Nov 5, 2018


 7.10 శాతం రాష్ట్ర అభివృద్ధి రుణం చెల్లింపు
          సచివాలయం, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 డిసెంబర్ 5వ తేదీ నాటి ఉత్తర్వుల ప్రకారం జారీ అయిన  రాష్ట్ర అభివృద్ధి రుణం 7.10 శాతాన్ని ఈ ఏడాది డిసెంబర్ 12న తిరిగి చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ  ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.  డిసెంబర్ 11వ తేదీ వరకు అయిన వడ్డీతో సహా చెల్లిస్తారని పేర్కొన్నారు. ఒక వేళ ఆ రోజుని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన పక్షంలో ఆ రోజుకు ముందు రోజు రాష్ట్రంలోని చెల్లింపుల కార్యాలయాలు ఆ రుణాన్ని చెల్లిస్తాయని తెలిపారు. డిసెంబర్ 12 నుంచి రుణంపై ఎటువంటి వడ్డీ చెల్లించరన్నారు.  స్టాక్ సర్టిఫికెట్ రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీని కలిగి ఉన్న రిజిస్టర్ హోల్డర్ బ్యాంకు ఖాతాకు  పరిపక్వ మొత్తాలను  ఎలక్ట్రానిక్ విధానం ద్వారా జమ చేస్తారని వివరించారు. ప్రభుత్వ సెక్యూరిటీల ఒరిజినల్ సబ్ స్కైబర్ లేదా ఆ తరువాతి హోల్డర్ వడ్డీ చెల్లింపు కోసం వారి బ్యాంకు ఖాతాల వివరాలను స్బేట్ బ్యాంక్ బ్రాంచ్ కి గానీ, ట్రెజరీకి గాని తెలియజేయాలన్నారు.
                  బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు లేనప్పుడు, ఎలక్ట్రానిక్ విధానం ద్వారా నిధులను తీసుకోవడం తప్పనిసరికానప్పుడు హోల్డర్ కు గడువు తేదీన రుణం తిరిగి చెల్లించడానికి వారి సెక్యూరిటీలను పబ్లిక్ రుణ కార్యాలయంలో 20 రోజులు ముందుగా అందజేయాలని తెలిపారు.  అటువంటి సందర్భాలలో సెక్యూరీటీల వెనుక భాగంలో ‘ధృవ

పత్రాలపై రాసిన అసలు మొత్తం అందింది’ అని రాసి ఇవ్వాలన్నారు. సెక్యూరిటీలు స్టాక్ సర్టిఫికెట్ల రూపంలో ఉన్నట్లైతే  స్బేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లేదా దానికి చెందిన ఏదైనా అనుబంధ బ్యాంకులు ట్రెజరీ పనిని నిర్వహించే చోట్ల మాత్రమే వాటిని సమర్పించాలని, ట్రెజరీలో గానీ సబ్ ట్రెజరీలో గానీ కాదని ఆయన స్పష్టం చేశారు.
సెక్యూరిటీలను రాయించుకున్న చోట కాకుండా ఇతర చోట్ల చెల్లింపు తీసుకోవాలని అనుకునేవారు వాటి వెనుకవైపు రాసి, రిజిస్ట్రర్, బీమా చేసిన పోస్ట్ ద్వారా సంబంధిత ప్రజా రుణ కార్యాలయానికి వాటిని పంపించాలని పేర్కొన్నారు. ప్రజా రుణ కార్యాలయం ట్రెజరీ లేదా రాష్ట్రంలో ట్రెజరీని నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లేదా దాని అనుబంధ బ్యాంకులో చెల్లించే విధంగా డ్రాఫ్ట్ ని జారీ చేస్తుందని రవిచంద్ర తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...