Apr 3, 2018

03.04.2018 మంగళవారం – శాసనసభ మీడియా పాయింట్



వినుకొండ MLA GV ఆంజనేయులు.
AP కి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీలకు తెలియ చేసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు.
దీనితో BJP, జగన్ లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అపర చాణక్యుడు ఢిల్లీ బయలు దేరాడంటే వారికి గుబులు మొదలైంది.
ధర్మ పోరాటం మొదలు పెట్టాం, విజయం TDP దే.
చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రాజీనామా, దీక్షలు అంటూ జగన్ కొత్త నాటకానికి తెరదీసాడు అని ప్రజలు గమనిస్తున్నారు.
కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్ ను ప్రజలు నమ్మరు.
ప్రధానిని అవమానించారని విజయసాయిరెడ్డి బాధ పడుతున్నారు. అక్కడే వారి లాలూచీ అర్ధమవుతుంది.
సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. ప్రధానిని విమర్శిస్తే విజయసాయిరెడ్డి కి ఎందుకు బాధ?
విజయమాల్యా వద్ద చంద్రబాబు150 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. దమ్ముంటే సాక్ష్యాలు ప్రజల ముందు ఉంచాలి.
విజయసాయిరెడ్డి క్రిమినల్. అతనికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.
అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మరు.
బీజేపీ కి వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారు.
---------------------------------------
MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.
మహాభారతం లో 5 మంది పాండవుల తరుపున శ్రీ కృష్ణుడు రాయబారానికి వెళ్ళినట్లు, 5 కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం చేయాలని అభ్యర్ధించడానికి చంద్రబాబు ఢిల్లీ(హస్తిన) వెళ్లారు.
అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. BJP పరిస్థితిని అర్ధం చేసుకుని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై చర్చకు అంగీకరించాలి.
భారతంలో చెప్పిన విధంగా ‘అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్ని ఏకము కాకపోవు’ అన్నట్లు  అన్ని పార్టీలు ఏకం అవుతాయి.
మోడీ బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
విజయసాయిరెడ్డి, జగన్ లు చంద్రబాబు, లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవం, అబద్ధాల పుట్ట.
రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పై బురద చల్లడం మానుకోవాలి.
సాక్షి ఫ్యాక్టరీ లో తయారైన అబద్ధపు మూటలు వాళ్ళు విప్పుతున్నారు.
----------------------------------------
అమలాపురం MLA ఐతాబత్తుల ఆనందరావు
YCP వ్యవహారం చూస్తుంటే ఏమనాలో అర్ధం కావడం లేదు.
ప్రత్యేక హోదా కోసం టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది.
ముఖ్యమంత్రి నిజాయితీతో వ్యవహరిస్తూ ఢిల్లీ వెళ్లారు.
YCP నాయకులు మోడీ జపం చేయడం, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమే.
ఒక ప్రక్క మోడీ కాళ్ళు మొక్కుతూ ముఖ్యమంత్రికి సభా హక్కుల నోటీసు పంపుతారా?
నోటీసు ఎందుకు అంటే, మోడీ ని అవమాన పరచినందుకు అంటున్నారు, ఆయనను అంటే ఈయనకు ఎందుకు?
ఒక ప్రక్క మోడీని ఏమైనా అంటే ఒప్పుకోవు, మరో ప్రక్క రాజీనామా, దీక్ష అంటావు. ఎవరిని మోసం చేయడానికి.
జగన్ పాదయాత్రలో మోడీని, అమిత్ షా ను, జైట్లీ ని విమర్శించరు. కానీ విజయసాయిరెడ్డిని మోడీ కాళ్ళమీద పడి గట్టి లాబీయింగ్ చేయమని పురమాయించాడు.
తెలుగు ప్రజలకు వీరి నాటకాలు అన్నీ తెలుస్తున్నాయి.
BJP చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
సోనియా నిర్ణయాకి కళ్లు మూసుకుని మద్దతు ప్రకటించింది.
ఆంధ్రులకు మోడీ పై కోపం ఉంటే YcP వాళ్ళు ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు.
YCP బీజేపీ తో రెండు రకాలుగా అనుబంధం కొనసాగిస్తోంది.
జగన్ మోడీ ని తిట్టడు, తిడితే జైల్లో వేస్తారని భయం.
TDP తెలుగువారు హక్కుల కోసం పోరాడుతుంటే YCP BJP పక్షాన ఉన్నది.
--------------------------------------------------------
MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

