Nov 19, 2024

పుష్ప 2 .. ఓ అగ్నిపర్వత విస్ఫోటనం


పుష్ప- 2: ది రూల్‌ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్ రష్మిక  పాల్గొన్నారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు  లాఠీ ఛార్జ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అయినా, ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దాదాపు రెండు లక్షల మంది అభిమానులు హాజరైనట్లు అంచనా. ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కి  900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని బీహార్ ప్రభుత్వం నియమించడం ఇదే మొదటిసారి. పుష్ప- 2 ట్రైలర్ కి అపూర్వ స్పందన వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర నుంచి  పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప అంటే పేరు కాదు .. వైల్డ్ ఫైర్’ ఓ అగ్నిపర్వత విస్ఫోటనం.# 


Nov 10, 2024

మరో 50 నామినేటెడ్ పదవులు

 అమరావతి: మొత్తం 59 మందితో నామినేటెడ్ పదవుల రెండో జాబితా ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసింది. గత ఎన్నికలలో సీట్లను త్యాగం చేసిన వారికీ ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.

జాబితా ఈ దిగువన ఇస్తున్నాం.

1. మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి ) - అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్

2. చాగంటి కోటేశ్వర్ రావు - అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్

3. కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి - టిడిపి) - ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

4. మాల సురేంద్ర ( అనకాపల్లి - టిడిపి ) - ఏపీ గవర్న్ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

5. రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట - టిడిపి )- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

6. పీవీజీ కుమార్ ( మాడుగుల - టిడిపి ) - ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

7. దేవేంద్రప్ప ( ఆదోని - టిడిపి ) - ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

8. ఆర్ సదాశివ ( తిరుపతి - టిడిపి )- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

9. సావిత్రి ( అడ్వొకేట్ - బీజేపీ ) - ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

10. పాలవలస యశస్వి ( శ్రీకాకుళం - జనసేన ) - ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

11. కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు - టిడిపి ) - ఏపీ వాల్మీకి, బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

12. సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్

13. నరసింహ యాదవ్ ( తిరుపతి - టిడిపి ) - ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

14. చిలకలపూడి పాపారావు ( రేపల్లె - జనసేన) - ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

15. వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు - టిడిపి )- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

16. గండి బాబ్జి ( పెందుర్తి - టిడిపి) - ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్

17. మంజులా రెడ్డి రెంటిచింతల - ( మాచర్ల - టిడిపి) - ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ

18. నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి - టిడిపి ) - ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు

19. జీవి రెడ్డి ( మార్కాపురం - టిడిపి ) - ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్

20 . మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి ) - ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్

21. తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు - టిడిపి) - ఏపీ కల్చరల్ కమిషన్

22. పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు - టిడిపి ) - ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

23. సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి - టిడిపి ) - ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

24. గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట - టిడిపి ) - ఏపీ గ్రంధాలయ పరిషద్

25. డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ - టిడిపి ) - ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

26. కేకే చౌదరి ( కోడూరు - టిడిపి ) - ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు

27. చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన ) - ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

28. ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి - టిడిపి ) - ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

29. మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు - టిడిపి ) - ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్

30. ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ - టిడిపి ) - ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ

31. రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ - టిడిపి ) - ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ

32. సావల దేవదత్ (తిరువూరు - టిడిపి ) - ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ

33. రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ - టిడిపి ) - ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్

34. కావాలి గ్రీష్మ ( రాజాం - టిడిపి ) - ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

35. దోన్ను దొర - టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు - జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు - టిడిపి ( కడప జోన్ ) - ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్

36. సజ్జా హేమలతా ( చీరాల - టిడిపి ) - ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ

37 . గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు - టిడిపి ) - ఏపీ నాటక అకాడమీ

38. సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ - టిడిపి )- ఎన్టీఆర్ వైద్య సేవ

39. కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ - టిడిపి ) - స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్

40 . స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం - టిడిపి ) - అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

41. టిసి . వరుణ్ - (అనంతపూర్ - జనసేన ) -అనంతపూర్ - హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

42. రూపానంద రెడ్డి ( కోడూరు - టిడిపి ) - అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

43. సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల - టిడిపి ) - బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

44. తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి - టిడిపి ) - బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

45. కే. హేమలత ( చిత్తూరు - టిడిపి ) - చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

46. తుమ్మల రామస్వామి ( కాకినాడ - జనసేన ) - కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

47. సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు - టిడిపి ) - కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

48. మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం - బీజేపీ ) - మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

49. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ - టిడిపి ) - నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

50. బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం - టిడిపి )- రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

51. కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం - జనసేన )- శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ

52. ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ ) - విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ

53. ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి) - ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్

54. డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ - టిడిపి) - ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

55 . వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం - జనసేన )- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

56. కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం - జనసేన) - ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్

57. ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ - టిడిపి ) - ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

58. డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు - జనసేన) - ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

59. కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ - టిడిపి ) - ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్

Oct 26, 2024

అమరావతికి మహర్దశ

అమరావతికి నిధులకు కొరతలేదు - నిర్మాణంలో వేగం


రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మళ్లీ కొత్త కళ వచ్చింది. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరిగిపోతున్నాయి. గత ప్రభుత్వం అయిదేళ్లపాటు మూలనపడేసిన అమరావతి నిర్మాణ పనులను ఈ ప్రభుత్వం కసితో అత్యంత వేగంగా పూర్తిచేయడానికి పూనుకుంది. అమరావతికి సంబంధించి ఈ నాలుగు నెలల్లో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం. ఏపీకి ఏకైక రాజధినిగా అమరావతి ఖాయమైపోయింది. ఇక్కడే రాజధాని నిర్మించాలని భూములిచ్చిన రైతుల ఆశలు కూడా నెరవేరినట్లైంది. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదే లక్ష్యంతో చంద్రబాబు,  ఆయన మంత్రి వర్గం, అధికారులు చకచకా చర్యలు చేపట్టారు. పనులు ప్రారంభించారు. ముళ్ల కంపలు పెరిగి ఓ చిన్నపాటి అడివిలా తయారైన అమరావతి ప్రాంత్రాన్ని రాత్రి పగలు జేసీబీలతో పనులు చేయించి నెల రోజుల్లో శుభ్రం చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అంతేకాకుండా, హౌసింగ్, అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.  రాజధాని నిర్మాణానికి ఇంకా అనేక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కృష్ణానది ఒడ్డున, గుంటూరు - విజయవాడ మధ్య ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు 2014 సెప్టెంబర్ 4న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి 2015 జూన్ 6న తాళ్లాయపాలెం వద్ద చంద్రబాబు భూమి పూజ చేశారు. 2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతి నగరానికి  ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కు చెందిన సర్బనా జురాంగ్ సింగపూర్ సంస్థ  2016 ఫిబ్రవరిలో సిద్ధం చేసింది. ఇందులో 9 నగరాలు, 27 టౌన్ షిప్ లు ఉంటాయి.  బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ పరిపాలనా నగరంతోపాటు  హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలను డిజైన్ చేసింది. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, రైతులు కూడా లాభపడే విధంగా రాజధాని నిర్మాణం కోసం 28,538 మంది రైతుల నుంచి 34,395.50 ఎకరాలు సమీకరించడం ఓ ప్రపంచ రికార్డ్. ఆ క్రెడిట్ ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. 217.23 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి మహానగరం నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. సీఆర్డీఏ అప్పట్లో విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం  రాజధాని మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.52,837 కోట్లు. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్ అయ్యాయి. రూ.5,674 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింది. అయితే, అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరింది.

అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే శాసనసభ, శాసనమండలి భవనం, సచివాలయ భవనాలు, హైకోర్టు భవనం నిర్మించారు. అలాగే, రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలందరికీ దాదాపు 5 వేల ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు,  కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేశారు.రోడ్లు, విద్యుత్, టెలికం... వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం పూర్తి చేసి పరిపాలన, శాసనసభ సమావేశాలు ప్రారంభించడం ద్వారా అప్పటి టీడీపీ  ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, కేంద్ర సర్వీస్, ఐఏఎస్, గజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు 3,840 ప్లాట్లు, సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 320 కిలోమీటర్ల పొడవైన 34 ప్రధాన రహదారులు నిర్మాణ దశలో ఆగిపోయాయి. వాటిలో కొన్ని దాదాపు 70 - 80 శాతం పూర్తి అయ్యాయి. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్‌ అయ్యాయి. ప్రభుత్వం రూ.5,674 కోట్లు చెల్లించింది. 1280 కిలో మీటర్ల లేఔట్లలో రోడ్లు, డ్రైనేజీల పనులు కూడా నిలిచిపోయాయి.

