Mar 2, 2019

మన్నిక, టెక్నాలజీ, వేగం
అమరావతి నిర్మాణంలో ప్రత్యేకతలు
పచ్చదనం నిండిన కాలుష్య రహిత ఆనంద నగరం ఇది
ఆంధ్రుల కలల రాజధాని
    
         
    రాజధాని అమరావతి మహానగరం నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తోంది. నాణ్యత, ఆధునిక టెక్నాలజీ, వేగం దీని నిర్మాణంలో ప్రత్యేకతలు. ప్రపంచంలోని ఆధునిక మహానగరాలకు ధీటుగా దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ప్రదేశం ఎంపిక, భూ సమీకరణ, మాస్టర్ ప్లాన్, తెలుసు సంస్కృతికి ప్రతిబింబంగా ఆకృతుల రూపకల్పన.... వంటి అన్ని విషయాలలో ఆయన ముద్ర ఉంది. రాజధాని అంటే ఒక్క పరిపాలనకే కాకుండా విద్య, వైద్యం, వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, ఉపాధి మొదలైన  అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉండాలన్నది సీఎం ఉద్దేశం. ఆ రకంగానే అంతర్జాతీయ స్థాయిలో అన్ని అధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా జలకళ-పచ్చదనం, కాలుష్యరహితంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సంతోషంగా జీవించడానికి అనువైన ఆనంద నగరం నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, వేగంగా నిర్మిస్తోంది. వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)లోని 5 బ్లాక్ లను రికార్డు స్థాయిలో 4 నెలలో నిర్మించారు. శాసన మండలి, శాసనసభ భవన సముదాయాన్ని 192 రోజుల్లో, అలాగే జ్యుడిషియల్ కాంప్లెక్స్(తాత్కాలిక హైకోర్టు)ని కూడా  192 రోజుల్లోనే నిర్మించి రికార్డు సృష్టించారు. ప్రవేటు రంగంలో కూడా విద్య, వైద్య సంస్థల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నగర నిర్మాణ అంచనా వ్యయం రూ.లక్ష కోట్లు. ఇప్పటికే దాదాపు రూ.40వేల కోట్ల పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వ భవనాలు, గృహాల నిర్మాణాలు చురుకుగా జరుగుతున్నాయి. ఈ వేగం వెనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ), దాని సిబ్బంది పాత్ర కీలకంగా ఉంటుంది.  సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మిస్తారు. వీటికి తోడు ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా వినియోగించడం వల్ల  భవన నిర్మాణ సమయం బాగా తగ్గుతోంది. భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను ఇతర చోట్ల తయారు చేసుకొని తీసుకువచ్చి ఇక్కడ బిగించే విధానాన్నే ప్రీకాస్ట్ టెక్నాలజీ అంటారు. సాధారణంగా ఇంత భవనాలు నిర్మించడానికి రెండుమూడు ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ వారానికో అంతస్తు పూర్తి అవుతోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లున్యాయమూర్తులు,మంత్రులుఅధికారులుఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణాలు ఏక కాలంలో జరుగుతున్నాయి.  నిర్మాణాలతోపాటు పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 34 రోడ్ల నిర్మాణం జరుగుతుండగా, మరో పక్క ఆ రోడ్ల వెంట వివిధ రకాల మొక్కలను కూడా ఏక కాలంలో నాటుతున్నారు. రోడ్లు, నిర్మాణాలు జరిగే ప్రతి చోట పచ్చదనం పరుస్తున్నారు. ఈ విషయంలో అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏడిసి) ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొంతమంది సచివాలయసీఆర్డీఏ అధికారులు  ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలోవిజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్నీరువిద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని సరఫరా చేస్తారు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఇటువంటి వ్యవస్థ ప్రస్తుతానికి మన దేశంలో ఎక్కడాలేదు.

             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద   ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దీనికి 2018 డిసెంబర్ 27న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.  డయాగ్రిడ్’ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రపంచంలోనే మొదటిసారిగా   సచివాలయ శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  40 అంతస్తులతో 4 టవర్లు, 50అంతస్తులతో మరో టవర్  నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి,సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. భూగర్భ డ్రైనేజీతో పాటు తాగునీటి వ్యవస్థ పైపులుగ్యాస్విద్యుత్కేబుల్ గ్రిడ్ వంటి వాటిని డక్ట్ ద్వారా భూగర్భంలోనే అమర్చుతున్నారు. ఈ విధంగా దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం కూడా మనదే.  ఈ రకంగా అనేక రికార్డులు అమరావతి సొంతం చేసుకుంటుంది. రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి,పగలు నిరంతరం శ్రమిస్తున్నారు.  అమరావతి పరిపాలనా నగరంలో భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా అమరావతి నగరంలోని ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవించడానికి అన్ని విధాల  అనుకూల వాతావరణాన్ని  ప్రభుత్వం ఏర్పరుస్తోంది.
-     శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...