Jun 12, 2024

ఏపీ మంత్రి మండలి - 2024

 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి మండలి సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 


ఏపీ మంత్రి మండలి

1. నారా చంద్రబాబు నాయుడు 

2. కొణిదెల పవన్ కళ్యాణ్ -  జనసేన - పిఠాపురం

3.  కింజరాపు అచ్చెన్నాయుడు  

4.  కొల్లు రవీంద్ర 

5. నాదెండ్ల మనోహర్ - జనసేన - తెనాలి

6.  పి.నారాయణ 

7. వంగలపూడి అనిత 

8.  సత్యకుమార్ యాదవ్ 

9. నిమ్మల రామానాయుడు

10.  ఎన్.ఎమ్.డి.ఫరూక్ 

11.  ఆనం రామనారాయణరెడ్డి 

12.  పయ్యావుల కేశవ్ 

13.  అనగాని సత్యప్రసాద్ గా

14.  కొలుసు పార్థసారధి 

15.  డోలా బాలవీరాంజనేయస్వామి 

16.  గొట్టిపాటి రవి 

17.   కందుల దుర్గేష్ 

18.  గుమ్మడి సంధ్యారాణి 

19. బీసీ జనార్థన్ రెడ్డి 

20. టీజీ భరత్ 

21. ఎస్.సవిత 

22. శ్రీవాసంశెట్టి సుభాష్ 

23.  కొండపల్లి శ్రీనివాస్ 

24.  మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

25. నారా లోకేష్ 

Jun 5, 2024

చేనేతకు అండగా గుత్తికొండ ధనుంజయ

టీడీపీ పుట్టినప్పటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయ

కళా,సాహితీ రంగాలకు కూడా విస్తరించిన గుత్తికొండ సేవలు

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కృషీవలుడు ధనుంజయ

మంగళగిరిలో లోకేష్  గెలుపు కోసం గుత్తికొండ విశేష కృషి 

చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ గారిపై అపార అభిమానం అతనిని పార్టీవైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే  ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు గారి పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు గారి నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు. పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు. 

14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్ర గారికి, 2014లో గంజి చిరంజీవికి, 2019లొ నారా లోకేష్ గారికి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. ఇప్పుడు2024 లో కూడ నారా లోకేష్ గారికి అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు. 2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా, రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు. 2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. 

2006లో మాదాల రాజేంద్ర గారు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది.  బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని రాజేంద్ర గారు చెల్లించారు.  దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు.  ఆ విధంగా  తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.

అంతేకాకుండా ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు గారు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు  అందించింది.

 చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు  కొనసాగుతున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.

1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు. 

ప్రస్తుతం వివిధ హోదాలలో  గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత, కుల, కళా, సాహితీ సంఘాల తరఫున ప్రజా సేవను కొనసాగిస్తున్నారు. 


గుత్తికొండ ధనుంజయరావు నిర్వహించిన, నిర్వహించే పదవులు: 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిడిపి బీసీ సెల్. 

జాతీయ కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి సంఘం. 

కేంద్ర కమిటీ సభ్యులు,  పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. 

ప్రధాన కార్యదర్శి, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్. 

ఉపాధ్యక్షులు, మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం. 

కన్వీనర్, మంగళగిరి సాహితీ కళావేదిక

మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్

Jun 4, 2024

ఆంధ్రప్రదేశ్- 2024 ఎమ్మెల్యేలు

2024 ఎన్నికల్లో ఏపీ శాసనసభకు వైసీపీ  175 ఎమ్మెల్యే,  25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది.  టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిలో  టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ,  జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేశాయి.

గెలిచిన స్థానాలు

టీడీపీ - 135

జనసేన -  21

బీజేపీ    -   8


వైసీపీ -  11

మొత్తం   -   175

1. శ్రీకాకుళం

ఆమదాలవలస - కూన రవి కుమార్ (టీడీపీ)

ఎచ్చెర్ల - ఈశ్వరరావు.ఎన్ -(బీజేపీ)

ఇచ్ఛాపురం - బెందాలం అశోక్ (టీడీపీ)

నరసన్నపేట - బగ్గు రమణమూర్తి (టీడీపీ)

పాలకొండ - జయకృష్ణ నిమ్మక (జనసేన)

పలాస - గౌతు శిరీష (టీడీపీ)

పాతపట్నం- మామిడి గోవిందరావు -(టీడీపీ)

రాజాం - కొండ్రు మురళి మోహన్ (టీడీపీ)

శ్రీకాకుళం - గొండు శంకర్ (టీడీపీ)

టెక్కలి - కింజారపు అచ్చెన్నాయుడు (టీడీపీ)


2. విజయనగరం

బొబ్బిలి - ఆర్.వీ.ఎస్.కే.కే. రంగా రావు@ బేబీ నాయన(టీడీపీ)

చీపురుపల్లి - కిమిడి కళావెంకట రావు (టీడీపీ)

గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)

కురుపాం - తోయక జగదీశ్వరి (టీడీపీ)

నెల్లిమర్ల - లోకం నాగ మాధవి(జనసేన పార్టీ)

పార్వతీపురం - బోనెల విజయ్ చంద్ర (టీడీపీ)

సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)

శృంగవరపుకోట - కోళ్ల లలిత కుమారి(టీడీపీ)

విజయనగరం - అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి(టీడీపీ)


3. విశాఖపట్నం

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ (జనసేన)

అరకు- రేగం మత్యలింగం-(వైసీపీ)

భీమిలి- గంటా శ్రీనివాసరావు(టీడీపీ)

చోడవరం - కేఎస్ఎన్ఎస్ రాజు (టీడీపీ)

గాజువాక- పల్లా శ్రీనివాసరావు (టీడీపీ)

మాడుగుల- బండారు సత్యనారాయణ మూర్తి (టీడీపీ)

నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు చింతకాయల (టీడీపీ)

పాడేరు- మత్స్యరాస విశ్వేశ్వరరాజు -(వైసీపీ)

పాయకరావుపేట - వంగలపూడి అనిత (టీడీపీ)

పెందుర్తి- పంచకర్ల రమేశ్ బాబు (జనసేన)