2019లో  వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం అధికారంలోకి రావడంతో  అమరావతి నిర్మాణ పనులన్నిటిని నిలిపివేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దాంతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.  దాంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆందోళనకు దిగారు. ధర్నాలు, పాదయాత్రలు చేశారు. వారికి రాష్ట్ర ప్రజానికం కూడా మద్దతు పలికారు. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటంతో అర్థంతరంగా ఆగిపోయిన నిర్మాణాలన్నీటిని జెట్ స్పీడ్ తో  పున:ప్రారంభిస్తున్నారు. ఈ నెల 19న చివరి దశలో ఉన్న సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.    వివిధ దశలలో ఉన్న పనులకు డిసెంబరులో టెండర్లు పిలుస్తారు.  జనవరిలో పనులు మొదలుపెడతారు.
                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Aug 19, 2024

ఇది ఓ జీవితం.. ఓ కవితా సముద్రం

శైలజామిత్ర ‘జన్మించడమే కవిత్వం’ పుస్తక సమీక్ష


‘జన్మించడమే కవిత్వం’ ఓ జీవితం. ఓ కవితా సముద్రం. దీన్ని సమీక్షించాలంటే భాష, భావం లోతులకు వెళ్లాలి. వెళతాం.  ఒక్క మాటలో చెప్పాలంటే శైలజా మిత్ర భాషతో అడుకున్నారు. ‘‘నా జీవితం సాహిత్యంలో ఉందా? లేక సాహిత్యం నా జీవితంలో ఉందా?’’ అనే సందిగ్ధంలో పడతానన్నారు ఆమె. అయితే, రెండూ కలిపిన జీవితం ఆమెది. 

   ‘నా ప్రయాణం చందమామ కై’ అనే కవితలో శైలజామిత్ర తన జీవిత,30 ఏళ్ల కవితా ప్రయాణాన్ని అంతా చొప్పించేశారు. భూమి అంటేనే బోరుకొట్టడం-శూన్య ముహూర్తం చూసి ఇల్లు మొదలుపెట్టడం-ఒంటిరిగానైనా సంతోషంగా నివసించడం- నిర్మలమైన నవ్వులు- నిర్బంధమే లేనితనం - గడిచిన బాల్యం - భావాల విహంగంమై గగన తలాన్ని చుట్టడం- ప్రతి అనుభూతి నేనే అవడం - అలసటలేని అరణ్యం - అంతిమపోరాటం - అక్షరమై నిలిచిపోవడం...ఇదంతా ఒకే కవితలో అల్లేశారు. ఒక జీవిత ప్రయాణ అనుభవాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘‘కవిత్వం నాకు తెలిసినంతవరకు ఒక సజీవ ప్రక్రియ’’ అని ముందే చెప్పారు. అలాగే రాశారు. ఓ మనిషి, ముఖ్యంగా ఓ స్త్రీ జీవితమంతా శైలజామిత్ర కవిత్వంలో ఉంది. 

‘‘ఇప్పటికీ నా అణువణువులో అమ్మ లాలిపాట వినిపిస్తుంటే

నా బిడ్డకు డబ్బు కోసం ఈ అమ్మ పోరుబాట కనిపిస్తోంది’’ రెండు లైన్లలో నాటి తల్లికి, నేటి తల్లికి తేడా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇందులో ఓ గ్రంథం రాసేటంతని నిగూఢ అర్థం దాగుంది. ఇదే అసలైన సిసలకైన అద్బుతమైన అందరికీ అర్థమైయ్యే కవిత్వం.


అమ్మానాన్న-ఉదయం-మధ్యాహ్నం-సాయంత్రం-రాత్రి- ఈ మధ్యలో వచ్చే స్వార్థం- అబద్ధం-ఆకలి-అన్యాయం-ప్రేమ-కోపం- ఒంటరితనం -కన్నీరు -ఆనందం -ఆత్మీయత-అనురాగం-ఆశలు-నవ్వులు -ఆశయాలు-చీకటి-వెలుగు..ఇదే మనజీవితం. అదే శైలజామిత్ర కవిత్వం. మరణం ఏ ఒక్కరి ఆస్తి కాదు. వాహ్! ఇందులో ఎంత భావం ఉందో!!

అంతస్తులను బట్టి అనుబంధాలు..ప్రేమేలేని వింత బంధాలు.. ఎంత కాదన్నా అల్లుకున్న బంధాలు.. ఎంత కొత్త యుద్ధమైనా ఫలితాలన్నీ పాతవే.. క్షణికావేశాల మధ్య గడ్డ కడుతున్న పాషాణ హృదయాలు.. కాలం గమనానుసారం సాగిపోవడం. ఎందరో వ్యక్తలు, మనస్తత్వాలతో నడవడం.. తెల్లవారితే వెళ్లిపోయే రాత్రి. ‘పగ’లతో రగిలిపోయే పగలు.. ఇలా సాగుతుంది శైలజా మిత్ర కవిత్వం. 

