Apr 2, 2018

02.04.2018 సోమవారం – శాసనసభ మీడియా పాయింట్




వినుకొండ MLA GV ఆంజనేయులు.
AP అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబును ఎదుర్కొనలేక YCP, BJP లు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రజల్ని పక్కదారి పట్టించడానికి MP ల రాజీనామా అంటూ డ్రామా ఆడుతున్నారు. దీక్ష చేస్తామంటున్నారు.
2 సం,, నుండి రాజీనామా అంటూ ఇప్పటివరకు చేయకుండా, ఇప్పుడు రాజీనామా చేస్తే 6 నెలల వరకు దానిని స్పీకర్ పరిసీలించరని, ఎన్నికలు రావని BJP సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నాడు.
BJP డైరెక్షన్లో జగన్ నడుస్తున్నాడు.
బయట పోరాటం అంటూ లోపల మోడీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు పోరాటం ఎలా చేస్తారు.
రాష్ట్రంలో అవినీతి ఉన్నందువల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజి ఇవ్వలేదు అని సొము వీర్రాజు అంటున్నాడు.
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతకు భయపడి BJP వాళ్ళు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
BJP వాళ్ళు రాష్ట్రాన్ని మోసం చేశారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారు.
రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాజధానికి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూపిస్తాం.
రోడ్ల నిర్మాణం జరుగుతుంది, యూనివర్సిటీలు వచ్చాయి. 6 నెలల్లో అసెంబ్లీ సచివాలయం, భవనాలు నిర్మించి ఇక్కడ నుండే పరిపాలన సాగిస్తున్నాం. జగన్ కు కనబడటం లేదా?
MLA లకు, అధికారులకు, పేదలకు ఇళ్ళు నిర్మాణం జరుగుతుంటే జగన్ కు కనబడడం లేదా?
ప్రతిపక్షం సయిందవుడిలా అడ్డుపడుతున్నా, కేంద్రం సహకరించకపోయినా, ప్రజల సహకారంతో రాజధాని నిర్మించి తీరుతాం. పోలవరం పూర్తి చేస్తాం.
  YSR పరిపాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, చంద్రబాబు రైతుల్ని గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకొంటున్నారు.
-----------------------------------------------------------------

MLC బుద్దా వెంకన్న
సొము వీర్రాజు ఆంధ్రాకు పట్టిన శని లా అవతరించాడు.
దక్షిణ, ఉత్తర భారతదేశం అంటూ మోడీ విభజించి పాలిస్తుంటే, సొము వీర్రాజు రాయలసీమ, ఉత్తర ఆంధ్రా, కోస్తా అంటూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడు.  బీజేపీకి, YCP కి మధ్య శకునిలా రాజకీయాలు చేస్తున్నాడు.
సొము వీర్రాజు గన్ మాన్ లను పక్కన పెట్టి రెండు గంటల పాటు పులివెందులలో ఎవరితో మంతనాలు జరిపారో ప్రజలకు చెప్పాలి.
చంద్రబాబు హోదా కోసం మోడీతో యుద్ధం చేస్తుంటే, వీర్రాజు పులివెందులలో జగన్ ఏజెంట్ లను కలుస్తున్నారు.
ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ రాష్ట్రంలో దుష్ట శక్తులను ఏకం చేస్తున్నాడు.
ముఖ్యమంత్రిపై ప్రజలను తిరగబడమంటున్నాడు. సొము వీర్రాజుపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు.
సొము వీర్రాజు డాష్ బోర్డు అంటే తెలియదు అంటున్నాడు. అతని అవినీతి గురించి కూడా డాష్ బోర్డులో ఉంటుంది.
YCP, BJP డ్రామాలతో రాష్ట్రం వెనకబడి ఉంది.
5 కోట్ల మంది ప్రజలు గళం విప్పాలి.
రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి  ఢిల్లీ వెళ్లనున్నారు.
చంద్రబాబును పలువురు నేతలు కలవనున్నారు.
BJP MP లు కొందరు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారని భయంతో వీర్రాజు ఇలా మాట్లాడుతున్నారు.
దేశంలో వేల కోట్లు ఎగ్గొట్టి, ఫారిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారికి మోడీ అండగా ఉంటున్నారు.
దమ్ముంటే మోడీని 2019 లో దక్షిణ భారతదేశంలో పోటీ చేయమనండి.
2019లో చంద్రబాబు సూచించిన వ్యక్తి ప్రధాని అవుతారు.
------------------------------------------------

అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి.
పార్లమెంట్ సాక్షిగా మోడీ కాళ్ళకు మొక్కిన విజయసాయిరెడ్డి BJP తో అనైతిక పొత్తు కుదుర్చుకున్నారు.
బడ్జెట్ లో అన్యాయం చేశారని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతుంటే, బడ్జెట్ బాగుందని విజయసాయిరెడ్డి కితాబు ఇచ్చాడు.
మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం కాళ్లపై ఎందుకు పడ్డారు.
రూ.64 కోట్ల కుంభకోణం చేసిన శశికళను జైలుకు పంపిన మోడీ, 43 వేల కోట్ల దోచిన వారి కేసులు ఎందుకు ముందుకు సాగనివ్వడం లేదు.
BJP ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరు.
16 పార్టీలు ఏకమై అవిశ్వానికి మద్దతు ఇవ్వడం చంద్రబాబు పై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు, కానీ అవిశ్వానికి ఎందుకంటే భయపడుతున్నారు.
-------------------------------------------------------

