1. మన భూమిని ఇతరులు ఆక్రమిస్తుంటే ఏం చేశారు?
2.మన భూమిలో అక్రమంగా భవనాలు నిర్మిస్తే ఏం చేశారు?
3.ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధం కాదా?
4.అది అరాచకం కాదా?
5.అది విచ్ఛిన్నం, విధ్వంసం కాదా?
6.సభ్యులు ఆక్రమించడంలేదు. స్వాధీనం చేసుకుంటున్నారు.
7.ఇప్పటికే ఆక్రమించినవారు సంఘ విద్రోహ శక్తులు కాదా? ఆక్రమణల వివరాలు సభ్యులకు ఎందుకు తెలపలేదు? మన సొసైటీ స్థలంలో ఇతరులు అడుగుపెడుతుంటే ఏం చేశారు. స్టాఫ్ దేనికి? వారి విధులు ఏమిటి? వారికి జీతాలు దేనికి?
8. ఆందోళన చెందకుండా, డబ్బు కట్టి ఇన్ని సంవత్సరాలు గా ఎదురుచూస్తూ చచ్చిపోవాలా?
9.దేశ అత్యున్నత న్యాయస్థానం మన భూమిని డెవలప్ చేసుకోమంటే ఎందుకు చేయలేదు? ఎందుకు ప్లాట్లు వేయలేదు. ఎందుకు సభ్యులకు పంపిణీ చేయలేదు?
10.మన భూమిలో మనం నిర్మాణాలు చేసుకోవడానికి సుప్రీం కోర్టు సర్వహక్కులు ఇచ్చిన తర్వాత కూడా బీఓడీ ఏం చేశారు?
11.మన స్థలం హద్దులలో పిల్లర్స్ పాతి, ముళ్ల తీగలతో కంచెవేసి ఉంటే ఆక్రమణలు జరిగేవి కావు. ఆ పని ఎందుకు చేయలేదు?. సభ్యుల అనుమతిలేకుండా లక్షలకు లక్షలు ఖర్చుచేసి రేకులు ఎందుకు వేశారు? వాటి బదులు మన స్థలం చుట్టూతా పది అడుగుల పిల్లర్సు వేసి, ఇనుప తీగలు పెట్టి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి.
12.ఇన్ని కోట్లు పెట్టి కొనుకున్న భూమికి, ఇన్ని ఏళ్లు గడిచినా హద్దు రాళ్లు ఏర్పాటు చేసుకోకుండా ఎవరైనా ఉంటారా? మీరు ఉంటారా? మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేశామో ఆలోచించండి.
13.సభ్యుల అనుమతిలేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేని అధ్యక్షుడిని ఎందుకు చేశారు? సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను ఏం చేశారు? అతనిని ఎవరు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? అతనికి ఎవరు మద్దతు ఇచ్చారు? ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని విధ్వంసాలు?
14.16 ఏళ్లు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. అన్ని అంశాలలో ఫెయిల్ అయ్యామని అర్థంకాలేదా? ఇంకా పదవులు పట్టుని వేలాడంటం ఏమిటి? ఇంకా సర్వనాశనం కాలేదనా? ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం చేశారో ఒక్కసారైనా ఆలోచించారా?
15.ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు, అరాచకానికి, విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
16.బీఓడీకి ఒక విధానం ఉందా? అది ఏమిటి? సుప్రీం కోర్టు తాజా తీర్పు ముందు వరకు, ఇప్పటికీ మన భూమిని ఇతరులు తమ అవసరాలకు వినియోగించుకుంటూనే ఉన్నారు. ఏం చేశారు? ఏం చేస్తున్నారు?
17. ఇతరులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకున్నవారు, ఇప్పుడు డబ్బు చెల్లించిన సభ్యులు స్వాధీనం చేసుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే, మన భూమిని కాపాడటానికి వారు మరికొంత నష్టపోవడానికి సిద్ధపడుతున్నారని అర్థం.
18.సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే మన భూమిని వారు రక్షిస్తున్నట్లే లెక్క. స్వాధీనం చేసుకోవడానికి సొసైటీ తరఫున విధివిధానాలు రూపొందించండి. మన భూమిని మనం పంచుకునే సమయంలో, వారు స్వాధీనం చేసుకున్న భూమిని సొసైటీకి అప్పగిస్తామని, పక్కా నిర్మాణాలు చేపట్టం అని సభ్యుల వద్ద నుంచి అఫిడవిట్ తీసుకోవచ్చు. ప్రభుత్వ అండతో, పోలీసు రక్షణతో ఆక్రమణలు ఆపండి. స్వాధీనాలు ఆపవద్దు.
19.మీరంతా సీనియర్ జర్నలిస్టులే. జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలియంది కాదు. చనిపోయిన కుటుంబాలు, బతికి ఉన్నవారిలో సింహంభట్ల సుబ్బారావు వంటి వారి పరిస్థితి ఆలోచించంది. వారి మానసిక వేదన అర్థం చేసుకోండి. అటువంటి ఎందరో ఉన్నారు. సభ్యులు కట్టలు తెగిన ఆవేశంతో ఉన్నారు. ఇన్నేళ్లు ఎదురు చూసిచూసి ఇక ఆగలేక స్వాధీనానికి దిగారు. ఇన్నేళ్లు వారి సహనాన్ని పరీక్షించారు. ఇక ఆపకండి.
20. సభ్యుల స్వాధీనం అన్న ఆలోచనకు అనుగుణంగా మనం ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఒకేరకమైన పోకడ, బుజ్జగింపులు, నచ్చజెప్పడాలు, బెదిరింపులు... చేస్తూ ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఇక మీ వల్ల కాదని మీకు అర్ధం కావడంలేదా?
21.కొందరు కుయుక్తులతో సొసైటీ లక్ష్యాన్ని నాశనం చేశారు. 1100 కుటుంబాలతో, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. టీమ్ మారాలి. ఆలోచనా విధానం మారాలి. సొసైటీ కోసం పూర్తి కాలం పనిచేసే వారు కావాలి.
22. సొసైటీ నిర్వహణ విషయంలో సభ్యుల వద్ద దాపరికం ఎందుకు? బహిరంగ పరచకూడని న్యాయసంబంధమైన విషయాలు కొన్ని ఉంటాయి. సొసైటీ ప్రయోజనాల రీత్యా వాటిని గోప్యంగా ఉంచవచ్చు. ఇతర వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? సభ్యుల పూర్తి వివరాలు, వారి నామినీ ఎవరు? (బ్యాంకుల విధానంలో) ఎవరు ఎంత డబ్బు చెల్లించారు? ఎవరు ఎంత తిరిగి తీసుకున్నారు? రూ.50వేలు, రూ.25వేలు ఎదుగు వసూలు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు సొసైటీ వద్ద ఎంత డబ్బు ఉంది?...ఇటువంటి వివరాలను వెబ్ సైట్ ఎందుకు పెట్టలేదు.?
23.మన భూముల వద్ద సొసైటీ తరఫున ఎటువంటి యాక్టివిటీ లేదు. ఇప్పుడు సభ్యులు వచ్చి మనందరి తరఫున, మనందరి కోసం స్వాధీనం చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి.
24.ఎవరో బయటవారిలో పంచాయతీలు కష్టమా? వారిలో ఎస్సీలు ఉన్నారని భయపెట్టడం, బెదిరించడం. మనలో ఎస్సీలు లేరా? వారితో మాట్లాడి వారిని ఎందుకు ముందు పెట్టడంలేదు? ఆక్రమణదారులతో పంచాయతీలు కష్టమా? మన సభ్యులు, డబ్బు కట్టినవారితో పంచాయతీలు చేసుకోవడం కష్టమా? అందరూ ఆలోచించండి.
25.సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మన భూమిని పక్కాగా మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అసాంఘీక శక్తులు మనకి నష్టం కలిగిస్తాయని భయపెట్టకండి. మనవారే ఎంత నష్టం కలిగించారో, ఎన్ని అరాచకాలు చేశారో అందరికీ తెలుసు. స్వాధీనానికి ముందుకు వచ్చేవారికి సహకరించి, మొత్తం భూమిని కాపాడే ప్రయత్నం చేయండి. అందుకు ప్రభుత్వం, పోలీసుల సహకారం తీసుకుందాం. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం, ఒక గంట, ఒక పూట వచ్చి పని చేయడం కాదు. పూర్తి కాలం, నిజాయితీ పనిచేసేవారికి బాధ్యతలు అప్పగించండి.
No comments:
Post a Comment