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే అవకాశాన్ని వారికి కల్పిస్తారని పేర్కొన్నారు. అవసరాన్నిబట్టి వారు ప్రధాన సమావేశ మందిరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. స్థలాభావం కారణంగా కార్యదర్శులు, శాఖాధిపతులు ఒక్కరే ఈ సమావేశానికి హాజరుకావాలని శ్రీకాంత్ ఆ ప్రకటనలో  కోరారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...