కవిత్వంతోపాటు ఈ పుస్తకంలో 2004లో బెంగళూరు సాహిత్య అకాడమి వారు ఇచ్చిన ట్రావెల్ గ్రాంట్ ద్వారా శైలజా మిత్ర  సాహితీ ప్రయాణ విశేషాలు ఓ బోనస్. గొప్ప గొప్ప తమిళ రచయితలు, కవులను, సాహితీవేత్తలను ఆమె స్వయంగా కలిశారు. వారి గురించి, వారి సాహిత్యం గురించి చాలా చాలా చక్కగా శైలజా మిత్ర తనదైన శైలిలో వివరించారు. ఆమె సాహితీ ప్రయాణం తప్పక తెలుసుకోవాలి. ఆమె తన ప్రయాణంలో ఓ పబ్లిషర్, ఓ నటుడు, ఓ ఉపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయురాలు, ఓ బ్యాంక్ ఆఫీసర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఓ పబ్లిషర్, ఓ విలేకరి, ఓ అనువాదకుడు, ఓ రాజకీయ నాయకురాలు, ఓ స్క్రీన్ ప్లే రైటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా న్యూస్ ఎడిటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఓ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఓ తత్వవేత్త, ఓ ప్రభుత్వ ఉద్యోగి .....ని కలిశారు. వీరంతా తమిళ ప్రజల మనసు దోచుకుని ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ సాహితీవేత్తలే.  శైలజా మిత్ర ఒక్కొక్కరిని కలిసినప్పటి అనుభవాలు తప్పక తెలుసుకోవాలి. నడుస్తున్న చరిత్ర అది. ఆ విధంగా ఆమె తమిళ సాహితీవేత్తల హృదయాన్ని మన ముందు పెట్టారు.

                                                                                                            - శిరందాసు నాగార్జున 

కవిత్వం : జన్మించడమే కవిత్వం

కవయిత్రి : శైలజా మిత్ర

పేజీలు : 214

వెల : రూ.175

ప్రతులకు : 9705972222

ప్రముఖ పుస్తక కేంద్రాలు

 09.08.2024


Aug 12, 2024

దేశ వారసత్వ సంపద చేనేత

 భారతదేశ వారసత్వ సంపద చేనేత. జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమంలో భాగంగా జాతీయ నేతలు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమానికి ఓ ఊపు తెచ్చిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి చివరకు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆగస్టు 7న అధికారికంగా దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

ఇక చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే రాష్ట్రంలో 950 వరకు సంఘాలు ఉన్నాయి. వీటిలో బోగస్ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్ సంఘాలు ఏర్పాటు చేసినవారు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడం ద్వారా  ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. వాటిని వదిలేసినా, మిగిలిన నిజమైన  సంఘాలకు ప్రభుత్వం నుంచి, ఆప్కో నుంచి రావలసిన బకాయిలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. 

 కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కొంతవరకు చేనేత రంగంపై శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా కేరళలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది. అక్కడి చేనేత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. చేనేత పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజం మనది.  ఇంటెల్లపాది రాత్రి పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించలేకపోతున్నాయి. 

చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి  ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్నలకు, ఇటు వినియోగదారులకు  ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.  చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర,స్నాప్​డీల్  వంటి ఆన్​ లైన్ మార్కెట్ లో  ఉంచాలని వారు కోరుతున్నారు. అలా నేరుగా చేనేత కార్మికుడే వ్యాపారం చేయడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేనిదే ఆన్ లైన్ లో అమ్మడం వీలుకాదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించవలసి ఉంది.

చేనేత సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ జరగడానికి నూతన పద్దతులను అవలంభించవలసి ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఆ విధంగా ఆన్ లైన్ ద్వారా అన్ని దేశాలలో మార్కెట్ చేసే అవకాశం ఉంది.ఈ విషయంలో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి, సహకరించవలసిన అవసరం ఉంది. 

 చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి.  నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు.   నిర్వహణ, సాంకేతికత రెండింటిలోనూ అధిక శిక్షణ పొందిన మానవశక్తి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడటమే గాక  ఎగుమతుల ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థకు కూడా  ప్రయోజనం చేకూరుతుంది.  అందువల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు  కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది.  

.-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Aug 1, 2024

తెలుగు సామెతలు

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రం

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

210. అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టొచ్చు