అమరావతి: ఏపీ 16వ శాసనసభ మొదటి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మొదటి విడత సమావేశాలు జూన్ 21, 22 తేదీలు రెండు రోజులు, రెండో విడత సమావేశాలు ఈ నెల 22 నుంచి 26 వరకు మొత్తం ఐదు రోజులు నిర్వహించినట్లు శాసనసభ స్పీకరు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ నెల 22న గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే సభా నిర్వహణకు సంబంధించి గణాంకాలను విడుదల చేశారు. మొత్తంమీద సభ 27 గంటల 22 నిమిషాలు నడిచిందని తెలిపారు. మౌఖికంగా సమాధానం చెప్పిన స్టార్ ప్రశ్నలు 36, సభలో సమాధానం ఇచ్చిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు 1, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు 3, ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య 2, ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య 2, ప్రసంగాలు 68 మంది, 344వ నియమం కింద చర్చ ఒక ప్రశ్నపై నడిచిందని స్పీకరు వెల్లడించారు. సభలో రాజకీయ పక్షాల బలాబలాలు టిడిపి 135 మంది, జనసేన 21, వైసిపి 11, బిజెపి 8 మంది మొత్తం 175 మంది సభ్యులు అని స్పీకరు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
సభ ప్రారంభమైన రోజు వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కేవలం 15 నిమిషాలు కూడా పాల్గొనకుండా సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
No comments:
Post a Comment