Aug 29, 2025

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

తెలుగంటే..... నీవు నేను మనం

Aug 21, 2025

ఎస్‌జేఎఫ్ఐ జాతీయ కమిటీలో ఏపీ నుంచి ఐదుగురికి స్థానం


తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: ఏపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా  ఎంవీ రామారావు(విజయవాడ), శిరందాసు నాగార్జున రావు (మంగళగరి), హెచ్.ఆజాద్(అనంతపురం),  ఎం.నరేంద్ర(తిరుపతి) ఎంపికయ్యారు. అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం వేదికగా  ఎస్‌జేఎఫ్ఐ ఆవిర్భవించింది.  ఎస్‌జేఎఫ్ఐ జాతీయ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, రైల్వే రాయితీలు పునరుద్దరించాలని, జర్నలిస్టులపై దాడులు నివారించాలని..తదితర డిమాండ్లతో తీర్మానాలు చేసింది. 


సీనియర్ జర్నలిస్టులకు కేంద్రం పెన్షన్ ఇవ్వాలి: ఎస్‌జే‌ఎఫ్‌ఐ

తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) రిటైర్డ్ జర్నలిస్టుల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొత్త సమాఖ్య అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. సీనియర్ జర్నలిస్టుల కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయాలని, నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కూడా ఈ సమావేశం పిలుపునిచ్చింది.  సందీప్ దీక్షిత్ (ఢిల్లీ) సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్‌పి చెక్కుట్టి (కేరళ) సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆనందమ్ పులిపలుపుల (తెలంగాణ), సుహాసిని ప్రభు గోవాంకర్ (గోవా), డాక్టర్ టి.జనార్ధన్ (ఆంధ్రప్రదేశ్), చందర్ ప్రకాష్ భరద్వాజ్ (మధ్యప్రదేశ్), కార్యదర్శులుగా కె.శాంతకుమారి (కర్ణాటక), కన్హు నందా (ఒడిశా), ఆర్. రంగరాజ్ (తమిళనాడు), డాక్టర్ జయపాల్ పరశురాం పాటిల్ (మహారాష్ట్ర), కోశాధికారి కె.పి.విజయకుమార్ (కేరళ) ఎన్నికయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి  జాతీయ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ నుంచి  సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా  ఎంవీ రామారావు, ఎం.నరేంద్ర, శిరందాసు నాగార్జున రావు, హెచ్.ఆజాద్ ఎంపికయ్యారు. 

ముగింపు వేడుకను గోవా, మిజోరం మాజీ గవర్నర్ అడ్వకేట్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై ప్రారంభించారు. మాజీ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ కె.వి. థామస్, మాజీ మంత్రి పి.కె. కున్హాలికుట్టి, ఎస్.జె.ఎఫ్.ఐ అధ్యక్షుడు సందీప్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి ఎన్.పి. చెక్కుట్టి కూడా సభలో ప్రసంగించారు.  ఈ సమావేశాల్లో పెట్టిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. తీర్మానం (1) సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకాన్ని SJFI డిమాండ్ చేస్తోంది. నేడు భారతదేశం అంతటా సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి దుర్బలంగా మరియు అనిశ్చితంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో, ఈ వృత్తి నుండి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులు వివిధ అనారోగ్యాలు, పరిష్కరించబడని కుటుంబ భారాలు మరియు ఒంటరితనం వంటి అనేక సమస్యల మధ్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సాధారణ ఆదాయం లేకపోవడంతో, రెండు అవసరాలను తీర్చుకోవడం ప్రాథమిక సవాలు. చాలా మంది విషయంలో, స్వీయ మరియు జీవిత భాగస్వామి వైద్య ఖర్చులు భరించలేనంత ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుండి మద్దతు ఓదార్పు ఇవ్వడం అంత సులభం కాదు ఎందుకంటే వారికి కూడా వారి కుటుంబ యూనిట్లు ఉన్నాయి. ఈ తీవ్రమైన పరిస్థితిని చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల, సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఈ మొదటి జాతీయ సమావేశం, దేశవ్యాప్తంగా అర్హత కలిగిన సీనియర్ జర్నలిస్టులందరినీ కవర్ చేసే జాతీయ పెన్షన్ పథకాన్ని అత్యవసరంగా అమలు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. 

ప్రస్తుత తరం సీనియర్ జర్నలిస్టులు ఎటువంటి నిర్దిష్ట ఆదాయాన్ని సంపాదించరు కాబట్టి, పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి.  భారత ప్రభుత్వం ప్రకటనల ద్వారా మీడియా సంస్థలకు భారీగా మద్దతు ఇస్తుంది, ప్రకటన చెల్లింపులో నిర్దిష్ట శాతాన్ని సంక్షేమ పథకానికి కేటాయించవచ్చు. 

వృత్తి నుండి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకాన్ని దోహదపడేలా ప్రభుత్వం జర్నలిస్ట్ సంఘాలతో సంప్రదింపులు జరపాలి. సీనియర్ జర్నలిస్టులు నిర్ణయించి కోరితే తప్ప, ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకం వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ పథకాలను భర్తీ చేయకూడదు. జాతీయ పెన్షన్ పథకంపై సంప్రదింపులు ప్రారంభించడానికి ప్రభుత్వం వెంటనే SJFI మరియు వివిధ వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. తీర్మానం (2):  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)లో సీనియర్ జర్నలిస్టులను చేర్చాలని SJFI డిమాండ్ చేస్తోంది.దేశంలోని అన్ని వృద్ధుల మాదిరిగానే సీనియర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కీలక సవాలు ఆరోగ్యానికి సంబంధించినది. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు సాధారణ ఆదాయం లేకపోవడం వల్ల మనుగడను సవాలుగా భావిస్తారు. దానితో పాటు పెరుగుతున్న వైద్య ఖర్చులను తీర్చాల్సిన అవసరం ఉంది. సీనియర్ జర్నలిస్టులకు సరసమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ తప్పనిసరి అని SJFI  ఈ మొదటి జాతీయ సమావేశం విశ్వసిస్తోంది. అందువల్ల, దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కవరేజీని విస్తరించాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర విభాగాలకు సబ్సిడీ ఆరోగ్య బీమా పథకంలో సీనియర్ జర్నలిస్టులను చేర్చాలని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ముఖ్యంగా, కేరళలోని సీనియర్ జర్నలిస్టులను రాష్ట్ర ఉద్యోగుల కోసం MEDICEP పథకంలో చేర్చాలని మేము కేరళ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

తీర్మానం.(3)సీనియర్ సిటిజన్లందరికీ రైళ్లలో రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించాలని SJFI డిమాండ్ చేస్తోంది. దేశంలో సీనియర్ సిటిజన్లు చాలా కాలంగా రైళ్లలో రాయితీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. భారత ప్రభుత్వం 2020లో తీసుకున్న నిర్ణయం వృద్ధుల అనవసర ప్రయాణాన్ని పరిమితం చేయడమే. రైల్వేలు రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీని ఉపసంహరించుకుని ఐదు సంవత్సరాలు దాటింది. కోవిడ్ తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది మరియు రైల్వేల పనితీరు బాగా మెరుగుపడింది. సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి ఇది సరైన సమయం అని మేము భావిస్తున్నాము. సీనియర్ సిటిజన్లకు రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించడంపై మేము వెంటనే నిర్ణయం తీసుకుంటాము.

తీర్మానం(4):  భారతదేశంలో జర్నలిస్టులపై పెరుగుతున్న బెదిరింపులు మరియు బాధితుల పట్ల ఈ సమావేశం తన ఆందోళన మరియు తీవ్ర వేదనను నమోదు చేస్తుంది. అసోం క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ప్రఖ్యాత జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్ మరియు కరణ్ థాపర్‌లను దేశద్రోహ ఆరోపణలపై సమన్లు ​​జారీ చేసినట్లుగా, చట్ట దుర్వినియోగాన్ని ఇది ఖండిస్తుంది.స్వేచ్ఛాయుతమైన మరియు విమర్శనాత్మక జర్నలిజం ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని మరియు బలవంతం ద్వారా నిశ్శబ్దం చేయలేమని ఇది ధృవీకరిస్తుంది. ఈ సమావేశం అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు పత్రికా స్వేచ్ఛపై ఇటువంటి దాడులను నిరసిస్తూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది.


Aug 19, 2025


నటనలో పట్టున్న గానగంధర్వుడు

ఘనంగా 70వ జన్మదిన వేడుకలు


వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీత్యా ఆయన నటుడు, గాయకుడు.. వెరసి కళలపట్ల మక్కువ ఎక్కువగా ఉన్న వామపక్ష భావజాలం ఉన్న కళాకారుడు. నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే  ఆయన వేదికనెక్కారు. ఆయనే మంగళగిరి గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పొట్లాబత్తుని లక్ష్మణరావు.

గుంటూరు జిల్లా మంగళగిరికి  చెందిన చేనేత, ప్రజానాట్యమండలి కళాకారుడు, కడలూరి డిటెన్యూ, ప్రముఖ కమ్యూనిస్టు  పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు- తల్లి మహాలక్ష్మి దంపతులకు లక్ష్మణరావు 1956 ఆగస్టు 19న  జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని  కడలూరు సెంట్రల్ జైలులో డిటెన్యూగా ఉన్నారు. తండ్రి లక్షణాలే బాల్యం నుంచి లక్ష్మణరావు పుణికిపుచ్చుకున్నారు. వృత్తి, ప్రవృత్తి అన్నీ తండ్రి లక్షణాలే. అయితే, ఈయన స్వయంకృషితో చేనేత కళాకారుడి నుంచి మాస్టర్ వీవర్‌(చేనేత మగ్గాలు నేయించే యజమాని)గా, ఆ తర్వాత చేనేత వస్త్ర వ్యాపారిగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆయన సామాజికంగా, ఆర్థికంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఓ గొప్ప మానవతావాది. మంచి స్నేహశీలి. పాత మంగళగిరిలోని జీఆర్(గంజి రామాంజనేయులు) స్కూల్‌లో ప్రాథమిక విద్యతో లక్ష్మణరావు చదువు ముగిసింది.  అక్కడ నుంచి జీవితాన్ని చదవడం మొదలుపెట్టారు. మంగళగిరి మెయిన్ బజారు గుర్రబ్బళ్ల సెంటర్‌లోని  వింజమూరి వెంకటరత్నం చిల్లర కొట్టుతో అతని సంపాదనపర్వం  మొదలైంది. అప్పటి నుంచే మంగళగిరిలోని అన్నివర్గాల ప్రజలతో, పెద్దలతో పరిచయాలు మొదలయ్యాయి. ఆ చిల్లర కొట్లో కొద్దికాలం మాత్రమే పనిచేశారు. 11 ఏళ్లకే చేనేత మగ్గం గుంటలోకి దిగారు. అది మొదలు దాదాపు 30 ఏళ్లు చేనేత కళాకారుడిగా జీవించారు. 1976 మార్చి 5న లక్ష్మణరావు-లక్ష్మిని వివాహం చేసుకున్నారు. 


