Jun 13, 2017

వెనుకబడిన జిల్లాల్లో నిధులు వినియోగంపై సమీక్ష

ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ప్రణాళికా శాఖ సమావేశం
   సచివాలయం, జూన్ 13: వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు, కీలక అభివృద్ధి సూచి అమలు, ప్రత్యేక అభివృద్ధి నిధులు, నవ నిర్మాణ దీక్షలో చేపట్టిన కార్యక్రమాలు, పార్లమెంట్ సభ్యుల నిధుల వినియోగం, ఆదర్శ గ్రామాలు, వార్డులలో  జరుగుతున్న పనులు, విజన్ 2029 అమలు, వర్షపాత వివరాలు, సాగు పరిస్థితిలను ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్షించారు. ప్రణాళిక, అర్థగణాంక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై సచివాలయం 2 బ్లాక్ లోని తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మంత్రి అధ్యక్షతన ప్లానింగ్ శాఖ అధికారుల సమావేశం జరిగింది. నిర్థేశించిన లక్షాలను సాధించే మార్గాలను చర్చించి, ప్రణాళిక బద్దంగా పూర్తిచేయుటకు మంత్రి తగు సూచనలు చేసారు. ఈ సంవత్సరం రాష్ట్ర స్థూ ఆదాయ మదింపులో ఖచ్చితత్వాన్ని పాటించి,  కొత్తగా ఏర్పాటు చేసి ఉత్పత్తి దశకు వెళ్ళిన పరిశ్రమలను పరిగణలోకి తీసుకొని  వాస్తవ పరిస్థితి ప్రతిబింబించేలా అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులకి చెప్పారు. వెనకబడిన 7 జిల్లాలో 20,839 పనులుకు ఎస్.డి.ఎఫ్ నుంచి రూ.1475 కోట్లు మంజూరు చేసినట్లు, వాటిలో  10,838 పనులు పూర్తియినట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరుకు రూ.646 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ సీ.కుటుంబరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్ ఢీపీఎస్) సీఈఓ సంజయ్ గుప్త, ఆర్థికాభివృద్ధి బోర్డు సలహాదారు దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...