Apr 9, 2024

కోర్టులలో పాటించవలసిన మర్యాదలు

Etiquette of Courts

 చట్టాలలో పొందుపరిచినవి కాకుండా మరికొన్ని మర్యాదలు, చిన్న చిన్నవే కావచ్చు, ముఖ్యమైనవి ముందు తరాల నుండి వస్తున్నవి. 

1. కోర్టులోకి ప్రతి రోజు మొదటిగా ప్రవేశించినపుడు,  న్యాయమూర్తి బెంచ్ దిగి వెళుతున్నపుడు, బెంచ్ వైపు తిరిగి నమస్కారం చేయాలి. (ఇది బెంచ్ కే గానీ న్యాయమూర్తికి కాదు. అందుకని న్యాయమూర్తి గమనించే వరకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు.)

2. కోర్టు హాలులోకి సాధారణంగా జడ్జి బెంచ్ కు దూరంగా ఉన్న ద్వారం గుండా ప్రవేశించాలి. 

3. జడ్జి కూర్చున్న బెంచ్ ముందు ఒక ప్రక్క నుండి మరో పక్కకు వెళ్ళరాదు. 

4. కోర్టు హాలులో జడ్జి కూర్చున్న బెంచికి అభిముఖంగా మాత్రమే సంచరించాలి. (జడ్జి వైపుకు వీపు చూపించకూడదు)

5. కోర్టు హాలులో మన కేసు పిలిచే వరకు వేచి ఉండాలి. మధ్యలో క్లర్కులను, టైపిస్టులను ప్రక్క నుంచి మాట్లాడి వారి పనికి ఆటంకం కలిగించరాదు.

6.  జడ్జిను (కోర్టును)  ప్రతిసారి గౌరవసూచకంగా “యువర్ ఆనర్” లేదా “మై లార్డ్” అని సంభోదించవలను.  (సర్ అని కూడా సంబోధించ వచ్చు అని మార్పు చేశారు)

7. వేరే కేసు జరుగుతున్న సమయంలో మనం ఏమైనా కోర్టుకు చెప్పవలసి వస్తే, మర్యాదగా, “I may be permitted to represent, your honour” అని గాని,  “with your honour’s permission” అని గానీ  మన రిప్రజెంటేషన్ చెప్పాలి. 

8. కోర్టు హాలులో కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. 

9. కోర్టు హాలులో సీట్లు లేనిచో వీలైనంత అభ్యంతరకరం కాని ప్రదేశంలో నిలబడాలి. 

10. సాధారణంగా కోర్టు హాలులో ఒక వైపు మొదటి సీటు, PP / APP, GP / AGP లకు కేటాయించాలి.  రెండో వైపు మొదటి సీటు, జరుగుతున్న కేసుకు సంబంధించిన అడ్వకేటుకు కేటాయించాలి. 

11. కోర్టు హాలులో ఖాళీ లేనప్పుడు క్లయింటులను అవసరం అయితే గాని కోర్టు హాలులో కూర్చోనివ్వరాదు.  వారి అవసరం లేనప్పుడు కోర్టుహాలు బయట నిరీక్షించమని చెప్పాలి. 

12. కోర్టు ఆవరణలో వాహనాల హారన్ వాడకూడదు. 

13. ఎక్కవ శబ్ధం చేసే వాహనాలను కోర్టు ఆవరణలోకి తీసుకు రాకూడదు.

14. కేసు పిలిచి నప్పుడు కోర్టులో రిప్రజెంటేషన్ చేయకుండా, సీనియర్ ను పిలవడానికి కోర్టు వదిలి బయటకు వెళ్ళకూడదు. “Kindly pass over the matter your honour.  I will call my senior your honour” అని రిప్రజెంటు చేయాలి.

15. ఏ సమయంలోనైనా, ఎట్టి పరిస్థితులలోనూ  కోర్టుల,  న్యాయమూర్తుల, న్యాయాధికారుల గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలి. న్యాయస్థానం గౌరవించబడనప్పుడు, అడ్వకేట్ కూడా గౌవవించబడడు అని గుర్తుంచుకోవాలి.

16. మీ సహచరులను, క్లయింట్లను, క్లర్కులను, న్యాయమూర్తులను, కోర్టు ఉద్యోగులను, అందరినీ, ఎల్లప్పుడూ మృదువైన, సరళమైన భాష లో పలకరించండి. అది మీకు ఎప్పుడూ గౌరవాన్ని తెస్తుంది. 

ఇవన్నీ చిన్నవిగా కనిపించినా, కోర్టుకు సంబంధించి మర్యాదలలోకి వస్తాయి. ఇవి పాటించడం ముఖ్యం.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...