1988 నుంచి  చేనేత మగ్గాలు నేయించడం ప్రారంభించారు. రెండేళ్లు గడిచింది. ఎదుగుబొదుగులేదు.  1990లో లక్ష్మణరావు అమ్మ మహాలక్ష్మి తండ్రి ఆత్మకూరు గ్రామానికి చెందిన చిట్టెల అంకయ్య  వ్యాపార వృద్ధి కోసం రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ పెట్టుబడితో వ్యాపారం వృద్ధి చేయడంపై దృష్టిసారించారు. రెండు చేనేత మగ్గాలతో మొదలుపెట్టిన చేనేత వ్యాపారం రెండు నెలల్లో 20 మగ్గాలకు చేరింది. అక్కడి నుంచి మాస్టర్ వీవర్‌గా ఎదుగుతూ వచ్చారు. నేడు 400 మగ్గాలు నేయిస్తున్నారు. మంగళగిరిలో ఆయనకు చేనేత షెడ్లు ఉన్నాయి. సొంత షెడ్లలోని మగ్గాలతోపాటు మంగళగిరి, భట్టిప్రోలు, ఐలవరం, తెనాలి, పెడన, చేబ్రోలు, మచిలీపట్నం వంటి చోట్ల కూడా ఆయన చీరలు నేయిస్తుంటారు. నీతి, నిజాయితీ, నమ్మకం, ఇతరులకు సహాయపడటం వంటి లక్షణాలు ఆయన జీవన శైలిలోనే ఉన్నాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడానికి అవి ఆయనకు ఉపయోగపడ్డాయి. చేనేత వస్త్రాల రంగు, నైపుణ్యంగల వస్త్రాల తయారీకి మంగళగిరి ప్రసిద్ధి. దానికితోడు ఆయన స్వయంగా చేనేత కళాకారుడు కావడంతో చేనేత వస్త్రాల తయారీలో రంగులు, డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పోకడలుపోతూ మాస్టర్ వీవర్‌గా మంచి గుర్తింపు పొందగలిగారు. 1992లో చేనేత వస్త్రాలయం 

‘లక్మ్షీశారీస్’ని  ప్రారంభించారు. మొదట రిటైల్ వ్యాపారం ప్రారంభించి, తర్వాత హోల్ సేల్ వ్యాపారం కూడా మొదలుపెట్టారు.  కొడుకు శ్రీకాంత్ ఆయనకు అన్ని విధాల చేదోడువాదోడుగా ఉండటంతో వ్యాపారవేత్తగా కూడా లక్ష్మణరావు దూసుకుపోతున్నారు. మంగళగిరిలో ప్రముఖ వ్యాపార సంస్థగా ఎదిగిన    ‘లక్మ్షీశారీస్’కి  రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి పేరుంది. దాంతో వారి వ్యాపారం రూ.4 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అటు చేనేత వృత్తిలో, ఇటు రిటైల్, హోల్ సేల్ వ్యాపారంలో  లక్ష్మణరావు దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

వృత్తి రీత్యా చేనేత కళాకారుడైన లక్ష్మణరావు ప్రవృత్తి రీత్యా నటుడు, గాయకుడు, రేడియో కళాకారుడు.  దానికి తోడు తండ్రి వెంకటేశ్వరరావు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత, ఆ ఉద్యమంలో పాల్గొని కడలూరి డిటెన్యూగా జైలుకు కూడా వెళ్లారు.  ఆయన కూడా ప్రజానాట్యమండలి కళాకారుడు. అప్పట్లో మిక్కిలినేని వంటి హేమాహేమీలతో ఆయన నటించారు.  ఆయన వామపక్ష భావజాలం, రంగస్థల నటన లక్ష్మణరావుకు బాగా వంటబట్టాయి. అయితే, తండ్రిని మించిన తనయుడుగా వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా, ఆర్థికంగా ఎదిగారు.  నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే వేదికనెక్కిన ఘనత లక్ష్మణరావుకు ఉంది. ‘మా భూమి’ నాటకంలో ప్రముఖ సినిమా నటుడు మిక్కిలినేని రాధాకృష్ణ నటించిన పాత్రకు కొడుకుగా 5 నెలల వయసులోనే లక్ష్మణరావుని తండ్రి స్టేజీ ఎక్కించారు. తల్లిదండ్రులు ఎత్తుకుని ఆడించే దృశ్యంలో కనిపించారు. ఆ తర్వాత పదేళ్ల వయసు నుంచి నటించడం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఒక్క ‘భూ భాగోతం’ నృత్య నాటిక ఒక్కటే 500 ప్రదర్శనలు ఇచ్చారు.   గంభీరమైన స్వరంతో భావాన్ని ప్రకటిస్తారు. స్వరంలో మాధుర్యం, గంభీరం రెండూ పలికిస్తారు.  గానం కూడా అంతే మధురంగా, వినసొంపుగా ఆలపిస్తారు. మంచంమీద మనిషి, ఎవరు కారణం?, వెలుగొచ్చింది, ఆంజనేయరెడ్డి చరిత్ర, అడ్రెస్ లేని మనుషులు, శ్రీముఖ వ్యాఘ్రం, కనువిప్పు, తిరుగు టపా, వంద నోటు, క్షీరసాగర మథనం... వంటి అనేక నాటకాలు, నాటికలలో నటించారు.  ఆయన నటించిన ప్రతి నాటిక 40 నుంచి 50 సార్లు ప్రదర్శించారు.  శ్రీముఖ వ్యాఘ్రం నాటికలో సినీనటి అన్నపూర్ణ(ఉమ), లక్ష్మణరావు భార్యాభర్తలుగా నటించారు. 

1979 నుంచి 2012 వరకు రేడియో ఆర్టిస్ట్‌గా అనేక  నాటికలలో నటించారు. పాటలు పాడారు. ముఖ్యంగా నాటక రంగంలో దర్శకత్వం, రచన, నటన.. వంటి విషయాలలో  లక్ష్మణరావుకు  మంగళగిరికి చెందిన అందె నరసింహారావు, కట్టా నాగేశ్వరరావు, కట్టా అంజిబాబు, గట్టెం నరసింహమూర్తి, భాస్కరరావు, కున్నెర్ల బుజ్జి, బొడ్డు విద్యాసాగర్, కొంగతి సాంబశివరావు, గోలి సీతారామయ్య, సందుపట్ల భూపతి... వంటివారు సహకారం అందించారు. 


వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ లక్ష్మణరావుకు  కళలంటే ప్రాణం. పదేళ్ల క్రితం ప్రారంభించిన  విశ్వశాంతి కళాపరిషత్ వ్యవస్థాపక కన్వీనర్ కూడా  అయిన పొట్లాబత్తుని లక్ష్మణరావు నేటి తరానికి సాంస్కృతిక, కళల ఆవశ్యకతను తెలియపరిచేందుకు  తండ్రి కడలూరి డిటెన్యూ, ప్రజాకళాకారుడు, కీర్తిశేషులు పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు పేరిట పాత మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన  లక్ష్మీశారీస్ భవనంపైన  దాదాపు పదేళ్ల క్రితం ‘పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయం’ను ప్రారంభించారు. కళలు, సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉత్తమ సాధనాలుగా ఆయన భావిస్తారు.  కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం. గానం  కాసు కోసం, కీర్తి కోసం కాకూడదన్నది ఆయన నినాదం, లక్ష్యం. మంగళగిరి నగరంలో సాంస్కృతిక పునర్ వైభవాన్ని చాటేందుకు  ఈ కళానిలయంను   సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు  ఉచితంగా ఇస్తారు. ప్రజా కళాకారుడైన లక్ష్మణరావు నగరంలో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ఆయా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తుంటారు.  మంగళగిరి బుద్ధ విహార్ వ్యవస్థాపక సభ్యులైన లక్ష్మణరావు  కళల ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు విశేషంగా కృషి చేస్తుంటారు. రాజకీయంగా కూడా లక్ష్మణరావు చురుకుగా వ్యవహరిస్తుంటారు. టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటుంటారు.  ఆగస్టు 19న లక్ష్మణరావు 70వ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు ఘనంగా నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పొట్లాబత్తుని లక్మణరావు కళాసేవను ఇలాగే కొనసాగిస్తారని ఆశిద్దాం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Aug 7, 2025

చేనేతపై ప్రభుత్వం చల్లని చూపు

నేడు చేనేత దినోత్సవం

జాతీయోద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించింది.  జాతీయ నాయకులు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో  1905, ఆగస్టు 7న  కోల్‌కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ సంఘటన ఉద్యమానికి ఊపు తెచ్చింది. దాంతో  చేనేత చిహ్నమైన రాట్నానికి జాతీయోద్యమ జెండాలో స్థానం కల్పించారు. నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడుకుతుండేవారు. ఆ విధంగా చేనేత  చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను తొలిసారి దగ్ధం చేసిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం(నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని  కేంద్ర ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. అప్పటి  నుంచి జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో  కూటమి ప్రభుత్వం చల్లని చూపు చేనేత రంగంపై పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. వారికి మద్దతు పలుకుతూ, వారి జీవనాన్ని మెరుగు పరచడం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేతకు పూర్వ వైభవం వస్తోంది. చేనేత మగ్గం మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు ఊతం ఇస్తే,  అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.  ప్రభుత్వ చర్యల వల్ల చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  చేనేత ఉత్పత్తులు పెరిగి, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారు.  ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్  పథకం కోసం ప్రభుత్వం  రూ.125 కోట్ల వ్యయం భరించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో  50 వేల చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలు, 15 వేల మర మగ్గాలు ఉన్న కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్  ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే.  అలాగే, చేనేత కార్మికులకు ఇచ్చే వీవర్ పెన్షన్‌ని నెలకు రూ.4వేలకు పెంచారు. చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే  భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.   చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది.  మంత్రి నారా లోకేష్  చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.  చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈరోజు మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్‌శాలలో జరిగే  జాతీయ చేనేత దినోత్సవంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అంటే, ఈ ప్రభుత్వం చేనేతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 23, 2025

ఆధునిక హంగులతో ‘బుద్ధునితో నా ప్రయాణం’








రెండున్నర గంటలు ప్రేక్షకులను కట్టిపడేసిన నాటకం


స్టేజీ నాటకానికి  ఆధునిక హంగులు అద్దారు. నాటకంను ప్రదర్శించే తీరులో నూతన పోకడలకు ప్రాధాన్యత ఇచ్చారు.  రికార్డ్ చేసిన నాటకాన్ని  30 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భాష, భావం, సంగీతం, నృత్యాలతో బౌద్ధాన్ని స్టేజీపై ఆవిష్కరించారు.  ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది. నాటకాన్ని చూసినవారందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అదే ‘బుద్ధునితో నా(అంబేద్కర్) ప్రయాణం’ అనే నృత్యరూప నాటకం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా ఈ నాటకాన్ని రాశారు. ఆ నాటి సామాజిక పరిస్థితులను, గౌతముడు బుద్ధుడిగా మారిన తీరు, బుద్ధుని బోధనల సారంతో బౌద్ధం-అంబేద్కరిజంని ఆవిష్కరించారు. బౌద్ధానికి, బుద్ధునికి, జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అంబేద్కర్ కలిగిన సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయో, మనకి కూడా నివృత్తి అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞనోదయం అవుతుంది.  ఇక ఆచరించడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎక్కవ భాగం వాడుక భాషలో ఈ దృశ్యరూపకాన్ని అద్వితీయంగా రూపొందించారు. కొన్ని దృశ్యాలు చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాటిలో  గౌతముడు బుద్ధుడిగా మారిన సన్నివేశం చూపరులను బాగా ఆకట్టుకుంది. వేదికపై ఒకేసారి మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. రికార్డ్ చేసిన నాటకం అయినా,  ప్రేక్షకులు గమనించలేనంగా నటీనటులు అందరూ  పెదాల కదలికను ప్రదర్శించారు. రికార్డ్ చేసిన నాటకం అయినందునే నిర్ణయించిన ప్రకారం 2.20 గంటలకు ముగుస్తుంది. 


బుద్ధుడి పాత్రధారి చాలా అందంగా ఉన్నారు. చక్కటి ముఖవర్చస్సు. బుద్ధుడిలోని ఆ శాంతం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత,  నడక,  నమ్రత, స్థిత ప్రజ్ఞత, మరణాన్ని జయించిన తేజస్సు ఆ నటుడిలో మూర్తీభవించింది. ఆయన మాటతీరు, అభినయం అద్వితీయం. నాటకం ఆద్యంతం, స్టేజీపై లైట్లు ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆ నటుడి నటన ఒకేతీరుగా ఉండటం ప్రత్యేకం.  అంబేద్కర్ పాత్రధారి కూడా చాలా చక్కగా నటించారు. ఆయన నడవడి, మాటతీరు, సందేహాలు వ్యక్తం చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి.  బుద్ధుడు, అంబేద్కర్ ఇద్దరి వస్త్రధారణ బాగుంది. నాటకం మొత్తాన్ని మోసిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మొత్తం  ఆరుగురు నృత్య కార్మికులు, శ్రామికులు, కళాకారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు నాటకం మొత్తం శ్రమించారు. వారు అలుపెరుగకుండా, చెమటలు కక్కుతూ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా నృత్యం చేశారు. కథంగా వారే నడిపారు.  దాదాపు రెండు గంటలు వారు నృత్యం చేయడంతోపాటు వివిధ రకాల పాత్రలు కూడా పోషించడం విశేషం. 

మైనస్ పాయింట్లు

నాటకం ఇతివృత్తం, ప్రదర్శన తీరు ఎంత అద్బుతంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్‌లో హిందు మతాన్ని విమర్శించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మతం ఏదైనా(ఏదైనా) మత్తు మందులాంటిదే. అందులో సందేహంలేదు. అలాంటప్పుడు ఒక్క హిందు మతాన్నే విమర్శించడం సరైన ఆలోచన కాదని నాకు అనిపించింది. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు.? అది మరో అంశం. అంబేద్కరిస్టులలో అత్యధిక మంది క్రైస్తవులు లేక ఆ మతానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇది మరో పెద్ద అంశం. వాటిజోలికి  నేను వెళ్లడంలేదు.  సమాజానికి ఎంతో ఉత్తమమైన, విలువైన సందేశాలను అందించిన, బుద్ధుని బోధనలను అత్యంత ఆసక్తికరంగా చూపించి, వినిపించి, చివరకు  హిందు మతాన్ని విమర్శించిన తీరు అసలు బాగోలేదు. ఉత్తమ బోధనలతో శిఖర స్థాయికి వెళ్లిన ఆలోచనలు చివరి అయిదు నిమిషాలలో ఒక్కసారిగా దిగజారినట్లనిపించింది. ఈ సమాజానికి ఈ నాటకం అవసరం చాలా ఉంది. బౌద్ధం, అంబేద్కర్ భావజాలంతోపాటు ప్రపంచ మానవ జాతికి  కావలసిన అనేక అంశాలను అత్యంత సులువుగా అర్థం చేసుకునే విధంగా నాటకంని ప్రదర్శించారు. అందువల్ల, నాటక రచయిత, ప్రదర్శకులు ఈ విషయాన్ని తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ముందు ముందు ప్రదర్శనలలో మార్పులు చేస్తే మంచిదని నా అభిప్రాయం.  నాటకంలో భాష 90 శాతం వ్యవహారికమే వాడారు. ఓ పది శాతం మాత్రం గ్రాంథికం వాడారు. దానిని కూడా వ్యవహారికంలోకి మార్చవలసిన అవసరం ఉందనిపించింది.

విజయవాడ మొగల్రాజ్ పురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జూలై 22 మంగళవారం  రాత్రి  బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్ధ కళాపీఠం, కామ్రేడ్ జీఆర్‌కే - పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.  వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా   వందల మంది  నాటకం చూసేందుకు వచ్చారు. వారిలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారితోపాటు ప్రగతిశీలవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.  కదలకుండా కూర్చొని చూశారు. ఓ నాటకం పట్ల ప్రజలు  ఇంతటి ఆసక్తికనపరచడం, వారి ఆలోచనల స్థాయికి తగ్గకుండా నాటకాన్ని ప్రదర్శించడం గమనార్హం.సంతోషం.  

మరో మైనస్ పాయింట్

ముందుగా ప్రకటించిన ప్రకారం నాటకంని ప్రారంభించలేదు. గంట ఆలస్యంగా  నాటకాన్ని మొదలు పెట్టారు. నా దృష్టిలో  ఇది క్షమార్హం కాదు. ఎందుకో వివరిస్తాను.  బుద్ధుడు - అంబేద్కర్ లను  ఉన్నతమైన వ్యక్తులుగా ప్రపంచం గుర్తించింది. తెలుగు నేలపై  సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను స్పృశిస్తూ, వారిద్దరి గురించి, వాళ్ళు సమాజం కోసం పడిన తపన గురించి, సమాజానికి వారు చూపించిన సార్వకాలికమైన సత్యాలను, వారి జీవితాల్లో జరిగిన పలు సంఘటనలను సంగీత, సాహిత్య సమ్మేళనంతో నిండిన గొప్ప కళారూపంగా, అత్యంత ఆధునిక సాంకేతిక, సౌండ్ అండ్ లైటింగ్ విధానాలతో  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా నాటకంని ప్రదర్శిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా  ప్రచారం చేశారు. చేస్తున్నారు. ప్రదర్శిస్తున్నారు. బౌద్ధులు, బౌద్దాభిమానులు, అంబేద్కరిస్టులు, వామపక్ష వాదులు, అభ్యుదయ వాదులు, సామాజిక మార్పును కాంక్షించే  ప్రగతిశీలు అందరినీ ఈ నాటకం పేరుతో కూడకడుతున్నారు. ఇది చాలా మంచి పరిణాం. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందారు. దానిని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి కార్లు, బస్సులు, టూవీలర్ల పై వందల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. సమాజంలో ఓ విప్లవాత్మకమైన మార్పు రావాలన్న దసాశయంతో ఈ నాటకంని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగకుండా సమయపాలన పాటించవలసిన అవసరం నిర్వాహకులకు ఉంది. 

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 18, 2025

రూ.39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం


అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు.  సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ ) సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. ఎస్ఐపీబీ సమావేశానికి సీఎస్ కె.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన  రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు  రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3,  ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీ లో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు  ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి.  ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

సమీకృత ప్రణాళికతో పారిశ్రామిక ప్రాజెక్టులు

పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం పేర్కోన్నారు. భూములు కేటాయించిన ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీశైలం రహదారి విస్తరణపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 ఎస్ఐపీబీ ఆమోదించిన 22 ప్రాజెక్టులు

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం గురువారం జరిగింది. 

ఈ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు:

1. ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ - విశాఖలో రూ.205 కోట్లు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు.

2. శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ-  చిత్తూరులో రూ.282 కోట్లు పెట్టుబడి, 1400 ఉద్యోగాలు.

3. రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.1800 కోట్లు పెట్టుబడి, 380 ఉద్యోగాలు.

4. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ -  కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.3600 కోట్ల పెట్టుబడి, 760 ఉద్యోగాలు

5. జెఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ  - కడప జిల్లాలో రూ.2000 కోట్ల పెట్టుబడి, 1380 ఉద్యోగాలు

6. పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.204 కోట్లు పెట్టుబడి, 1000 ఉద్యోగాలు 

7. పీవీఎస్ గ్రూప్ - విజయనగరం జిల్లాలో రూ.102 కోట్ల పెట్టుబడి ,500 ఉద్యోగాలు

8. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్-  నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టు, రూ.4708 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు 

9. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ - విశాఖలో రూ.328 కోట్ల పెట్టుబడి, 1100 ఉద్యోగాలు

10. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్-  విశాఖలో రూ.86 కోట్ల పెట్టుబడి, 720 ఉద్యోగాలు

11. స్టార్ టర్న్ హోటల్స్ ఎల్ఎల్ పీ-  తిరుపతిలో రూ.165 కోట్ల పెట్టుబడి , 280 ఉద్యోగాలు

12. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ - తిరుపతి నాయుడుపేట సెజ్ లో రూ.1147 కోట్ల పెట్టుబడి, 1475 ఉద్యోగాలు  

13. యాక్సెలెంట్ ఫార్మా - తిరుపతి శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడి, 1770 ఉద్యోగాలు

14. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - కర్నూలు జిల్లాలో (సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి), రూ.6933 కోట్ల పెట్టుబడి, 2138 ఉద్యోగాలు

15. జెఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ - కడప జిల్లా స్టీల్ ప్లాంట్  రూ.4500 కోట్ల పెట్టుబడి( రెండు దశల్లో), 2500 ఉద్యోగాలు

16. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్- అనకాపల్లి జిల్లా(ఫోటో వోల్టాయిక్ ప్లాంట్) రూ.3700 కోట్ల పెట్టుబడి,లు,1200 ఉద్యోగాలు 

17. లారస్ ల్యాబ్స్ - అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.5630 కోట్ల పెట్టుబడి, 6350 ఉద్యోగాలు

18. లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- విశాఖ, విజయవాడలలో రూ.1222 కోట్లు పెట్టుబడి, 1500 ఉద్యోగాలు

19. ఏస్ ఇంటర్నేషనల్ - చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు

20. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ ఇండియా- అచ్యుతాపురం సెజ్ లో ఫుట్ వేర్, టాయ్స్ తయారికీ అనుమతి

21. వీఎస్ఆర్ సర్కాన్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు 

22. అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్ - కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.500 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు


Jul 17, 2025

అమరావతిలో సీఆర్డీఏ భూ కేటాయింపులు


అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పలు సంస్థలకు భూములు కేటాయించింది.  అమరావతి పరిధిలోని నిడమర్రు, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో పలు సంస్థలకు ప్రభుత్వం ఈ భూములను కేటాయించారు. ఆ కేటాయింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

క్వాంటం వ్యాలీకి 50 ఎక‌రాలు

లా యూనివ‌ర్శిటీకి 55 ఎక‌రాలు

ఐఆర్ సీటీసీకి ఒక ఎక‌రం

బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఫౌండేష‌న్ కు 21 ఎక‌రాలు

కోస్ట‌ల్ బ్యాంకుకు 0.4 ఎక‌రాలు

రెడ్ క్రాస్ సొసైటీకు 0.78 ఎక‌రాలు

శాఖమూరు పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు  6.8 ఎకరాలు  

కిమ్స్ ఆస్పత్రికి నిడమర్రులో 25 ఎకరాలు

రాయపూడిలో సీబీఐకి 3.50 ఎకరాలు

రాయపూడిలో ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుకు 3 ఎకరాలు

తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ కు 3 ఎకరాలు

గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు

ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు

ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు 2 ఎకరాలు

ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు రెండు ఎకరాలు

బీజేపీ ఆఫీసుకురెండు ఎకరాలు

మందడంలో వివాంతా స్టార్ హోటల్ కు 2.5 ఎకరాలు

హిల్చన్ స్టార్ హోటల్  కు 2.5 ఎకరాలు

తుళ్లూరులో హయత్ రీజెన్సీ కి 2.5 ఎకరనాలు

లింగాయపాలెంలో నోవోటెల్ హోటల్ కు 2.5 ఎకరాలు

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ కు రెండు ఎకరాలు

జియలాజిక‌ల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు

స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు

ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు

ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB)కి 0.5 ఎకరాలు

బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు

గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బ‌త్తి సంస్థ‌లకు  గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేశారు. 

ఇప్పటివరకు 74 సంస్థలకు 947 ఎకరాల భూమి కేటాయించారు. వాటి నిర్మాణాలకు గడువులు విధించారు. 3 సంస్థలు 1 నెలలో, 15 సంస్థలు 2 నెలల్లో, 13 సంస్థలు 5 నెలల్లో, 17 సంస్థలు 6 నెలల్లో పనులు ప్రారంభిస్తాయి.

2014-19 మ‌ధ్య కాలంలో 130 సంస్థలకు 1270 ఎక‌రాలు కేటాయించ‌గా, గ‌త ప్ర‌భుత్వ చర్యల వల్ల ప‌లు సంస్థ‌లు వెన‌క్కి వెళ్లిపోయాయి. 

Jul 15, 2025

మంగళగిరి ఎయిమ్స్‌లో ఏం జరుగుతోంది?


మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ తట్టుకోలేక ఓ జూనియర్‌ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఆ విద్యార్థి ఇక్కడ చేరి ఏడాది పూర్తి అయింది. ఇది ర్యాగింగ్ కాదని, ఓ విద్యార్థినిని, ఆమెకు తెలియకుండా వీడియో తీయడం వల్ల జరిగిన గొడవని తెలుస్తోంది.  ఈ విషయం బయటకు పొక్కితే, పెద్ద కేసవుతుందని, ఆ విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని,   దానిని ర్యాంకింగ్ గా డైవర్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయినందున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎయిమ్స్‌ యాజమాన్యం వారు, స్థానికంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం,  తిరుపతికి చెందిన జూనియర్‌ విద్యార్థికి, సీనియర్ విద్యార్థులకు మధ్య జూన్ 23న గొడవ జరిగింది. ఆ విద్యార్థినిని 25వ తేదీ వరకు సీనియర్లు వసతి గృహంలో పలుమార్లు నిర్బంధించారు.  ర్యాగింగ్‌ పేరిట కొట్టారు. బెదిరించారు.  దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. తక్షణం చికిత్స అందించడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన యూజీసీ అధికారులు ఎయిమ్స్‌ అధికారులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్‌ ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపింది. అంతర్గత విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ  ర్యాగింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రాథమికంగా 15 మంది విద్యార్థులను బాధ్యులుగా తేల్చింది.  అయితే,  వారిలో ఇద్దరికి సంబంధంలేదని తర్వాత తేల్చారు. బాధ్యులుగా 13 మంది సీనియర్‌ విద్యార్థులను గుర్తించారు.  వారిలో ఒకరిని 18 నెలలపాటు, మిగిలిన వారిలో కొందరిని 12 నెలలు, మరి కొందరిని ఆరు నెలలపాటు  ఎకడమిక్ క్లాసుల నుంచి సస్పెండ్ చేశారు. అంతే కాకుండా, వారిని కోర్సు పూర్తి అయ్యేంతవరకు హాస్టల్ నుంచి బహిష్కరించారు.  అందరికీ రూ.25 వేలు చొప్పున జరిమానా విధించారు. 13 మందిని వసతి గృహం నుంచి ఖాళీ చేయించారు. విద్యార్థుల అందరితో అంతర్గత విచారణ పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణా రెడ్డి వివరించారు.  బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్వస్థలానికి తీసుకెళ్లిపోయారు.  అయితే, ర్యాగింగ్ చేసినవారిలో మంగళగిరి ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎయిమ్స్‌లో ఇంత జరిగినా వారం రోజుల వరకు బయటకు తెలియనివ్వలేదు. మీడియాకూ సమాచారం లేదు. యాజమాన్యానికి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు కూడా ఈ ఘటనను  బయటకు వెల్లడించలేదు. అందువల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నిబంధనల ప్రకారం  పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిమ్స్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఫిర్యాదు రాతపూర్వకంగా ఇవ్వకుండా, మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాలేదు. ఆ విద్యార్థిని గానీ,  బాధిత విద్యార్థి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో అనుమానాలు ఇంకా ఎక్కువవుతున్నాయి.  ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు అధికార ప్రతినిధి స్పష్టంగా సమాధానాలు చెప్పలేదు.  ర్యాగింగ్ చేసినవారిలో ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఒకసారి లేదని ఖండించారు. మరోసారి, ఎవరున్నా అందరికీ ఒకే రకమైన పనిష్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంతకు మించి చెప్పే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా వారి పేర్లను బయట పెట్టడంలేదని చెప్పారు.  కమిటీ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీడియా వారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే,  విద్యార్థుల పేర్లు వెల్లడికాకపోవడంతో వారిలో ఎయిమ్స్‌ డీన్‌ కుమారుడు ఉన్నాడా? లేడా? అన్నది స్పష్టంగా తెలియడంలేదు.

మరో వైపు ఇది ర్యాగింగ్ కాదని,  ప్రేమ వ్యవహారం, సీనియర్ మహిళా విద్యార్థినిని జూనియర్ విద్యార్థి వీడియో తీయడం వల్ల జరిగిన గొడవగా చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే, కాలేజీ పరువు పోతుంది. అలాగే, ఆ విద్యార్థిని భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఇది వాస్తవం.  అందువల్ల విద్యార్థిని విషయాన్ని  బయటకు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశ్నించగా, అధికార ప్రతినిధి సమర్థించలేదు. ఖండించలేదు. విలేఖరులు అడిగిన ప్రశ్నలను విని ఊరుకున్నారు. స్పందించలేదు.  కాలేజీ పరువు, ప్రతిష్టలు, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా తమకు సహకరించమని మాత్రం ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ప్రతిష్టాత్మక కాలేజీ అయినందున, ఇక్కడ పాలనా వ్యవహారాలను  సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరం  ఉంది. ఈ ఘటనతో ఇక్కడ అడ్మినిస్టేషన్ లో లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది.  దేశంలోని నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతుంటారు. విద్యార్థులలో డీన్‌ కుమారుడితోపాటు ఎవరున్నా క్రమశిక్షణతో మెలిగే విధంగా ఎయిమ్స్ యాజమాన్యం  పటిష్టమైన చర్యలు తీసుకోవలసి ఉంది. ఎయిమ్స్ ప్రతిష్టని నిలబెట్టడం బాధ్యతగా భావించాలి.  మళ్లీ ఇటువంటి సంఘటన మరొకటి జరిగితే కాలేజీ ప్రతిష్ట మంటగలిచే ప్రమాదం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ చేర్చడానికి, అలాగే విద్యార్థులు కూడా  భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలన్నిటినీ దృష్టిలోపెట్టుకుని ఎయిమ్స్ యాజమాన్యం ఇక ముందు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.  

