Jun 10, 2019

ఆంధ్రప్రదేశ్ మంత్రులు - శాఖలు- ఫోన్ నెంబర్లు


ఉపముఖ్యమంత్రులు

పిల్లి సుభాష్ చంద్రబోస్ -  రెవెన్యూ శాఖ   -9440522229

అంజాద్ బాషా - మైనారిటీ సంక్షేమ శాఖ   -9948020786

ఆళ్ల నాని - వైద్య ఆరోగ్య శాఖ  -9848509999

నారాయణ స్వామి - ఎక్సైజ్ ,వాణిజ్య పన్నుల శాఖ  -9849034091

పాముల పుష్ప శ్రీవాణి- గిరిజ సంక్షేమ శాఖ -7674084463

మంత్రులు
మేకతోటి సుచరిత - హోం,విపత్తు నిర్వహణ -9908355663

బొత్స సత్యంన్నారాయణ - మున్సిపల్,పట్టణాభివృద్ధి -7997511999

ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు-  పర్యాటక,సాంస్కృతిక -9849555252

మేకపాటి గౌతం రెడ్డి-ఐటీ, పరిశ్రమల శాఖ -9849020556

కురసాల కన్నబాబు -వ్యవసాయ,సహకార శాఖ -9848172411

తానేటి వనిత -మహిళ ,శిశు సంక్షేమ శాఖ-9490032112

కొడాలి నాని -పౌర సరఫరాల శాఖ -9100229567

వెలంపల్లి శ్రీనివాసరావు - దేవాదాయశాఖ -9440611111

మోపిదేవి వెంకటరమణ -పశు సంవర్ధన,మత్స్య శాఖ -9849122337

అనిల్ కుమార్ -జలవనరుల శాఖ -7873456789

పినిపే విశ్వరూప్ -సాంఘిక సంక్షేమ శాఖ-8106990234

శ్రీరంగనాథ -గృహనిర్మాణ శాఖ   -9848135555

పేర్ని నాని - రవాణా,సమాచార శాఖ -9440227099

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి-9010158888

ధర్మాన కృష్ణదాస్ - రోడ్డు,భవనాల శాఖ -9440195666

బుగ్గన రాజేంద్రనాథ్ - ఆర్ధిక,ప్రణాళిక శాఖ -9000526788

ఆధిమూలపు సురేష్ - విద్య శాఖ -9440383942

గుమ్మునురు జయరాం - కార్మిక శాఖ  -9849939171

బాలినేని శ్రీనివాసరెడ్డి - విద్యుత్,అటవీ, పర్యావరణ శాఖ             -9885999666

శంకర నారాయణ - బీసీ సంక్షేమ శాఖ   -9391745699

మంత్రుల ఛాంబర్లు



2వ బ్లాక్
మేకతోటి సుచరిత - హోం శాఖ మంత్రి  - 136
పిల్లి సుభాష్ చంద్రబోస్‌ - డిప్యూటీ సీఎం -215
కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) -208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -  135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) – 137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)-2111
బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)- 212
3వ బ్లాక్
పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)-2111
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్‌(పర్యాటక శాఖ)- 210
4వ బ్లాక్
నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌)- 127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)- 130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)- 132
అనిల్ కుమార్ యాదవ్‌(జలవనరుల శాఖ)-212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)-208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131
5వ బ్లాక్
ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)- 191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)- 193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)-210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పంచాయతీ రాజ్,  రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188

Jun 8, 2019

మంత్రుల బయోడేటా


మోపిదేవి వెంకటరమణారావు
పేరు : మోపిదేవీ వెంకటరమణారావు
పుట్టిన తేదీ : 06-08-1964
స్వగ్రామం : నిజాంపట్నం
తల్లిదండ్రులు : నాగులమ్మ, వీరరాఘవయ్య
విద్యార్హత : బీఏ
భార్య  : అరుణాభాస్కరి
సంతానం : రాజీవ్, జస్మిత
నియోజకవర్గం : రేపల్లె
రాజకీయ నేపథ్యం : కాంగ్రెస్ తరఫున 1984లో ఎంపీపీగా ఎన్నిక. 1989, 1994లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున కూచినపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009లో రేపల్లే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలుపు. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున రేపల్లెలో పోటీ ఓటమి. 2019లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపు.
మేకతోటి సుచరిత

ఎమ్మెల్యే పేరు : మేకతోటి సుచరిత
స్వస్థలం : ఫిరంగిపురం
పుట్టిన తేదీ : 25:12:1972
విద్యార్హత  :  బాచిలర్ ఆఫ్ సైన్స్ , డిస్టెంట్ ఎడ్యుకేషన్ , మదురై కామరాజు యూనివర్సిటీ, మదురై.
భర్త పేరు : మేకతోటి దయాసాగర్
వివాహం : 21:05:1995
సంతానం :  హర్షిత (కుమారుడు), రితిక (కూతురు)
రాజకీయ ప్రవేశం : 2006 లో ఫిరంగిపురం జడ్పీటీసీ గా చేశారు.
2006 నుంచి 2009 వరకు జడ్పీటీసీగా పని చేశారు.
ఎమ్మెల్యేగా తొలి ప్రస్థానం :
2009 రాష్ట్రంలో జరిగిన పునర్విభజనలో  ప్రత్తిపాడు నియోజకవర్గం   ఎస్సీ రిజర్వుడు అయింది. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం లో  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 2042 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టారు. 2012లో వైకాపా ఆవిర్భావంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 16781 ఓట్ల భారీ మెజారిటీతో రెండో సారి  గెలుపొందారు. 2014లో వైకాపా తరుపున మరోసారి పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో 7405 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
తిరిగి 2019లో వైకాపా తరఫున మరోసారి పోటీ చేసి 7398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బాలనేని శ్రీనివాసరెడ్డి  :
పేరు : బాలినేని శ్రీనివాసరెడ్డి
స్వస్థలం : కొణిజేడు గ్రామం, ఒంగోలు
పుట్టిన తేదీ : 12-12-1964
విద్యార్హత : బీఎస్సీ
తల్లిదండ్రులు : బాలినేని రమాదేవి, వెంకటేశ్వరరెడ్డి
భార్య : శచీ దేవి
సంతానం : ప్రణీత్ రెడ్డి,కావ్య(కోడలు)
రాజకీయ ప్రస్థానం : జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009 ఎన్నికల తరవాత రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, చేనేత జైళి శాఖ మాత్యులు బాధ్యతల నిర్వహణ. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో వైసీపీ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలుపు.

మేకపాటి గౌతమ్ రెడ్డి  :
పేరు : మేకపాటి గౌతమ్ రెడ్డి
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్ రెడ్డి(మాజీ ఎంపి), మణిమంజరి
పుట్టిన తేదీ : 02-11-1971
విద్యార్హత : ఎమ్మెస్సీ
భార్య :  శ్రీకీర్తి,
సంతానం : సాయి అనన్య(కుమార్తె), కృష్ణార్జున్ రెడ్డి(కుమారుడు)
సోదరులు : ఫృద్విరెడ్డి, విక్రమ్ రెడ్డి
వ్యాపార ప్రవేశం : 1997లో కేఎంసీ కనస్ట్రక్షన్ కంపెనీలో
రాజకీయ నేపథ్యం : 2014లో వైసీపీ తరఫున ఆత్మకూరు శాసనసభ్యునిగా గెలుపు. 2019లోనూ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా    ఎన్నిక.
అనిల్ కుమార్ యాదవ్ :
పేరు : అనిల్ కుమార్ యాదవ్
తండ్రి : తిరుపాలయ్య
విద్యార్హత : బీడీఎస్
భార్య : జాగృతి
సంతానం : సమన్వి, దర్శనందన్
రాజకీయ నేపథ్యం : 2008 లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా ఎన్నిక. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 2014, 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపు.

డాక్టర్ ఆదిమూలపు సురేష్ :
పేరు : డాక్టర్ ఆదిమూలపు సురేష్
విద్యార్హత : బీఈ, ఎంటెక్, పీహెచ్డీ
భార్య : విజయలక్ష్మి( కమిషనర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్, ఏపీ, టీఎస్)
సంతానం : విశాల్(కుమారుడు), శ్రీస్టి(కుమార్తె)
రాజకీయ నేపథ్యం : 2009లో కాంగ్రెస్ తరఫున ఎర్రగుండపాలెం నుంచి ఎమ్మెల్యే గెలుపు. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో ఎర్రగుండపాలెం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు. ఏపీ అసెంబ్లీ కమిటీల్లో సభ్యునిగా పనిచేసిన అనుభవం. వైసీపీలో క్రియాశీలక నేతగా గుర్తింపు.