విశాఖపట్నం తూర్పు - రామకృష్ణ బాబు వెలగపూడి (టీడీపీ)

విశాఖపట్నం ఉత్తరం - విష్ణు కుమార్ రాజు (బీజేపీ)

విశాఖట్నం దక్షిణ- సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ (జనసేన)

విశాఖపట్నం పశ్చిమ - గణబాబు (టీడీపీ)

యలమంచిలి- సుందరపు విజయకుమార్ (జనసేన)


4. తూర్పు గోదావరి

అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు (టీడీపీ)

అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ (టీడీపీ)

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

కాకినాడ రూరల్ - పంతం నానాజీ (జనసేన)

కొత్తపేట - బండారు సత్యానందరావు(టీడీపీ)

మండపేట - జోగేశ్వర రావు (టీడీపీ)

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు (టీడీపీ)

పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ (జనసేన)

పెద్దాపురం - చిన్న రాజప్ప నిమ్మకాయల (టీడీపీ)

పిఠాపురం - పవన్ కల్యాణ్ (జనసేన)

ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ (టీడీపీ)

రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)

రాజానగరం - బత్తుల బలరామకృష్ణ (జనసేన)

రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)

రంపచోడవరం - మిరియాల శిరీశ దేవి (టీడీపీ)

రాజోలు - దేవ వరప్రసాద్ (జనసేన)

తుని - దివ్య యనమాల (టీడీపీ)


5. పశ్చిమ గోదావరి

ఆచంట - పితాని సత్యనారాయణ (టీడీపీ)

భీమవరం - పులవర్తి ఆంజనేయులు(జనసేన)

చింతలపూడి - రోషన్ కుమార్ సొంగ (టీడీపీ)

దెందులూరు - చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)

ఏలూరు - రాధాకృష్ణయ్య బడేటి (టీడీపీ)

గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు (టీడీపీ)

నిడదవోలు - కందుల దుర్గేశ్ (జనసేన)

కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

నరసాపురం- బొమ్మిడి నారాయణ నాయకర్ (జనసేన)

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు (టీడీపీ)

పోలవరం - చిర్రి బాలరాజు (జనసేన)

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ)

ఉండి - రఘురామ కృష్ణరాజు (టీడీపీ)

ఉంగుటూరు - ధర్మరాజు పత్సమట్ల (జనసేన)


6.కృష్ణా

అవనిగడ్డ- బుద్ధప్రసాద్ మండలి (జనసేన)

గన్నవరం - యార్లగడ్డ వెంకట రావు (టీడీపీ)

గుడివాడ - వెనిగండ్ల రాము (టీడీపీ)

జగ్గయ్యపేట - రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య) టీడీపీ

కైకలూరు - కామినేని శ్రీనివాస్ (బీజేపీ)

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర (టీడీపీ)

మైలవరం - వసంత వెెంకట కృష్ణప్రసాద్ (టీడీపీ)

నందిగామ- తంగిరాల సౌమ్య-(టీడీపీ)

నూజివీడు- కొలుసు పార్థసారథి(టీడీపీ)

పామర్రు - రాజా వర్ల కుమార్ (టీడీపీ)

పెడన- కాగిత కృష్ణ ప్రసాద్-(టీడీపీ)

పెనమలూరు - బోడె ప్రసాద్ (టీడీపీ)

తిరువూరు - కొలికపూడి శ్రీనివాస రావు (టీడీపీ)

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ)

విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహన్ (టీడీపీ)

విజయవాడ పశ్చిమ - యలమంచిలి సత్యనారాయణ చౌదరి -(బీజేపీ)


7. గుంటూరు

బాపట్ల - వేగేశ్న నరేంద్ర వర్మ రాజు-(టీడీపీ)

చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ)

గుంటూరు తూర్పు - మొహమ్మద్ నజీర్ అహ్మద్ (టీడీపీ)

గుంటూరు పశ్చిమ- గల్లా మాధవి-(టీడీపీ)

గురజాల- యరపతినేని శ్రీనిసవాసరావు-(టీడీపీ)

మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (టీడీపీ)

మంగళగిరి- నారా లోకేశ్-(టీడీపీ)

నరసరావుపేట- అరవింద బాబు చదలవాడ-(టీడీపీ)

పెదకూరపాడు- భాష్యం ప్రవీణ్-(టీడీపీ)

పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (టీడీపీ)

ప్రత్తిపాడు - బి. రామాంజనేయులు (టీడీపీ)

రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ -(టీడీపీ)

సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ-(టీడీపీ)

తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్ (టీడీపీ)

తెనాలి - నాదెండ్ల మనోహర్ (జనసేన)

వేమూరు- ఆనంద బాబు నక్కా-(టీడీపీ)

వినుకొండ- గొనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు-(టీడీపీ)


8. ప్రకాశం

అద్దంకి- గొట్టిపాటి రవికుమార్ -(టీడీపీ)

చీరాల- మద్దులూరి మాలకొండయ్య -(టీడీపీ)

దర్శి - బీ.శివ ప్రసాద్ రెడ్డి (వైసీపీ)

గిద్దలూరు - ఎం. అశోక్ రెడ్డి (టీడీపీ)

కందుకూరు- ఇంటూరి నాగేశ్వరరావు -(టీడీపీ)

కనిగిరి- డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ముక్కు -(టీడీపీ)

కొండపి- డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -(టీడీపీ)

మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి (టీడీపీ)

ఒంగోలు- దామచర్ల జనార్దన రావు -(టీడీపీ)

పర్చూరు- ఏలూరి సాంబశివరావు-(టీడీపీ)

సంతనూతలపాడు - విజయ్ కుమార్ (టీడీపీ)

యర్రగొండపాలెం- చంద్రశేఖర్ తాటిపత్రి -(వైసీపీ)


9. నెల్లూరు

ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి -(టీడీపీ)

గూడూరు - సునీల్ కుమార్ (టీడీపీ)

కావలి- దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి-(టీడీపీ)

కోవూరు- ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి-(టీడీపీ)

నెల్లూరు సిటీ- నారాయణ పొంగూరు -(టీడీపీ)

నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-(టీడీపీ)

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ)

సూళ్లూరుపేట- నెలవల విజయశ్రీ-(టీడీపీ)

ఉదయగిరి- కాకర్ల సురేశ్ -(టీడీపీ)

వెంకటగిరి - కురుగొండ్ల రామకృష్ణ (టీడీపీ)


10.కర్నూలు

ఆదోని- డాక్టర్ పార్థసారథి వాల్మీకి-(బీజేపీ)

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ(టీడీపీ)

ఆలూరు - బీ. విరూపాక్షి(వైసీపీ)

బనగానపల్లె - బీ.సీ జనార్థన్ రెడ్డి(టీడీపీ)

డోన్ - కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి (టీడీపీ)

కోడుమూరు- బొగ్గుల దస్తగిరి-(టీడీపీ)

కర్నూలు- టీజీ భరత్ -(టీడీపీ)

మంత్రాలయం- వై.బాలనాగిరెడ్డి -(వైసీపీ)

నందికొట్కూరు- జయ సూర్య-(టీడీపీ)

నంద్యాల- నాస్యం మొహమ్మద్ ఫరూఖ్ -(టీడీపీ)

పాణ్యం- గౌరు చరితారెడ్డి -(టీడీపీ)

పత్తికొండ- కేఈ శ్యామ్ కుమార్ -(టీడీపీ)

శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి -(టీడీపీ)

ఎమ్మిగనూరు- బి.జయనాగేశ్వర రెడ్డి -(టీడీపీ)


11.అనంతపురం

అనంతపురం అర్బన్ - దగ్గుపాటి ప్రసాద్ (టీడీపీ)

ధర్మవరం- సత్యకుమార్ యాదవ్ -(బీజేపీ)

గుంతకల్లు- గుమ్మనూరు జయరాం -(టీడీపీ)

హిందూపురం - నందమూరి బాలకృష్ణ (టీడీపీ)

కదిరి - కందికుంట వెంకట ప్రసాద్ (టీడీపీ)

కళ్యాణదుర్గం - సురేంద్ర బాబు (టీడీపీ)

మడకశిర - ఎంస్.రాజు (టీడీపీ)

పెనుకొండ- ఎస్.సవిత -(టీడీపీ)

పుట్టపర్తి - పల్లె సింధూర రెడ్డి (టీడీపీ)

రాప్తాడు - పరిటాల సునీతమ్మ (టీడీపీ)

రాయదుర్గం - కాల్వ శ్రీనివాసులు (టీడీపీ)

శింగనమల - బండారు శ్రావణి (టీడీపీ)

తాడిపత్రి - జేసీ. అశ్మిత్ రెడ్డి (టీడీపీ)

ఉరవకొండ - పయ్యావుల కేశవ్ (టీడీపీ)


12.కడప

బద్వేలు - దాసరి సుధ (వైసీపీ)

జమ్మలముడుగు - ఆదినారాయణ రెడ్డి (బీజేపీ)

కడప - రెడ్డప్ప గారి మాధవి (టీడీపీ)

కమలాపురం - పుత్తా కృష్ణా చైతన్య రెడ్డి (టీడీపీ)

రైల్వే కోడూరు - అరవ శ్రీధర్(జనసేన పార్టీ)

మైదుకూరు - పుట్ట సుధాకర్ (టీడీపీ)

ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి (టీడీపీ)

పులివెందుల - వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసీపీ)

రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ)

రాజంపేట - అకేపాటి అమర్నాథ్ రెడ్డి(వైసీపీ)


13.చిత్తూరు

చంద్రగిరి - వెంకట మణి ప్రసాద్ పులివర్తి(టీడీపీ)

చిత్తూరు - గురజాల జగన్ మోహన్ (టీడీపీ)

గంగాధర నెల్లూరు - డాక్టర్. వీఎం థామస్ (టీడీపీ)

కుప్పం - నారా చంద్రబాబు నాయుడు(టీడీపీ)

మదనపల్లె - షాహజాన్ బాషా (టీడీపీ)

నగరి - గాలి భాను ప్రకాష్(టీడీపీ)

పలమనేరు - అమర్నాథ రెడ్డి (టీడీపీ)

పీలేరు - నల్లారి కిషన్ కుమార్ రెడ్డి(టీడీపీ)

పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -(వైసీపీ)

పూతలపట్టు - కె. మురళి మోహన్ (టీడీపీ)

సత్యవేడు - కోనేటి ఆదిమూలం (టీడీపీ)

శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(టీడీపీ)

తంబళ్లపల్లె - ద్వారకానాథ రెడ్డి(వైసీపీ)

తిరుపతి - ఆరణి శ్రీనివాస్ (జనసేన)


పోలింగ్ తేది: మే 13, 2024

ఫలితాల తేదీ : జూన్ 4, 2024

 టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి

 వైసీపీ ఒంటరిగా పోటీ 


సుమారు 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు 

సుమారు 3,33,40,333 (80.66 శాతం) మంది ఓటు వేశారు.   