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల  ఆనందరావు  :
       భారతీయ జనతా పార్టీ అబద్ధాలతో, అసత్యాలతో ఈ దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తోంది.
       లౌక్యంతో లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుంది
       స్నేహంతో మిత్ర పక్షాలను వంచిస్తూ అధికారంలోకి వచ్చాక అణచివేస్తూ దుర్మార్గ పాలన చేస్తుంది.
       బీజేపీకి రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కష్టం కానీ విభజించడం చాలా ఇష్టం. అందుకే సోమువీర్రాజు రాయలసీమకు వెళ్లి రాయలసీమ నిధులు కోస్తాకు మళ్లిస్తున్నారని సిగ్గులేని విమర్శలు చేస్తున్నారు.
       ఆంధ్రా బీజేపీ నాయకులు అంధత్వంలో ఉన్నారా ? ఈ కమల నాయకులకు కర్ణభేరులు పనిచేయడం లేదా ? మోదీ హామీల మాటలు మీకు వినబడలేదా ? మీకు దమ్ముంటే ఆంధ్రాహక్కుల కోసం మీ పార్టీమీదే పోరాటం చేయండి..అంతేగానీ మోదీ తానా అంటే మీరు తందానా అనకండి.
       దక్షిణాది రాష్ట్రాల నిధులు మోదీ ఉత్తరాదికి మళ్లిస్తుంటే మీకు కనబడలేదు కానీ సీమ నిధులు కోస్తాకు మళ్లిస్తున్నారని నీకు నోరెలా వస్తుంది ?
       తెలుగుజాతి ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు బీజేపీ నాయకులు చేసినంత ద్రోహం ఇంత వరకు ఎవరూ లేరు
       అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ అవార్డును మించిన నటులు బీజేపీలో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ రికార్డును కూడా బీజేపీ బద్దలు కొట్టింది.
       ఏపీలో అవినీతి అని మాట్లాడే సోము వీర్రాజు నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఎందుకు పట్టించుకోవడం లేదు? నరేంద్ర మోదీ నిద్రపోతున్నాడా ?
       బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లెక్క గట్టలేనంతగా ఉంది.
       చంద్రబాబు నాయుడుగారిది హోదా, విభజన హామీల్లో ధర్మపోరాటం కాబట్టే దేశం మొత్తం ఆయనకు మద్దతు పలుకుతుంది. ఇప్పటికైనా ఆంధ్రా బీజేపీ నాయకులు కళ్లు తెరిచి జరిగేది చూసి మాతో కలిసి రండి..లేదంటే జనం మిమ్మల్ని రోడ్లమీదికి  కూడా రానివ్వరు
---------------------------------------------------------

పీడీఫ్ ఎమ్మెల్సీ రామ సూర్యారావు
Ø ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతుంది.
Ø ఒకరి పై ఒకరు దూషణలు చేసుకోవడం తప్ప పేదవారు బాధపడుతున్నారు అన్న విషయాన్ని మరుగున పడవేస్తున్నారు.
Ø  రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ నాయకులే కారణం
Ø  అందరం కలిసి అభివృద్ధి కోసం పోరాడాలి
Ø  తెలంగాణ ప్రజలను చూసైనా మనం మారాలి
Ø  అఖిల పక్షం అంతా కలసి ప్రధాని మోదీని కలసి నిలదీయాలి
Ø  ప్రతిపక్ష నేత జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి విభజన హామీలు అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరాలి.
--------------------------------------------

మంత్రి  శామ్యూల్ జవహర్
v  సంవత్సరం నుండి అసెంబ్లీ కి రాకుండా వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వైసీపీ అదే పద్ధతి పార్లమెంట్ లో కూడా చేస్తున్నారు.
v  ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు అన్ని వదిలేసి మాట్లాడండి.
v  అన్ని అనుభవిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు అని వైసీపీ నాయకులు గ్రహించాలి
v  Iyr కృష్ణా రావు మాటలు పదవి పోవటంతో పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నట్లుంది.
v   ఇప్పుడు peoples కాపిటల్ పైన మాట్లాడుతున్న మాటలు ఏ రహస్య ఏజండాతో  మాట్లాడుతున్నారో చెప్పాలి
v  ఆంద్రప్రదేశ్ లో A అంటే అమరావతి P అంటే పోలవరం గా ముందుకు వెళ్తున్నాం. ప్రజలను తప్పుతోవ పట్టించే చర్యలు దయ చేసి మానుకోండి.
--------------------------------------------------

మంత్రి నక్కా ఆనంద బాబు
·       పార్లమెంట్ యథావిధిగా వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ కు రావటానికి ఎందుకు భయపడుతున్నారు.
·        అన్నా డీఎంకే ఒకటే గొడవ చేస్తుంది. చర్చ ప్రారంభిస్తే గొడవ సద్దు మణుగుతుంది
·         స్పీకర్ కి అందరూ కనపడుతూ ఉంటారు. లేక్కపెడితే ఎంత మద్దతు ఉందొ తెలుస్తుంది.
·        టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వచ్చిన మద్దతుకి భయపడి చర్చ జరగనివ్వటం లేదు.
·        ఇలాంటి పిరికి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ  చూడలేదు.
·         వైసీపీ  పధకం ప్రకారం రాజీనామా డ్రామాలు ఆడుతుంది. బీజేపీ తో కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారు.
·        ప్రజలు అంతా గమనిస్తున్నారు.
·        బీజేపీ, వైసీపీ ని నమ్మే పరిస్థితులు ఏపీలో లేవు.
·        కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తప్పదు
·        ప్రజాస్వామ్య వ్యవస్థ కి, పార్లమెంటరీ వ్యవస్థ కి బీజేపీ తిలోదకాలు ఇస్తుంది.
---------------------------------



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...