Dec 26, 2024

జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ బీఓడీకి నా ప్రశ్నలు

1. మన భూమిని ఇతరులు ఆక్రమిస్తుంటే ఏం చేశారు?

2.మన భూమిలో అక్రమంగా భవనాలు నిర్మిస్తే ఏం చేశారు?

3.ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధం కాదా?

4.అది అరాచకం కాదా?

5.అది విచ్ఛిన్నం, విధ్వంసం కాదా?

6.సభ్యులు ఆక్రమించడంలేదు. స్వాధీనం చేసుకుంటున్నారు.

7.ఇప్పటికే ఆక్రమించినవారు సంఘ విద్రోహ శక్తులు కాదా? ఆక్రమణల వివరాలు సభ్యులకు ఎందుకు తెలపలేదు? మన సొసైటీ స్థలంలో ఇతరులు అడుగుపెడుతుంటే ఏం చేశారు. స్టాఫ్ దేనికి? వారి విధులు ఏమిటి? వారికి జీతాలు దేనికి? 

8. ఆందోళన చెందకుండా, డబ్బు కట్టి ఇన్ని సంవత్సరాలు గా ఎదురుచూస్తూ చచ్చిపోవాలా?

9.దేశ అత్యున్నత  న్యాయస్థానం మన భూమిని డెవలప్ చేసుకోమంటే ఎందుకు చేయలేదు? ఎందుకు ప్లాట్లు వేయలేదు. ఎందుకు సభ్యులకు పంపిణీ చేయలేదు? 

10.మన భూమిలో మనం నిర్మాణాలు చేసుకోవడానికి సుప్రీం కోర్టు సర్వహక్కులు ఇచ్చిన తర్వాత కూడా బీఓడీ ఏం చేశారు?

11.మన స్థలం హద్దులలో పిల్లర్స్ పాతి, ముళ్ల తీగలతో కంచెవేసి ఉంటే ఆక్రమణలు జరిగేవి కావు. ఆ పని ఎందుకు చేయలేదు?. సభ్యుల అనుమతిలేకుండా లక్షలకు లక్షలు ఖర్చుచేసి రేకులు ఎందుకు వేశారు? వాటి బదులు మన స్థలం చుట్టూతా పది అడుగుల పిల్లర్సు వేసి, ఇనుప తీగలు పెట్టి ఉంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. 

12.ఇన్ని కోట్లు పెట్టి కొనుకున్న భూమికి, ఇన్ని ఏళ్లు గడిచినా హద్దు రాళ్లు ఏర్పాటు చేసుకోకుండా ఎవరైనా ఉంటారా?  మీరు ఉంటారా?     మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేశామో  ఆలోచించండి.

13.సభ్యుల అనుమతిలేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేని అధ్యక్షుడిని ఎందుకు చేశారు? సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అతను ఏం చేశారు? అతనిని ఎవరు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? అతనికి ఎవరు మద్దతు ఇచ్చారు? ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని విధ్వంసాలు?

14.16 ఏళ్లు. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది. అన్ని అంశాలలో ఫెయిల్ అయ్యామని అర్థంకాలేదా?  ఇంకా పదవులు పట్టుని వేలాడంటం ఏమిటి? ఇంకా సర్వనాశనం కాలేదనా?  ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం చేశారో ఒక్కసారైనా ఆలోచించారా?

15.ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు, అరాచకానికి, విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

16.బీఓడీకి ఒక విధానం ఉందా? అది ఏమిటి?  సుప్రీం కోర్టు తాజా తీర్పు ముందు వరకు, ఇప్పటికీ మన భూమిని ఇతరులు తమ అవసరాలకు వినియోగించుకుంటూనే ఉన్నారు. ఏం చేశారు? ఏం చేస్తున్నారు?

17. ఇతరులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకున్నవారు, ఇప్పుడు డబ్బు చెల్లించిన సభ్యులు స్వాధీనం చేసుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే, మన భూమిని కాపాడటానికి వారు మరికొంత నష్టపోవడానికి సిద్ధపడుతున్నారని అర్థం.

18.సభ్యులు స్వాధీనం చేసుకోవడం అంటే మన భూమిని వారు రక్షిస్తున్నట్లే లెక్క. స్వాధీనం చేసుకోవడానికి సొసైటీ తరఫున విధివిధానాలు రూపొందించండి. మన భూమిని మనం పంచుకునే సమయంలో, వారు స్వాధీనం చేసుకున్న భూమిని సొసైటీకి అప్పగిస్తామని, పక్కా నిర్మాణాలు చేపట్టం అని  సభ్యుల వద్ద నుంచి అఫిడవిట్ తీసుకోవచ్చు.  ప్రభుత్వ అండతో, పోలీసు రక్షణతో ఆక్రమణలు ఆపండి. స్వాధీనాలు ఆపవద్దు.  

