Sep 12, 2018


గన్నవరం మేధాటవర్స్ లో రేపు హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ప్రారంభం

       ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మేధాటవర్స్ లో ఈ నెల 13వ తేదీ గురువారం  ఉదయం 9 గంటలకు హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ కంపెనీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ రాకతో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మేధా టవర్స్ వేదికగా  క్యాపిటల్ మార్కెట్స్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్,  ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి. అమెరికాకి చెందిన స్టేట్ స్ట్రీట్ కంపెనీ భాగస్వామ్యంతో హెచ్ సిఎల్ దీనిని  ఏర్పాటు చేస్తోంది.  అమెరికా, కెనడా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో స్టేట్ స్ట్రీట్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.  హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ఏర్పడిన తరువాత మన దేశంలో కోయంబత్తూరులో 4 వేల మందికి ఉపాధి లభించింది.


No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...