Jun 3, 2024

20 మంది స్ఫూర్తి ప్రదాతలు

11:08 pm

20 మంది స్ఫూర్తి ప్రదాతలుస్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపినవారు ఉంటారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, భగత్‌ సింగ్‌… ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. వీరే కాకుండా మన నిజ జీవితంలో తారసపడే వాళ్లు, అంటే… రైళ్లలో స్కేళ్లు, పెన్నులు అమ్మే అంధులు, తోపుడు బండిపై పండ్లు అమ్ముకొని జీవించే 70- 80 ఏళ్ల వృద్ధులు వంటి వారు కూడా ఉంటారు. ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి తమకాళ్లపై తాము నిలబడి బతకాలనే నిజాయితీ, తాపత్రయం వారిలో ఉంటుంది. అదే స్ఫూర్తి. తెలుగు భాషపై మంచి పట్టున్న ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్‌ రజా హుస్సేన్‌ పాఠకులకు ఆకట్టుకునే విధంగా ‘స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకం రాశారు. అత్యంత సామాన్యులు ఆర్థికంగా బలహీనులు, శారీరకలోపం ఉన్నవారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నతంగా జీవిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినవారి గురించి రజా హుస్సేన్‌ తనదైన శైలిలో అద్భుతంగా వివరించారు. వివిధ రంగాలకు చెందిన సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఓ 20 మంది స్ఫూర్తి ప్రదాతల గురించి ముఖపుస్తక మాద్యమంగా రాశారు. దానినే పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. వారిలో ఆచార్య మన్నవ సత్యనారాయణ ఒకరు. పుట్టుకతోనే చూపులేని ఆయన ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. తాను చదివిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆ స్థాయికి నడిపించిన, ఆయన తండ్రి వెంకటరామయ్య కూడా స్ఫూర్తిమంతులే. జన్మత: అంథుడైన లక్కోజు సంజీవరాయశర్మ గణిత శాస్త్రంలో ప్రావీణ్యత పొంది, గణితావధానంలో దిట్టగా నిలిచి, గణిత బ్రహ్మగా కీర్తి పొందారు. అంకెలు ఎలా ఉంటాయో తెలియని ఆయన, నాలుగు వేల ఏళ్ల వరకు సరిపోయే క్యాలండర్‌ని సృష్టించారు.
అలోక్‌ సాగర్‌ ఢిల్లీ ఐఐటీ విద్యార్థి. ప్రతిష్టాత్మక హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌, ఆ తర్వాత పోస్ట్‌ డాక్టరేట్‌ కూడా పూర్తి చేసి, ఆయన చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్‌, ఓ పాత సైకిల్‌ ఆయన ఆస్తి. తెలుగు సాహిత్యంలో తళుక్కుమన్న మెరుపు తీగె అందే నారాయణ స్వామి. చేనేత కార్మికుడైన ఆయన 33 ఏళ్ల తర్వాత కంటిచూపు కోల్పోయారు. ఆయన 1935-1975 మధ్య జీవితాలను కథలుగా రాశారు. ఆయన కథలను అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రిలు పూనుకొని నారాయణస్వామి కథలను అచ్చు వేయించారంటే ఆయన ఎంత గొప్పకథకుడో మనం అర్థం చేసుకోవచ్చు. చింతక్రింది కనకయ్య 1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ విద్యాసంస్థ నెలకొల్పేందేకు అప్పట్లోనే రూ.26వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఆ స్కూల్‌ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన అనేక మంది రాష్ట్రం, దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్నత సంస్థల్లో ప్రముఖ హోదాలలో పనులు చేశారు. చేస్తున్నారు. తెలుగు మాస్టార్‌ పూసపాటి నాగేశ్వరరావు. పద్య కావ్యాలు రాయడంలో, అవధానాలు చేయడంలో దిట్ట. తెలుగులో ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి పూసపాటి నాగేశ్వరరావు అవధానాన్ని మెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పూసపాటి వారి కాలికి గండపెండేరం తొడిగారు.
కందుకూరి పైడిరాజుకు కాళ్లు కదలవు, మెడ నిలవదు. చిత్రలేఖనమే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. స్వప్న అగస్టీన్‌కు రెండు చేతులూ లేవు. అయినా అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్‌, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు దాకోజు శివప్రసాద్‌. బొమ్మలు ఫ్రీగా గీసివ్వడం ఆయన ప్రత్యేకత. ఎవరికో తెలుసా? అబద్ధం ఆడనంటే ఓ బొమ్మ, మందుకొట్టనంటే ఓ బొమ్మ, పొగతాగనంటే ఓ బొమ్మ గీసిస్తారు. ప్రకృతి ఉపాధ్యాయుడు కొమెర జాజి. ప్రకృతి ఆరాధకుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు. నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొట్లాబత్తుని లక్ష్మణరావు. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్‌ వీవర్‌ గా, మంగళగిరిలో నాణ్యత గల వస్త్ర నిలయంగా పేరుగాంచిన లక్ష్మీశారీ హౌస్‌ వ్యవస్థాపకుడిగా ఎదిగారు. పొట్ట కూటికోసం నేత నేసిన ఓ కార్మికుడు ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కళాకారుడి నుంచి కళాపోషకుడిగా ఎదిగారు.
తిమ్మక్కకు 110 సంవత్సరాల వయసు. ఆమెకు చదువులేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలయినందున కడుపేదరికం అనుభవించింది. ఆమె శ్వాస, ధ్యాస, భాష, చివరికి ఆమె ఊపిరి కూడా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా ‘పద్మశ్రీ’ అందుకుంది. అంటే ఆమె ఎంత స్ఫూర్తిమంతురాలో అర్థం చేసుకోండి. పర్యావరణ ఉద్యమ తొలి సేనాని రేచల్‌ లూయిస్‌ కార్సన్‌. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన యోధురాలు. దోమలను సంహరించే డీడీటీ (ణఱషష్ట్రశ్రీశీతీశీ-ణఱజూష్ట్రవఅyశ్రీ-ుతీఱషష్ట్రశ్రీశీతీశీవ్‌ష్ట్రaఅవ) మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి రేచల్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది గోలి పార్వతీదేవి. భర్త మానసిక పరిస్థితి బాగోలేక ఇల్లు వదిలివెళ్లిపోయారు. కడుపేదరికం. ఇద్దరు పిల్లలు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. ఓ సాధారణ పేద మహిళ ధీరవనితగా నిలిచిన తీరుని రజాహుస్సేన్‌ పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా వివరించారు.
సంగీత లోకంలో ఓ వేగుచుక్క, ఫిడేలు వాయిద్య పరికరానికి ఓ రూపంగా నిలిచిన మన తెలుగువాడు ‘ఫిడేలు నాయుడు’గా కీర్తి పొందిన వెంకటస్వామి నాయుడు, మరుగుజ్జు అయినా ఇస్లామిక్‌ సంస్కృతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు కైసర్‌ అబ్బాస్‌, 91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్‌గా, మదర్‌ ఆఫ్‌ ఇండోర్‌గా నిలిచి, పద్మశ్రీ అవార్డు అందుకున్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ భక్తియాదవ్‌, ఇంగ్లీష్‌ చానల్‌ ఈది మెగల్లాన్‌ సంధిని దాటిన ధీరుడు – మన తెలుగువాడు మధు నాగరాజు గురించి రాశారు. మనుషుల్లో ఇలాంటివారుంటారా అని ఆశ్చర్యం కలిగించేటంతటి ఖద్దరు గాంధీగా పేరుపొందిన కలువకొలను వెంకట్రామయ్య, గోదావరి డెల్టా పితామహుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వంటివారి గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పదవ తరగతికి నాన్‌ డిటెయిల్‌గా సిఫారసు చేయతగిన పుస్తకం ఈ ‘స్ఫూర్తి ప్రదాతలు’.
– శిరందాసు నాగార్జున, 9440222914