19.మీరంతా సీనియర్ జర్నలిస్టులే. జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలియంది కాదు. చనిపోయిన కుటుంబాలు, బతికి ఉన్నవారిలో సింహంభట్ల సుబ్బారావు వంటి వారి పరిస్థితి ఆలోచించంది. వారి మానసిక వేదన అర్థం చేసుకోండి. అటువంటి ఎందరో ఉన్నారు.  సభ్యులు కట్టలు తెగిన ఆవేశంతో ఉన్నారు. ఇన్నేళ్లు ఎదురు చూసిచూసి ఇక ఆగలేక స్వాధీనానికి దిగారు. ఇన్నేళ్లు వారి సహనాన్ని పరీక్షించారు. ఇక ఆపకండి. 

20. సభ్యుల స్వాధీనం అన్న ఆలోచనకు అనుగుణంగా మనం ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఒకేరకమైన పోకడ, బుజ్జగింపులు, నచ్చజెప్పడాలు, బెదిరింపులు... చేస్తూ ఇక్కడి వరకు తీసుకువచ్చారు. ఇక మీ వల్ల కాదని మీకు అర్ధం కావడంలేదా? 

21.కొందరు కుయుక్తులతో సొసైటీ లక్ష్యాన్ని నాశనం చేశారు. 1100 కుటుంబాలతో, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.   టీమ్ మారాలి. ఆలోచనా విధానం మారాలి.  సొసైటీ కోసం పూర్తి కాలం పనిచేసే వారు కావాలి. 

22. సొసైటీ నిర్వహణ విషయంలో సభ్యుల వద్ద దాపరికం ఎందుకు? బహిరంగ పరచకూడని న్యాయసంబంధమైన విషయాలు కొన్ని ఉంటాయి. సొసైటీ ప్రయోజనాల రీత్యా వాటిని గోప్యంగా ఉంచవచ్చు. ఇతర వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?  సభ్యుల పూర్తి వివరాలు, వారి నామినీ ఎవరు? (బ్యాంకుల విధానంలో) ఎవరు ఎంత డబ్బు చెల్లించారు? ఎవరు ఎంత తిరిగి తీసుకున్నారు? రూ.50వేలు, రూ.25వేలు ఎదుగు వసూలు చేశారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడు సొసైటీ వద్ద ఎంత డబ్బు ఉంది?...ఇటువంటి వివరాలను వెబ్ సైట్ ఎందుకు పెట్టలేదు.?

23.మన భూముల వద్ద సొసైటీ తరఫున ఎటువంటి యాక్టివిటీ లేదు. ఇప్పుడు సభ్యులు వచ్చి మనందరి తరఫున, మనందరి కోసం స్వాధీనం చేసుకుంటున్నారు. చేసుకోనివ్వండి. 

24.ఎవరో బయటవారిలో పంచాయతీలు కష్టమా? వారిలో ఎస్సీలు ఉన్నారని భయపెట్టడం, బెదిరించడం. మనలో ఎస్సీలు లేరా? వారితో మాట్లాడి వారిని ఎందుకు ముందు పెట్టడంలేదు? ఆక్రమణదారులతో పంచాయతీలు కష్టమా?  మన సభ్యులు, డబ్బు కట్టినవారితో పంచాయతీలు చేసుకోవడం కష్టమా? అందరూ ఆలోచించండి. 

25.సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మన భూమిని పక్కాగా మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అసాంఘీక శక్తులు మనకి నష్టం కలిగిస్తాయని భయపెట్టకండి. మనవారే ఎంత నష్టం కలిగించారో, ఎన్ని అరాచకాలు చేశారో అందరికీ తెలుసు.   స్వాధీనానికి ముందుకు వచ్చేవారికి సహకరించి, మొత్తం భూమిని  కాపాడే ప్రయత్నం చేయండి. అందుకు ప్రభుత్వం, పోలీసుల సహకారం తీసుకుందాం.  ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం, ఒక గంట, ఒక పూట వచ్చి పని చేయడం కాదు. పూర్తి కాలం, నిజాయితీ పనిచేసేవారికి బాధ్యతలు అప్పగించండి. 

