Apr 12, 2018


రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలి
అటవీ శాఖ అధికారులను ఆదేశించిన సీఎస్ దినేష్ కుమార్
           సచివాలయం, ఏప్రిల్ 12: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం జరిగిన అటవీ పునరుద్దరణ నిధుల నిర్వహణ, ప్రణాళికా సంస్థ (సీఏఎంపీఏ -  కాంపెన్ సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) 11వ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనం నింపడం, అటవీ ప్రాంత విస్తరణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని  చెప్పారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు అటవీకరణ, వివిధ రకాల మొక్కల పెంపకం, టేకు చెట్ల పెంపకం వంటి అంశాలను అధికారులు సీఎస్ కు వివరించారు. అటవీకరణ, పరిహారం, నిర్వహణ, నిధుల వినియోగం, రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల మొక్కలు నాటడం, బయోడైవర్సిటీ కన్సర్వేషన్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ పి.మల్లిఖార్జున రావు, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఖాజారియా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...