Aug 6, 2023

ఆధునిక పోకడలను తట్టుకుని నిలుస్తున్న చేనేత వస్త్రాలు


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణ్ పేట్, గద్వాల్ వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దే కార్మికుల నైపుణ్యం వల్ల  ఆ రంగులలో నాణ్యత ఉంటుంది. ఆయా రంగుల వల్ల కూడా ఆయా ప్రాంతాల చేనేత వస్త్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో  


దాదాపు 14 శాతం తెలంగాణ వస్త్రాలే ఉంటాయి.  అంటే ఇక్కడి చేనేత వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన  తిరుమల తిరుపతిలోని పద్మావతి దేవికి సమర్పించారు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశారు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించారు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఈ చీరల పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 47 అంగుళాలు ఉంటాయి. ఆయనే దబ్బళం మొనలో దూరే 5.5 అడుగుల చీరలను కూడా తయారుచేసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. హరి నైపుణ్యాన్ని ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు.  హరి ఇప్పుడు ఓ కొత్త చీరను తయారు చేస్తున్నారు. అది రాజన్న సిరిసిల్ల ప్రత్యేకం. ఆ చీరపై  సిరిసిల్ల  కమాన్ తో పాటు రాట్నం వడికే మహిళ కూడా ఉంటుంది. ఈ చీరను జాతీయ చేనేత  దినోత్సవం రోజు  ప్రభుత్వానికి అందచేస్తానని హరి చెప్పారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ఏపీలోని ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

( ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా )

Aug 5, 2023

ఆధునిక వస్త్రాలకు దీటుగా.. చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో తెలుగు రాష్ట్రాలదే సింహ భాగం అంటే ఇక్కడి వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 

 అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో  చేనేత వర్గాల జనాభా దాదాపు 15 శాతం వరకు ఉంటుందని అంచనా. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Aug 3, 2023

దేశ వారసత్వ సంపద చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీలో మంచి గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. అనేక రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడు ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు  అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశాడు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించాడు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు.   

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయ తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటా ఎక్కువ. సహకార రంగంలో కూడా చేనేత ఉత్పత్తులు అనేకం తయారవుతున్నాయి.ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.  చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా  అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం.  చేనేత రంగం అనేక వడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది.  ముఖ్యమైన ప్రపంచ దేశాలలో మన చేనేత వస్త్రప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 30, 2023

రాజకీయ సాధికారతతోనే చేనేతల అభ్యున్నతి

వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధనలో భాగస్వామ్యులుకండి

వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి, సభ్యులు రమేష్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల 

మంగళగిరిలో విజయవంతమైన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్-2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వరల్డ్ కాన్ఫరెన్స్-2023కు ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆర్.ఆర్. కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన సదస్సులో చేనేతల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా అందుకు రాజకీయ సాధికారత సాధించాల్సిన ఆవశ్యకతపై నిర్వాహకులు, ముఖ్యఅతిథులు, వివిధ సంఘాల ప్రతినిధుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా కొనసాగాయి.

సదస్సులో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి (అమెరికా), వ్యవస్థాపక సభ్యులు రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో)లు ఈ సంస్థ ఎందుకు ఏర్పడిందీ.. దాని లక్ష్యాలను సవివరంగా వెల్లడించారు. ‘‘అమెరికాలోని న్యూజెర్సీలో 2021 మే నెలలో ఆవిర్భవించిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ కు అంజన్ కర్నాటి (అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల (డెట్రాయిట్), రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారధి కార్యంపూడి (డల్లాస్) వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అనుకోని కారణాల వల్ల డాక్టర్ హరనాథ్, సారథి సదస్సుకు హాజరుకాలేదు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద వృత్తిగా ఉన్న చేనేత అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేతలకు అండగా నిలవాలంటే.. చే‘నేత’లందరూ ఐక్యంగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకతను గుర్తించి..  చేనేతల్లోని అన్ని సామాజికవర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చేనేతల అభ్యున్నతికి పాటుపడాలనే ప్రధాన లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను నెలకొల్పడం జరిగింది.


 ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్న చేనేత కుటుంబాలను కలుపుకోవడం ప్రధాన లక్ష్యం. చేనేత కుటుంబాలకు ఆసరగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టడం. అందుకు  మన చేనేతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సామాజిక సంఘాలు ప్రభుత్వ సహకారంతో చేనేతల సాధికారత కోసం కృషిచేయాలి.  ఇక చేనేత కుటుంబాల్లో ప్రతిభావంతులకు కొదవలేదు. మేధో సంపత్తిలో ఇతరులకు ఏమాత్రం తీసిపోరు. అయితే, చేనేత వృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడం. కొత్తగా విదేశాలకు వెళ్లినవారు అక్కడ కుదురుకునేవరకు అవసరమైన సహకారం... ఇమ్మిగ్రేషన్ సూచనలు, సహాయం... ఆరోగ్య సంరక్షణ అవగాహన సెషన్స్/ వెబినార్లు/ శిబిరాలు. వృత్తిపరమైన సహాయం, వ్యాపార అవకాశాలు- పరస్పర సహకారం అందించడం. వివాహ ప్రయోజనాలు కల్పించడం. చేనేతలు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థితికి ఎదగాలి. అందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఎవరు ఏ రంగంలో ఎదుగుతున్నారో.. వారు ఆ రంగంలో మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు గల అవకాశాలను మెరుగుపరుకునేందుకు కృషి జరగాలి. అన్నింటికి మించి ప్రధానంగా రాజకీయ సాధికారత సాధనకు అందరూ సహకరించుకోవాలి’. ఇవీ  వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రధానలక్ష్యాలు. వీటి సాధన కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులందరూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధన కోసం సహకరించాలని ఈ సదస్సులో వ్యవస్థాపక చైర్మన్  అంజన్ కర్నాటి, సభ్యులు రమేశ్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల విన్నవించారు. 

ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ లతోపాటు వివిధ రంగాలకు చెందిన చేనేత ప్రముఖులు హాజరయ్యారు. 



ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేతలు రెండు కోట్ల జనాభావున్నారని ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచే వీరి మూలాలు వున్నాయని తెలిపారు. నాయకులు ఏ రాజకీయపార్టీకి అనుబంధంగా ఉన్నా చేనేతల సమస్యలపై, చేనేతలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనమందరం ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతలు ప్రతిభాశాలురని, చేనేత వృత్తిలోనే కాకుండా అనేకరంగాల్లో నిష్ణాతులున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేనేతల్లో ఐక్యత సాధించేదిశగా మనలో స్ఫూర్తిరావాలని ఎంపీ సంజీవ్ కుమార్ సూచించారు. 


మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి మాట్లాడుతూ తాను 2001 బ్యాచ్ ఐఏఎస్ నని, తన సాధారణ కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సివిల్స్ , గ్రూపు వన్ ప్రధానపరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించాలని.. 8, 9, 10 తరగతుల్లోనే విద్యార్థులు సివిల్స్ దిశగా లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని సూచించారు. ప్రధానం రాజకీయ వ్యవస్థలో మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం వుందన్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తనకు రాజకీయంగా దివంగత ఎన్టీరామారావు అవకాశమిస్తే చేనేత బిడ్డ నాయకుడిగా ఉన్నానంటే అందుకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పుణ్యమేనని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరిలోనూ సర్వీసు చేయాలనే భావన ఉండాలని, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అందుకు పరస్పర సహకారం అవసరమని ఎల్.రమణ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో చేనేతలకు బలమైన నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, అందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా చేనేత పిల్లల్లో కూడా మనం బాగా చదువుకోవాలని.. అటువంటివారికి వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా సంస్థ వ్యవస్థాపకులు కృషిచేయాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ మనవాళ్లందరికోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం గొప్పవిషయంగా పేర్కొన్నారు. అందుకు ఎన్నారైలు ముందుకు రావడం ముదావహమన్నారు. చేనేతలు అంటే సౌమ్యంగా ఉంటారని, ఎవరి జోలికి వెళ్లరని వారి పని వారుచేసుకుంటారనే పేరుందని చెబుతూ ఇటీవలి ధర్మవరం చేనేత వస్త్రవ్యాపారులపై దారుణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బాధితులకు అండగా చేనేతలు ఐక్యంగా ఉండబట్టే కొంతమేరకైనా న్యాయం జరిగిందన్నారు. కాలంమారింది.. సౌమ్యంగా ఉంటే కుదరదు.. న్యాయం కోసం ఫైటింగ్ చేయాలని పిలుపునిచ్చారు.  

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మన రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మనమే పోటీచేసేవిధంగా చైతన్యం రావాలని, ఆ దిశగా మనల్ని మనం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగురాష్ట్రాల్లో చేనేతలు రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని సునీత కోరారు.

ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ తాము పుట్టిన జాతికోసం సహాయపడాలనే సదుద్దేశంతో ఎన్నారైలు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. చేనేతలు బలహీనులుకాదని, సమాజానికి నాగరికత నేర్పిన జాతి అని గుర్తుచేశారు. చేనేతలు అన్ని రంగాల్లో రాణిస్తూ గతంకన్నాకొంత మెరుగ్గా వున్నారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని చెబుతూ, చేనేత నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేతలపై వుందన్నారు. చేనేతలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుండాలని, స్వార్థాన్ని పక్కనబెట్టి చేనేత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో చేనేత జాతి బలమైన నాయకత్వం వహించి సీట్లు సాధించుకోవాలని సూచించారు.

మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ చేనేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు గతంలో కూడా కృషిజరిగిందన్నారు. నాయకుల్లో ఎవరు గొప్ప అనే అంశం పక్కనబెట్టి నాయకత్వం కావాలని కోరుకోవాలని సూచించారు. చేనేతల్లో ఉపకులాల ప్రస్తావన తేకుండా ఐకమత్యంతో వుంటే రాజకీయపార్టీలను మనం శాసించవచ్చని నిమ్మల పేర్కొన్నారు. అలాగే మనం గెలవగలిగే సీట్లలో మన నాయకులను ప్రోత్సహించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ ఇలాంటి సభలు పెట్టడం చాలా గొప్ప విషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహక ఎన్నారైలకు అభినందనలు తెలిపారు. మనం రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడమేనన్నారు. చేనేతలు అంటే ఒకేకులం.. ఒకేబాటలో నడవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. చేనేత కులాలు ఐక్యంగా వుండి ముందుకు వెళ్లగలిగినప్పుడే ఈ సభల ప్రయోజనం నెరవేరుతుందన్నారు. రాజకీయాల్లో ముందుకువెళుతున్న నాయకులను వెనక్కి లాగే ప్రయత్నాలు మంచి పరిణామం కాదన్నారు. చేనేత ఉపకులాల మధ్య వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తూ.. అలా ముందుకు వెళ్లగలిగినప్పుడు ఉపకులాల మధ్య అంతరాలు, విభేదాలు వైదొలుగుతాయని ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా కమల పేర్కొన్నారు. 

మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య మాట్లాడుతూ ఐకమత్యం, ఎడ్యుకేషన్, ఆర్థికాభివృద్ధి, రాజ్యాధికారం వంటి ప్రధాన అంశాలు చేనేతల ఎదుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఏ కులం నీదంటే.. చేనేత కులం అని చెప్పుకునే స్థాయికి చేనేతలు ఎదగాలని సూచించారు. చిన్నచిన్నవిషయాలకే కోపతాపాలకు పోయి సంఘాలు పుట్టుకొస్తున్నాయని ఇది మంచి పరిణామం కాదన్నారు. 

ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేతలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను ఒక వేదికగా భావించి చేనేతలందరూ భాగస్వామ్యం వహించాలని సూచించారు.

ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చేనేత నాయకులను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్పవిషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. చేనేతలకు  సంబంధించి దీర్ఘకాలికసమస్యలున్నాయని చెబుతూ వాటిని సాధించడం కోసం రాజకీయపార్టీలకతీతంగా చేనేతనాయకులు లాబీయింగ్ చేయాలని సూచించారు.

సదస్సు తీర్మానాలు

ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

శాసనసభ స్థానాలు : చీరాల, మంగళగిరి, రాజమండ్రి రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం, 

పార్లమెంట్ స్థానాలు :  హిందూపురం, కర్నూలు, రాజమండ్రి కేటాయించాలని సదస్సు తీర్మానించింది.

చేనేత వుత్పత్తులపై, చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హండ్లూమ్ బోర్డ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థల్ని పునరుద్ధరించాలని, 1985 చేనేత రిజర్వేషన్ యాక్ట్ ను పటిష్టం గా అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సదస్సు తీర్మానించింది.

చేనేత సామాజికవర్గాలన్నీ ఒకటవుతున్న వేళ!

