Nov 2, 2018

అసంఘటిత కార్మిక కుటుంబాలకు రక్ష చంద్రన్న బీమా 
v ఈ రకమైన పథకం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం
v రాష్ట్రంలో సగానికిపైగా కుటుంబాలకు భరోసా
v పధకం పరిధిలోకి 2.49 కోట్ల మంది
v 10 రోజుల్లో క్లెయిమ్ ల పరిష్కారం
v 4 ఏళ్లలో 1.82 లక్షల బాధిత కుటుంబాలకు రూ.2,170 కోట్లు
v రైతుల కోసం చంద్రన్న రైతు బీమా పథకం
                  
చంద్రన్న బీమా పథకం రాష్ట్రంలోని అసంఘటిత కార్మిక కుటుంబాలకు రక్షగా నిలుస్తోంది
అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా లక్షల  నిరుపేదల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందిక్లెయిమ్ లు వేగంగా పరిష్కారం కావడంతో అంతే వేగంగా జనాధరణ పొందిందికేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై)ఆమ్‌ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై)ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్ బీవైపథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను చేర్చి 2016 అక్టోబ‌ర్ 2న  చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించిందికేంద్ర  నిబంధనల ప్రకారం పీఎంజేజేబీవై18-50 ఏళ్ల మధ్య వయస్కులకు వర్తిస్తుంది. పీఎంఎస్ బీవై 51-70ఏళ్ల మధ్యలో వారికిఏఏబీవై 51-60 మధ్య వయసు వారికి వర్తిస్తుందిఈ మూడు పథకాలకు కేంద్రం  చెల్లించే ప్రీమియంకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి అన్నింటినీ ఏకం చేసింది.  18 -70 ఏళ్ల మధ్య వయసున్న అసంఘటిత రంగ కార్మికులునిరుపేదలందరికీ వర్తించేవిధంగా  పీఎంజేజేబీవై చంద్రన్న బీమా’ ప్రవేశపెట్టింది.దేశంలో అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రంగా నిలిచిందిప్రస్తుతం రాష్ట్రంలో ఈ పథకం కాల వ్యవధి 2018జూన్ నుంచి 2019 మే 31 వరకు ఉందిరాష్ట్రంలో సగానికిపైగా కుటుంబాలకు ఈ పథకం భరోసా ఇస్తోంది. 18-70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రెండు కోట్ల 49 లక్షల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు.  ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం వాటా రూ.467 కోట్లు కాగాకేంద్రం వాటా రూ.365 కోట్లుదేశంలోనే ఎక్కువ కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసిన పథకంగా కూడా ఇది రికార్డుకెక్కింది.  ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ వరకు 34,488క్లెయిమ్ లకు 31,362 పరిష్కరించి రూ.493 కోట్లు అందజేశారు.  గత 4 ఏళ్లలో 1.9 లక్షల మంది దరకాస్తు చేసుకోగా, 1.82 లక్షల క్లెయిమ్స్(96 శాతం) పరిష్కరించి, రూ.2,170 కోట్లు బాధిత కుటుంబాలకు అందజేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2.13కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు. 82 వేల క్లెయిమ్ లు పరిష్కరించి రూ.800 కోట్లు చెల్లించారు. 2017-18లో నెలల కాల పరిమితిలో 2.46 కోట్ల మంది పథకం పరిధిలోకి రాగా, 70వేల క్లెయిమ్ లు పరిష్కరించి బాధిత కుటుంబాలకు రూ.1250 కోట్లు అందజేశారు.  ఈ ఏడాది 2.49 కోట్ల మంది నమోదయ్యారులక్ష క్లెయిమ్ లు వరకు వచ్చే అవకాశం ఉందనిరూ.1,800 కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా.
                 చంద్రన్న బీమా కింద 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారుప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు,పాక్షిక వైకల్యానికి రూ.3,62,500  చెల్లిస్తారుసహజంగా మరణిస్తే పరిహారం కింద రూ.30 వేలు అందిస్తారుబాధిత కుటుంబాల్లో 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకుంటున్న విద్యార్థులుంటే ఇద్దరి వరకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాల కింద చెల్లిస్తారునెలకు రూ.15వేల లోపు ఆదాయం ఉన్న చేతి వృత్తులు చేసే వారువ్యవసాయం అనుబంధ రంగాల్లో పనులు చేసేవారు,చిన్న వ్యాపారులుమెకానిక్ లుకళాకారులుప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందే అంగన్ వాడీఆశావర్కర్లుఆరోగ్యమిత్రబీమా మిత్రఆటోకారు డ్రైవర్లు వంటివారందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారురైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది.  ఈ పథకం కింద నమోదు ప్రక్రియ 2018 జూలై 7న ప్రారంభమైందిచంద్రన్న బీమాకు వర్తించేవే దీనికి వర్తిస్తాయి.ఇప్పటికే చంద్రన్న బీమా పరిధిలోకి 39.25 లక్షల మంది రైతులు వచ్చారుచంద్రన్న రైతు బీమా పథకం కింద 7.77 లక్షల మంది నమోదయ్యారుఈ రెండు పథకాల కింద మొత్తం 47 లక్షల మంది రైతులకు బీమా వర్తిస్తోందిఏడాదికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం పరిధిలోకి వస్తారుఈ రెండు పథకాల వల్ల రాష్ట్రంలో సగానికి పైగా కుటుంబాలకు భరోసా లభిస్తోందిక్లెయిమ్ ల పరిష్కారం కూడా శరవేగంగా జరుగుతోంది. ప్రమాద, సహజ మరణాలకు సంబంధించిన క్లెయిమ్స్ పది రోజులలో పరిష్కరిస్తున్నారు. అనుమానాస్పద మృతుల క్లెయిమ్స్ ని నెల రోజుల్లో పరిష్కరిస్తున్నారు. మృతుల వయసు ఎక్కవగా ఉండటం, ఆత్మహత్యలు, హత్యల వంటి క్లెయిమ్స్ ని బీమా కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆన్ లైన్ లో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. అసంఘటిత రంగంలో కుటుంబ పెద్ద లేక సంపాదించే  ప్రధానమైన వ్యక్తి మృతి చెందినప్పుడు ఈ పథకం వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది.  ఆ విధంగా ఈ పథకానికి ప్రాధాన్యత ఏర్పడింది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...