                                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 5, 2025

రాజ్యాధికారానికి దూరమైతే అభివృద్ధిలో వెనుకబడతారు

మంగళగిరి:  ఏ జాతి ప్రజలు రాజ్యాధికారానికి దూరమౌతారో, ఆ జాతి ప్రజలు అభివృద్ధి సాధించడంలో వెనకబడతారని  పద్మశాలీ క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు,  హైకోర్టు అడ్వకేట్  కొసనం శ్రీనివాసరావు చెప్పారు.  అలాగే అభివృద్ధిలో వెనుకబడిన జాతుల ప్రజలు రాజ్యాధికారం కోల్పోతారన్నారు. చేనేత కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  అభివృద్ధి, రాజ్యాధికారం అనేవి పరస్పరం ఒకదానిపై మరోటి ఆధారపడిన అంశాలుగా పేర్కొన్నారు.  ఒకటి లోపిస్తే మరొకటి లోపిస్తుందని, ఒకటి సాధిస్తే మరొకటి సాధించగలం అన్నారు. అలాగే ఒక సామాజిక వర్గ అభివృద్ధిని, రాజ్యాధికారాన్ని సమన్వయ పరిచేది ఆ సామాజిక వర్గం ప్రజల ఆత్మగౌరవం, ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలు, కలిసి నడవడం అని వివరించారు.  ఆత్మగౌరవంతో ఐకమత్యం వస్తుందని, ఐకమత్యం ఉన్నవారు సమిష్టి నిర్ణయాలు చెయ్యగలరని, సమిష్టి నిర్ణయాలు కలిసి నడిచేలా  చేస్తాయని తెలిపారు. కలిసి నడిచినప్పడే మన సామాజిక వర్గానికి సామాజిక న్యాయం ప్రకారం దక్కవలసిన రాజ్యాధికారం సాధించగలమని, మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి కావలసిన భారీ ప్రణాళికలు ప్రభుత్వంతో అమలు చేయించుకోవాలని పద్మశాలీ సామాజిక వర్గానికి ఆయన పిలుపు ఇచ్చారు.

వ్యక్తిగత ప్రయోజనాలు చాలా చిన్నవని, సామాజిక వర్గం ప్రయోజనాలు చాలా విస్తృతమైనవి, విలువైనవన్నారు.  గతంలో ప్రగడ కోటయ్య నాయకత్వంలో చేనేత కాంగ్రెస్ ఒక పిలుపునిస్తే రాష్ట్రంలో  చేనేత కులవృత్తికి అవసరమైన 5 సహకార స్పిన్నింగ్ మిల్లులు ఆవిర్భవించాయని గుర్తు చేశారు. అనేక వ్యవస్థల నిర్మాణం జరిగిందన్నారు. బ్రిటిష్ పాలనలో చేనేత వృత్తికి, సామాజిక వర్గానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ మన సామాజిక వర్గం వికసించిందని కొసనం శ్రీనివాసరావు తెలిపారు. చేనేత సామాజిక వర్గమే రాష్ట్రంలో అతిపెద్ద సంఘటిత సామాజిక , రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీల గుర్తింపు పొందిందని తెలిపారు.  కాలక్రమంలో దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దశలో మన తొలితరం నాయకులు కొంతమంది అస్తమించడం, కొంతమంది వృద్ధాప్యం వలన రాజకీయ ఉధృతి తగ్గిందన్నారు. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆధునిక వస్త్ర ఉత్పత్తి రంగంలో మన సామాజిక వర్గాన్ని మిళితం చేయలేక పోవడం, ముందు చూపుతో సామాజిక వర్గానికి దిశా నిర్దేశం చేసే నాయకత్వ లోపం ఏర్పడిందన్నారు.  పారిశ్రామిక అభివృద్ధిని  అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు వెనుకబడిపోయారన్నారు.  చేనేతలోనే మనవాళ్ళు ఉండడం మనల్ని ఆర్థికంగా బలహీన పరిచిందన్నారు.  ఆ విధంగా బలహీనపడి  రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయామని తెలిపారు. 

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మనలో ఆత్మగౌరవం ఉన్నప్పటికీ ఐకమత్యం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  మనకు రాజ్యాధికారం లేకపోయినా, మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో వేరే సామాజిక వర్గం వారు పాలకులుగా మారినా, మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నెరవేర్చుతున్నారు కదా సామాజిక ఐకమత్యం, సమిష్టి నిర్ణయాలతో పనేముందనే ధోరణి కనిపిస్తుందని, ఇది మంచిది కాదన్నారు. నేడు మన వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరో ఒకరు నేరవేర్చుతున్నారు కదా అని మనం అంతటితో తృప్తి చెంది మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలలో రాజ్యాధికారం వదులుకుంటే మన సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. మన సామాజిక వర్గం ప్రజల అభివృద్ధికి అవసరమైన వ్యవస్థల నిర్మాణం మనం చెయ్యలేమని పేర్కొన్నారు. అందువల్ల,  మనం సామాజిక వర్గం ప్రజల విస్తృత ప్రయోజనాలు సాధన, అభివృద్ధి, రాజ్యాధికారం కోసం మనం ఐకమత్యంగా సమిష్టి నిర్ణయాలు చేసి, కలిసి ఉద్యమాలు చెయ్యడం ఎంతైనా అవసరం అని కొసనం శ్రీనివాసరావు అన్నారు. 

Jul 4, 2025

చేనేత కార్మికుడి నుంచి టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారి వరకు


నాకు మంచి మిత్రుడు, ఇంటర్‌లో, డిగ్రీలో నా జూనియర్ అందె వెంకటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఆడిట్ అధికారిగా నియమితులయ్యాడు. చాలా సంతోషించాను.   అతి నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన వెంకటేశ్వరరావు  ఓ పక్క నేత నేస్తూ, ఇంకో పక్క ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీలో మేం ఇద్దరం ఎకనామిక్స్ విద్యార్థులమే. ఇంటర్‌లోనూ,  డిగ్రీలోనూ క్విజ్‌లో మా ఇద్దరి టీమ్‌లే పోటీపడేవి. నేను మెట్రిక్ వరకు నేత నేశాను. అతను డిగ్రీ వరకు నేత నేసేవాడు.   డిగ్రీ పూర్తి అయిన  తర్వాత  వెంకటేశ్వరరావు ఆంధ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లోనే పీజీ చేశాడు. ఇక్కడో విషయం చెప్పాలి. సాధారంగా కాలేజీలో, యూనివర్సిటీలలో చేరిన తొలి రోజుల్లో విద్యార్థులకు హోమ్ సిక్ అంటే ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. తల్లిదండ్రులను చూడాలనిపిస్తుంది. కానీ, ఇక్కడ వెంకటేశ్వరరావు తల్లి కొడుకుని చూడకుండా ఉండలేక, మంగళగిరి నుంచి ఒక్కతే ఏకంగా విశాఖపట్నం వచ్చారు. అంత పేదరికంలో ఉండి కూడా ఆమె కొడుకు కోసం వ్యయప్రయాసలకోర్చి ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ కు రావడం అక్కడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. తల్లి ప్రేమంటే ఇదే.  వెంకటేశ్వరరావు
ఆంధ్రాయూనివర్సిటీలో చదివే సమయంలో నేను నాగార్జునా యూనివర్సిటీలో లా చేశాను. ఆ తర్వాత వెంకటేశ్వరరావు కూడా నాగార్జున యూనివర్సిటీలో లాలో చేరాడు. నేను కూడా ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీజేఎంసీ, ఎంజేఎంసీ చేశాను.  2023లో  నాగార్జునా యూనివర్సిటీ లా డిపార్ట్ మెంట్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ లో అందరం కలిశాం. ఆ ఫొటోనే ఇక్కడ పోస్ట్ చేశాను. వెంకటేశ్వరరావు మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్. కష్టపడి ఇష్టంగా చదివే స్వభావం. సౌమ్యుడు. ఏ అవలక్షణాలు లేని ఉత్తముడు.    1996లో గ్రూప్ -1 సాధించాడు. ఆడిట్ డిపార్ట్ మెంట్ కు ఎంపికయ్యాడు. అయితే, వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్‌లో  జాయింట్ డైరెక్టర్/చీఫ్ ఆడిట్ ఆఫీసరు హోదాలో  ఉన్న వెంకటేశ్వరరావుని ప్రభుత్వం టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా నియమించింది. కష్టపడి చదువుకుంటే, విజయం తప్పక వరిస్తుందనడానికి నిదర్శనం వెంకటేశ్వరావు. చేనేత కార్మికుడి నుంచి టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా ఎదిగి, యువతకు ఆదర్శంగా నిలిచిన  వెంకటేశ్వరరావుకు అభినందనలు.మంగళగిరి అంటే చేనేత (పద్మశాలీలు), లక్ష్మీనరసింహ స్వామి గుర్తుకు వస్తాయి. అలాగే, మంగళగిరిలో కష్టజీవులు ఎక్కువ. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన అత్యధికులు చేనేత కార్మికుడిగా లేక పడుగులు చూస్తూ చదువుకున్నవారే.ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఇటీవలే మంగళగిరికే చెందిన ఉడతా బసవరావు కర్నూల్ లోని రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యాడు. బసవరావు కూడా  పడుగులు చేస్తూ ఎంతో కష్టపడి చదువుకున్నాడు. వెంకటేశ్వరరావు, బసవరావు క్లాస్ మీట్స్. మంచి మిత్రులు. 

మరో ముఖ్య విషయం చెప్పాలి. మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన వారే కాదు, అందరూ కష్టజీవులే. ఈ ఫొటోలో ఉన్న మా మిత్రుడు ఓబులాపురం వెంకటేశ్వర్లు మరో గ్రేట్ పర్సన్. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఉన్నాడు. వెంకటేశ్వర్లు చిన్నప్పటి నుంచి బార్బర్ వృత్తి చేసుకుంటూ చదివాడు. లా పూర్తి చేసేవరకు కూడా బార్బర్ షాపు నడిపాడు. సొంతంగా బార్బర్ షాపు నిర్వహిస్తూ, అదే వృత్తి చేస్తూ, డిగ్రీ, బీఎల్, ఎంఎల్ చదివి ఈ స్థాయికి చేరాడు. అందుకే మా మంగళగిరి అంటే, మాకు అంత గొప్ప. ఈ ఫొటోలో ఉన్న మరో మిత్రుడు అవ్వారు శ్రీనివాసరావు. మేమిద్దరం జర్నలిజంలో స్థిరపడ్డాం. ఇంటర్ లో మాది ఒకే బ్యాచ్.  శ్రీనివాసరావు బైపీసీ, నేను హెచ్ఈసీ. ఆ తర్వాత శ్రీనివాసరావు నాగార్జునా యూనివర్సిటీలో ఎంఏ ఆర్కీయాలజీ చేస్తే,  నేను లా చేశాను. ఆ తర్వాత మేం ఇద్దరం చాలా కాలం కలిసే జర్నలిస్టులుగా పని చేశాం. అవ్వారు శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా ఇచ్చింది. 