నేడు మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు


రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటితవర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు. కొన్ని వృత్తులకు సంబంధించి సామాజిక వర్గాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.  మనదేశంలో అనేక కులావారు  ఒకే వృత్తిలో ఉంటుంటారు. అటువంటివారిలో ఐక్యతాలోపం వల్ల రాజకీయంగా మంచి స్థానాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వారిలో చేనేత సామాజిక వర్గాల వారు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాలలో, దేశంలో గణనీయంగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన స్థానం లభించడంలేదు. అయితే, చేనేత కులాలలో ఉన్నత చదువులు చదివి దేశవిదేశాలలో ఆర్థికంగా స్థిరపడినవారు అనేక మంది ఉన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలలో నిష్ణాతులున్నారు. చేనేతకు సంబంధించి  పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ వంటి దాదాపు 25 కులాల వారు మన దేశంలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి చేనేత. చేనేత వృత్తిగా ఉన్న వీరిలో కొన్ని కులాల వారికి తగిన గుర్తింపేలేదు.  అందువల్ల రాజకీయంగా, సామాజికంగా తగిన స్థానం సాధించుకోవాలన్న తపనతో   చేనేత వృత్తిగా గల ఈ కులాలవారినందరినీ  కలపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక కుల సంఘాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి.   అందులో భాగంగా భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చేనేత మూలాలున్న ఉన్నత విద్యావంతులు, మేథావులు కలిసి అంతర్జాతీయ చేనేత కార్మిక సంస్థ(వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమెరికాలోని డెట్రాయిట్, డల్లాస్, చికాగో, న్యూజెర్సీ వంటి నగరాలతోపాటుకెనడాలలో ఉండే వారు ఈ సంస్థను స్థాపించారు.  దేశవ్యాప్తంగా ఉన్న, ఎన్ఆర్ఐ చేనేత కులాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక  బలమైన శక్తిగా రూపొందించండి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రభుత్వాల సహకారంతో చేనేత కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం. చేనేత వర్గాలు  ఆర్థిక, విద్యా, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలలో నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించడం,  చేనేత వృత్తిపై ఆధారపడిన వారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి, వారికి కావలసిన పరికరాలు అందించడం, చేనేత వస్త్రాల మార్కెటింగ్, చేనేత కుటుంబాలకు వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలలో సహకారం, విదేశీ విద్య, ఉపాధి, వ్యాపారం, వివాహాలు వంటి అంశాలలో సహకారం అందించాలన్న ఉత్తమ ఉద్దేశాలతో దీనిని స్థాపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. 


తెలంగాణ ప్రభుత్వం, భారతీయ ట్రస్ట్ సహకారంతో  2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పద్మశాలి భవన్ లో  వంద చేనేత కుటుంబాలకు  ఆసు యంత్రాలను ఈ సంస్థ అందించింది.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంలో ఈ సంస్థ ఉంది.  గత డిసెంబరు 10న తిరుచిరాపల్లిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు శాఖను ఏర్పాటు చేశారు. దేశంలోని చేనేత సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసిద్ధ చేనేత కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు-2023ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల చేనేత సామాజిక వర్గాలకు చెంది కుల సంఘాల   ప్రముఖ నేతలను, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులతోపాటు విదేశాలలో ఉండేవారిని  కూడా ఆహ్వానించారు. ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, ఎల్.రమణ, పంచుమర్తి అనురాధ, పోతుల సునీత,మాజీ ఎంపీలు బుట్టా రేణుక, రాపోలు ఆనందభాస్కర్, నిమ్మల కిష్టప్ప, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఎన్ఆర్ఐలు అంజన్ కర్నాటి, రమేష్ మునుకుట్ల, రాజ్ అడ్డగట్ల, సారథి కార్యంపూడి  వంటివారు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత, అన్ని అంశాలలో పరస్పర సహకారం, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదగడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. చేనేత కార్మికులకు అన్నివిధాల సహాయపడటంతో వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో  చేనేత వర్గాలకు అధిక సీట్లు సాధించుకోవాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914







 


Jul 13, 2023

చేనేత కార్మికుల సంఖ్య తెలియని ప్రభుత్వాలు

ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నేతన్నలు

తూతూ మంత్రంగా పథకాలు
చాలీ చాలని నిధుల కేటాయింపుతో మమ అనిపించేస్తారు


దేశంలో చేనేత రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగి, అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత అనేది ఎంతో కళాత్మకమైనది, మనదేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ప్రభుత్వాలు మాత్రం ఈ రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ, దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయో, ఎంతమంది చేనేత కళాకారులు లేక కార్మికులు ఉన్నారో లెక్కలు తేల్చలేకపోయాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలకు చేనేత వర్గాలు గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తాయి. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హామీలపై హామీలు ఇస్తారు.   అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించవు. తూతూ మంత్రంగా ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటాయి.