ఏపీ మంత్రి వర్గం సెల్ నంబర్లు - ఇ.మెయిల్స్

  

1. ఎన్.చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి - మొబైల్ :  9963510004/   9705710004

2. కె.పవన్ కళ్యాణ్      ఉప ముఖ్యమంత్రి

    మొబైల్ :  93813-09696      pawan.k786@gmail.com

3. ఎన్. లోకేష్      మొబైల్ : 0863-2499999      lokeshnara@gmail.com

4. కె. అచ్చెన్నాయుడు     మొబైల్ :  94401- 96777     katchannaidu@gmail.com

5. కొల్లు రవీంద్ర      మొబైల్ :  99851-22254      kolluravindra@gmail.com

6. నాదెండ్ల మనోహర్      మొబైల్ :  98490-00006     nadendalamanohar@ gmail.com

7. పి.నారాయణ    మొబైల్ :  98481-72501   narayanaponguru@   gmail.com

8. వంగలపూడి అనిత    మొబైల్ :  80994-88888/         90955-48888

    anithavangalapudi@    gmail.com

9. సత్యకుమార్ యాదవ్     మొబైల్ :   98105-09999/            74829-99999

    satyaosd@gmail.com

10. ఎన్. రామానాయుడు      మొబైల్ : 92477-31129      ramanaidunimmala@  gmail.com

11. ఎన్.ఎం.డి.ఫరూక్       మొబైల్ : 98496-99920     ministerfarook@gmail. com

12. ఎ.రామనారాయణరెడ్డి      మొబైల్ : 98490- 48855/           94412-20555

     ananmramanarayanareddy 139@gmail.com

13. పయ్యావుల కేశవ్      మొబైల్ : 98480-32984     payyavulakeshav@gmail.  com

14. ఎ. సత్య ప్రసాద్       మొబైల్ : 99120-77777/         96764-47777

     anaganimla@hotmail.com

15. కె. పార్ధసారధి      మొబైల్ : 98483-04112/           96983-59999

    nitinkrishna1811@gmail.com

16. డి. వీరాంజనేయస్వామి      మొబైల్ : 98491-94903    doctorswamydola@ gmail.com

17. జి. రవికుమార్       మొబైల్ : 98485-25717      gravikumarmlaaaddanki@gmail.com

18. కందుల దుర్గేష్       మొబైల్ : 91128-99999     lakshmidurgesh@gmail. com

19. జి.సంధ్యారాణి      మొబైల్ : 94916-99633    sandhyatdp@gmail.com

20. బి.సి. జనార్ధనరెడ్డి      మొబైల్ : 94944-94944/            94410- 43333

      bcjreddy2@gmail.com

21. టి.జి. భరత్      మొబైల్ : 98483-59999     tgbharath@hotmail.com

22. ఎస్.సవిత      మొబైల్ : 94406-10201/     83091-70485

     savithahpe1@gmail.com

23. వాసంశెట్టి సుభాష్        మొబైల్ : 95344-44999    subashforrcp@gmail.com

24.  కొండపల్లి శ్రీనివాస్        మొబైల్ : 91771-12349      skondapalli9@gmail.com

25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి      మొబైల్ : 63610-27470     prasadreddy3@gmail.com

పాఠశాల విద్యలో సంస్కరణలు

విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 16,437 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

సర్కారు స్కూళ్లను ప్రైవేటుకుదీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చర్యలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రామోడల్ ఎడ్యుకేషన్ ను తె చ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్ మెంట్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డిఎస్సీలో ఎక్కువమంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ను పారదర్శంగా నిర్వహించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్ లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటులాంటి జిఓ 117ని రద్దుచేసి, కొత్త డ్రాఫ్ట్ మోడల్ ను సిద్ధం చేశారు. కొత్తపోస్టుల భర్తీ ప్రారంభమయ్యే లోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీచేశారు. ప్రభుత్వస్కూళ్లను రాజకీయాలకు అతీతంగా సిఎంతో సహా ఎటువంటి రాజకీయనేతల ఫోటోలు లేకుండా అకడమిక్ క్యాలెంటర్ రూపొందించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రాజకీయలకు సంబంధం లేని స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమేగాక దేశంలోనే తొలిసారిగా 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో7 డిసెంబర్ 2024న  మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు.  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే అయిదేళ్లలో ఆంధ్రామోడల్ విద్యావ్యవస్థను తయారుచేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలస్తున్నాయి. 

పాఠ్యాంశాల్లో మార్పులకు చర్యలు

మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, నిపుణ్ భారత్ కి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో మార్పులకు కసరత్తు ప్రారంభించారు. విద్యాసంస్కరణల్లో యునిసెఫ్ తోపాటు ప్రథమ్, జె-పాల్, మది, లీడర్ షిప్ ఈక్విటి (ఎల్ఎఫ్ఇ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో భాగంగా ఉత్తమ బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టారు. బడిబయట ఉన్న 84,640 మంది విద్యార్థులకు నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ డ్రైటింగ్ సెంటర్లు  (NRSTCలు), సీజనల్ హాస్టల్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చారు. ప్రతి బిడ్డను సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి ICDS, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, పాఠశాల విద్యా విభాగాల నుండి డేటాబేస్‌లను సమగ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. నమోదు చేసుకున్న విద్యార్థులలో 80% మందికి APAAR IDలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా  విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చకున్నారు. SCERTలో ఖాళీలను భర్తీ చేశారు. కెజిబివిల్లో 342 మంది బోధన, 991 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. కెరీర్ ప్లానింగ్, మానసిక ఎదుగుదల, సంఘర్షణల పరిష్కారంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 255 మంది కెరీర్, మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించారు. విద్యార్థుల్లో డిజిటల్ సౌలభ్యాన్ని పెంపొందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) సమగ్ర క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించడంలో ఎపి ప్రభుత్వం చేసిన కృషిని కేంద్రం గుర్తించింది. వికలాంగుల హక్కుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు ఇటీవల డిల్లీలో జాతీయ అవార్డును అందుకున్నారు. 

