మంగళగిరి:మంగళగిరి ప్రెస్ క్లబ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.మంగళగిరి మండలంలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఏకమై ‘మంగళగిరి ప్రెస్‌క్లబ్’ పేరుని ఖరారు చేశారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశమై ప్రెస్ క్లబ్ నూతన కమిటీని కూడా గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా వానపల్లి బ్రహ్మనాయుడు(ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్(మహాన్యూస్), కోశాధికారిగా బత్తుల సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళి రాజు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, మట్టుకొయ్య కృష్ణ, బాపనపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వుల శ్రీహరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లేశ్వరరావు, కార్యదర్శులుగా దొప్పలపూడి రాము, మెడకాయల మస్తాన్, మంచికలపూడి సిరిబాబు, సహాయకార్యదర్శులుగా చెదలవాడ సాయిచంద్, నాయుడు నాగరాజు, గండికోట దుర్గారావులను ఎన్నుకున్నారు.
కార్యవర్గ సభ్యులుగా శిరందాసు విజయ భాస్కర్, విడేల సాయి శ్రీనివాస్, కె.అభిరామ్ కృష్ణారెడ్డి, ఎం. శివనాగి రెడ్డి, బత్తెన శ్రీనివాసరావు, ఆరేపల్లి రాజు, వేముల రాంబాబు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మద్దెల కిషోర్, ఉద్దంటి రమేష్, పి.రమేష్ కె.వెంకటేష్, శివరాత్రి శ్రీనివాసరావు, బండారు సాంబ, జీవై సాయి కృష్ణ, చిన్ని కాజాలను ఎన్నుకున్నారు. ప్రెస్‌క్లబ్ గౌరవ సలహాదారులుగా కొలికిపూడి రూఫస్, శిరందాసు నాగార్జున, త్రిపురమల్లు సతీష్, ఎన్వీ శివన్నారాయణ, గోరంట్ల లక్ష్మీనారాయణ, శిరందాసు శ్రీనివాసరావు, ఈపూరి రాజారత్నం, ఐ.వెంకటేశ్వరరెడ్డి, అన్నవరపు ప్రభాకర్‌లను ఎన్నుకున్నారు.
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి
మంగళగిరిలో దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరినీ ఏకతాటిపై నడిపించి, ఐక్యంగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షకార్యదర్శులు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలను పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రెస్‌క్లబ్ సభ్యులకు సహాయం అందించేందుకు ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ప్రెస్‌క్లబ్ సభ్యులందరూ తర్వలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు.
No comments:
Post a Comment