Apr 15, 2024

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష


 స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపినవారు ఉంటారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్... ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. వీరే కాకుండా మన నిజ జీవితంలో తారపడే వాళ్లు కూడా ఉంటారు. రైళ్లలో స్కేళ్లు, పెన్నులు అమ్మే అంధులు, తోపుడు బండిపై పండ్లు అమ్ముకొని జీవించే 70- 80 ఏళ్ల వృద్ధులు వంటి వారు కూడా ఉంటారు. ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి తమకాళ్లపై తాము నిలబడి బతకాలనే నిజాయితీ, తాపత్రయం వారిలో ఉంటుంది. అదే స్ఫూర్తి. తెలుగు భాషపై మంచి పట్టున్న ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్ రజా హుస్సేన్ పాఠకులకు ఆకట్టుకునే విధంగా ‘స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకం  రాశారు. అత్యంత సామాన్యులు ఆర్థికంగా బలహీనులు, శారీరకలోపం ఉన్నవారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నతంగా జీవిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినవారి గురించి రజా హుస్సేన్ తనదైన శైలిలో అద్భుతంగా వివరించారు. వివిధ రంగాలకు చెందిన సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన  ఓ 20 మంది స్ఫూర్తి ప్రదాతల గురించి ముఖపుస్తక మాద్యమంగా రాశారు. దానినే పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. వారిలో ఆచార్య మన్నవ సత్యనారాయణ ఒకరు. పుట్టుకతోనే చూపులేని ఆయన ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తాను చదివిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆయనను వేలిపట్టుకుని ఆ స్థాయికి చేరుకునేవరకు నడిపించిన, ఆయన తండ్రి వెంకటరామయ్య కూడా స్ఫూర్తిమంతులే. జన్మత: అంథుడైన లక్కోజు సంజీవరాయ శర్మ గణిత శాస్త్రంలో ప్రావీణ్యత పొంది, గణితావధానంలో దిట్టగా నిలిచి, గణిత బ్రహ్మగా కీర్తి పొందారు.అంకెలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అయినా, నాలుగు వేల ఏళ్ల వరకు సరిపోయే క్యాలండర్ ని సృష్టించారు. 

 ఆయన పేరు అలోక్ సాగర్. ఢిల్లీ ఐఐటీ విద్యార్థి. అమెరికాలోని ప్రతిష్టాత్మక హూస్టన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేశారు.  ఆ తర్వాత పోస్ట్ డాక్టరేట్ కూడా పూర్తి చేశాడు. ఆయన చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్ గా చేశారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆయన శిష్యులే. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్, ఓ పాత సైకిల్ ఆయన ఆస్తి. 

తెలుగు సాహిత్యంలో తళుక్కుమన్న మెరుపు తీగె అందే నారాయణ స్వామి. చేనేత కార్మికుడైన ఆయన 33 ఏళ్ల తర్వాత కంటిచూపు కోల్పోయారు. ఆయన 1935-1975 మధ్య జీవితాలను కథలుగా రాశారు. ఆయన కథలను అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రిలు పూనుకొని నారాయణస్వామి కథలను అచ్చు వేయించారంటే ఆయన ఎంత గొప్పకథకుడో మనం అర్థం చేసుకోవచ్చు. చింతక్రింది కనకయ్య  1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ విద్యా సంస్థ నెలకొల్పేందేకు అప్పట్లోనే రూ.26వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఆ స్కూల్ ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.ఈ పాఠశాలలో చదివిన అనేక మంది రాష్ట్రం, దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్నత సంస్థల్లో ప్రముఖ హోదాలలో పనులు చేశారు. చేస్తున్నారు. తెలుగు మాస్టార్ పూసపాటి నాగేశ్వరరావు. పద్య కావ్యాలు రాయడంలో, అవధానాలు చేయడంలో దిట్ట. తెలుగులో ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి పూసపాటి నాగేశ్వరరావు అవధానాన్ని మెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పూసపాటి వారి కాలికి గండపెండేరం తొడిగారు.

కందుకూరి పైడిరాజుకు కాళ్లు కదలవు, మెడ నిలవదు.చిత్రలేఖనే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. స్వప్న అగస్టీన్ కు రెండు చేతులూ లేవు. అయినా, అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు దాకోజు శివప్రసాద్.  బొమ్మలు ఫ్రీగా గీసివ్వడం ఆయన ప్రత్యేకత. ఎవరికో తెలుసా?  అబద్ధం ఆడనంటే ఓ బొమ్మ,  మందుకొట్టనంటే ఓ బొమ్మ, పొగతాగనంటే ఓ బొమ్మ గీసిస్తారు. అంతేకాదు, ఆయన బొమ్మలు గీయడంలో ఎన్నో స్టైల్స్ ఉన్నాయి.ప్రకృతి ఉపాధ్యాయుడు కొమెర జాజి. ప్రకృతి ఆరాధకుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొట్లాబత్తుని లక్ష్మణరావు. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్ వీవర్ గా, మంగళగిరిలో నాణ్యత గల వస్త్ర నిలయంగా పేరుగాంచిన లక్ష్మీశారీ హౌస్ వ్యవస్థాపకుడిగా ఎదిగారు. పొట్ట కూటికోసం నేత నేసిన ఓ కార్మికుడు ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కళాకారుడి నుంచి కళాపోషకుడిగా ఎదిగారు. 

తిమ్మక్కకు 110 సంవత్సరాల వయసు. ఆమెకు చదువులేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలయినందున కడుపేదరికం అనుభవించింది.ఆమె శ్వాస, ధ్యాస, భాష, చివరికి ఆమె ఊపిరి కూడా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా ‘పద్మశ్రీ’ అందుకుంది. అంటే ఆమె ఎంత స్ఫూర్తిమంతురాలో అర్థం చేసుకోండి. పర్యావరణ ఉద్యమ తొలి సేనాని రేచల్ లూయిస్ కార్సన్. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన యోధురాలు. దోమలను సంహరించే డీడీటీ(Dichloro-Diphenyl-Trichloroethane) మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి రేచల్ ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది గోలి పార్వతీదేవి. భర్త మానసినక పరిస్థితి బాగోలేక ఇల్లు వదిలివెళ్లిపోయారు. కడుపేదరికం. ఇద్దరు పిల్లలు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు.ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. ఓ సాధారణ పేద మహిళ ధీరవనితగా నిలిచిన తీరుని రజాహుస్సేన్ పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా వివరించారు. 

సంగీత లోకంలో ఓ వేగుచుక్క, ఫిడేలు వాయిద్య పరికరానికి ఓ రూపంగా నిలిచిన మన తెలుగువాడు ‘ఫిడేలు నాయుడు’గా కీర్తి పొందిన వెంకటస్వామి నాయుడు, మరుగుజ్జు అయినా ఇస్లామిక్ సంస్కృతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో  గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు కైసర్ అబ్బాస్,  91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్ గా, మదర్ ఆఫ్ ఇండోర్ గా నిలిచి, పద్మశ్రీ అవార్డు అందుకున్న  గైనకాలజిస్ట్ డాక్టర్ భక్తియాదవ్, ఇంగ్లీష్ చానల్ ఈది, మెగల్లాన్ సంధిని దాటిన మగధీరుడు, మన తెలుగువాడు మధు నాగరాజు గురించి రాశారు. మనుషుల్లో ఇలాంటివారుంటారా అని ఆశ్చర్యకలిగించేటంతటి ఖద్దరు గాంధీగా పేరుపొందిన కలువకొలను వెంకట్రామయ్య, గోదావరి డెల్టా పితామహుడు సర్ ఆర్థర్ కాటన్ వంటివారి గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.  పదవ తరగతికి నాన్ డిటెయిల్ గా  సిఫారసు చేయతగిన పుస్తకం ఈ ‘స్ఫూర్తి ప్రదాతలు’. అందరూ చదవవలసిన పుస్తకం ఇది.

 

పుస్తకం పేరు : స్ఫూర్తి ప్రదాతలు

రచయిత : అబ్దుల్ రజా హుస్సేన్

పుస్తకం ధర : రూ.120

పుస్తకాలు లభించు చోటు:

తిరంగా ముసల్మాన్ ప్రచురణలు

11-5-410, ఫ్లాట్ నెం.402

లిలీ బ్లాక్, నయూముల్ కాసిం అపార్ట్ మెంట్స్

రెడ్ హిల్స్, హైదరాబాద్-50000

                      -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

స్ఫూర్తి ప్రదాతలు అంటే ఎవరు?

రజా హుస్సేన్  పుస్తకంపై సమీక్ష

అబ్దుల్ రజా హుస్సేన్ రాసిన ‘స్ఫూర్తి ప్రదాతలు’ పుస్తకం చదివే ముందు స్ఫూర్తి ప్రదాతలు అంటే ఎవరు అని ఆలోచించాను. స్ఫూర్తిగా నిలవడానికి గొప్పగొప్ప వ్యక్తులే కావలసిన అవసరంలేదు. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, హిట్లర్ వంటివారితోపాటు అత్యంత సామాన్యమైన వ్యక్తులు కూడా నాకు స్ఫూర్తినిచ్చినవారిలో ఉన్నారు.     ఒక్కసారిగా 50 ఏళ్లు వెనక్కెళ్లాను. పొన్నూరు బస్టాండ్ లో మండుటెండలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు బుట్టలో ముంజలు పెట్టుకుని అమ్ముతున్నాడు. మరోపక్క అన్ని అవయవాలు బాగానే ఉన్న ఓ వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఆ అడుక్కుతినేవాడు గుర్తులేడుగానీ, ఆ వృద్ధుడు ఇప్పటికీ నా కళ్లలో మెదులుతాడు. ఎన్నో వందసార్లు నాకు గుర్తుకువచ్చాడు. ఆ వయసులో కూడా ఒకరిపై ఆధారపడకుండా కష్టపడి ముంజలు అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. అతని నిజాయితీ, ఒకరిని యాచించకుండా ఆ కష్టపడేతత్వం నాకు బాగా నచ్చాయి. అతను నాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ తర్వాత కూడా చాలా మంది అలాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తిమంతులుగా కనిపించారు. నేను చిన్నప్పుడు ఓ తౌడు కొట్టులో పనిచేశారు. తౌడు కొనుగోలుకు తరచూ రైల్లో చెన్నై వెళ్లేవాడిని. ఆ రైల్లో  ఓ అంథుడు స్కేళ్లు, పెన్నులు వంటివాటిని అమ్మేవాడు. అదే రైల్లో మరోపక్క కొందరు అంథులు పాటలు పాడుతూ అడుక్కునేవారు. స్కేళ్లు, పెన్నులు అమ్మే ఆ అంథుడు నాకు స్ఫూర్తి. వాస్తవానికి అతను అమ్మే వస్తువులు అవసరంలేకపోయినా, నేను వాటిని కొనేవాడిని. అలా నేను కొన్న ఇనప స్కేలు ఇప్పటికీ నా వద్ద ఒకటి ఉంది. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వంటివారి పక్కన హిట్లర్ ఏంటని అనుకోవచ్చు. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి జీవితాలు నాకు స్ఫూర్తి. హిట్లర్ లక్ష్యం కోసం పట్టుదలగా పనిచేయడం నాకు స్ఫూర్తి. అతని లక్ష్యంవేరు. నా లక్ష్యం మాత్రం చదువు.నేను 7వ తరగతి మధ్యలో ఆర్థిక కారణాల వల్ల చదువు మానివేశాను. చాలా పనులు చేసి, చివరికి చేనేత కార్మికుడిగా నేత నేసేవాడిని. దాదాపు 8 ఏళ్ల తర్వాత మెట్రిక్ పరీక్షలు రాయాలనుకున్నాను. ఆ సమయంలోనే హిట్లర్ జీవిత చరిత్ర చదివాను. తన లక్ష్యం చేరుకోవడానికి హిట్లర్  కఠోర దీక్ష, పట్టుదలతో చేసిన ప్రయత్నం నాకు నచ్చింది. అనేక మందితోపాటు హిట్లర్ స్ఫూర్తితో అంతే పట్టుదలతో 7వ తరగతి మధ్యలో ఆపివేసిన నేను  ఓ యజ్ఞంలా రాత్రి పగలు చదివి ఆరు నెలల్లోనే మెట్రిక్ పరీక్షలు రాసి, ఒకేసారి పాసయ్యాను.


 అబ్దుల్ రజా హుస్సేన్ రాసిన ‘స్ఫూర్తి ప్రదాతలు’ విషయానికి వస్తే, ఇందులో 20 మంది ప్రముఖులు, సాధారణ వ్యక్తులు స్ఫూర్తి ప్రదాతలుగా ఎలా నిచిచారో చాలా చక్కగా తదైన శైలిలో వివరించారు. తెలుగులో ఎంఏ చేసి, డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా, జర్నలిస్టుగా చేసిన అనుభవంతో చక్కటి తెలుగులో, పుస్తకం మొదలుపెడితే ఎక్కడా ఆగకుండా చదివేవిధంగా రాశారు. 

పుట్టుకతోనే చూపులేని ఓ వ్యక్తి ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తాను చదివిన విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆయనను వేలిపట్టుకుని ఆ స్థాయికి చేరుకునేవరకు నడిపించిన, ఆయన తండ్రి  కూడా స్ఫూర్తిమంతులే. ఢిల్లీ ఐఐటీ విద్యార్థి, అమెరికాలోని ప్రతిష్టాత్మక హూస్టన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేశారు.  ఆ తర్వాత పోస్ట్ డాక్టరేట్ కూడా పూర్తి చేసి, ఆయన చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్ గా చేశారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆయన శిష్యులే. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్, ఓ పాత సైకిల్ మాత్రమే ఆయన ఆస్తి. అంతటి చదువులు చదివి, అంత నిరాడంబరంగా జీవించేవాడే మనీషి.  తెలుగు సాహిత్యంలో  తళుక్కుమన్న మెరుపు తీగె ఆ చేనేత కార్మికుడు. 33 ఏళ్ల తర్వాత కంటిచూపు కోల్పోయారు. 1935-1975 మధ్య మన పరిసరాలలోని జీవితాలను కథలుగా రాసిన ఓ గొప్ప కథకుడు.  అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రిలు పూనుకొని ఆయన కథలను అచ్చు వేయించారు. ఆ కథలు, ఆ కథకుడు ఎంత గొప్పవారో మనం అర్థంచేసుకోవచ్చు. 

ఓ రైస్ మిల్లు యజమాని  1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామంలో ఓ విద్యా సంస్థ నెలకొల్పేందేకు రూ.26వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఓ స్కూల్ ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.ఈ పాఠశాలలో చదివిన అనేక మంది దేశవిదేశాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు. అదే పాఠశాలలోని ఓ తెలుగు మాస్టార్ పద్య కావ్యాలు రాయడంలో, అవధానాలు చేయడంలో దిట్ట. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇద్దరూ ఆయన అవధానాన్ని మెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారైతే ఏకంగా ఆ మాస్టార్ కాలికి గండపెండేరం తొడిగారు.


పుట్టుకతోనే అంథుడైన ఓ విజ్ఞని గణిత శాస్త్రాన్ని ఔపోసనపట్టి  గణితావధానంలో దిట్టగా నిలిచారు. అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన గణిత బ్రహ్మగా కీర్తి పొందారు. నాలుగు వేల ఏళ్లకు సరిపడా క్యాలండర్ ని తయారు చేశారు. 

ఆమెకు ఇప్పుడు 110 సంవత్సరాల వయసు. ఆమెకు చదువులేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలు.పేదరికంలో జీవించింది.  ఆమె శ్వాస, ధ్యాస, భాష, చివరికి ఆమె ఊపిరి కూడా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెని గుర్తించి ‘పద్మశ్రీ’తో సత్కరించింది. 

సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు  నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్ వీవర్ గా ఎదిగాడు. వస్త్రవ్యాపారిగా నాణ్యతకు ప్రధాన్యత ఇస్తూ మంచి పేరు సంపాదించారు. పొట్ట కూటికోసం నేత నేసిన ఆ కార్మికుడు ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కళాకారుడి నుంచి కళాపోషకుడిగా ఎదిగారు. నటుడు, కార్మికుడు, వ్యాపారవేత్త, సౌమ్యుడు, సహృదయుడు, కళాపోషకుడు..వంటి పార్శాలున్న అరుదైన వ్యక్తి అతను. 

అతనికి కాళ్లు కదలవు, మెడ నిలవదు.చిత్రలేఖనే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. ఆమెకు రెండు చేతులూ లేవు. అయినా, అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. 

కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారుడు మరొకరు. అబద్ధం ఆడనంటే ఓ బొమ్మ గీసిస్తారు. మందుకొట్టనంటే ఓ బొమ్మ, పొగతాగనంటే ఇంకో బొమ్మ గీసిస్తారు. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు. అదే ఆయన ప్రత్యేకత. మరో ప్రకృతి ఆరాధకుడు, ప్రకృతి ఉపాధ్యాయుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. 

పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన తొలి ఉద్యమకారిణి. దోమలను సంహరించే డీడీటీ(Dichloro-Diphenyl-Trichloroethane) మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి ఆమె ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది ఓ తల్లి. భర్త మానసినక పరిస్థితి బాగోలేక ఇల్లు వదిలివెళ్లిపోతే, పేదరికం అనుభవిస్తూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు.ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. ఓ సాధారణ పేద మహిళ ధీరవనితగా నిలిచారు.  సంగీత లోకంలో ఓ వేగుచుక్క, ఫిడేలు వాయిద్య పరికరానికి ఓ రూపంగా నిలిచిన మన తెలుగువాడు, మరుగుజ్జు అయినా ఇస్లామిక్ సంస్కృతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో  గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు,  91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్ గా, మదర్ ఆఫ్ ఇండోర్ గా నిలిచి, పద్మశ్రీ అవార్డు అందుకున్న  గైనకాలజిస్ట్ డాక్టర్, ఇంగ్లీష్ చానల్ ఈది, మెగల్లాన్ సంధిని దాటిన మగధీరుడు, మన మరో తెలుగువాడు... ఇలా వారంతా ఎలా స్ఫూర్తిమంతులుగా నిలిచారో  రజాహుస్సేన్ పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా రాసిన తీరు చాలా బాగుంది. తెలుగు భాషా సౌందర్యాన్ని ఒడిసిపట్టిమరీ  ఈ పుస్తకాన్ని రాశారు. చదవడం వచ్చిన అన్ని వయసులవారు చదవదగిన పుస్తకం ఇది. 


పుస్తకం పేరు : స్ఫూర్తి ప్రదాతలు

రచయిత : అబ్దుల్ రజా హుస్సేన్

పుస్తకం ధర : రూ.120

పుస్తకాలు లభించు చోటు:

తిరంగా ముసల్మాన్ ప్రచురణలు

11-5-410, ఫ్లాట్ నెం.402

లిలీ బ్లాక్, నయూముల్ కాసిం అపార్ట్ మెంట్స్

రెడ్ హిల్స్, హైదరాబాద్-50000

                      -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Apr 9, 2024

కోర్టులలో పాటించవలసిన మర్యాదలు

Etiquette of Courts

 చట్టాలలో పొందుపరిచినవి కాకుండా మరికొన్ని మర్యాదలు, చిన్న చిన్నవే కావచ్చు, ముఖ్యమైనవి ముందు తరాల నుండి వస్తున్నవి. 

1. కోర్టులోకి ప్రతి రోజు మొదటిగా ప్రవేశించినపుడు,  న్యాయమూర్తి బెంచ్ దిగి వెళుతున్నపుడు, బెంచ్ వైపు తిరిగి నమస్కారం చేయాలి. (ఇది బెంచ్ కే గానీ న్యాయమూర్తికి కాదు. అందుకని న్యాయమూర్తి గమనించే వరకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు.)

2. కోర్టు హాలులోకి సాధారణంగా జడ్జి బెంచ్ కు దూరంగా ఉన్న ద్వారం గుండా ప్రవేశించాలి. 

3. జడ్జి కూర్చున్న బెంచ్ ముందు ఒక ప్రక్క నుండి మరో పక్కకు వెళ్ళరాదు. 

4. కోర్టు హాలులో జడ్జి కూర్చున్న బెంచికి అభిముఖంగా మాత్రమే సంచరించాలి. (జడ్జి వైపుకు వీపు చూపించకూడదు)

5. కోర్టు హాలులో మన కేసు పిలిచే వరకు వేచి ఉండాలి. మధ్యలో క్లర్కులను, టైపిస్టులను ప్రక్క నుంచి మాట్లాడి వారి పనికి ఆటంకం కలిగించరాదు.

6.  జడ్జిను (కోర్టును)  ప్రతిసారి గౌరవసూచకంగా “యువర్ ఆనర్” లేదా “మై లార్డ్” అని సంభోదించవలను.  (సర్ అని కూడా సంబోధించ వచ్చు అని మార్పు చేశారు)

7. వేరే కేసు జరుగుతున్న సమయంలో మనం ఏమైనా కోర్టుకు చెప్పవలసి వస్తే, మర్యాదగా, “I may be permitted to represent, your honour” అని గాని,  “with your honour’s permission” అని గానీ  మన రిప్రజెంటేషన్ చెప్పాలి. 

8. కోర్టు హాలులో కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. 

9. కోర్టు హాలులో సీట్లు లేనిచో వీలైనంత అభ్యంతరకరం కాని ప్రదేశంలో నిలబడాలి. 

10. సాధారణంగా కోర్టు హాలులో ఒక వైపు మొదటి సీటు, PP / APP, GP / AGP లకు కేటాయించాలి.  రెండో వైపు మొదటి సీటు, జరుగుతున్న కేసుకు సంబంధించిన అడ్వకేటుకు కేటాయించాలి. 

11. కోర్టు హాలులో ఖాళీ లేనప్పుడు క్లయింటులను అవసరం అయితే గాని కోర్టు హాలులో కూర్చోనివ్వరాదు.  వారి అవసరం లేనప్పుడు కోర్టుహాలు బయట నిరీక్షించమని చెప్పాలి. 

12. కోర్టు ఆవరణలో వాహనాల హారన్ వాడకూడదు. 

13. ఎక్కవ శబ్ధం చేసే వాహనాలను కోర్టు ఆవరణలోకి తీసుకు రాకూడదు.

14. కేసు పిలిచి నప్పుడు కోర్టులో రిప్రజెంటేషన్ చేయకుండా, సీనియర్ ను పిలవడానికి కోర్టు వదిలి బయటకు వెళ్ళకూడదు. “Kindly pass over the matter your honour.  I will call my senior your honour” అని రిప్రజెంటు చేయాలి.

15. ఏ సమయంలోనైనా, ఎట్టి పరిస్థితులలోనూ  కోర్టుల,  న్యాయమూర్తుల, న్యాయాధికారుల గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలి. న్యాయస్థానం గౌరవించబడనప్పుడు, అడ్వకేట్ కూడా గౌవవించబడడు అని గుర్తుంచుకోవాలి.

16. మీ సహచరులను, క్లయింట్లను, క్లర్కులను, న్యాయమూర్తులను, కోర్టు ఉద్యోగులను, అందరినీ, ఎల్లప్పుడూ మృదువైన, సరళమైన భాష లో పలకరించండి. అది మీకు ఎప్పుడూ గౌరవాన్ని తెస్తుంది. 

ఇవన్నీ చిన్నవిగా కనిపించినా, కోర్టుకు సంబంధించి మర్యాదలలోకి వస్తాయి. ఇవి పాటించడం ముఖ్యం.