Aug 18, 2017

టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో కొత్త ఆలోచనలకు ఆహ్వానం


Ø స్వచ్ఛ ఆంధ్ర మిషన్ సమీక్ష సమావేశం
Ø పోటీలో పాల్గొనేందుకు అన్ని వయసుల వారు అర్హులే
Ø నూతన ఆలోచనల్లో ముందుండే ఏపీ
Ø 6 విభాగాల్లో 18 బహుమతులు

 సచివాలయం, ఆగస్ట్ 18: వ్యక్తిగత, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పిచాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులకు పిలుపు ఇచ్చారు. కేంద్ర త్రాగునీరు, శానిటేషన్ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ లాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తూ పోటీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంబంధిత ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ సచివాలయంలోని 2వ బ్లాక్ సమావేశమందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరగాలని చెప్పారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఎండి డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త కొత్త ఆలోచనల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుదని చెప్పారు. టాయిలెట్ల నిర్మాణంలో కూడా మనమే ముందుండాలన్నారు. లాయిలెట్లకు సంబంధించి ఆరు అంశాలలో పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ అంశాలు టాయిలెట్ల ఉపయోగించడాన్ని పర్యవేక్షించడం, ప్రవర్తనలో మార్పు, టాయిలెట్ల నిర్మాణంలో సాంకేతికత, పాఠశాలలో టాయిలెట్ల వినియోగం, నిర్వహణలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు, వ్యర్థాల సురక్షిత నిర్మూలనలో సాంకేతిక వినియోగం, సెప్టిక్ ట్యాంకుల శుభ్రతలో తలెత్తే సమస్యలకు పరిష్కారం అని వివరించారు. స్వచ్ఛ హక్తాన్ పేరుతో నిర్వహించే ఈ పోటీలలో అన్ని వయసులవారు, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా, విదేశీయులు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ పోటీ మూడు రౌండ్లలో జరుగుతుందన్నారు. పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు https://innovate.mygov.in వెబ్ సైట్ లో ఉంటాయని, నూతన ఆలోచనలు, పరిష్కార మార్గాలతో కూడిన ఎంట్రీలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని చెప్పారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన మొదటి రౌండ్ కు ఎంట్రీలు అప్ లోడ్ చేయడానికి చివరి తేది ఈ నెల 25 అని తెలిపారు.  పోటీదారులు రూపొందించే వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి, ఆ లింక్ ను  దరకాస్తులో పొందుపరచాలని తెలిపారు. మొదటి రౌండ్ లో ఒక్కో అంశానికి సంబంధించి పది మందిని రెండవ రౌండ్ కు ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 72వ రౌండ్, 83వ రౌండ్ నిర్వహిస్తారని వివరించారు. ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, 2వ బహుమతిగా రూ.2 లక్షలు, 3వ బహుమతిగా లక్ష రూపాయలు అందజేస్తారని, ప్రతి అంశంలో 3 బహుమతుల చొప్పున మొత్తం 18 బహుమతులు ఉంటాయని చెప్పారు. ఇవేకాకుండా రాష్ట్రాలకు, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ పోటీలకు సంబంధించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయాలని చెప్పారు. బహుమతులకంటే ఈ అంశం గురించి అందరూ ఆలోచించాలన్నారు.

రాష్ట్రంలో టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణపై సమీక్ష సందర్భంగా పలు సమస్యలను అధికారులు వివరించారు. పాఠశాలలో టాయిలెట్ల శుభ్రత, నీటి సమస్య గురించి తెలిపారు. కొన్ని గ్రామాలలో ఇంటి స్థలం చాలా తక్కువగా ఉండటం వల్ల, దగ్గరదగ్గరగా ఇళ్లు ఉండటం వల్ల టాయిలెట్ నిర్మాణానికి స్థలం ఉండటంలేదని చెప్పారు.  సెప్టిక్ ట్యాంకుల సుభ్రం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.  అయితే వ్యక్తిగత శుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలలో 90 శాతం అవగాహన కలిగినట్లు చెప్పారు. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉందని, అందువల్ల టాయిలెట్లను వినియోగంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆర్తి కూచిబొట్ల, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...