విజయసాయి రెడ్డి మానసిక అంగ వైకల్యంతో పెట్రేగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నారు.
ఆర్ధిక ఉగ్రవాదిని ప్రధాని మోదీ ఎందుకు హక్కును చేర్చుకుంటున్నారు.
ఆ దన్నుతోనే విజయ సాయి మాట్లాడుతున్నారు.
నోట్లరద్దు ద్వారా ఎన్ని లక్షల కోట్లు నల్ల ధనం బయటకు తెచ్చారు.
బ్యాంక్ లపై నమ్మకం పోయి డిపాజిట్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు.
డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకోవాలంటే ATM లన్నీ మూతపడ్డాయి.
మోడీ త్రయం బ్యాంకులని ముంచేసింది.
దోపిడీ దారులపై తీసుకున్న చర్యలు ఏమిటి?
రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో కాంగ్రేస్ హయాంలో ఇచ్చిన ఆర్డర్ 560 కోట్ల నుండి, 760 కోట్లకి పెరిగిందని బెంగళూరు HAL కు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేశారు.
ఆ తరువాత మీరు ఫ్రాన్స్ వెళ్లి కేవలం 26 యుద్ధ విమానాలు 54000 కోట్లకు కొనుగొలు చేశారు.
ఆ రేట్లు బయటకు రాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు తో ఒప్పందం చేసుకున్నారు.
ఎన్ని కోట్ల స్కాం జరిగినది. మీ వాటా ఎంత? BJP వాటా ఎంత?
అక్కడ ఇంతటి అవినీతి జరిగితే రాష్ట్రంలోని BJP వారు, ఇక్కడ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రా? లేక దేశ ప్రధానినా?
గుజరాత్ లో GSP అనే సంస్థను పెట్టారు. ఆ సంస్థ 20000 కోట్ల నష్టాల్లో ఉంటే, దానిని ONGC లో కలిపారు.
GSP డబ్బుతో పబ్బం గడుపుకొని ఎన్నికలలో ఖర్చు పెట్టారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవసాయంలో నెగటివ్ గ్రోత్ సాధించారు.
అనేక పాఠశాలలో ఉపాధ్యాయులు కూడాలేరు.
CAG నివేదిక ప్రకారం 25000 కోట్లకు లెక్కలు లేవు.
ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన మోడీ ప్రధానిగా సక్సెస్ ఎలా అవుతారు.
అమరావతికి 1500 కోట్లు, విజయవాడ గుంటూరు కు 1000 కోట్లు ఇచ్చారు.వాటికి UC లు ఇచ్చాము. అయితే లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లోని BJP వాళ్ళు మాట్లాడుతున్నారు.
కేంద్రం ఇచ్చిన మొత్తం 12,500 కోట్లు మాత్రమే, ఇందులో అవినీతి ఏమి జరుగుతుంది.
పోలవరం కు ఇంకా 2500 కోట్లు ఇవ్వాలి.
BJP రాష్ట్ర నాయకులు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు.
యుద్ధ విమానాలు కుంభకోణం పై వివరణ ఇచ్చి మాట్లాడండి.
ఆ డబ్బు మీ జేబు లోనిది కాదు, మీ తాత గాడి ముల్లె కాదు.
రాష్ట్రంలోని విద్యా సంస్థలకు 11000 కోట్లకు గానూ 560 కోట్లు మాత్రమే ఇచ్చారు.
రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలకు 24,000 కోట్లకు గానూ 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు.
BJP మతోన్మాదం తో వ్యవహరిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది.
ప్రధానిగా మోడీ చేసిన పనుల విషయంలో CAG ఇచ్చిన రిపోర్ట్ చూడండి.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే, BJP సహకరించింది.
అవిశ్వాసం పై చర్చకు ఎందుకు అనుమతించరు?
AIADMK ను సస్పెండ్ చేసి చర్చకు అనుమతించ వచ్చు కదా.
మీరు పారిపోవడం సరియైన విధానం కాదు.
రాయలసీమ లో అభివృద్ధి, పరిశ్రమలు మీ కళ్ళకు కనిపించడం లేదా?
కేంద్రం ఏ ఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినపుడు ఇక్కడ ఎందుకు  పెట్రోల్ ధర పెంచుకుంటూ పోతున్నారు.
ప్రజారాజ్యం లో నియంత లా వ్యవహరిస్తే పతనం తప్పదు.
------------------------------------------------
MLC బుద్దా వెంకన్న
విజయసాయిరెడ్డి కి పిచ్చి కుక్క కరచినట్లు ఉన్నది. ఆయన మాట్లాడే మాటలు, చేష్టలు అలానే ఉన్నాయి. ఆయనకు బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ లు చేయించాలి.
రాష్ట్రంలో ఉండే అర్హత విజయసాయిరెడ్డి కి లేదు.
5 కోట్ల మందింప్రజాలు ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి, వెలివేయాలి.
విజయసాయిరెడ్డి 5 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.
మొన్న ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి ని అనారాని మాటలు అన్నాడు.
మోడీతో ప్రత్యక్ష యుద్దానికి దిగిన చంద్రబాబుపై, అసెంబ్లీ లో మోడీ వీడియో క్లిప్పింగ్స్ చూపించాడని విజయసాయి రెడ్డి సభా హక్కుల నోటీసు ఇచ్చాడు. కానీ BjP వాళ్ళు ఏమి మాట్లాడలేదు.
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
కేంద్రం చెప్పినట్లు తలదిఅతున్న విజయ సాయిరెడ్డి కి ముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత లేదు.
YCP BJP వాళ్ళ డైరెక్షన్ లో నడుస్తున్నది అని నిన్నటితో తెలిసి పోయింది.
రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేసినట్లు, విజయసాయిరెడ్డి ని లాంటి బ్రోకర్ల ను కూడా బహిష్కరించాలి.
ముద్దులు పెట్టడం లో జగన్మోహన్ రెడ్డి, కాళ్ళకు మొక్కడం లో విజయసాయిరెడ్డి.
తెలుగువారి ఆత్మ గౌరవం PMO లో తాకట్టు పెట్టారు.
YCP వాళ్ళు 6 వ తారీఖున రాజీనామా చేస్తామనడం BJP ఆడిస్తున్న డ్రామా.
జగన్, విజయసాయిరెడ్డి లు రాష్ట్రానికి రాహుకేతువులు లా తయారయ్యారు.
---------------------------------



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...