Jul 2, 2025

కమ్మ వారి విశిష్టత

కమ్మవారి చరిత్ర 

కమ్మ అనేది  భారతదేశంలో ఒక బలమైన కులంగా విరాజిల్లుతోంది.  కమ్మ సామాజిక వర్గం వారు  ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఉన్నారు. కొంత మంది ఇంటి పేరు కమ్మ అని కూడా ఉంటుంది. ఈ కులంలోని వారు చివర చౌదరి లేదా నాయుడు అని గౌరవంగా పెట్టుకుంటారు.  మొదటి కమ్మ మహాసభ  1910లో కృష్ణా జిల్లా కౌతారంలో జరిగింది.  ఈ సభ నిర్వహణలో  కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మ నాబయ్య కీలక పాత్ర పోషించారు. కమ్మ అన్న పదం సామాన్య శకం (క్రీస్తు శకం) ఒకటో శతాబ్దం నుంచి ఉంది. కమ్మ వారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణా నది) నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారు. ఆ ప్రాంతంతో కమ్మవారి మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెబుతారు. 

 కమ్మ కులస్తులైన  కొందరు చరిత్రకారులు రాసిన  ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని కాలంలో పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలస వచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ అంటారు. ఈ సిద్ధాంతం కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు ఒక కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే, కమ్మనాడు సంబంధించిన మిగతా వర్గాలను కూడా చారిత్రకంగా కమ్మ బ్రాహ్మణులు, కమ్మ కాపులు, కమ్మ కోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మ వారికి మాత్రమే కుల నామమంగా మిగిలిపోయింది.

కమ్మ వారు ఎక్కువగా ఆంధ్ర పాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి వీరు ప్రపంచం వ్యాప్తంగా విస్తరించారు. కమ్మవారు ఆడ అయినా, మగ అయినా కష్టపడే స్వభావం కలిగినవారు. అందువల్లే వీరు  ఏ రంగాలోనైనా ఇట్టే ఇమిడిపోతారు. విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, సినిమా, వ్యాపారం... ఇలా రంగాల్లో అత్యున్నత స్థాయిలకు ఎదిగారు. అంతే కాకుండా వీరు సామాజిక చైతన్యం కలిగినవారు. కమ్యూనిస్టు పార్టీలలో కూడా  కమ్మ వారు చాలా కీలకమైన పదవులను అలంకరించారు.  తెలుగు దేశం పార్టీ పుట్టే వరకు కమ్మ వారు ఎక్కువ మంది కమ్యునిస్టు ఉద్యమంలోనే పని చేశారు.  గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి కులాలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించారు.   కమ్మవారి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. అత్యుత్తమ వ్యవసాయ పద్దతులు అవలంబించేవారు.  కృష్ణా నది ప్రవహించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  వ్యవసాయంలో పట్టు సాధించి మంచి స్థితిమంతులుగా ఎదిగారు.  కమ్మ వారు శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని చెబుతారు.   వీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా ప్రాంతాలలో భూములను వ్యవసాయం చేస్తూ సస్యశ్యామలంగా ఉంచుతారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లిన కమ్మవారు తెలంగాణ, కర్ణాటకలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అక్కడి వారికి కూడా నూతన వ్యవసాయ పద్దతులను అలవాటు చేశారు. వారు క్రమంగా ఆయా ప్రాంతాలలో స్థితిమంతులుగా,  ఆర్థికంగా, వ్యాపారస్తులుగా స్థిరపడిపోయారు.  ఆ విధంగా వారూ లాభపడ్డారు. ఆయా ప్రాంతాలను అభివృద్ది చేశారు. కాల క్రమంలో కమ్మవారు చదువులలో, రాజకీయాలలో, సినిమా తదితర రంగాలతోపాటు అన్ని రకాల వ్యాపారాలలో బాగా రాణించారు. వారి పిల్లలు ఆడ, మగ ఉన్నత చదువులు చదివి విజ్ఞాన వంతులుగా ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అలాగే, వ్యాపారంలో కూడా వీరు బాగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, నాగార్జున, బాలకృష్ణ,  ఎల్.వి.ప్రసాద్,  డి.రామానాయుడు తదితరులు అగ్రకథానాయకులుగా, దర్శక, నిర్మాతలుగా  సినిమా రంగాన్ని ఏలారు. ఏలుతున్నారు. రామోజీరావు, కేఎల్ఎన్ ప్రసాద్.. వంటి వారు పత్రికా రంగాన్ని కూడా ఏలారు.

చారిత్రకంగా కాకతీయ సామ్రాజ్యంలో కమ్మ వారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు కీలక సైనిక పదవుల్లో ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో  ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు అవకాశం కల్పించారు.  కమ్మ కులస్తులు  ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించుకుంటున్నారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం తర్వాత విజయనగర సామ్రాజ్యం సైనిక విభాగంలో సామంత రాజులుగా కమ్మవారు ఉన్నారు.  విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికులు,  సైన్యాధ్యక్షులుగా పలు హోదాల్లో కమ్మ వారు వెళ్ళారు. అమరావతి కేంద్రంగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలించారు. ఆయన హయాంలోనే మంగళగిరిలోని గాలిగోపురం నిర్మించారు. 

  గణనీయమైన సంఖ్యలో  తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు  అక్కడ వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలస వచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో కూడా కమ్మవారు స్థిరపడి వ్యవసాయం చేశారు.  భూ సంస్కరణల ద్వారా, రైతాంగ పోరాటాల ద్వారా గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల భూములు  గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి. వ్యవసాయ వలసల్లో కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్ది భూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాకులోకి తీసుకువచ్చారు. ఆ విధంగా కమ్మ వారు ఏ ప్రాంతానికి వెళ్లినా కష్టపడి, వ్యవసాయంలో వారికి ఉన్న ప్రావీణ్యం ద్వారా అక్కడి భూములను సాకులోకి తీసుకువచ్చి వారు ఆర్థికంగా లాభపడేవారు. ఆయా ప్రాంతాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కారకులయ్యేవారు. అన్ని అంశాలలో మహిళది కూడా కీలక పాత్రగా ఉంటుంది.   నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో  మధ్య స్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు విస్తారంగా భూములు కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో, మంచి నీటివసతి కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలస వెళ్ళి  పెద్ద వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు.

కమ్మ వారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇక్కడి ఈ భూములను అమ్ముకోలేదు.  కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తూ రావడం ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. భూమి విలువ, భూమి ప్రాధాన్యత తెలిసిన విజ్ఞులుగా గుర్తింపు పొందారు. 

వాసిరెడ్డి, శాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మ వారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి. ఆధునిక యుగంలో  ఎన్టీఆర్ రాకతో రాజకీయ రంగంలో  వీరు బాగా రాణించారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఓ ఊపు తెచ్చారు.   రాజకీయాలలో ఓ పట్టు సాధించారు. అందుకు ఉదాహరణగా తొమ్మిది సార్లు, ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడుని చెప్పుకోవచ్చు.  ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలలో  35 మంది ఎమ్మెల్యేలతో  కమ్మ కులం టాప్ లో ఉంది. 

1960, 70 దశకంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా  వెళ్లిన కమ్మవారు దేశానికి పేరు తెచ్చారు. వ్యాపారలలో గుర్తింపు పొందారు. తిరిగి వచ్చిన వారు వైద్యంలోనూ, ఇతర వ్యాపారాలలోనూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ... తదితర ప్రాంతాలలో కమ్మ సామాజిక వర్గం వారి ఆస్పత్రులే ఎక్కువగా ఉన్నాయి.  జనాభా శాతం తక్కువైనా  సమాజంలో ప్రాధాన్యత కలిగిన వర్గంగా  కమ్మవారు కొనసాగడానికి వారంతా  దోహదపడ్డారు. 


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914



Jul 1, 2025

వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయండి


విజయవాడ : వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు వెటరన్ జర్నలిస్టులు సమావేశంమై పలు తీర్మానాలు చేశారు.  ప్రధానంగా పెన్షన్, హెల్త్ కార్డుల గురించి చర్చించారు.   వెటరన్ జర్నలిస్టులు వెంకటరత్నం, ఎంవీ రామారావు, శిరందాసు నాగార్జున రావు మాట్లాడుతూ,    దేశంలో 16 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు గౌరవ పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.  మన రాష్ట్రంలో కూడా కనీసం 20 ఏళ్ల సర్వీసు ఉండి, 60 ఏళ్లు నిండిన, అక్రిడేషన్ కలిగిన   వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కలిగిన వెటరన్ జర్నలిస్టులు రాష్ట్రంలో 400 మందికి మించి ఉండరని తెలిపారు. కనీసం రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలని వారు కోరారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నారు.  365 రోజులు,24 గంటలు పనిచేసిన 60 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. అనేక మంది చాలా దయనీయమైన స్థితిలో బతుకుతున్నట్లు తెలిపారు.  వారికి ఏ విధమైన ఆదాయ మార్గంలేక అనేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేసిన వెటరన్ జర్నలిస్టులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 


అలాగే, వృద్ధాప్యంలో వెటరన్ జర్నలిస్టులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధలు పడుతున్నట్లు తెలిపారు. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.   పక్కన తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రులతో సహా క్యాష్ లెస్ వైద్యంతోపాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారని, ఆ విధంగా మన రాష్ట్రంలో వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం రూ.10 లక్షల జీవితా బీమా కల్పించాని విజ్ఞప్తి చేశారు.  జర్నలిస్టులకు గౌరవ పెన్షన్  కర్నాటక రూ.15వేలు, హర్యాణా, రూ.15వేలు, తమిళనాడు రూ.8వేలు, యూపీ  రూ.8వేలు, మహారాష్ట్ర - రూ.10వేలు, మణిపూర్ రూ.10వేలు, పంజాబ్ రూ.12వేలు, అస్సాం రూ.8వేలు, గోవా  రూ.8,500,  కేరళ  రూ.6వేలు  నెలనెలా  ఫించన్ ఇస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జి.చంద్రశేఖర్,  ఆజాద్, స్వాతి, మారుతీ మోహన్ తదితరులు మాట్లాడారు.  అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెళ్లి  వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు.


 ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం

విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతికి చెందిన  టి.జనార్దన్ అధ్యక్షులుగా, గుంటూరుకు చెందిన గుంటూరు చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన నరేంద్రరెడ్డి, అమరావతికి చెందిన జి.రామారావు, అనంతపురానికి చెందిన ఆజాద్, విజయవాడకు చెందిన కె.వెంకటరత్నం ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా అనంతపురానికి చెందిన వి.చంద్రశేఖర్, విజయవాడకు చెందిన స్వాతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పట్నాయక్(శ్రీకాకుళం), జియన్ రావు(అమలాపురం), ఎల్ ప్రసాద్(గుడివాడ), గణపతిరావు(విజయవాడ), జయరామిరెడ్ఢి(సత్యసాయి జిల్లా), శివరాంజనేయులు(అనంతపురం), తిమ్మప్ప (సత్యసాయి జిల్లా), మారుతీ మోహన్(అనంతపురం), సిహెచ్ వీఎన్ శర్మ( విజయవాడ), వేగి రామచంద్రరావు(విశాఖ) కోశాధికారిగా యం. వి.రామారావు ఎన్నికయ్యారు.



Jun 27, 2025

ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈడీఎల్ఐ పథకం

EPFO: PF అకౌంట్ ఉన్న వారికీ గుడ్ న్యూస్ రూ.7 లక్షలు ఉచితం.

మీకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా ఉండి, మీ జీతం నుండి క్రమం తప్పకుండా ప్రావిడెంట్ ఫండ్ (PF) చెల్లిస్తుంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందించే ఒక ముఖ్యమైన ప్రయోజనం గురించి మీరు తెలుసుకోవాలి.

చాలా మంది ఉద్యోగులు EPF సహకారాల ద్వారా పదవీ విరమణ పొదుపులపై దృష్టి పెడతారు, కానీ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్  ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ₹7 లక్షల వరకు ఉచిత జీవిత  బీమా కవర్‌కు కూడా వారు అర్హులని చాలా మందికి తెలియదు. అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ప్రయోజనం అన్ని EPFO ​​సభ్యులకు అందుబాటులో ఉంటుంది.

EDLI పథకం అంటే ఏమిటి?

ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కింద కవర్ చేయబడిన ఉద్యోగులకు EPFO ​​అందించే జీవిత బీమా పథకం. ఉద్యోగి అకాల మరణం చెందితే అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి దీనిని ప్రవేశపెట్టారు.

EDLI పథకం యొక్క ముఖ్య లక్షణాలు

ఉచిత జీవిత బీమా: ఉద్యోగులు ఈ బీమా కవరేజ్ కోసం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా EPFO ​​ద్వారా అందించబడుతుంది.

గరిష్ట కవరేజ్ మొత్తం: అర్హత కలిగిన ఉద్యోగులు ఈ పథకం కింద ₹7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని పొందవచ్చు.

కనీస జీతం అర్హత: ₹15,000 లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక జీతం + డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఉన్న ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

 EPF సభ్యులకు వర్తిస్తుంది: EPF ఖాతాదారుడు, అతని యజమాని EPFOకి విరాళం ఇచ్చే ఏ ఉద్యోగి అయినా, ఈ పథకానికి స్వయంచాలకంగా అర్హులు అవుతారు.

ఉద్యోగానికి మించిన కవరేజ్: ఉద్యోగికి EPF ఖాతా ఉన్నంత వరకు, వారు ఉద్యోగాలు మారినప్పటికీ, బీమా ప్రయోజనం యాక్టివ్‌గా ఉంటుంది.

భీమా మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు?

EDLI పథకం కింద బీమా చెల్లింపును ఈ క్రింది సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు:

చివరిగా తీసుకున్న ప్రాథమిక జీతం కంటే 35 రెట్లు + DA + ₹1.75 లక్షల బోనస్ (EPFO ద్వారా నిర్ణయించబడుతుంది)

దీని అర్థం బీమా మొత్తం ఉద్యోగి గత 12 నెలల్లో తీసుకున్న ప్రాథమిక జీతం మరియు డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా ఉంటుంది.

ఉదాహరణ గణన: ఒక ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం + DA నెలకు ₹15,000 అని అనుకుందాం.


భీమా గణన: చివరిగా తీసుకున్న జీతం కంటే 35 రెట్లు: 35 × 15,000 = ₹5,25,000

బోనస్ మొత్తం: ₹1,75,000

మొత్తం బీమా చెల్లింపు = ₹5,25,000 + ₹1,75,000 = ₹7,00,000

దీని అర్థం ఉద్యోగి మరణిస్తే, అతని కుటుంబం లేదా నామినీ ₹7 లక్షలు పొందుతారు.

ముఖ్య గమనిక: ప్రాథమిక జీతం తక్కువగా ఉంటే, బీమా చెల్లింపు కూడా తక్కువగా ఉంటుంది.

ప్రాథమిక జీతం ఎక్కువగా ఉంటే, గరిష్ట చెల్లింపు ₹7 లక్షలకు పరిమితం చేయబడింది.

EPFO సభ్యుడు మరణిస్తే, సమ్ అష్యూర్డ్ వారి నామినీ లేదా చట్టపరమైన వారసులకు చెల్లించబడుతుంది.

నామినీ: మరణించిన ఉద్యోగి EPF ఖాతాకు ఎవరినైనా నామినేట్ చేసి ఉంటే, నామినీ ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

చట్టపరమైన వారసులు: నామినీ పేరు లేకుంటే, మరణించిన ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసులు ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.బీమా పాలసీలు

మైనర్ నామినీల కోసం: నామినీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మైనర్ యొక్క సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

EDLI బీమాను క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు

EDLI బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, కింది పత్రాలను EPFOకి సమర్పించాలి:


ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం.

మరణించిన ఉద్యోగి EPF ఖాతా వివరాలు.

ఆధార్ కార్డ్ లేదా నామినీ యొక్క ఇతర ID రుజువు.

నిధుల బదిలీ కోసం నామినీ/చట్టపరమైన వారసుడి బ్యాంక్ వివరాలు.

చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రం (నామినీ పేర్కొనబడకపోతే).

గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ (నామినీ మైనర్ అయితే).

సరిగ్గా నింపిన ఫారం 5 IF (EPFO వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది).

EDLI క్లెయిమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

EDLI బీమా క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభం

దశ 1: నామినీ/చట్టపరమైన వారసుడు ఫారం 5 IF ని నింపాలి, ఇది EPFO ​​వెబ్‌సైట్‌లో లేదా ఏదైనా EPFO ​​కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది.

దశ 2: మరణ ధృవీకరణ పత్రం, అవసరమైన పత్రాలను జత చేయండి.

దశ 3: ఫారమ్‌ను యజమానికి సమర్పించండి, వారు దానిని EPFOకి పంపుతారు.

దశ 4: యజమాని అందుబాటులో లేకపోతే, నామినీ నేరుగా ప్రాంతీయ EPF కార్యాలయానికి ఫారమ్‌ను సమర్పించవచ్చు.

దశ 5: ధృవీకరించబడిన తర్వాత, మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

EDLI బీమా ఎందుకు ముఖ్యమైనది?బీమా పాలసీలు

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో EDLI పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ ఉంది:

ఉద్యోగులకు ఖర్చు లేదు: ఈ బీమా ప్రయోజనాన్ని పొందడానికి ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

అధిక కవరేజ్ మొత్తం: గరిష్ట చెల్లింపు ₹7 లక్షలు, ఇది మరణించిన వారి కుటుంబానికి గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ప్రత్యేక  బీమా పాలసీ అవసరం లేదు: చాలా మంది ఉద్యోగులకు EDLI కింద ఇప్పటికే ఉచిత జీవిత బీమా ఉందని తెలియదు, ఇది అదనపు టర్మ్ బీమా అవసరాన్ని తగ్గిస్తుంది.

త్వరిత క్లెయిమ్ ప్రక్రియ: క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ సాపేక్షంగా సరళమైనది. కుటుంబాలు ఎక్కువ ఆలస్యం లేకుండా ఆర్థిక సహాయం పొందేలా చేస్తుంది.

ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్  ఇన్సూరెన్స్ (EDLI) పథకం అన్ని EPF ​​సభ్యులకు అందుబాటులో ఉన్న ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు సమస్యలను నివారించడానికి ఉద్యోగులు తమ నామినీ వివరాలను వారి EPF ఖాతాలో నవీకరించాలని నిర్ధారించుకోవాలి.

మరిన్ని వివరాల కోసం సమీపంలోని PF ​​కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా క్లెయిమ్ సంబంధిత ప్రశ్నల కోసం EPFO ​​వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.


Jun 23, 2025

వెటరన్ జర్నలిస్టుల జాబితా

1)M.V.Ramarao.....................vza.......8074129668(7286964554)