Jun 5, 2019

సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజేయ్ కల్లం


  
  సచివాలయం, జూన్ 5:  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం సచివాలయం మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం  పదవీబాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన  సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన(రాజకీయ వ్యవహరాలు) ముఖ్య కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా, ఏపీ ట్రాన్స్ కో ముఖ్య కార్యదర్శి  శ్రీకాంత్ నాగులాపల్లి, పలువురు ఇతర అధికారులు  అజేయ్ కల్లంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

May 30, 2019



కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు !
 
          ప్ర్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్థిక పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రి పదవి ఓ సవాల్ లాంటిది. అత్యంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఎన్నికల మేనిఫెస్టో అమలు, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు వంటి ముఖ్య అంశాలు ఈ నెల 30న నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే  వైఎస్ జగన్మోహన రెడ్డి ముందున్నాయి. పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు, వివిధ శాఖల ప్రక్షాళన, పాదర్శక పాలన, దుబార వ్యయం నియంత్రణ వంటి ఆలోచనలతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అన్నిటికంటే ముఖ్యం పొరుగురాష్ట్రాలతో సఖ్యత, కేంద్రంతో సత్ సంబంధాలు నెరపాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే సరైన విధానంగా ఆయన భావిస్తున్నారు.  అదేవిధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో రాజధాని నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. ఓ పెద్ద యజ్ఞం లాంటిది. అందులో జరిగిన అవకతవకలను సరిదిద్దవలసి ఉంది. రైతులకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి. కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన, పూర్తిగా కేంద్రం వ్యయంతో నిర్మించే పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లుగా ఉన్న రుణ భారం కాస్తా రూ.2.58 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అంతేకాకుండా ప్రభుత్వంలోని  కార్పొరేషన్‌లు, ఇతర సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.  ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులూ తక్కువ ఏమీలేవు. ఈ పరిస్థితులలో కేంద్రం సహాయ సహకారాలు తీసుకోవలసిన అవసరాన్ని జగన్మోహన రెడ్డి గుర్తించారు. ఆడంబరాలకు పోకుండా అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ దుబారా ఖర్చులను తగ్గిస్తూ ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల సలహాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓ శుభపరిణామం.
                  నవరత్నాలలో భాగమైన  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12.50 వేల  చొప్పున 4 ఏళ్లలో 50 వేలు చెల్లించడం - వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బోర్లు – వైఎస్ హయాంలో ఎందరో జీవితాలను నిలిపిన ఆరోగ్యశ్రీ , యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన - వృద్దాప్య ఫించన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్​ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు కుదింపు - విద్యార్థులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌తోపాటు ఏడాదికి 20 వేల స్టైఫండ్ - పేదల కోసం ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టించడం – జలయజ్ఞం - పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే "అమ్మఒడి" పథకం,  స్వయం సహాయక సంఘాల రుణ మాఫి - దశల వారీగా మద్యపాన నిషేధం లాంటి హామీలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటన్నిటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతులు, యువత, పేదలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

             2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు ఈ దేశంలో ఏ యువనేత ఎదుర్కోలేదు. తండ్రి అకాల మరణం - ఆ తరువాత రాజకీయ పరిణామాలు,  తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు - ఉప ఎన్నికలలో దాదాపు అన్ని సీట్లు గెలుపు  - అనేక కేసుల్లో ఇరికించడం – జైలు జీవితం – 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటం – అధికారం చేజిక్కకపోయినా పట్టుదలతో పోరాటం కొనసాగింపు – ప్రజా సంక్షేమ పథకాల అధ్యయనం – అన్ని వర్గాల వారిని ఆకర్షించేవిధంగా నవరత్నాల రూపకల్పన – రాజధాని రైతుల పక్షాల పోరాటం -ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర – ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదం – పార్టీ ఎంపీల రాజీనామా - కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి పార్టీ నేతల నోటీసులు – టీడీపీని ఇరుకున పెట్టడం – 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం – బీసీలకు అధికంగా టిక్కెట్లు ఇవ్వండం – అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారంలో నూతన వరవడి – ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటం - టీడీపీ వారి విమర్శలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం ...... వంటివాటితో సాగింది ఆయన రాజకీయ పోరాటం.  ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొని ఘనవిజయం సాధించారు. ముందుగా తాము ఊహించిన, ఆశించిన విధంగా తమపై ఎంతో నమ్మకంతో  అత్యధికంగా 151 శాసనసభా స్థానాలలో గెలిపించడంతో బాధ్యత పెరిగినట్లుగా జగన్ భావిస్తున్నారు. ఆ నమ్మకాన్ని చెదరనివ్వకుండా ఆరు నెలల లోపలే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకునే రీతిలో పనులు చేయాలన్న తపనతో ఆయన ఉన్నారు. తండ్రికి మించిన పట్టుదలతో ఒంటరి పోరాటం చేసి 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని ఘన విజయం సాధించిన జగన్ అంతే పట్టుదలతో  ప్రత్యేక హోదా సాధించి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, తమకు న్యాయం చేస్తారని రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అద్వితీయమైన మద్దతుని దృష్టిలో పెట్టుకొని  జగన్మోహన రెడ్డి సుపరిపాలన అందిస్తారని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 27, 2019


కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
కొత్త ప్రభుత్వానికి సంఘం అధ్యక్షుడు సుమన్ విజ్ఞప్తి
నూతన సీఎం జగన్మోహన రెడ్డికి అభినందనలు
          అమరావతి, మే 27: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొత్తగా ఏర్పడే వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన రెడ్డికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తరపున అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా  రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న కొత్త ప్రభుత్వ న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు లక్షా 80వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత, పే స్కేల్, టైమ్ స్కేల్, సమాన పనికి సమాన వేతనం లేదని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఊసే లేదన్నారు. 2015 - 2018 మధ్య కాలంలో జరిగిన శాసనసభ సమావేశాలలో కాంట్రాక్ట్,  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ (పర్మినెంట్) చేయమని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీరు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని అసెంబ్లీ సాక్షిగా గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆదోనిలో మాట్లాడుతూ అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యార్హతలు ఆధారంగా అవకాశం ఉన్నంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హతల ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని, పెన్షన్ వర్తింపజేయాలన్నారు. రెండు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుమన్  కోరారు.


May 23, 2019

ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలి



బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్
                అమరావతి, మే 22:  ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు  బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రరాష్ట్ర ప్రభుత్వం  బీసీ సాధారణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదని తెలిపారు.  గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగ నియామకం పొంది ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి అయినా,  వారి వార్షికాదాయం రూ.8 లక్షలు దాటినా వారు కూడా క్రీమిలేయర్ కిందకు రారని, వారి పిల్లలు ఓబిసిలుగా పరిగణించాలని తెలిపారు. ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామితులైనవారు, తల్లిదండ్రులు నేరుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియమితులైన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందకు వస్తారని వివరించారు. సాధారణ ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షిక ఆదాయము రూ.8 లక్షలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పారు. అయితే చాలా మంది రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షికాదాయం రూ.8 లక్షలు దాటితే,  వారి పిల్లలకు ఓబిసి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. దాంతో వారి పిల్లలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులలో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.  ఈ నేపధ్యంలో క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీవికలాంగులుమహిళలు వంటి తొమ్మిది వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారని  వారికెవరికీ లేనిక్రీమిలేయర్ నిబంధన ఒక్క బీసీ వర్గానికే ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు.  రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్షసాంఘిక వెనుకబాటుతనం విద్యారంగంలో వెనుకబాటుతనమే కానీ ఆర్థిక వెనుకబాటుతనం  కాదన్నారు. ఈ విషయాన్ని రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్ కమిషన్కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ రచయితల దృక్పథంలో గానీసామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టం చేశారన్నారు. రిజర్వేషన్లపై అనేక సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయనిసమాజాన్ని సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా కులపరమైనవిధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని సూచించారని తెలిపారు. బీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయకుండా క్రీమిలేయర్ నిబంధన పెట్టడం అన్యాయమని, ఆ షరతును వెంటనే తొలగించాలని ఆయన కోరారు. కేంద్రంలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేసిన రోజునే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని,  ఆశించిన లక్ష్యాలను  సాధించగలుగుతామని శంకరరావు స్పష్టం చేశారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి : పట్టాభిరామ్ పిలుపు

కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు...