Jan 10, 2019

‘చుక్కల’ చిక్కులకు పరిష్కారం


v ప్రభుత్వ తాజా నిర్ణయం
v  జనవరి 24 డెడ్ లైన్
v లక్ష మందికి పైగా రైతుకుల ప్రయోజనం

           
 ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో చుక్కల భూముల సమస్య పరిష్కారం కానుంది. దాదాపు 64 ఏళ్ల నుంచి రైతులురైతు కుటుంబాలు ఈ చుక్కల’ చిక్కులతో అల్లాడుతున్నారు. ఈ చుక్కల వెనక పెద్ద కథే ఉంది. బ్రిటీష్ వారి హయాంలో 1906లో దేశవ్యాప్తంగా భూముల సర్వే జరిగింది. అ తర్వాత 1954లో రీ సర్వే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ భూముల సర్వే గానీరీ సర్వే జరగలేదు. అందువల్ల భూమి హక్కులకు సంబంధించి 1954 నాటి రెవెన్యూ రికార్డులే ప్రామాణికంగా ఉన్నాయి. 1954లో రీ సర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్‌ వారీగా భూమి హక్కుదారుల పేర్లుసర్వే నెంబర్లు,విస్తీర్ణం నమోదు చేశారు. అయితేఎవరూ యాజమాన్య హక్కు కోరని  భూముల వద్ద రెవెన్యూ రికార్డుల్లో చుక్కలు(డాట్స్‌) పెట్టారు. అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములు(డాటెడ్‌ ల్యాండ్స్‌)గా పిలుస్తున్నారు. 1954 తరువాత ఆ భూములను సాగు చేసుకునేవారికి ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు. ఆ తరువాత భూముల రీసర్వే చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది.  వాటిని వారసత్వంగా బదిలీ చేయడానికి గానీఅమ్ముకోవడానికి గానీ అవకాశం లేదు. అప్పటి నుంచి రైతులను ఈ చుక్కల చిక్కులు వెంటాడుతున్నాయి. వేధిస్తున్నాయి. ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. తాత,ముత్తాతల కాలం నుంచి దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నవారికి కూడా యాజమాన్య హక్కులు లేకపోవడంతో అనే మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులను విచారించిన ధర్మాసనంహక్కు పత్రాలున్న వారికి న్యాయం చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఈ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తూర్పు గోదావరికృష్ణాగుంటూరుప్రకాశంనెల్లూరుచిత్తూరుకడపకర్నూలు,అనంతపురం జిల్లాల్లో  ఈ చుక్కల భూములు ఎక్కువగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాలకు పైగా చుక్కల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు అంచనా. వీటిలో 17.7 లక్షల ఎకరాలను ప్రభుత్వం కొంతమందికి అసైన్ చేసింది. లక్షా 80 ఎకరాలను రైతులు సాగుచేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వారు ఆ భూమిపై హక్కు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ సంస్కరణలలో భాగంగా రిజిస్ట్రేషన్ చట్టం-1908 లోని 22-ఏ1లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ 2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములను మాత్రం  ఆ తేదీ నుంచి ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించవలసి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలుకాలేదు. ఈ సమస్యపై మళ్లీ వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పరిస్థితిని తీవ్రంగా పరిగణించి జనవరి 4న తనంతతానుగా ఈ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆదేశాల ప్రకారం నూతన  మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లు పంపుతారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)చట్టం ప్రకారం 1బి రిజిస్టర్ 2వ కాలమ్ లో నమోదైన పట్టాదారు పేరుని సరిచూసుకొని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్ లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదు చేసినవాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలమ్ లో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలమ్ లో 1954కు ముందు ఇచ్చిన డి పట్టాడికెటి పట్టాఅసైన్ మెంట్ భూములు అని నమోదు చేసినట్లైతే వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 1954 తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి.

            చుక్కల భూములను స్వాధీనంలో ఉంచుకున్నవారుసాగుచేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన  పత్రాలలో ఏదోఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా భావించి రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్‌లింకు డాక్యుమెంట్‌ పత్రాలు,రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రికార్డు ఆఫ్‌ హోల్డింగ్సు నమోదు చేసిన పత్రాలుఎన్‌క్యూంబరెన్స్‌ పత్రం,10(1) అకౌంట్‌ భూమి శిస్తు రసీదులు, రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆర్‌వోఆర్‌ రికార్డు,న్యాయస్థానాలుసంబంధిత అధీకృత అధికారి జారీ చేసిన ఉత్తర్వు ప్రతులు వంటి వాటిని రిజిస్టర్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది.  2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తారు. చుక్కల భూములకు సంబంధించి రైతులు ఫిర్యాదు చేసినరెవెన్యూ శాఖ వద్ద,  తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్న వాటిని కూడా రెవెన్యూ సిబ్బంది తమంతటతాముగా పరిశీలిస్తారు. వాటికి కూడా ఇవే  నిబంధనలు  వర్తిస్తాయి.  చుక్కల భూములు పరిశీలన పూర్తి అయిన తరువాత తుది జాబితాని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రదర్శనకు పెడతారు. వాటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటేతెలియజేస్తే రెవెన్యూ శాఖ వాటిని పరిశీలిస్తుంది. అభ్యంతరాల పరిశీలన తరువాత సవరించిన తుది జాబితాని ప్రకటిస్తారు. నిషేధిత భూముల నుంచి చుక్కల భూములతోపాటు ఇతర భూములను తొలగించి సెక్షన్ 22-ఏ1 (ఏ) టు (డి) కొత్త జాబితాని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. సెక్షన్ 22-ఏ1(ఇ) జాబితాని ప్రభుత్వనికి పంపుతారు.  ప్రభుత్వం దానిని గెజిట్ లో ప్రచురిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు సక్రమంగా అమలు జరిగితే లక్ష మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జనవరి 24వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందువల్ల చుక్కల భూములు ఎక్కువగా ఉన్న జిల్లాలకు అదనంగా అధికారులను పంపించే అవకాశం కూడా ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...