అకడమిక్, మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44వేల పైచిలుకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రతిభ ఆధారంగా అకడమిక్ స్టార్ రేటింగ్, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయ్ లెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్ మెరుగుదలకు రూట్ మ్యాప్ నిర్దేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీచ్ టూల్ ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను అంచనావేసి బోధనా పద్ధతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ-అవగాహన, స్వీయ-నిర్వహణ, కమ్యూనికేషన్, సమస్యల పరిష్కరంతో సహా కీలక నాయకత్వ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని అభిరుచులకు తగ్గట్లుగా మెనూ మార్పు చేశారు. జనవరి నుంచి KGBV స్కూళ్లలో డైట్ ఛార్జీలను ₹1,400 నుండి ₹1,600కి పెంచేలా ఉత్తర్వులు జారీచేశారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల సందర్భంగా, విద్యార్థుల పనితీరుతో పాటు పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో వారు సాధించిన విజయాలను పొందుపరుస్తూ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్‌లు తల్లిదండ్రులకు అందజేశారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారిచే స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్‌లను వివరించే హెల్త్ కార్డ్‌లను కూడా అందజేశారు. 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత ఆరునెలల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల పనివేళలను ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, KGBVలు, AP మోడల్ స్కూల్‌లు, AP రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్‌లను కవర్ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, స్కూల్ బ్యాగ్‌లు ఉచితంగా అందజేశారు. RJDల పర్యవేక్షణలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్‌లు ఏర్పాటుచేశారు. 11వ, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షల కోసం కేంద్రీకృత ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి, ఫిబ్రవరి 2025లో నిర్వహించే రెండు ప్రీ-ఫైనల్ పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థుల ప్రాక్టీస్ కోసం విద్యార్థులందరికీ కొచ్చన్ బ్యాంకులను అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు ప్రతి 10-15 మంది విద్యార్థులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో అనుసంధానం చేస్తూ అన్ని జూనియర్ కళాశాలల్లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. 

రాబోయే ఆరునెలలకు రూట్ మ్యాప్!

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరునెలల్లో చేపట్టాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ రూపొందించారు.  స్కూళ్లవారీగా ఆయా పాఠశాలల వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు "ఒక పాఠశాల-ఒక యాప్" పేరుతో సమగ్ర డాష్‌బోర్డ్ సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సో పో, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేతృత్వంలో స్పోర్ట్స్/గేమ్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు.  విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున మరోమారు మెగా PTM నిర్వహించి విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 1 నుండి 12 తరగతులకు కొత్త యూనిఫారాలు, బ్యాగ్‌లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌, మాన్యువల్‌, నోట్‌బుక్‌లు, రికార్డులను అందజేయాలని నిర్ణయించారు. స్టార్ రేటింగ్‌ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 12 తరగతుల పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. IIT మద్రాస్‌తో కలిసి విద్యా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్‌లైన్ నాయకత్వ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్ ను సమర్థవంతంగా అమలుచేయడంతోపాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  మెరుగుదల, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించారు.  ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ సర్టిఫికేషన్‌తో పాటు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ( NSQF), నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET ) సహకారంతో 11,12వ తరగతుల వృత్తి విద్యార్ధులకు డ్యుయల్ ధృవీకరణ పత్రాలను అందజేసేలా కసరత్తు చేస్తున్నారు.  అన్ని ముఖ్యమైన అకడమిక్ అప్‌డేట్‌లు, సమాచారాన్ని అందజేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో WhatsApp గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూరుశాతం APAAR IDలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

అనిశ్చిత వాతావరణంలో జర్నలిస్టులు

 భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. తరచుగా జర్నలిస్టులు భద్రతా పరమైన  ముప్పును ఎదుర్కొంటున్నారు "ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్" సమన్వయకర్త సుహాస్ చక్మా  తన వార్షిక నివేదిక లో సభ్య సమాజం విస్తుపోయే వివరాలను తెలియ చేసారు. వారు తన నివేదికలో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే..

 "‘2015లో  ప్రాణాలు కోల్పోయిన  జర్నలిస్టుల్లో 76% మంది హత్యలకు గురైనారు.

