Sep 24, 2018


అమృత పథకం నిర్వహణలో ఏపీ ఫస్ట్
ఢిల్లీ అవార్డ్ అందుకున్న పట్టణ వ్యవహారల శాఖ డైరెక్టర్ కన్నబాబు
                సచివాలయం, సెప్టెంబర్ 24: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25న కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు తీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మొదటి మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలును సమీక్షించి ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా  ఏపీ 65.24 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. 59.17 శాతం మార్కులతో ఒడిస్సా రెండవ స్థానంలో, 54.32 శాతం మార్కులతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో, 52.39 శాతం మార్కులతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ జాతీయ సమావేశంలో  కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ఏపీ పట్టణ పరిపాలన శాఖ, అమృత మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబుకు అవార్డుని అందజేశారు. 

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...