ఆంధ్రప్రదేశ్ లో చేనేత మగ్గం నేసే కార్మికులు దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నారు. దేశంలో అత్యధిక మంది చేనేత రంగంపై జీవిస్తున్నవారు ఏపీలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘ సభ్యులు 2,00,310 మంది ఉన్నారు. సహకార సంఘాలలోలేని కార్మికులు 1,58,902 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 3.60 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఓ లక్ష మంది చిలపలు ఎలిచేవాళ్లు, కండెలు చుట్టేవాళ్లు, అచ్చులు అతికేవాళ్లు ఉన్నా,  2.60 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటారు.  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద  81,700 మంది మాత్రమే  లబ్ధి పొందుతున్నారు. అంటే ఇంకా 1,78,300 కార్మికులకు ఈ పథకం అందడంలేదు.  ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం పట్టేంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేత నేసే నిజమైన చేనేత కార్మికులకు మాత్రం ఈ పథకం వర్తించడంలేదు.వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టిలో వారు చేనేత కార్మికులు కారు. చేనేత కార్మికులను శాస్త్రీయంగా గుర్తించే విధానాన్ని ఏ ప్రభుత్వం(అది ఏ పార్టీ అయినా) అనుసరించలేదు. ఆ ఆలోచన కూడా ఏ ప్రభుత్వం చేయలేదు.  ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు చేనేత కార్మికులు, చేనేత కులాలు గుర్తుకు వస్తాయి.గెలిచిన తర్వాత పేరుకి మాత్రమే ఏదో ఒక పథకం ప్రవేశపెట్టి మమ అనిపిస్తారు.ఇన్ని కోట్లు ఇచ్చాం, అన్ని కోట్లు ఇచ్చాం అని లెక్కలు చెప్పేస్తారు. నిజంగా నేత నేసే కార్మికులకు ఆ పథకం అందినా అందకపోయినా పట్టించుకోరు. రాజకీయ పార్టీలకు గాని, ప్రభుత్వాలకు గాని చిత్తశుద్ధి ఉంటే ఒక్క నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ద్వారా చేనేత కార్మికులను శాస్త్రీయంగా లెక్కించవచ్చు. చేనేత, సహకార వంటి సంబంధిత శాఖల అధికారులు మండలాల వారీగా ప్రతి చేనేత కార్మికుని ఇంటికి, ప్రతి సొసైటీకి, ప్రతి చేనేత షెడ్డు వద్దకు వెళ్లి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ మగ్గాలను నేసే స్త్రీ, పురుష కార్మికులను గుర్తించాలి. అలాగే, పడుగుల సాగుల వద్దకు, ఆసుల వద్దకు వెళ్లి అక్కడ పని చేసే కార్మికులను గుర్తించాలి. చేనేత కార్మికులుగా వారికి అధికారికంగా ప్రభుత్వం  గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం కల్పించాలి. ఈ విధంగా లెక్క తేల్చి, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చిన నాడే వారికి న్యాయం చేసినవారవుతారు. ఏ ప్రభుత్వం అయినా ఈ పద్దతిని పక్కాగా అనుసరించవలసిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్వే సంస్థ ద్వారా సర్వే చేయించి కొంతమందికి కార్డులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాండ్ లూమ్ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చింది. కానీ, ఇప్పుడు వారికి పథకాలు వర్తించడంలేదు. అంటే, ప్రభుత్వం కార్డులు ఇచ్చినా ప్రయోజనంలేకుండాపోయింది. ఇక పథకాల విషయానికి వస్తే ప్రభుత్వం మారినప్పడల్లా వారి పేర్లతో పథకాలు ప్రవేశపెడతారు. పాత పథకాలు రద్దు చేస్తారు. వారికి ఏ పథకాలు ఉపయోగపడతాయో ఆలోచన చేయరు. పాఠశాలల పిల్లలకు చేనేత వస్త్రాలతో తయారు చేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలేదు.

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్,హోం ఫర్ వర్క్ షెడ్, మార్కెటింగ్ ఇన్సెంటివ్, చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనకరమైన మహాత్మాగాంధీ బంకర్ బీమా  వంటి  పథకాలను రద్దు చేసింది. దేశంలో  నూలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చిలపనూలును  గతంలో చేనేత అవసరాల కోసం సరఫరాచేసేవారు. ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించారు. దీంతో నూలు ధరలు పెరిగాయి. ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేత వృత్తికి తీరని అన్యాయం జరుగుతోంది. లక్షాలాది మంది జీవిస్తున్న చేతి వృత్తి ద్వారా తయారయ్యే చేనేత వస్త్రాలపై   కేంద్రం 5 శాతం  జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధించారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, రద్దు చేసిన చేనేతకు సంబంధించిన పథకాలను పునరుద్దరించాలని, చేనేత వృత్తి చేస్తూ 80 సంవత్సరాలుపైబడి మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.చేనేతను జౌళి రంగం నుంచి విడగొట్టాలని, చేనేతకు బడ్జెట్ లో ఏటా కేంద్రం రూ.5వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించాలని, స్పిన్నింగ్ మిల్లులు చేనేతకు ఉపయోగించే నూలుని 50 శాతం ఉత్పత్తి చేయాలని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని వారు కోరుతున్నారు.  చేనేత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారం కోసం సెప్టెంబర్ నెలలో చీరాలలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 11, 2023

భారతదేశ పాలకులు

 బానిస రాజవంశం

 1 = 1193 ముహమ్మద్ ఘోరి

 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్

 3 = 1210 అరామ్ షా

 4 = 1211 ఇల్టుట్మిష్

 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా

 6 = 1236 రజియా సుల్తాన్

 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా

 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా

 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్

 10 = 1266 గియాసుడిన్ బల్బన్

 11 = 1286 కై ఖుష్రో

 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్

 13 = 1290 షాముద్దీన్ కామర్స్

 1290 బానిస రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)


 ఖిల్జీ రాజవంశం

 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ

 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ

 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా

 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా

 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా

 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)


 తుగ్లక్ రాజవంశం

 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.

 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ

 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్

 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ

 5 = 1389 అబూబకర్ షా

 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ

 7 = 1394 సికందర్ షా మొదటి

 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా

 9 = 1395 నస్రత్ షా

 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 డోలత్ షా

 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)


 సయ్యిద్ రాజవంశం

 1 = 1414 ఖిజ్ర్ ఖాన్

 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ

 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ

 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా

 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)


 అలోడి రాజవంశం

 1 = 1451 బహ్లోల్ లోడి

 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది

 3 = 1517 ఇబ్రహీం లోడి

 1526 లోడి రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)


 మొఘల్ రాజవంశం

 1 = 1526 జహ్రుదిన్ బాబర్

 2 = 1530 హుమయూన్

 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది


 సూరి రాజవంశం

 1 = 1539 షేర్ షా సూరి

 2 = 1545 ఇస్లాం షా సూరి

 3 = 1552 మహమూద్ షా సూరి

 4 = 1553 ఇబ్రహీం సూరి

 5 = 1554 ఫిరుజ్ షా సూరి

 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి

 7 = 1555 అలెగ్జాండర్ సూరి

 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)


 మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది

 1 = 1555 హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన 

 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్

 3 = 1605 జహంగీర్ సలీం

 4 = 1628 షాజహాన్

 5 = 1659 u రంగజేబు

 6 = 1707 షా ఆలం మొదట

 7 = 1712 జహదర్ షా

 8 = 1713 ఫరూఖ్సియార్

 9 = 1719 రైఫుడు రజత్

 10 = 1719 రైఫుడ్ దౌలా

 11 = 1719 నెకుషియార్

 12 = 1719 మహమూద్ షా

 13 = 1748 అహ్మద్ షా

 14 = 1754 అలమ్‌గీర్

 15 = 1759 షా ఆలం

 16 = 1806 అక్బర్ షా

 17 = 1837 బహదూర్ షా జాఫర్

 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)


 బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)

 1 = 1858 లార్డ్ క్యానింగ్

 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్

 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్

 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో

 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్

 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్

 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్

 8 = 1884 లార్డ్ డఫెరిన్

 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్

 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్

 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్

 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో

 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్

 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్

 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్

 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్

 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్

 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో

 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్

 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్


బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు.


 స్వంత్రభారతదేశ ప్రధానులు

 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ

 2 = 1964 గుల్జారిలాల్ నందా

 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి

 4 = 1966 గుల్జారిలాల్ నందా

 5 = 1966 ఇందిరా గాంధీ

 6 = 1977 మొరార్జీ దేశాయ్

 7 = 1979 చరణ్ సింగ్

 8 = 1980 ఇందిరా గాంధీ

 9 = 1984 రాజీవ్ గాంధీ

 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్

 11 = 1990 చంద్రశేఖర్

 12 = 1991 పివి నరసింహారావు

 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి

 14 = 1996 H.D. దేవేగౌడ

 15 = 1997 ఐకె గుజ్రాల్

 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి

 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్

18 = 2014 నుండి నరేంద్ర మోడీ

764 సంవత్సరాల తరువాత, పరదేశీ, బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందాం.