Jan 29, 2019


ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
Ø నేటి నుంచి శాసనసభ సమావేశాలు
Ø ఇవే 14వ శాసనసభ చివరి సమావేశాలు
          సచివాలయం, జనవరి 29:  14వ శాసనసభ 13వ సెషన్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి మొదలవుతాయని  శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. అసెంబ్లీ భవనంలోని తన ఛాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాల కాలానికి ఇవే చివరి సమావేశాలని తెలిపారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ఈఎస్ఎల్  నరసింహన్‌ ప్రసంగిస్తారని చెప్పారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, సభ్యులు కిడారి సర్వేశ్వర రావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెడతారని, చర్చ జరిగిన తరువాత సంతాపం తెలుపుతారని, ఆ తరువాత సభ వాయిదా పడుతుందని వివరించారు. సభకు 1,2,3,4 తేదీలు సెలవులని చెప్పారు. మళ్లీ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులు సభ జరుగుతుందన్నారు. 5వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తరువాత  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఆ తరువాత రోజుల్లో ప్రభుత్వ బిల్లులు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహిస్తామన్నారు. మార్చి 31 తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టడం రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ లోని నిబంధనలకు విరుద్దమని తెలిపారు.
           
             శాసనసభ సమావేశాలకు అందరు సభ్యులు హాజరైతే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరు సభ్యులు హాజరు కాకపోతే, స్పీకర్ కు అసంతృప్తి ఉంటుదని చెప్పారు. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇచ్చానన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభ సరైన వేదిక అని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం వారు దానిని ఉపయోగించుకోలేదన్నారు. సమావేశంలో శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...