వేగం పుంజుకున్న పంచాయతీరాజ్ శాఖ
పనులు

పంచాయతీరాజ్
శాఖలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇ-పాలన అమలులోకి రావడంతో
ఫైల్స్ అన్ని ఆన్ లైన్ లో వెంటవెంటనే పరిష్కారమవుతున్నాయి. కొన్ని ఫైళ్లకు నిమిషాల్లోనే సమాధానం
వెళ్లిపోతోంది. గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గ్రామీణ రోడ్లు, భూగర్భ మురుగునీటి
పారుదల వ్యవస్థ వంటి మౌలిక
సదుపాయాలకు, పారిశుద్ధ్యానికి
ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేసి
అమలు చేస్తున్నారు. ఈ శాఖలో
నిధులు పుష్కలంగా ఉన్నాయి.
ఈ శాఖ మంత్రి నారా లోకేష్ తండ్రి మాదిరిగానే చాలా చురుకుగా వ్యవహరిస్తూ
అధికారులతోమ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పనులు చేయిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీటీ
రోడ్లకు రూ.400 కోట్లు
కేటాయించి, రూ.73.43 కోట్ల
విలువైన పనులు పూర్తి చేశారు.
6,039 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ రోడ్లు నిర్మించారు. 3,113 అంగన్ వాడీ కేంద్రాలు, 451 గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం పూర్తి
చేశారు. గత ఆర్థిక
సంవత్సరంలో 48 స్త్రీ
శక్తి 66 చేప పిల్లల
పెంపకం చెరువుల పనులు, 80 చేపలు
ఎండబెట్టే ఫ్లాట్ ఫారాల పనులు పూర్తి చేశారు. 669 స్మశానాలను అభివృద్ధి చేశారు. చంద్రకాంతి పేరుతో
దేశంలోనే మొట్టమొదటగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్ కింద ఈ
ఏడాది చివరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఎల్ఈడీ బల్బులు అమరుస్తారు. 23.90 లక్షల
ఎల్ఈడీ బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12.84
లక్షల బల్బులు ఏర్పాటు చేయగా,
3,701 గ్రామ పంచాయతీల్లో వంద శాతం బల్బులు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు రూ.420 కోట్లు ఖర్చు చేయాలని
నిర్ణయించి, ఇప్పటి
వరకు రూ.32.15 కోట్ల
విలువైన పనులు చేశారు. 2వేల గ్రామ
పంచాయతీల్లో ఈ తయారీ కేంద్రాలను నిర్మించారు. గత
సంవత్సరం 759 కేంద్రాలు
నిర్మించారు. ఈ ఏడాది
చివరకు 9వేల
గ్రామాల్లో ఈ కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వాటర్ షెడ్ పథకం కింద రూ.421 కోట్లతో చెక్ డ్యాంలు, ఊట కుంటలు, నీటి నిల్వ కట్టడాలు
వంటి పనులు చేపట్టాలని నిర్ధేశించారు. ఎన్టీఆర్ జలసిరి పేరుతో ఎస్సీ,ఎస్టీలకు చెందిన బోరు
బావులకు విద్యుత్ సౌకర్యం కల్పించి దాదాపు 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ పథకం కింద 15వేలకు పైగా సోలార్ పంపుసెట్లు అమర్చి 70 వేల ఎకరాలకు సాగునీరు
అందిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల
అనుసంధానంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా-ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్)
ప్రణాళికను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)లో వేతనాల కింద రూ. 6 వేల కోట్ల
చెల్లించేలా, మెటీరియల్
వాటా కింద రూ.5 వేల కోట్లు
సాధించేలా పనులు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అనుసంధాన శాఖల నుంచి రూ.2,809
కోట్ల నిధులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.4940 కోట్ల ఖర్చుతో ఉపాధి హామీ,
ఇతర పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటి వరకు రూ.2669 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. పంచాయతీరాజ్
ఇంజనీరింగ్ విభాగంతో కలిసి రూ.2337
కోట్ల విలువైన పనులు చేయాలని నిర్ణయించారు. రూ.467.39 కోట్ల విలువైన పనులు చేశారు.
గిరిజన సంక్షేమ శాఖతో కలిసి రూ.242
కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.51.47 కోట్ల
విలువైన పనులు పూర్తి చేశారు.
ఐసీడీఎస్ తో కలిసి రూ.310
కోట్లతో పనులు చేపట్టి,
రూ.15.52 కోట్ల
విలువైన పనులు పూర్తి చేశారు.
గృహ నిర్మాణ శాఖతో రూ.2740
కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.97.47 కోట్ల
విలువైన పనులు పూర్తి చేశారు.
ఆర్ డబ్ల్యూఎస్ తో కలసి రూ.5.4
కోట్లు, ఆంధ్రప్రదేశ్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్-సొసైటీ ఫర్ ఎలిమినేషన్
ఆఫ్ రూరల్ పోవర్టీ)తో కలిసి
రూ.79.43 కోట్లు , అటవీ శాఖతో కలిసి రూ.42.3 కోట్లు, పశుసంవర్ధక శాఖతో
కలిసి రూ.11.7 కోట్లు, పట్టు పరిశ్రమల శాఖతో
కలిసి రూ.5.81 కోట్లు, మత్స్య శాఖతో కలిసి రూ. 15.11 కోట్లు, శాప్(ఎస్ఏఏపి-స్పోర్ట్స్ అథారిటీ
ఆఫ్ ఆంధ్రప్రదేశ్)తో కలిసి
రూ.3.22 కోట్ల
విలువైన పనులు పూర్తి చేశారు.
179 పాఠశాలలో ఆట స్థలాలను అభివృద్ధి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పశువులకు 608 నీటి తొట్టెలు
నిర్మించారు. ఊరూరా
పశుగ్రాస క్షేత్రాల పేరిట 16,892
ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 71,437
ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి, 1,43,171 మందికి లబ్ధి చేకూర్చారు. ఈ విధంగా
గ్రామీణాభివృద్ధికి, గ్రామీణులకు
ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి పంచాయతీరాజ్ శాఖ విశేష కృషి చేస్తోంది.
-
శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment