Mar 31, 2025

2029 నాటికి పేదరిక నిర్మూలన - ‘జీరో పావర్టీ - P4’


అమరావతి, 30మార్చి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక కీలక ముందడుగు పడింది అదే ‘జీరో పావర్టీ - P4’ ప్లాట్ ఫామ్. స్వర్ణ ఆంధ్ర@2047 లక్ష్య సాధనలో భాగంగా, ప్రజలు ఆర్థిక అభివృద్ధికి చురుకైన సహకారులుగా మరియు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉండేలా చూసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో పావర్టీ-P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్)’ను రూపొందించింది.జీరో పావర్టీ - P4 లో భాగంగా ప్రభుత్వం సమాజంలో ఆర్థికంగా సంపన్నమైన(మార్గదర్శి)వారుపేద కుటుంబాలను(బంగారు కుటుంబం)ఆదుకోవడానికి మద్దతు ఇవ్వడానికి మరియు మార్గదర్శకత్వం చేయడం ద్వారా వారిని పేదరికం నుండి పైకి తీసుకురావడానికి మార్గాలను సృష్టిస్తోంది. తద్వారా వారు సమాజంలో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఈపి-4 కార్యక్రమం దోహదం చేస్తుంది. సమ్మిళిత ఆర్థిక వృద్ధి,పేదరిక నిర్మూలన మరియు స్వర్ణాంధ్ర  యొక్క నిజమైన దార్శనిక తను గ్రహించడంలో ప్రభుత్వ నిర్ణయం ఒక కీలకమైనదని చెప్పవచ్చును.

బంగారు కుటుంబం లేదా కుటుంబాలకు మార్గదర్శకత్వం,మద్దతు ఇవ్వడానికి మార్గదర్శిని ప్రోత్సహించడం ద్వారా సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఈ చొరవ ఎంతగానో దోహద పడుతుంది.అంతేగాక సమ్మిళిత మరియు స్థిరమైన వృద్ధి సాధనకు ఉపకరిస్తుంది. పి-4 అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి-బంగారు కుటుంబాల మధ్య ఒక సహాయకుడి(Facilitator)గా వ్యవహరిస్తుంది.పురోగతిని రియల్ టైంలో పురోగతిని పర్యవేక్షించేందుకు డిజిటల్ సాధనాలను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే డేటా విశ్లేషణలు, ఆన్-గ్రౌండ్ సర్వేలు మరియు  గ్రామ సభల ధృవీకరణల ద్వారా 20 లక్షల అత్యంత వెనుకబడిన కుటుంబాలను గుర్తించింది. తదుపరి క్రమంలో మిగతా కుటుంబాలను కూడా సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.ఈ ప్రయత్నాన్ని అన్ని విధాలా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు,శాసన సభ్యులు,అధికారులకు అప్పగించింది.

అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీరో పావర్టీ-పి4 ప్లాట్‌ఫామ్ (https://zeropovertyp4.ap.gov.in/) ను ప్రారంభించారు.ఇది బంగారు కుటుంబం మరియు కుటుంబాలను గుర్తించి వారికి మద్దతు ఇవ్వడానికి వారి నిబద్ధతను ప్రతిజ్ఞ ద్వారా తెలియ జేయవచ్చు.ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత మార్గదర్శికి వారి నిబద్ధతకు గుర్తింపుగా ఆన్‌లైన్ సర్టిఫికేట్ లభిస్తుంది.వచ్చే ఉగాది పండుగ నాటికి పి-4 ద్వారా సాధించిన ఫలితాలను అంచనా వేసి డిజిటల్ డాష్‌బోర్డ్ ద్వారా పురోగతిని ట్రాక్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఈ హ్యాండ్‌హోల్డింగ్ మరియు మద్దతు ప్రక్రియను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాకు చెందిన కడియం నరసింహ స్వామి కుటుంబం మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మచ్చా ఇమ్మాన్యుయేల్‌తో సహా రెండు బంగారు కుటుంబ కుటుంబాలను పారిశ్రామికవేత్తలు పి.వి. కృష్ణారెడ్డి,అనిల్ కుమార్ సిహెచ్. మరియు సజ్జన్ కుమార్ గోయంకతో సహా ముగ్గురు ప్రముఖ మార్గదర్శులకు పరిచయం చేశారు.వారు ఈ కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి తమ అంకిత భావాన్ని వ్యక్తం చేసి తమ నిబద్ధతను ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా కృష్ణారెడ్డి కృష్ణా జిల్లాలోని తన స్వంత మండలమైన గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకునే ప్రణాళికను ప్రకటించారు. ఆమండలంలో సర్వే జరిపించి పేదకుటుంబాలను ఏవిధంగా అదుకోవాలనే కార్యాచరణను చేపట్టనున్నదీ వివరించారు. ఈ గొప్ప ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ చొరవను పేదరిక నిర్మూలనకు ప్రపంచ ప్రమాణంగా ఉపయోగపడే ఒక మైలురాయి సామాజిక పరివర్తన నమూనాగా  ప్రశంసించారు.

 "మొదటిసారిగా మేము సంపన్నులు మరియు నిరుపేదల మధ్య ప్రత్యక్ష మార్గదర్శకత్వాన్ని సంస్థాగతం చేస్తున్నామన్నారు.తర్వాత ఆర్థిక సహాయం భవిష్యత్తు మార్గదర్శకత్వం, సమగ్రాభివృద్ధికి తగిన అవకాశాలు వారికి చేరేలా చూస్తున్నామని అన్నారు. చారిత్రక మరియు ప్రపంచ ఉదాహరణల నుండి ప్రేరణ పొందిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు మహారాజా సాయాజీరావు గైక్వాడ్ అందించిన మద్దతును సియం ప్రత్యేకంగా ఉదహ రించారు.అంబేద్కర్, బిల్ గేట్స్ మరియు వారెన్ బఫెట్ వంటి దాతలు సమాజంలో వెనుకబడిన వర్గాలకు తిరిగి ఇవ్వాలని మరియు వారిని ఉద్ధరించాలని కోరారని సియం ఈసందర్భంగా గుర్తు చేశారు.

ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పి-4 ముఖ్య లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ "బాధ్యతా యుతమైన ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనాన్ని అందించడమే కాకుండా ఒక రోజు మార్గదర్శులుగా మారే స్వయం సమృద్ధిగల కుటుంబాలను సృష్టిస్తుందని అన్నారు.ఈ చొరవ కేవలం ఆర్థిక సహాయం గురించే కాదని ఇది శాశ్వత సాధికారత వారసత్వాన్ని సృష్టించడం గురించని పేర్కొన్నారు.

జీరో పావర్టీ-పి4 చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని నిర్ధారిస్తూ సమ్మిళిత సంపన్న భవిష్యత్తును నిర్మించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.బంగారు కుటుంబ,కుటుంబాలను దత్తత తీసుకుని పేదరికాన్ని అధిగమించడానికి మరియు ఆంధ్రప్రదేశ్ ను సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వారి సమయం,మార్గదర్శకత్వం, ఆర్థిక మద్దతును అందించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మార్గదర్శులను కోరారు.

అనంతరం ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి బంగారు కుటుంబం,కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు ప్రతిజ్ఞ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ పి-4 ప్రారంభ కార్యక్రమం లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ సహా పలువురు మంత్రులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పారిశ్రామిక వేత్తలు మరియు 10,000 మందికి పైగా హాజరయ్యారు. అనంతరం సాయంత్రం మార్గదర్శులకు ఏర్పాటు చేసిన విందుతో ఈ కార్యక్రమం ముగిసింది.

(జారీ చేసిన వారు: డైరెక్టర్ సమాచార పౌరసంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)

డాక్టర్ జీకే పదవీ విరమణ

విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే) 2025 మార్చిలో పదవీవిరమణ చేశారు. పాత్రికేయుల్లో ప్రజా సమస్యలపై శాయశక్తుల కృషి చేసిన వారు, ఘనులు, ప్రముఖులు, మణిపూసలాంటి వారు  డాక్టర్ గుత్తికొండ కొండలరావు. అలుపెరగని కలం శ్రామికుడు జీకే. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.  ప్రజా సమస్యలపై అహరహం శ్రమిస్తూ, తన శక్తిని, సామర్థ్యాన్ని, పరిశ్రమని, తన జీవితాన్నే పరిపూర్ణంగా వెచ్చించిన గొప్ప వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో  జన్మించిన జీకే  ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అత్తిలి మండలం బల్లిపాడు  ఓరియంటల్ స్కూల్, హైస్కూల్ విద్యను SVSS జూనియర్ కాలేజీ, డిగ్రీ విద్యను నరసాపురంలోని వైఎన్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత   ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, బీజేఎంసీ చేసి, ఎంజెఎంసిలో గోల్డ్ మెడల్ సాధించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై జీకే చేసిన పీహెచ్‌డీని ఇప్పటి  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి   ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పరిశోధనను జీకే తన ధర్మపత్ని  శైలజ సహకారంతో పూర్తి చేశారు. మొదటి నుంచి జీకే అన్ని అంశాలలో  సోదరి  స్వర్ణలత, చిన్నాన్న గుత్తికొండ సత్యనారాయణ  సహకారంతో ఈ స్థాయికి ఎదిగారు.  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురంలో 1965 మార్చి 10వ తేదిన  గుత్తికొండ సత్తిరాజు, గుత్తికొండ వెంకట నాగరత్నం గార్లకు డాక్టర్ గుత్తికొండ కొండలరావు జన్మించారు. తెలుగు కథకు ప్రపంచ ఖ్యాతిని సాధించిన పాలగుమ్మి పద్మారావు స్వగ్రామం కూడా ఇదే.  కొండలరావు  ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరుపతిపురం, బల్లిపాడు, అత్తిలిలో జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో చదివారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు.


జీకే బాబాయి, మెకానికల్ మెరైన్ ఇంజనీర్ గుత్తికొండ సత్యనారాయణ, చిన్నక్క స్వర్ణలతల ప్రోత్సాహం, ప్రోద్భలంతో కొండలరావు ఈ స్థాయికి ఎదిగారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో  ఆచార్య పి.బాబీవర్థన్  ప్రోత్సాహం, సహాయ సహకారాలతో జర్నలిజంలో డాక్టరేట్ పూర్తి చేశారు. పీహెచ్‌డీ కోసం ఆయన రాసిన ‘ట్రైబల్ అండ్ ఇంటర్‌నెట్’ అనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం(డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. 

కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనాపై శ్రోతలకు అవగాహన కల్పించడంలో కూడా కొండలరావు క‌ృషి అద్వితీయం.జింగిల్స్ విషయంలో కొండలరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హిరిచందన్ కూడా కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జీకే సేవలను గుర్తించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా   ఏప్రిల్ 14న  విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ‘విశిష్టసేవారత్న’ పురస్కారంతో సత్కరించింది. 


ఈనాడులో రిపోర్టింగ్ విభాగంలో కొంతకాలం పనిచేసి, 1993లో యూపీఎస్సీ ద్వారా ఐఐఎస్‌కు  ఎంపికయ్యారు. బొంబాయిలోని పత్రికా సమాచార కార్యాలయంలో విధులలోకి చేరారు. ఆయన మొట్టమొదటి ఇంటర్వూ దివంగత మదర్ థెరిస్సాను చేశారు.  అంతర్జీతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కొండలరావు  జీకే అనే కలం పేరుతో వందల వ్యాసాలు రాశారు. బొంబాయి నుండి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరంలో పని చేశారు. విజయవాడలో ఆకాశవాణి వార్తా విభాగాధిపతిగా, అసిస్టెంట్  న్యూస్ డైరెక్టర్ గా 2017 నుంచి 2023 వరకు కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. ప్రజల్లో కోవిడ్ అవగాహన నిమిత్తమై 8 నుండి 18 సెకండ్ల జింగిల్స్ ని స్వయంగా రూపొందించి , వాటిని వార్తల్లో చొప్పించి, జనానికి  అవగాహన కలిగేలాగా 12 వేల సార్లు ప్రసారం చేసిన రికార్డు ప్రపంచ బ్రాడ్ కాస్ట్ చరిత్రలోనే ఓ రికార్డ్ అయింది. జీకే సేవలను ఏపీ  గవర్నర్ అభినందించారు.   జే టిఎస్ డిప్యూటీ డైరెక్టర్ గా ప్రమోషన్ మీద  దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా విధులు నిర్వహించి, ఇక్కడే ఆయన పదవీ విరమణ చేశారు.  యూట్యూబ్లో నిర్వహించిన లైవ్ ప్రోగ్రాం లో నాలుగు లక్షల మించిన వ్యూస్ తో జాతీయ రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.   అంతర్జాతీయ స్థాయి చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు, యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యూజీసీ) చైర్మన్, డాక్టర్ మహమ్మద్ యూనస్ నోబుల్ లారియేట్,  యునైటెడ్ నేషన్స డైరెక్టర్ ఫన్ ఎన్విరాన్మెంట్ వంటి వారిని  ఇంటర్వ్యూ చేశారు.  జీకే "తెలుగు తేజం", ఆకాశవాణి రిక్రియేషన్ క్లబ్ నుండి "అవార్డు ఆఫ్ అప్రిసియేషన్" వంటి అవార్డులతోపాటు  విశిష్ట సేవారత్న బిరుదుని కూడా జీకే కైవసం చేసుకున్నారు.

                                                              - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914





జీరో పావర్టీ -పీ4 విధానం

బంగారు కుటుంబం-మార్గదర్శి


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదిలో మెదిలిన మరో కొత్త ఆలోచన జీరో పావర్టీ -P4 విధానం.  ఇది మరో విప్లవాత్మక  ఆలోచన.  ఈ నెల 30వ తేదీ  ‘విశ్వావసు’ తెలుగు సంవత్సరాది నాడు ప్రారంభించే ఈ విధానాన్ని సీఎం గేమ్‌ఛేంజర్‌గా పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర@ 2047లో భాగంగా, వచ్చే ఐదేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తోంది.  సామాజిక-ఆర్థికాభివృద్ధిలో సరికొత్త మార్పులకు ఈ పీ4(ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యం) నాంది పలుకుతుంది. ఇది సమ్మిళిత వృద్ధి ద్వారా సమాజంలోని బలహీన వర్గాలను పైకి లేపడానికి నిరంతరంగా పనిచేసే ఓ ప్రక్రియ. సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.ఈ విధాన ప్రధాన లక్ష్యం సమాజజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని, వారికి అండగా నిలిచి, వారిని పేదరికం నుండి పైకి తీసుకురావడం. వెనుకబడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు  ‘ప్రభుత్వ , దాతల, ప్రజల భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 'పది సూత్రాల'లో ఒకటైన 'సున్నా పేదరికం' లక్ష్యాన్ని సాధించేందుకు, సమాజంలో ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐలు), ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు భాగస్వాములు కావడానికి ఈ విధానం దోహదపడుతుంది. ఈ పథకంలో లబ్ధిదారులను 'బంగారు కుటుంబాలు' అని, సహాయం చేసే ఆర్థికంగా బలమైన వారిని 'మార్గదర్శి' అని పిలుస్తారు. ఈ పేర్లను ప్రజల సూచనల మేరకే ఖరారు చేశారు. ఆర్థికంగా అండగా నిలిచే 'మార్గదర్శి'లు తమకు తోచిన విధంగా నిధులతో పాటు, సమయం ఉన్నవారు ఆర్థిక విషయాల్లో సలహాలు, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులకు సహాయం లేదా వ్యాపారాలకు పెట్టుబడి వంటి సహాయం కూడా అందిస్తారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సాధికారత సాధిస్తుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోంది.ఈ విధానం అమలులో ప్రభుత్వం ఏ రకమైన ఆర్థిక సాయం చేయదు. బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు మధ్య సమన్వయ కర్తగా పని చేస్తుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలు సర్వేల ద్వారా పేద కుటుంబాలను గుర్తిస్తాయి.అర్హులైన కుటుంబాలు ఈ పథకంలో భాగమవుతాయి.ఈ విధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రియల్ టైమ్ డేటాని సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్ వేదిక నుంచి మార్గదర్శులు తాము సహాయం అందించే కుటుంబాలను ఎంచుకుంటారు.  పీ4లో  భాగంగా పేద కుటుంబాలకు విద్య, వైద్యం,ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ఈ విధానం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేరుకూరుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.2029 నాటికి పేదరికం నిర్మూలించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


Mar 29, 2025

పంచాంగశ్రావణం - పంచాంగ శ్రవణం

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు-

ఈ ఉగాది సందర్భంగా, మాధ్యమాల్లో విరివిగా వినవస్తున్న/కనవస్తున్న మాట "షష్ఠగ్రహకూటమి" అనేది. ఆరు గ్రహాల కలయిక అనేది వారి భావం. కాని ఈ సందర్భంగా వాడవలసిన మాట "షట్" అని – ‘షట్’ అంటే ఆరు, ‘షష్ఠ’ అంటే ఆరవ అని అర్థాలు(సంఖ్యావాచకం-పూరణవాచకం). కనుక షష్ఠగ్రహకూటమి అంటే ఆరవ గ్రహ కూటమి అనే తప్పు అర్థం వస్తుంది . ఆరు గ్రహాల కలయిక అనే అర్థం రావాలంటే షట్ గ్రహ కూటమి - షడ్గ్రహ కూటమి అనాలి.  షట్చక్రవర్తులు, షట్ఛాస్త్రాలు/షట్శాస్త్రాలు అన్నట్లు. మరికొందరు షష్ఠికి బదులు షష్టి అని కూడా వాడుతున్నారు. దానికి 60 అని అర్థం. అది కూడా గమనీయమే. ఇక ప్రాచీనుల దృష్టిలో "షష్ఠగ్రహకూటమి" అనే సమాసం కూడా తప్పే, కాని ఆధునికులు దాన్ని ఆమోదిస్తున్నారు.

ఉగాది నాటి కర్తవ్యాల క్రమంలో అభ్యంగనస్నానం అంటుంటారు- ఇది అభ్యంగస్నానం మాత్రమే.

 మరోమాట- “పంచాంగశ్రవణం”. ఇది శ్రోత పరంగా చెప్పవలసిన మాట. వక్త పరంగా “పంచాంగశ్రావణం” అని చెప్పాలి. రెండుచోట్ల పంచాంగశ్రవణం అని వాడడం సమంజసం కాదు.  పత్రికలలో/టీవీలో- ‘‘ఫలానా వారు పంచాంగ శ్రవణం చేసారు/చేస్తారు’’  అని రాయడం/అనడం సరికాదు. శ్రవణం అంటే వినడం; శ్రావణం అంటే వినిపించడం. సిద్ధాంతి/పురోహితుడు చేసేది పంచాంగ శ్రావణం, శ్రోతలు చేసేది పంచాంగశ్రవణం.ఈ స్పష్టత తెలియనప్పుడు , వక్త పరంగా పంచాంగపఠనం, శ్రోత పరంగా పంచాంగశ్రవణం అని వాడుకోవచ్చు.

మన తరువాతి తరాలకు మనం అందించవలసిన వాటిలో  మంచిభా‌ష కూడా ఒకటి కదా! 

- డాక్టర్ పి.నాగమల్లీశ్వరరావు (తప్పొప్పుల కోశ కర్త)

Mar 26, 2025

మతాలతో ప్రభుత్వాలకు పనేంటి?

హిందూ, ముస్లిం, క్రైస్తవం... వంటి మతవాదనలే నా దృష్టిలో  తప్పు. సమాజానికి హాని కలిగించనంత వరకు ప్రభుత్వం ఎవరి మత విశ్వాసాలను వారిని అనుసరించనివ్వాలి. మతం విషయంలో, ప్రార్థనా మందిరాలు, మత ట్రస్ట్ లు... వంటి  విషయంలో ప్రభుత్వ జోక్యం సరైనది కాదు. సమాజానికి హాని కలగకుండా వాటిని పర్యవేక్షిస్తుండాలి.  మత సంస్థలు, దేవాలయాలన నిర్వహణకు సంబంధించి ఒక కామన్ చట్టం చేయాలి. ప్రత్యేక చట్టాలు, హక్కులు ఉండకూడదు. మత విశ్వాసాలని వెసులుబాటు ఇవ్వడం సరైనది కాదు. రోడ్డు పక్కన ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు కట్టేస్తున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటాయని అలా వదిలివేస్తామా? ఒక ప్రాంతంలో ఒక మతస్తులుంటే, వారి ఇళ్ల మధ్యలోకి వచ్చి ఇతర మతస్తులు ప్రార్థనా మందిరాలు కడుతున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు, ఆస్తులు ఇతరులకు పంచేస్తున్నారు. అది సమర్థనీయమా?    మసీదులు, చర్చిల ఆస్తులు అలా పంచుతారా? అలా పంచితే సమర్థిస్తారా?  ఓ హిందూ వృద్ధురాలు ఓ హిందూ దేవుడిపై విశ్వాసంతో తన నాలుగు ఎకరాల భూమిని హిందూ దేవాలయానికి దానం చేసింది. ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వం పేదలకు పంచింది. ఆ ప్రాంతంలో ఏర్పడిన కాలనీకి  ఆ హిందూ దేవుడి పేరు పెట్టారు. అందులో ఓ పేదవాడు అక్కడ మరో మతం ప్రార్థనా మందిరం కట్టాడు. విచిత్రం ఏమిటంటే, ఆ ప్రార్థనా మందిరం బోర్డుపైన ఆ కాలనీ పేరు కూడా రాయలేదు. ఎందుకంటే ఆ కాలనీ పేరు హిందు దేవుడిది.  ఈ రకమైన భూమి పంపకాలను  సమర్థిస్తారా?  ఈ రకమైన వ్యవహారాలు ఎక్కడికి దారి తీస్తాయి? ఇటువంటి సందర్భాలలో హేతుబద్దత లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అందువల్ల మనం అందరినీ మనుషులుగా సంస్కరించాలి. ఏ మతాన్ని సమర్థించవలసిన పనిలేదు. మత ఛాందసవాదులను దారిలో పెట్టడానికి  ఆ మతాలను కూడా సంస్కరించాలి.  

 భారతీయులందరూ సమానం. మతం ఆధారంగా ఎవరికీ  హక్కులు, రిజర్వేషన్లు ఉండకూడదు. భారతీయులందికి ఒకే చట్టం వర్తించాలి. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండకూడదు. పేదలందరికీ విద్య, వైద్యం (కులం, మతం ఏదైనా అనవసరం. భారతీయుడైతే చాలు) తప్పనిసరిగా ఉచితంగా అందివ్వాలి. అందరికీ ఉపాధి కల్పించాలి.  సామాజికంగా అత్యంత వెనుకబడిన వారికి పదేళ్లు రిజర్వేషన్లు కల్పించి, వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు, భారతీయులందరూ సమానంగా బతికేందుకు రాజ్యాంగంతో పదేళ్లు రిజర్వేషన్లు కల్పించారు. ఆ పదేళ్లని ఎన్నేళ్లు సాగదీశారు? ఇంకా ఎన్ని ఎళ్లు సాగదీస్తారు? అసమర్థ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం సమాజం అభివృద్ధి చెందకుండా, దిగువ స్థాయి కులాలను, మైనార్టీలను ఎదగనివ్వకుండా వారి పబ్బం గడుపుకుంటూ వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే, మరో వెయ్యి ఏళ్లకు కూడా సమాజం అభివృద్ధి చెందదు. అసమానతలు తగ్గవు. సమాజం ఇంకా నీచమైన స్థాయికి దిగజారిపోతుంది. అత్యాచారం జరిగితే, దళిత బాలిక లేక మైనార్టీ బాలిక లేక ఎస్టీ బాలిక అని రాస్తున్నారు. ఈ సమాజానికి మనం ఏం నేర్పుతున్నాం.  అత్యాచారం జరిగితే ఏ బాలికైనా ఒక్కటే. బాలికలందరికీ రక్షణ ఉండాలి. ఆ రకమైన కల్చర్ ని మనం మార్చాలి.  ఈ విషయాలన్నీ లౌకిక వాదులకు, హేతువాదులకు, నాస్తికులకు, కమ్యూనిస్టులకు, ర్యాడికల్స్ కు తెలియదా? ఆ దిశగా వారు పోరాటం చేయాలి. కానీ, వారు ఒక్క హిందు మతాన్ని హిందువులను విమర్శిస్తూ, ఇతరులను వెనకేసుకొస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విధానం. ఇది మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతుంది. మార్క్స్ చెప్పిన ప్రకారం మతం ఏదైనా మత్తు మందే. అది హిందు లేదా ముస్లిం లేదా క్రైస్తవం... అటువంటప్పుడు మూఢంగా మతవిశ్వాసాలను నమ్మేవారిని ఎవరూ సమర్థించవలసి అవసరంలేదు. వారు మైనార్టీలని సమర్థించడం తప్పు. భారతీయులుగా వారికి అన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను సమర్థించండి. ఆ హక్కుల కోసం పోరాడండి. ఎవరికైనా, ఏ మతం ద్వారానైనా, ఏ హక్కు ఉండకూడదు. భారతీయలందరికీ సమాన హక్కులు ఉండాలి.  మతవాదుల దారి వేరు. కనీసం లౌకికవాదులైనా  అందరినీ భారతీయులుగా గుర్తించి, గౌరవించాలి. అందరి హక్కుల కోసం పోరాడాలి.  

భారతీయులకు పని చూపించండి, వాళ్లే బతుకుతారు. ఏ విధమైన  రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరంలేదు. ఒక్కటే దేశం, ఒక్కటే రాజ్యాంగం, ఒక్కటే చట్టం, అందరికీ ఒకే హక్కులు.. ఈ విధానం కావాలి. అన్ని రకాల చదువులు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించాలి. చదువుకునే సమయంలో ఉచితంగా భోజనం పెట్టండి. ఆ తర్వాత వాడి బతుకు వాడే బతుకుతాడు.  ఆ తర్వాత వాడంతట వాడు బతికే విధంగా మనం చదువులను సంస్కరించాలి. ఇంత చేసిన తర్వాత కూడా వారు ఉచితాల కోసం, రిజర్వేషన్ల కోసం ఎదురు చూశాడంటే, మన విద్యావ్యవస్థలోనే లోపం ఉన్నట్లు లెక్క. లౌకిక వాదులందరూ ఈ దిశగా ఆలోచన చేస్తే సమాజంలో కొంతవరకైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది.  


Mar 24, 2025

తాడిప్రకాష్‌కు కేఎన్‌వై పతంజలి సాహితీ పురస్కారం


      ఈ ఏడాది కేఎన్‌వై పతంజలి సాహితీ పురస్కారానికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ ఎంపికయ్యారు. విజయనగరంలోని కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఈ పుస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని తాడి ప్రకాష్‌కు అందజేస్తారు. ఈ పురస్కారానికి ప్రకాష్ నూటికి నూరు శాతం అర్హులు. ఈ సందర్భంగా ప్రకాష్ గారికి అభినందనలు.

నేను ఇద్దరి సారధ్యంలో పని చేశాను. ఇద్దరూ ఇద్దరే. కలాన్ని వాడటంలో, బాధితుల పక్షం నిలబడటంతో వారు దిట్టలు. వారి రాత, రాత శైలి అద్భుతం.

ఈ సందర్భంగా కేఎన్‌వై పతంజలి గారి గురించి ఓ మాట. సాక్షి ప్రారంభంలో 2008లో పతంజలి గారు దానికి ఎడిటర్‌గా ఉండేవారు.  నేను న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపులో చెన్నైలో చీఫ్ కంటెంట్ ఎడిటర్‌గా చేస్తూ, సాక్షిలో చీఫ్ సబ్ ఎడిటర్‌గా చేరాను. అప్పుడు, సబ్ ఎడిటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ సమయంలో  ఇతర పత్రికలో పని చేసే బక్కపలచగా ఉండే  ఓ సబ్ ఎడిటర్ ఇంటర్వ్యూకి వచ్చి, సెలక్ట్ అయ్యారు. అతను అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని అప్పటి సాక్షి  ఎడిటర్  పతంజలి గారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. పతంజలి గారు అతని గురించి, అతను చేస్తున్న పని గురించి అడిగి,   చివర్లో  ‘‘ఏంటయ్యా మరీ ఇంత సన్నగా ఉన్నావు?’’ అని అడిగారు. ఆ సబ్ ఎడిటర్ వెంటనే, ‘‘మీరిచ్చే జీతాలకు ఇంతకంటే ఇంకా ఎలా ఉంటామండి?’’ అని ఎదురు ప్రశ్నవేశారు. పతంజలి గారు వెంటనే అతని చేతిలోని అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుని, దాని మీద ఉన్న జీతానికి మరో వెయ్యి రూపాయలు కలిపారు. దటీజ్ పతంజలి. ఆ సబ్ ఎడిటర్ ఇప్పటికీ సాక్షిలోనే పని చేస్తున్నారు. 

తాడి ప్రకాష్ గారి గురించి ఒక్క మాట. నేను ఆంధ్రభూమి విజయవాడ ఎడిషన్‌లో 1989లో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా పని చేసే సమయంలో ఆయన న్యూస్ ఎడిటర్‌గా ఉండేవారు. ఎంతటి వార్తనైనా చదివిన వెంటనే అదిరిపోయే సూపర్ లీడ్ రాసేవారు. మనసుకి హత్తుకునే విధంగా రాస్తారు. ఆయన పనితనం ప్రత్యక్షంగా చూడవలసిందే, చదవవలసిందే. చెప్పడం సాధ్యంకాదు. 

ఒకసారి స్టాఫ్ ఫొటోగ్రాఫర్  ఓ కుటుంబం వీధిన పడిన ఫొటో ఒకటి తీసుకువచ్చారు. అతను ఫొటో నేపథ్యం చెప్పారు.  దానికి ప్రకాష్ గారు రెండంటే రెండు నిమిషాల్లో  అదిరిపోయే రైటప్ రాశారు. ఆ ఫొటోలో, ఆ కుటుంబం ఉన్న దీనస్థితి మొత్తాన్ని రెండే రెండు లైన్లలో అర్థవంతంగా రాశారు. అంతేకాదు, ఆ ఫొటోని ఆరోజు బేనర్‌గా వాడారు. ఇలాంటివి చాలా చేశారు. 

ఇక్కడ మరో విషయం. అప్పుడు ఎడిటర్‌గా ఏబీకే ప్రసాద్ గారు ఉండేవారు. నేను కొత్త, ట్రైనీ, ఎడిటోరియల్ డెస్క్‌లో పోస్టులు, హోదాల గురించి కూడా నాకు సరిగా తెలియదు. అక్కడే ఎడిటర్‌గా ఏబీకే ప్రసాద్ గారు ఉన్నా, ప్రకాష్‌ గారిని చూసి ఎప్పటికైనా నేను ప్రకాష్ గారి అంతటి న్యూస్ ఎడిటర్‌ని కావాలని అనుకున్నాను. ఎడిటర్‌ని కావాలని మాత్రం అనుకోలేదు.

అంటే, ప్రకాష్ గారి రాత తీరు నాపై ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.  చివరికి పతంజలి గారు ఎడిటర్‌గా పని చేసిన సాక్షిలోనే, ఆ తర్వాత న్యూస్ ఎడిటర్‌ని అయ్యాను. ఆ రోజు నాకు ప్రకాష్ గారు గుర్తుకు వచ్చారు.  కానీ, రాయడంలో ప్రకాష్ గారి అంతటి వాడిని మాత్రం కాలేకపోయాను.

                                                                                                            - శిరందాసు నాగార్జున 






 

చేనేత రంగానికి మహర్దశ

వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే  చేనేత రంగానికి ఏపీలో మహర్దశ పట్టనుంది. అనేక ఆటుపోట్లకు తట్టుకుని దేశ వారసత్వ సంపదగా చేనేత నిలిచింది. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత వస్త్ర పరిశ్రమ రాష్ట్రంలో మళ్లీ కళకళలాడే పరిస్థితి రానుంది. చేనేత కార్మికుల చిరకాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నాయి. అటు కేంద్రంలోని ఎన్‌డీఏ(జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని  కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టిపెట్టాయి. ఎన్నికల హామీ మేరకు రోజుకో వరాన్ని  ప్రకటిస్తున్నాయి. అలాగే, చేనేత కార్మిక సంఘాల డిమాండ్లను కూడా పరిగణలోని తీసుకుని చేనేత కుటుంబాల సంక్షేమం కోసం అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో,  93 వేల చేనేత కుటుంబాలకు, 10,534 మరమగ్గాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది.  మర మగ్గాలపై కూడా చేనేత రంగానికి చెందిన కార్మికులే వస్తాలను తయాలు చేస్తారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.96.76 కోట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు రూ.28.16 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు  ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే, బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాకుండా,  చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  అదనంగా రూ.50 వేల ఆర్థిక సహకారం అందజేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది. ముడిపదార్థాల సరఫరా పథకం కింద నూలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.

 కేంద్ర ప్రభుత్వ చేనేత ఉత్పత్తులపై విధించే  జీఎస్‌టీని తిరిగి చెల్లించేందు( రీయింబర్స్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం క్లస్టర్ల విధాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో  ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో  రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి.  ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.5 కోట్లు విడుదల చేసింది. మిగిలినవాటికి మరో రూ.2 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో రెండు వేలమంది చేనేత కళాకారులకు లబ్ధి కలుగుతుంది. కూటమి ప్రభుత్వం రాయదుర్గంలోని టెక్స్‌టైల్ పార్కుని అభివృద్ధి చేయడంతోపాటు మంగళగిరిలో  తమిళనాడులోని కంచి తరహాలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మంగళగిరిలోని ఆటోనగర్‌కు ఆనుకుని  10.80 ఎకరాల స్థలాన్ని కూడా  చేనేత జౌళిశాఖ అధికారులు పరిశీలించారు. 


తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి చేనేతకు అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తర్వాత  చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనేక పథకాలు ప్రవేశపెట్టారు. చేనేత కార్మికులకు  ఉపాధి కల్పన కోసం ఎన్టీఆర్ హయాంలో జనతా వస్త్రాల పథకం ప్రవేశపెట్టారు. చేనేత సహకార సొసైటీలను బలోపేతం చేసి వారికి పని కల్పించారు. ఆప్కో ద్వారా సహకార సంఘాలలో నిల్వలను కొనుగోలు చేయించారు. వారికి ఆరోగ్యభద్రత కార్డులు అందజేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత  కార్మికులు లక్షా 11 వేల మందికి రూ.2 వేలు చొప్పున పెన్షన్ అందించారు. నూలు, రంగులు, రసాయనాలపై  సబ్సిడీలు అందించారు. 23వేల మంది చేనేత కార్మికుల రుణాలు చంద్రన్న చేయూత పథకం  ద్వారా రూ.110 కోట్ల వరకు రద్దు చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది నేతన్నలకు రూ.26.62 కోట్లు రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది చేనేత కార్మికుల ప్రయోజనం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికుల పొదుపు పథకాన్ని అమలు చేశారు. ప్రాథమిక చేనేత సహకార సంఘ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.12,500లు ఆర్థిక సహాయం అందించారు. ప్రధాన నగరాల్లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి, కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. మంగళగిరిలో 2024 ఫిబ్రవరిలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా 20 మగ్గాలతో వీవర్స్ శాలను ప్రారంభించారు. ఇక్కడ అధునాతన మగ్గాలతోపాటు కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడివారికి టెక్నాలజీపరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది.  మంగళగిరి చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి  వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే,  ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్ టైల్స్ పార్కులు,  చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది.  

చేనేతకు ప్రధాన సమస్య మార్కెటింగ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లోకి మన చేనేత ఉత్పత్తులను చొప్పించాలి. అంది అసంఘటింతంగా ఉన్న ఈ కార్మికులకు సాధ్యంకాదు.     చేనేత కార్మికులు తమ వృత్తితో అంత్యంత నైపుణ్యం కలిగినవారే గానీ, వారికి మార్కెటింగ్ తెలియదు. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఎగ్జిబిషన్ల ద్వారా చేనేత వస్త్రాలకు విస్తృతమైన మార్కెటింగ్‌ని కల్పిస్తే, వారి ఉత్పత్తులు అమ్ముడుపోయి, వారికి ఉపాధి లభిస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెడితే  చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


Mar 10, 2025

కీ బోర్డు విన్యాసాలు

 Important Shortcuts Keys For Computer

CTRL+A. . .. . Select All CTRL+C. . . . . . Copy
CTRL+X. . . . . . . . . . . . . . . . . Cut
CTRL+V. . . . . . . . . . . . . . . . . Paste
CTRL+Z. . . . . . . . . . . . . . . . . Undo
CTRL+B. . . . . . . . . . . . . . . . . Bold
CTRL+U. . . . . . . . . . . . . . . . . Underline
CTRL+I . . . . . . . . . . . . . . . . . Italic
F1 . . . . . . . . . . . . . . . . . . . . . . Help
F2 . . . . . . . . . . . . . . . . . . . . . Rename selected object
F3 . . . . . . . . . . . . . . . . . . . . . Find all files
F4 . . . . . . . . . . . . . . . . . . . . . Opens file list drop-down in dialogs
F5 . . . . . . . . . . . . . . . . . . . . . Refresh current window
F6 . . . . . . . . . . . . . . . . . . . . . Shifts focus in Windows Explorer
F10 . . . . . . . . . . . . . . . . . . . . Activates menu bar options
ALT+TAB . . . . . . . . . . . . . . . . Cycles between open applications
ALT+F4 . . . . . . . . . . . . . . . . . Quit program, close current window
ALT+F6 . . . . . . . . . . . . . . . . . Switch between current program windows
ALT+ENTER. . . . . . . . . . . . . . Opens properties dialog
ALT+SPACE . . . . . . . . . . . . . . System menu for current window
ALT+¢ . . . . . . . . . . . . . . . . . . opens drop-down lists in dialog boxes
BACKSPACE . . . . . . . . . . . . . Switch to parent folder
CTRL+ESC . . . . . . . . . . . . . . Opens Start menu
CTRL+ALT+DEL . . . . . . . . . . Opens task manager, reboots the computer
CTRL+TAB . . . . . . . . . . . . . . Move through property tabs
CTRL+SHIFT+DRAG . . . . . . . Create shortcut (also right-click, drag)
CTRL+DRAG . . . . . . . . . . . . . Copy File
ESC . . . . . . . . . . . . . . . . . . . Cancel last function
SHIFT . . . . . . . . . . . . . . . . . . Press/hold SHIFT, insert CD-ROM to bypass auto-play
SHIFT+DRAG . . . . . . . . . . . . Move file
SHIFT+F10. . . . . . . . . . . . . . . Opens context menu (same as right-click)
SHIFT+DELETE . . . . . . . . . . . Full wipe delete (bypasses Recycle Bin)
ALT+underlined letter . . . . Opens the corresponding menu
PC Keyboard Shortcuts
Document Cursor Controls
HOME . . . . . . . . . . . . . . to beginning of line or far left of field or screen
END . . . . . . . . . . . . . . . . to end of line, or far right of field or screen
CTRL+HOME . . . . . . . . to the top
CTRL+END . . . . . . . . . . to the bottom
PAGE UP . . . . . . . . . . . . moves document or dialog box up one page
PAGE DOWN . . . . . . . . moves document or dialog down one page
ARROW KEYS . . . . . . . move focus in documents, dialogs, etc.
CTRL+ > . . . . . . . . . . . . next word
CTRL+SHIFT+ > . . . . . . selects word
Windows Explorer Tree Control
Numeric Keypad * . . . Expand all under current selection
Numeric Keypad + . . . Expands current selection
Numeric Keypad – . . . Collapses current selection
¦ . . . . . . . . . . . . . . . . . . . Expand current selection or go to first child
‰ . . . . . . . . . . . . . . . . . . Collapse current selection or go to parent
Special Characters
‘ Opening single quote . . . alt 0145
’ Closing single quote . . . . alt 0146
“ Opening double quote . . . alt 0147
“ Closing double quote. . . . alt 0148
– En dash. . . . . . . . . . . . . . . alt 0150
— Em dash . . . . . . . . . . . . . . alt 0151
… Ellipsis. . . . . . . . . . . . . . . . alt 0133
• Bullet . . . . . . . . . . . . . . . . alt 0149
®️ Registration Mark . . . . . . . alt 0174
©️ Copyright . . . . . . . . . . . . . alt 0169
™️ Trademark . . . . . . . . . . . . alt 0153
• ° Degree symbol. . . . . . . . . alt 0176
• ¢ Cent sign . . . . . . . . . . . . . alt 0162
• 1⁄4 . . . . . . . . . . . . . . . . . . . . . alt 0188
• 1⁄2 . . . . . . . . . . . . . . . . . . . . . alt 0189
• 3⁄4 . . . . . . . . . . . . . . . . . . . . . alt 0190
• PC Keyboard Shortcuts
• Creating unique images in a uniform world! Creating unique images in a uniform world!
• é . . . . . . . . . . . . . . . alt 0233
• É . . . . . . . . . . . . . . . alt 0201
• ñ . . . . . . . . . . . . . . . alt 0241
• ÷ . . . . . . . . . . . . . . . alt 0247
• File menu options in current program
• Alt + E Edit options in current program
• F1 Universal help (for all programs)
• Ctrl + A Select all text
• Ctrl + X Cut selected item
• Shift + Del Cut selected item
• Ctrl + C Copy selected item
• Ctrl + Ins Copy selected item
• Ctrl + V Paste
• Shift + Ins Paste
• Home Go to beginning of current line
• Ctrl + Home Go to beginning of document
• End Go to end of current line
• Ctrl + End Go to end of document
• Shift + Home Highlight from current position to beginning of line
• Shift + End Highlight from current position to end of line
• Ctrl + f Move one word to the left at a time
• Ctrl + g Move one word to the right at a time
• MICROSOFT®️ WINDOWS® SHORTCUT KEYS
• Alt + Tab Switch between open applications
• Alt +
• Shift + Tab
• Switch backwards between open
• applications
• Alt + Print
• Screen
• Create screen shot for current program
• Ctrl + Alt + Del Reboot/Windows®️ task manager
• Ctrl + Esc Bring up start menu
• Alt + Esc Switch between applications on taskbar
• F2 Rename selected icon
• F3 Start find from desktop
• F4 Open the drive selection when browsing
• F5 Refresh contents
• Alt + F4 Close current open program
• Ctrl + F4 Close window in program
• Ctrl + Plus
• Key
• Automatically adjust widths of all columns
• in Windows Explorer
• Alt + Enter Open properties window of selected icon
• or program
• Shift + F10 Simulate right-click on selected item
• Shift + Del Delete programs/files permanently
• Holding Shift
• During Bootup
• Boot safe mode or bypass system files
• Holding Shift
• During Bootup
• When putting in an audio CD, will prevent
• CD Player from playing
• WINKEY SHORTCUTS
• WINKEY + D Bring desktop to the top of other windows
• WINKEY + M Minimize all windows
• WINKEY +
• SHIFT + M
• Undo the minimize done by WINKEY + M
• and WINKEY + D
• WINKEY + E Open Microsoft Explorer
• WINKEY + Tab Cycle through open programs on taskbar
• WINKEY + F Display the Windows®️ Search/Find feature
• WINKEY +
• CTRL + F
• Display the search for computers window
• WINKEY + F1 Display the Microsoft®️ Windows®️ help
• WINKEY + R Open the run window
• WINKEY +
• Pause /Break
• Open the system properties window
• WINKEY + U Open utility manager
• WINKEY + L Lock the computer (Windows XP®️ & later)
• OUTLOOK®️ SHORTCUT KEYS
• Alt + S Send the email
• Ctrl + C Copy selected text
• Ctrl + X Cut selected text
• Ctrl + P Open print dialog box
• Ctrl + K Complete name/email typed in address bar
• Ctrl + B Bold highlighted selection
• Ctrl + I Italicize highlighted selection
• Ctrl + U Underline highlighted selection
• Ctrl + R Reply to an email
• Ctrl + F Forward an email
• Ctrl + N Create a new email
• Ctrl + Shift + A Create a new appointment to your calendar
• Ctrl + Shift + O Open the outbox
• Ctrl + Shift + I Open the inbox
• Ctrl + Shift + K Add a new task
• Ctrl + Shift + C Create a new contact
• Ctrl + Shift+ J Create a new journal entry
• WORD®️ SHORTCUT KEYS
• Ctrl + A Select all contents of the page
• Ctrl + B Bold highlighted selection
• Ctrl + C Copy selected text
• Ctrl + X Cut selected text
• Ctrl + N Open new/blank document
• Ctrl + O Open options
• Ctrl + P Open the print window
• Ctrl + F Open find box
• Ctrl + I Italicize highlighted selection
• Ctrl + K Insert link
• Ctrl + U Underline highlighted selection
• Ctrl + V Paste
• Ctrl + Y Redo the last action performed
• Ctrl + Z Undo last action
• Ctrl + G Find and replace options
• Ctrl + H Find and replace options
• Ctrl + J Justify paragraph alignment
• Ctrl + L Align selected text or line to the left
• Ctrl + Q Align selected paragraph to the left
• Ctrl + E Align selected

