May 1, 2018


3న తాటి, కొబ్బరి ఉత్పత్తులపై అవగాహన సదస్సు
కల్లు గీత కార్మికుల సహకార అర్థిక సంస్థ చైర్మన్ జయప్రకాష్
                
                 సచివాలయం, మే 1: ఈ నెల 3న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డచ్ మాన్, జాన్ డేవిడ్ ఆడిటోరియంలో తాటి, కొబ్బరి ఉత్పత్తులపై  కల్లు గీత కార్మికులకు జాతీయ స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కల్లు గీత కార్మికుల సహకార అర్థిక సంస్థ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. తాటి, కొబ్బరితో విలువ ఆధారిత ఉత్పత్తుల ఆవశ్యకతని గుర్తించినట్లు తెలిపారు. తాటి, కొబ్బరి నీరాతో ఆరోగ్యదాయకమైన బెల్లం, పంచదార వంటి 800 రకాల ఉత్పత్తుల తయారీకి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ ఉత్పత్తులు, సంబంధిత పరిశ్రమల ఏర్పాటుపై కల్లు గీత కార్మికులకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరిశ్రమల స్థాపనకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ (కెవిఐసి) రుణాలు అందజేస్తుందన్నారు. ఈ ఉత్పత్తుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, పరిశ్రమలకు లైసెన్సులు, ప్యాకింగ్, ప్రభుత్వ రంగంలో శిక్షణ, రుణ సదుపాయం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా స్థానం(కేరళ), కొబ్బరి అభఇవృద్ధి బోర్డు, ఏపీ ఉద్యానవన, ఎక్సైజ్ శాఖల తోడ్పాటుతో  ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు సందర్భంగా ఆ రోజు తాటి, కొబ్బరి ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం, భోజనం ఉచితం అని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కె..కృష్ణమూర్తి ప్రారంభించే ఈ సదస్సులో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు.  13 జిల్లాలకు చెందిన గీత కార్మికులు ఈ అవగాహన సదస్సుకు హాజరుకావలసిందిగా జయప్రకాష్ కోరారు.

రూ.140 కోట్ల రుణాలు
                   తమ కార్పోరేషన్ ద్వారా గౌడ, శెట్టిబలిజ, ఈత, ఈడిగ కులస్తులకు రుణాలు అందజేస్తున్నట్లు జయప్రకాష్  తెలిపారు. గత సంవత్సరం రూ.35 కోట్లు రుణాలు అందజేసి ఏడు వేల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఈ ఏడాది 14 వేల మందికి రూ.140 కోట్ల  రుణాలు అందజేస్తామన్నారు. అందులో రూ.70 కోట్లు బ్యాంకుల రుణాలు కాగా, రూ.70 కోట్లు సబ్సిడీగా అందజేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2460 దరకాస్తులు అందినట్లు తెలిపారు. గత ఏడాది మిగిలిన వారికి కూడా రుణాలు అందజేస్తామని చెప్పారు.  అంతేకాకుండా ఆధరణ పథకం కింద వెనుకబడిన తరగతులవారికి రూ.10 వేలు, రూ.20వేలు, రూ.30 వేలు చొప్పున 70శాతం సబ్సిడితో రుణాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ పథకం కింద గీత కార్మికులకు తాటి మోకు, రెండు బిందెలు, ఒక సైకిల్ అందజేస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచి గీత కార్మికులకు ప్రభుత్వం భూమి శిస్తు రద్దు చేస్తున్నట్లు జయప్రకాష్ తెలపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...