అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పలు సంస్థలకు భూములు కేటాయించింది. అమరావతి పరిధిలోని నిడమర్రు, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో పలు సంస్థలకు ప్రభుత్వం ఈ భూములను కేటాయించారు. ఆ కేటాయింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు
లా యూనివర్శిటీకి 55 ఎకరాలు
ఐఆర్ సీటీసీకి ఒక ఎకరం
బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కు 21 ఎకరాలు
కోస్టల్ బ్యాంకుకు 0.4 ఎకరాలు
రెడ్ క్రాస్ సొసైటీకు 0.78 ఎకరాలు
శాఖమూరు పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు 6.8 ఎకరాలు
కిమ్స్ ఆస్పత్రికి నిడమర్రులో 25 ఎకరాలు
రాయపూడిలో సీబీఐకి 3.50 ఎకరాలు
రాయపూడిలో ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుకు 3 ఎకరాలు
తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ కు 3 ఎకరాలు
గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు
ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు
ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు 2 ఎకరాలు
ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు రెండు ఎకరాలు
బీజేపీ ఆఫీసుకురెండు ఎకరాలు
మందడంలో వివాంతా స్టార్ హోటల్ కు 2.5 ఎకరాలు
హిల్చన్ స్టార్ హోటల్ కు 2.5 ఎకరాలు
తుళ్లూరులో హయత్ రీజెన్సీ కి 2.5 ఎకరనాలు
లింగాయపాలెంలో నోవోటెల్ హోటల్ కు 2.5 ఎకరాలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు రెండు ఎకరాలు
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు
స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఐదు ఎకరాలు
ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు మూడు ఎకరాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు
ఇంటిలిజెన్స్ బ్యూరో (SIB)కి 0.5 ఎకరాలు
బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కి 0.5 ఎకరాలు
గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్ బత్తి సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేశారు.
ఇప్పటివరకు 74 సంస్థలకు 947 ఎకరాల భూమి కేటాయించారు. వాటి నిర్మాణాలకు గడువులు విధించారు. 3 సంస్థలు 1 నెలలో, 15 సంస్థలు 2 నెలల్లో, 13 సంస్థలు 5 నెలల్లో, 17 సంస్థలు 6 నెలల్లో పనులు ప్రారంభిస్తాయి.
2014-19 మధ్య కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు కేటాయించగా, గత ప్రభుత్వ చర్యల వల్ల పలు సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.
No comments:
Post a Comment