Mar 8, 2025

కష్టేఫలి..యువతకు ఆదర్శం శ్రీపతి

పచ్చి బాలింత పోటీ పరీక్షకు హాజరై చరిత్ర సృష్టించింది

మనసుపెట్టి కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిజన యువతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు యువతీయువకులు తెలుసుకోవలసిన ఓ చదువుల తల్లి జీవితం. రెండు రోజుల బిడ్డతో పోటీ పరీక్షకు హాజరై విజయం సాధించింది.స్వతంత్ర భారతంలో 77 ఏళ్ల తర్వాత తమిళనాడులో మొట్టమొదటి మహిళా గిరిజన న్యాయమూర్తిగా రికార్డుకెక్కింది.  ఆ ఎస్టీ యువతి పేరు వి. శ్రీపతి. తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం పులియూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీపతి తండ్రి కాలియప్పన్, తల్లి మల్లిక.  శ్రీపతికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చెన్నై నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఏమాత్రం సౌకర్యాలు లేని ఆ గ్రామంలో ఆమె తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేసుకుని జీవించేవారు. వారు ఎక్కడికైనా వెళ్లడానికి బస్సు ఎక్కాలంటే 15 కిలో మీటర్లు నడవాలి. అంతటి మారుమూల గిరిజన గ్రామం అది. వారిది ‘మలయలి’ అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ. ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉన్నాయి. శ్రీపతి తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు.  పిల్లలను చదివించాలన్న కోరిక వారిలో బలీయంగా. ఆ గూడెంలో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లల చదువు కోసం వారు  తిపట్టూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వెళ్లారు. అక్కడ కూడా  పోడు వ్యవసాయమే చేసేవారు. పిల్లలు చదువు ముఖ్యమనుకున్నారు.  యలగిరి హిల్స్ లో  మంచి స్కూల్ ఉందని సంతోషించారు. 


శ్రీపతి ప్రాథమిక విద్య, ఇంటర్  అక్కడే అభ్యసించింది. కలియప్పన్ పర్యాటక ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ వంటి పనులు చేసేవారు. శ్రీపతి చదువులో బాగా రాణించింది. మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవుతూ ఉండేది. చదువంటే ఎంతో ఇష్టం. ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె కోరిక.ఇంటర్ లో మంచి మార్కులతో పాసైంది.  ఆమె పట్టుదలను చూసి తల్లిదండ్రులు  ఆమెను తిరువణ్ణామలైలో అయిదు సంవత్సరాల "లా" కోర్సు చేర్పించారు. కుటుంబ నేపథ్యం,  బంధువుల ఒత్తిడి వల్ల  శ్రీపతికి చిన్న వయసులోనే వెంకట్రామన్ అనే యువకుడితో పెళ్లి చేశారు.  పెళ్ళైనా ఆ చదువుల తల్లి శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. పట్టుదల వీడలేదు. డాక్టర్ అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. అప్పుడే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు  జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షకు ప్రకటన జారీ చేశారు. అప్పటికే ఆమె గర్భవతి. అయినా పట్టువదల కుండా ఆ పోటీ పరీక్షకు అప్లై చేసింది. సరిగ్గా పరీక్ష సమయానికి డెలివరీ డేట్ వస్తుందని  ఆందోళన చెందింది. తల్లిదండ్రులు, తనకు ఇష్టమైన టీచర్ మహాలక్ష్మి, భర్త వెంకట్రామన్ శ్రీపతికి ధైర్యం చెప్పారు. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వమని ప్రోత్సహించారు. శ్రీపతి ఆ పరీక్షని ఓ యజ్ఞంలా భావించింది.  తల్లి మల్లిక అండతో రాత్రి పగలు చదివి పరీక్షకు సిద్ధమైంది. ఓ పక్క పరీక్ష తేదీ, మరో పక్క డెలీవరీ డేట్  దగ్గర పడుతున్నాయి. పరీక్ష తేదీ కంటే డెలివరీ సమయమే రెండు రోజులు ముందు వచ్చింది. అయినా,   పుస్తకాలు వదలలేదు. ప్రిపరేషన్ కొనసాగించింది. 2023 నవంబరు 27 శ్రీపతి పండంటి పాపకు జన్మనిచ్చింది. రెండు రోజులకే 29న పరీక్ష. పరీక్ష రాయాలని శ్రీపతి పట్టుబట్టింది.  జాగ్రత్త కావాలని డాక్టర్లు చెప్పినా వినలేదు. తాను కష్టపడి చదివిన చదువు వృధా కాకూడదని అనుకుంది. తల్లిదండ్రులు, భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణమైంది. యలగిరి హిల్స్ నుంచి కారులో పచ్చి బాలింత శ్రీపతి చెన్నైకి నాలుగున్నర గంటల ప్రయాణం చేసి పోటీ పరీక్ష రాసింది. విజయం సాధించింది. 2024 ఫిబ్రవరి 15న సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైంది. రాష్ట్రంలో జడ్జి అయిన మొట్టమొదటి గిరిజన మహిళగా నిలిచింది. యువతకు ఆదర్శ మహిళ అయింది. 

 తమిళనాడు ప్రభుత్వ ‘ద్రవిడ మోడల్’ విధానంలో  రూపొందించిన ‘ద తమిళ మీడియం యాక్ట్’ ప్రకారం తమిళ మీడియంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 20 రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ చట్టం   శ్రీపతి జడ్జిగా ఎంపిక కావడానికి ఉపయోగపడిందని భావిస్తున్నారు.  ఎందరు చెప్పినా వినకుండా ప్రాణాలకు తెగించి 200 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్ష రాసిన రెండు రోజుల బాలింత శ్రీపతి సంకల్పాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, సినీ ప్రముఖులు కమల్ హాసన్  వంటి పలువురు ప్రముఖులు ప్రశంసించారు.  పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువు ఆపకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించిన శ్రీపతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు.

-  శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...