2) K.Venka Ratnam.............vza....... ..........9440285120

3)G.Sridharan...........................Tpt..................9398511649

4)M. Narendra reddy...............Tpt..................9490652136

5)R.Raja Sekhar.......................Vza.................9347240430

6)T.Janardhan.........................Tpt.................9490108656

7)P.Ganapathi rao....................Vza................9346412802

8)S.Nagarjuna rao...................vza.................9440222914

9)K.Markandeyulu...................Atp....9440676207

10)A.Ramachandra reddy.......Tpt.................9394750096

11)Athaulla..............................Atp........9052162444

12) Abdul Rajak.......Gnt...........  9731118817

13)Anand..Ph.jou................Vza.....................9985411617

14) G.Ananda vardhan.................Atp...........9440045765

15) Ananda vardhan..................knl...............9885259239

16)Balaka Srinivasarao............vza................9703422681

17)B.Bala Koteswara rao...........Vza..............9705346104

18)G.V.Ramana Reddy.............Vizag.............9440147031

19)K. Uma maheswararao.......Vza................9394450423

20) A. vidya sagar....................Tpt.................8790033963

21)G.Seshadri Sekhar..............Atp................9441664687

22)C.Viswanadh.......................Atp................9440584552

23)T. Tandava Krishna muthy.....Vza..............8886988059

24))K. Bhaskara rao.................vuyyuru..........8121737248

25)Y.V.S.Subramanyeswararao....vuyyuru.....9959062055

26)p. Venugopala swamy..........vuyyuru........9440661946

27)Ch. Venkateswara Swamy......Vza...............9493250543

28)B. Surendra Nath............Atp.................9440808022

29)N.C.S.M. Krishnamacharyulu......Atp.......9394881112

30)H.Muralidhara rao...........Vza......9849036849

31)K. Srinivasa Rao.............Vza.....9246536254

32) M. Nagaraja.................Tpt.......................9848997194

33)K.Rama Krishna...........Atp......................8309306594

34)Vegi Ramachandra Rao....Vizag..................8179518592

35)Dr.M.Kailasapathi..........Vza....................9848045612 

36)D.Ramanjaneyulu.........Atp......................8142609158

37)N.Venkatesh..................Atp.....................9441950789

38)Sk.Fayaz Bhasha..........NLR.....................8886833033

39)P.Anjaneyulu..........SSdt(Atp).....................9000867133

40)P.Satyanarayana...............Vza......................9440229308

41)D.Swathi........................Vza......................8309384148

42)P.Mallikharjuna.........SSdt(Atp)................9700848170

43)M.Ramanjaneyulu.......Atp.........................9440452022

44)Akbarpasha................Vza.........................9989016212

45)A.Ramakrishna reddy...Atp.........................9441146419

46)G.Chandra Sekhar..........Gnt.......................9703422681

47)K.Linga Prasad..............Atp........................9440432030

48)A.Kotaiah......................Tpt........................9885180710

49)Kalakada Venugopal.....Madanapalle....(Anna dt)..9346295544

50)P.M.R.Mohanarao...........Atp.......................9848997175

51)R.V.Patnaik...................SkL.......................9290918998

52)K.Ramachandra.........SSdt(Atp)...............9490445924

53)T.Raghurao.................Vza........................9248072899

54)K.Bavisetty................Atp..........................9948769126

55)V.Suribabu..............kkd............9963029999

56)C.Hothuru Obulesu....Atp..........................9502560113

57)AbdulJabbar...........Vza...........................9505954518

58)k.Gurnadha Prasad.....Vza........................8919933249

59)S.M.Shafiulla.............Atp...........................9985722660

60)G.Prabhakar Naidu......Atp.........................9441246073

61)K.Adinarayana Murthy....Atp..9481859972

62)V.Syam sundar..............NLR....................9441846022

63)M.Srinivas......................Vza........9347465382

64)P.Mani bhushan.........Atp..................9182646065

65)G.Kishan Varma..............NLR......................9347104645

66)I.VishnuMurthy...............Gnt.......................9949127433

67).B.Timmappa...................ATP.......6305600469

68)A.Nagaraju......................Atp.......9182079757

69)P.Jayaprakash reddy........Atp......................9440720090

70)P.Sainadh........................Atp.......................8296096928

71)N.V.Srinivasarao............Vza........9246464355

72)Khadar.....Vza.............................8511002013

73)T.D.Jayaramireddy...........Atp.......................9160970235

74)Mangu Srinivas......Vizag.....................9393969889

75)M. Satyanarayana Murthy...Vizag.................9505504998

76)K.Venkata Ramana..........Atp........................9866853001

77)J.Ramesh Reddy.............Atp.........................9908012755

78)N.V.V.Satyanarayana......E.G..........................9333613336

79)NandamRamarao..........MTM.......................9393921025

80)Ganji Krishna..............kkd.....................7013614366

81)T.Lakhminarayana........SSdt(Atp)......................9959517126 

82)K.Ramachandra Reddy......CDP......................9701729073

83)K.BabaSaheb.................Atp..........................9010733375

84)Madhunspanthula styanarayana murthy...vizag...9505504998

85)G.Madhavi.....................Vza............................9849524257

86)M.V.Mangalamba...........Vza...........................8374872245

87)B.Anjappa.......................Atp............... ............9490079390

88)M.Kristappa.............. .....Atp............................7981133095

89)M.Kalidas....... ...............E.G................ ............9948570779

90)B.VijayaDas.....................Atp.......9618737492

91)P.Jocob...........................Atp........9049893211

92)L.Padmavathi..................Vza.......9000323764

93)Ramprasad Lepakshi........Atp......................9440221194

94)Srinivas IFWJ...................Vizag....................9705655440

95)Talari Ramanjaneyulu........Atp..................9440002482

96)M.Kameswararao..............Vza..........................9052267020

97)K.RamaKrishna.................penugonda ..SSdt.....8309306594

98)T.V.Prasad...............Vza..............9849118606

99)Lakshmana Naidu...........Tpt.............................9985917219

100) K.Maddileti......................knl............9848387554

101)Killi Srinivas.................SkL......................8374020827

102)jairaj.............................Knl........7013296637

103)Siva Ramanjeneyulu.....Atp...................9440323027

104)Bhimudu......................CDP.............................9030204532

105)Y.china Subbarayudu....CDP...........................9030204532

106)G.N.Rao..........E.G.....................9100812124

107)Rao.............................Vza..............................9490717007

108)Satyanarayana.AJ..........Vza......9440229308

109)M.Ravindranath........Vza............9912199574

110)V.Satyanarayana.........Vza........9246412918

111)Ananda Vardhan...............Knl............9885259239

112)B.Venkata Srinivasarao......Vza......................9491113699

113)T.Raghava Reddy............E.G..........................9989799563

114)V.Chandra Sekhar..........Atp...........................9440323716

115)K.Usha.......................Vza........6302153231

116)K.Babjan..........Atp...................9440944991

117)T.Venkatarao.................Vza...........................9246361993

118)Govindappa,madakasira.....Atp......................9441030949

119)H.Azad............................Atp..........................9440468730

120)Nazeer ...........................CDP..........................9121049386

121)Hussian............................Knl.........................9912199880

122)Sk.Akbar Hussain..............Gtl(atp..................9396732260

123)Madhava Rao...patrhika......Vza.....................9849998069

124)C.Sujatha..........................Vza........................9948960009

125)Ch.Balaji......................Vza..............................9059992723

126)Y.Girijapathi......................W.G......................7981988139

127)G.V.Sesha reddy...............CDP.......................9032002724

128)K.prabhakara reddy.......Atp........................9000144466

129)M.Suryanarayana.....Pitapuram(kkd)...........9441073148

130)MCK Raju......Vza....9440863367

131)P.Narasumharao....ATP.....9160444748

132)kuppala Ramachandra....SSdt(atp).......9490445924

133)M.Thomas Paul....Vza....9848378870

134)B.Sanmukharao........SKL........9440002439

135)Battina Srinivasarao.....Vza.........9703333539

136)pendyala Suryanarayana........Vza.....9010196842

137)MV Ramachandra sarma.....SSdt......9542021439

138)Ramana murthy....Annamaihdt....9885451878

139)K.Amarendra.....Tpt......9177732414

140)Anke Tippaiah....SSdt......9440668454

141)P.Prasad......Vza.....9440263323

142)P.Pandurangarao.....Vza......9440985186

143)GSVVRamarao....ELR......9440144919

144)T.Rajagopal.....Tpt......9573169057

145)K.Mallikarjunaraju....Vizag.....8019131777

146)G.Narasimhulu.....cdp......9382448055

147)Ch.Prasad......Vignm....9849850102

148)T.Nagaseshu....Konaseemadt.............9440329567

149)PMS.Prasad...pamarru.....9848653300

150)G.Srinivasarao...GDV.....8978975454

151)N.D.Ajay babu...GDV.........9394211662

152)G.Vijaya Kumar.....Vza.....9948460199

153)S.Krishna Prasad.....Nandigama....9440331100

154)B.Nagamalleswara rao....Mudinepalli...9948669879

155)L.V.Prasadarao...GDV.....9493377304

156)Gorli Ramarao....Vza.......9440934466

157)A.Sriramulu....SSdt......9440732371

158)D.Siva Dhanvantari....GDV......9848608260

159)VVP Raju...Vza......9908089776

160)Kanuri Venkata Krishna.....Vza.....7981305779

161)T.VenkataRamana...SSdt.......94402 47944

162)P.Bhujangarao....Darmavam,SSdt.....9490802611

163)Gld.Prasad.....Vza.......9848997060

164)kamireddy Ramakrishnareddy...TPT....9550990196

165)CH.Harish Chandra...Tpt...8974691867

166)Appari Maridisetty....Vizag....9052966399

167)S.Ramesh Kumar,....Tpt....7330841753

168)K.chandra Sekhar...Tpt....9440553666

169)M.Subramanyam reddy...Tpt.......7013317499

170)A.Nagaraju...Tpt.....9493717460 

171)T.Krishna paramathma....Darmavam(SSdt)...9985915290

172)P.Ramachandrareddy......Atp.........9000025623

173)B.Venkata Subbaiah......KNL.....9441759629

174)K.S.Jyothi sree......Vza.....9491128554

175)B.paparao...SKL.....7969368987

176)Krishna Kumar.....RJD.....+91777 32414

177)A.Srinivasa chari....Viznm....9908848084

178)R.ChandraSekhar.. .Tpt....9441304011

179)L.Nagesh babu...Vizag.....9849026589

180)P.V.Ravikumar....TPT.....88979 38291

181)N.S.Venkataramana....Tpt...9441115999

182)M.Jayachandrareddy...Annamaihdt....6302521878

183) S.Kuppaiah...Tpt.. 99639 95396

184)AAV.Padmanabha chari....VZA...6309513606

185)Reddy Nagaraju...viganrm....9346627000

186)Jaggina Adinarayana ...Vza....9985809159

187)CH.V.N.S.Sarma...Vza....94405 87567

188)Mandapaka Seetaram..vignm..9440735804

189)USHSN Sastry....Vizag....9440843182

190)VV.Padmanabha Raju...VZa..9908089776

191)T.D.Prasad.....GUV...9666655757

192)Ch.Ramarao....vza...9959021483

193)GLRVVR Mohanrao...Rjd...9848997105

194)KJRamarao...NRT.....9948454185

195)M.Brahmanandarao...Gnt...9848334351

196)Nama Varadarajulu...Tpt...8143940999

197)T.Chandra Sekhar...kkd....9160237569

198)M.Umamaheswaram....NRT....9912348011

199)B.sai prasad...vza....9849111618

200)T.Ravikumar....vza.9493920299

201)B.Ramamohanreddy....ATP..... 77801 39153

202)K.Bhaskararao...Rcmpuram..9393834050

203).Manne Sudarsan. ATP....9440573153

204)SJP.HariGopal..GTL..6304008672

205)AVV.Prasad...Gnt...9666068015

206)Ch.Vs.Sravan Kumar...kkd...9491766605

207)P.Rambabu...Tuni...6303656005

208)S.Rama Krishna...VZA...9121516091

209)MV Subbarao...vza..9290981000

210)M.Srinivasa Reddy...RJD... 94901 23633

211)K.Balaji Reddy...VZA...76809 90970

212)Ch.Krishna Rao...Skl...80086 79666

213)MS.Subani..GNT...99590 85441

214)G.krishnamohanrao...Vza...9347481087

215)S.Varadaraju...SKL..9493207255

216)A.Rajasekhar...Tpt..9010749007

217)A.Devarajan...Tpt....98490 46451

218)K.Tirumala Naidu.. Nagiri.....9440075742

219)P.Vijendra Naidu.. Nagiri....9490939223,

220)CB.MOHANRAO...TPT....9866071887

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...