ఇందులో వృత్తిపరంగా వివిధ సందర్భాల లో సంచలన సమాచారాన్ని బయ్యట పెట్టినందుకు రాజకీయ పరమైన పగ ప్రతీకారాలు తో హత్య లకు గురైనవారి లో జర్నలిస్ట్ లే అధికులు అని ఒక అధ్యయనం వెల్లడించింది.

 ఈ నివేదిక జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను సూచిస్తుంది. '

ఈ జర్నలిస్ట్  హత్యలలో 56%  హత్యలు పేరువున్న రాజకీయ పక్షాల నాయకులు  సామాజిక  సమూహాలు  పాల్పడ్డాయి.  7% హత్యలు వివిధ నేర ముఠాలు చేశాయి ఆని గణాంకాలు చెపుతున్నాయి.

జర్నలిస్ట్ ల పై జరిగిన దాడుల గత చరిత్ర ఇలా వుంటే...

వర్తమానంలో   జర్నలిస్టు లపై జరిగిన దాడులు  జరిగిన హత్యల కు సంబందించి నమోదైన గణాంకాలు పరిశీలిస్తే....

పాత్రికేయులు ఎంత ప్రాణాంతక పరిస్థితులలో పనిచేస్తున్నారో సమాజానికి అర్ధం అవుతుంది

 2024 లోజర్నలిస్టులపై దాడులు విప‌రీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా 226 మందిపై ప్రభుత్వ సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని  వివిధరకాలుగా ఇబ్బందుల కు గురి చేశారు.

చంపబడిన జర్నలిస్టుల వివరాలు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, అస్సాం, మహారాష్ట్ర, బీహార్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 54 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్(25), మణిపూర్(22), యూపీ(20), కేరళ(16), జార్ఖండ్(11), మహారాష్ట్ర, తెలంగాణ8 చొప్పున  హత్యలు ,దాడులు జరిగాయి

అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్(7 చొప్పున), ఛత్తీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఓడిశా(5 చొప్పున), ఏపీ, హర్యానా(4 చొప్పున), పంజాబ్(3), త్రిపుర(2), తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్(ఒక్కరు చొప్పున) దాడులకు హత్యలకు గురి అయ్యారు.

ఇక దేశవ్యాప్తంగా 30 మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది. 

ఢిల్లీలో అత్యధికంగా 12 మంది, కేరళ, మణిపూర్(5 మంది చొప్పున), పశ్చిమ బెంగాల్(3), పంజాబ్(2), ఒడిశా, తెలంగాణ, యూపీ(ఒక్కరు చొప్పున) మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్భంధానికి గురికాగా, తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది.

 'భారత్‌లో సామాజిక ప్రయోజనం కోసం సత్యనిష్ట  తో పాత్రికేయ వృత్తిని అవలంబించే వారి

ప్రాణాలకు భద్రత కరువైంది

సమాజం లోని రాజకీయ సామాజిక వ్యాపార వర్గాల నుండే  కాక అధికార వర్గం నుండి కుడా అత్యంత ప్రాణాంతక క్రూర దాడులకు నిత్యం  గురి అవుతూ జర్నలిజం దేశంలోఅత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది"  అన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం  లా వ్యవహరించే పత్రికా టివి వ్యవస్థ పై జరుగుతున్న దాడులు చూస్తుంటే   ప్రజాస్వామ్యానికి నియంతృత్వ వ్యవస్థ నుండి ఎదురైనా మొదటి హెచ్చరిక లా  '  వుంది ఆనిఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా  ఒక నివేదిక లో విమర్శించారు.

ఎడిటర్స్ గిల్డ్ నివేదికల ప్రకారం

జనవరి 5, 2024: ప్రభాత్ ఖబర్ చీఫ్ ఎడిటర్ మిస్టర్ అశుతోష్ చతుర్వేదిపై జార్ఖండ్ పోలీసులు IPC సెక్షన్లు 469, 501, మరియు 502 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారన్న వార్తలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది

రెసిడెంట్ ఎడిటర్ శ్రీ విజయ్ కాంత్ పాఠక్, అలాగే MD, Mr. రాజీవ్ ఝవార్, మిస్టర్ జోగేంద్ర తివారీ దాఖలు చేసిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా.

డిసెంబర్ 29, 2023: 24 న్యూస్ అనే టెలివిజన్ ఛానల్ రిపోర్టర్‌పై విద్యార్థుల నిరసనకు సంబంధించి కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయడం పైఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది

ఫిబ్రవరి 10, 2024: శుక్రవారం పూణె నగరంలో సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.


 ఫిబ్రవరి 22, 2024: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఒక టీవీ జర్నలిస్టుపై పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా భౌతిక దాడికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన సంఘటనపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 20, 2024: పశ్చిమ బెంగాల్‌లోని సందేస్‌ఖాలీ నుండి రిపబ్లిక్ బంగ్లా టివి ఛానల్  పనిచేస్తున్న టీవీ జర్నలిస్ట్‌ని సోమవారం అరెస్టు చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

 సున్నితమైన రాజకీయ అంశాలు మరియు నేర కార్యకలాపాలపై నివేదించడం వల్ల  జర్నలిస్ట్ లు ఎదుర్కొనే ప్రమాదాలను  పై సంఘటనలు తెలియ చేస్తున్నాయి.

 భారతీయ జర్నలిస్టులు ఎంత ప్రమాద కర పరిస్థితులలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో పై ఘటనలు నొక్కి చెబుతున్నాయి

, ముఖ్యంగా అవినీతి, నేరాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించే  సమాచారం వారిని మరిన్ని ప్రమాద కర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి.

వాస్తవ పరిస్థితులు ఇలా వుండగా

తెలంగాణా లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి  2006-2008 మధ్య జర్నలిస్ట్ గృహ వసతి కోసం కేటాయించిన 72 ఎకరాలకు సంబందించి తుది తీర్పులో

  "రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు స్తంభాలు గా నిలిచే శాసన ,కార్యనిర్వహక ,న్యాయ, మీడియా వ్యవస్థలు కలిసి స్వప్రయోజనాల రక్షణ లో భాగంగా విలువైన ప్రభుత్వ ఆస్తులను స్వంతం చేసుకోవాలి ఆని కుట్ర చేసారు.

 జర్నలిస్టులు తమ తమ వృత్తిపరమైన బాధ్యతల నుండి తప్ప్పుకోవటానికి లేదా సమాజంలో జరిగే తప్పులను కప్పిపుచ్చుడానికి  సిద్దం అయ్యారు.

 ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాల వంటి వ్యవస్థలలో జరిగే తప్పులకి అనుకూలంగా ఉన్నారని "జస్టిస్ ఖన్నా తన యొక్క పరిశీలన గా చెప్పుకొచ్చారు.

కానీ పై ఘటనలు  పరిశీలించి చూస్తే జస్టిస్ ఖన్నా పరిశీలనకు పూర్తి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు వున్నాయి

కాబట్టి దయచేసి గౌరవ సుప్రీం కోర్టు వారు  సమాజంలో పాత్రికేయుల వాస్తవ స్థితిగతులను దృష్టి లో పెట్టుకుని  మానవీయ దృష్టి లో పెట్టుకుని..ఆర్టికల్ 15 (4)

ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రత్యేక సమూహంగా గుర్తించి మా హక్కులను పరిరక్షిస్తూ..

మా జీవన స్థితి గతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కనీస అవసరాలు ఆయిన గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తూ జస్టిస్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ భట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున పరిశీలించి ...పాత్రికేయ సమాజానికి తగు న్యాయం చెయ్యాలని ప్రార్ధిస్తున్నాం!!

2015లో  జగేంద్ర సింగ్  మరణం

2015 నుండి జర్నలిస్ట్ లపై  జరిగిన   హత్యా ప్రయత్నాలలో మొదటిది జగేంద్ర సింగ్ పై అనబడే వ్యక్తి పై జరిగింది. , ఇతను ఒక జర్నలిస్ట్ ఫ్రీలాన్సర్,  జూన్ 2015లో పోలీసులు చేసిన క్రూర దాడిలో   తీవ్రమైన కాలిన గాయాలతో మరణించాడు.  ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై ఆయన పనిచేస్తున్నారు .

2016లో  ఉత్తరప్రదేశ్‌లో  జనసందేశ్ టైమ్స్ రిపోర్టర్  కరుణ్ మిశ్రా , ఈశాన్య రాష్ట్రమైన బీహార్‌లో హిందుస్థాన్  రిపోర్టర్  రంజన్ రాజ్‌దేవ్ హత్యకు గురయ్యారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై వారి పని ఫలితంగా  మోటార్‌సైకిళ్లపై వచ్చిన అగంతకులు ఈ ఇద్దరూ  జర్నలిస్ట్ లను కాల్చి చంపారు . 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  న్యూస్ వరల్డ్ లోకల్ టీవీ ఛానెల్ కోసం ఇసుక మాఫియా సమాచారాన్ని కవర్ చేస్తున్న  సందీప్ శర్మ అనే రిపోర్టర్, ను 2018 మార్చిలో ఉద్దేశపూర్వకంగా అతనిని తన వాహనం నుండి బలవంతంగా  కిందకి దింపి డంపర్-ట్రక్కుతో గుద్ది  హత్య చేశారు.

కాంపు మెయిల్ స్థానిక వార్తాపత్రిక  లో రిపోర్టర్   గా పని చేస్తున్న శుభం మణి త్రిపాఠి   2020 జూన్‌లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇసుక మాఫియా అక్రమ దోపిడీ కేసులపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి నందునతనను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన అతి కొద్ది కాలంలో  కాల్చి చంపబడ్డాడు .

ఇసుక మాఫియాపై సంచలన కథనాలు ను ప్రచురించిన  ఫ్రీలాన్స్ రిపోర్టర్  సుభాష్ కుమార్ మహ్తోను మే 2022లో బీహార్‌లోని తన ఇంటి వెలుపల నలుగురు గుర్తుతెలియని హంతకులు  తలపై కాల్చి చంపారు.

 6 ఫిబ్రవరి 2023 అక్రమ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ లాబీయిస్ట్ అక్రమాలను వెలికి తీసిన పుణ్యానికి  పరిశోధనాత్మక పాత్రికేయుడు శశికాంత్ వారిషే నీ  నడి రోడ్డులో జరిగిన దాడిలో తగిలినగాయాలతో మరణించారు.

2014 నుండి  జర్నలిజంకు సంబంధించి   హత్యకు గురి కాబడిన వారిలో  మరో 15 మంది జర్నలిస్టులు అవినీతి, వ్యవస్థీకృత నేరాలు, ఎన్నికలు మరియు మావోయిస్టుల తిరుగుబాటుకు సంబంధించిన కథనాలను రూపొందించినందుకు రాజకీయ సామాజిక ఆర్థిక  అరాచక శక్తులకు లక్ష్యంగా  మారి  హత్య చేయబడ్డారు

చనిపోయిన 28 మందిలో మహిళ. గౌరీ లంకేష్  ఒకరు. బడుగు బలహీన బాధిత ప్రజల కోసం పని చేస్తున్న గౌరీ లంకేష్ కర్ణాటకలో అధికార పార్టీ కోపానికి గురి అయ్యి చాలా విధాలుగా హింసాత్మకమైన ఆన్‌లైన్ వేధింపులకు గురైన తర్వాత  ఆమె  సెప్టెంబర్ 2017లో బెంగుళూరులోని తన ఇంటి వెలుపల అరాచక శక్తులుచే కాల్చి చంపబడింది .

ఈ వివరాలు అన్నీ RWB  రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన వార్షిక నివేదికలో పొందు పరిచింది. RSF యొక్క 2023 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానంలో ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం.

Dec 9, 2024

సృష్టి రహస్యాలు

1  *సృష్టి * ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి


( సృష్ఠి )  ఆవిర్బావం.

1  ముందు  (పరాపరము) దీనిలో శివం పుట్టినది

2  శివంలో  శక్తి

3  శక్తిలో  నాధం

4  నాధంలో  బిందువు

5  బిందువులో  సదాశివం

6  సదాశివంలో మహేశ్వరం

7  మహేశ్వరంలో ఈశ్వరం

8  ఈశ్వరంలో  రుద్రుడు

9  రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11  బ్రహ్మ యందు ఆత్మ

12  ఆత్మ యందు దహరాకాశం

13  దహరాకాశం యందు వాయువు

14  వాయువు యందు అగ్ని

15  ఆగ్ని యందు జలం

16  జలం యందు పృథ్వీ. 

17. పృథ్వీ యందు ఓషధులు

18. ఓషదుల వలన అన్నం

19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం.

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఎంతో మంది శివులు  

ఎంతోమంది విష్ణువులు  

ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 

ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.

ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.


1 కృతాయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం


నాలుగు యుగాలకు 1 మహయుగం.

71 మహ యుగాలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)

15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)

1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  

1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)

2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.


ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 

శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.


5 గురు భాగాన కాలంకు 60 సం

1 గురు భాగాన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు  3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం.  2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు


పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.


సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.

దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.

1  సత్వ గుణం 

2  రజో గుణం

3  తమో గుణం


( పంచ భూతంలు ఆవిర్భావం )

1 ఆత్మ యందు ఆకాశం 

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5  ఙ్ఞానేంద్రియంలు

5  పంచ ప్రాణంలు

5  పంచ తన్మాత్రలు

5  ఆంతర ఇంద్రియంలు

5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు


1  ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచీకరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచీకరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )

జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )

భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )

భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.


( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు

1  శబ్ద

2  స్పర్ష

3  రూప

4  రస

5  గంధంలు.


5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు

2  చర్మం

3  కండ్లు

4  నాలుక

5  ముక్కు


5  ( పంచ ప్రాణంలు )

1  అపాన 

2  సామనా

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన


5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )

1  మనస్సు

3  బుద్ది

3  చిత్తం

4  జ్ఞానం

5  ఆహంకారం


1  వాక్కు

2  పాని

3  పాదం

4  గుహ్యం

5  గుదం


6  (  అరిషడ్వర్గంలు  )

1  కామం

3  క్రోదం

3  మోహం

4  లోభం

5  మదం

6  మాత్సర్యం


3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం

2  సూక్ష్మ  శరీరం

3  కారణ  శరీరం


3  (  అవస్తలు  )

1  జాగ్రదావస్త

2  స్వప్నావస్త

3  సుషుప్తి అవస్త


6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట

2  పుట్టుట

3  పెరుగుట

4  పరినమించుట

5  క్షిణించుట

6  నశించుట


6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి

2  దప్పిక

3  శోకం

4  మోహం

5  జర

6  నాధం


.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం

2  రక్తం

3  మాంసం

4  మేదస్సు

5  మజ్జ

6  ఎముకలు

7  శుక్లం


3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు

2  తైజుడు

3  ప్రఙ్ఞుడు


3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు

2  అగామి  కర్మలు

3  సంచిత  కర్మలు


5  (  కర్మలు  )

1  వచన

2  ఆదాన

3  గమన

4  విస్తర

5  ఆనంద


3  (  గుణంలు  )

1  సత్వ గుణం

2  రజో గుణం

3  తమో గుణం


9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప

2  అధ్యాసాయం

3  ఆభిమానం

4  అవధరణ

5  ముదిత

6  కరుణ

7  మైత్రి

8  ఉపేక్ష

9  తితిక్ష


10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )

      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం

2  వాయువు

3  ఆగ్ని

4  జలం

5  భూమి


14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు

2  వాయువు

3  సూర్యుడు

4  వరుణుడు

5  అశ్వీని దేవతలు

6  ఆగ్ని

7  ఇంద్రుడు

8  ఉపేంద్రుడు

9  మృత్యువు

10  చంద్రుడు

11  చతర్వకుడు

12  రుద్రుడు

13  క్షేత్రజ్ఞుడు

14  ఈశానుడు


10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి

2  పింగళ

3  సుషుమ్నా

4  గాందారి

5  పమశ్వని

6  పూష

7  అలంబన

8  హస్తి

9  శంఖిని

10  కూహు

11  బ్రహ్మనాడీ


10  (  వాయువులు  )

1  అపాన

2  సమాన

3  ప్రాణ

4  ఉదాన

5  వ్యాన

6  కూర్మ

7  కృకర

8  నాగ

9  దేవదత్త

10  ధనంజమ


7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార

2  స్వాదిస్థాన

3  మణిపూరక

4  అనాహత

5  విశుద్ది

6  ఆఙ్ఞా

7  సహస్రారం


(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగుళంలు

8  జానల పోడవు

4  జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62  కీల్లు

37  ముారల ప్రేగులు

1  సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4  సేర్లు మాంసం

1  సేరెడు పైత్యం

అర్దసేరు శ్లేషం


(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7

1  భూలోకం  -  పాదాల్లో

2  భూవర్లలోకం  -  హృదయంలో

3  సువర్లలోకం  -  నాభీలో

4  మహర్లలోకం  -  మర్మాంగంలో

5  జనలోకం  -  కంఠంలో

6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో


అధోలోకాలు  7

1  ఆతలం  -  అరికాల్లలో

2  వితలం  -  గోర్లలో

3  సుతలం  -  మడమల్లో

4  తలాతలం  -  పిక్కల్లో

5  రసాతలం  -  మొకాల్లలో

6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం  -  పాయువుల్లో


(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం

2  ఇక్షి సముద్రం  -  చెమట

3  సూర సముద్రం  -  ఇంద్రియం

4  సర్పి సముద్రం  -  దోషితం

5  దది సముద్రం  -  శ్లేషం

6  క్షీర సముద్రం  -  జోల్లు

7  శుద్దోక సముద్రం  -  కన్నీరు


(  పంచాగ్నులు  )

1  కాలాగ్ని  -  పాదాల్లో

2  క్షుదాగ్ని  -  నాభిలో

3  శీతాగ్ని  -  హృదయంలో

4  కోపాగ్ని  -  నేత్రంలో

5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో


7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబుా ద్వీపం  -  తలలోన

2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన

3  శాక ద్వీపం  -  శిరస్సుపైన

4  శాల్మల ధ్వీపం  -  చర్మంన

5  పూష్కార ద్వీపం  -  గోలమందు

6  కూశ ద్వీపం  -  మాంసంలో

7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో


10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం

2  భేరి  -  నాధం

3  చణీ  -  నాధం

4  మృదంగ  -  నాధం

5  ఘాంట  -  నాధం

6  కీలకిణీ  -  నాధం

7  కళ  -  నాధం

8  వేణు  -  నాధం

9  బ్రమణ  -  నాధం

10  ప్రణవ  -  నాధం

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...