Nov 12, 2018


మంత్రులుగా ఫరూక్, కిడారి శ్రావణ్ ప్రమాణస్వీకారం
                 సచివాలయం, నవంబర్ 11  ఆంధ్రప్రదేశ్  నూతన మంత్రులుగా     ఎన్.మొహమ్మద్ ఫరూక్కిడారి శ్రావణ్కుమార్ లు ఆదివారం ఉదయం ఉండవల్లిలోని  ప్రజావేదికపైన ప్రమాణస్వీకారం చేశారు.    గవర్నర్ నరసింహన్ వారిచేత ప్రమాణం చేయించారు.  ఫరూక్  తెలుగులోశ్రావణ్ కుమార్  ఇంగ్లీ ష్ లో  ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన అనంతరం ఇద్దరు మంత్రులు గవర్నర్ నరసింహన్ తో కరచాలనం చేశారు. ఆ తరువాత  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ ప్రారంభించి, ముగించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఫరూక్ జీవిత విశేషాలుః ఎన్.ఎం.డి.ఫరూక్ మే 15, 1950 కర్నూలు జిల్లా నంద్యాలలో జన్మించారు. తండ్రి ఎన్.ఇబ్రహీం సాహెబ్. ఫరూక్ పీయూసి వరకు చదువుకున్నారు. ఆయనకు ఆరుగురు సంతానం. ఎమ్మెల్యేగా 1985లో ఎన్నికయ్యారు. తరువాత మంత్రిగా, శాసన మండలి సభ్యులు, మండలి చైర్మగా బాధ్యతు నిర్వహించారు. ఆయనకు క్రీడలు, పుస్తక పఠనంపై  ఆసక్తి.

కిడారి శ్రావణ్ కుమార్ జీవిత విశేషాలుః శ్రావణ్ కుమార్ జూన్ 14,1990లో విశాఖపట్నం జిల్లా  పెదబయలు మండలం నదింవాడలో కిడారి సర్వేశ్వర రావు, పరమేశ్వరిలకు జన్మించారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పెదబయలులోని సెయింట్ ఆన్స్ స్కూల్ లో విద్యనభ్యసించారు. 10వ తరగతి పార్వతిపురం పాఠశాలలో, ఇంటర్ విద్యాభ్యాసం విశాఖ నారాయణ కాలేజీలో పూర్తి చేశారు. బీటెక్ ఐఐటీ వారణాసిలో పూర్తి చేశారు. ఆయనకు పుస్తకపఠనం, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తితోపాటు క్రికెట్, సెస్ లో ప్రావీణ్యం ఉంది.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...