Mar 15, 2021

హిందూ వివాహం - ఆచారవ్యవహారాలు

 వివాహ పద్ధతులు 

కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే  వివాహం బ్రహ్మ వివాహం  

యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా  ఇవ్వడం - దైవవివాహం.

ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం - ఆర్ష వివాహం.

మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణిగా   ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం - ప్రాజాపత్య వివాహం. 

తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం  గాంధర్వ వివాహం.  

షరతు పెట్టి వివాహం చేసుకోవడం - అసుర వివాహం.  

కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం - రాక్షస వివాహం.

కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు అనుభవించి ,చేసుకున్న వివాహం - పైశాచిక వివాహం.

పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు  తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదెందుకు?

మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో  పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని,  జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని.  జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెళ్ల యిపోయిన ట్లు.

తలంబ్రాలు పోసుకునే దెందుకు??

ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు.  ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ....ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.

సప్తపది అనగా ఏంటి?

వధువుని  ఏడడుగులు నడిపిస్తూ.... నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి.  ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.

పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి?

పెళ్ళికొడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను,  నా, నీ జీవనం  ఈ క్షణం నుండి ప్రారంభం.  నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు.  పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ,  పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం.   

పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు?

ఓ పెండ్లి కూమారుడా  పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని,  ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను.  ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను....

"ఓ వరుడా......నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి,  నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను" అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి,  శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.

 నల్ల పూసలు ధరించేది ఎందుకు?

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం.  దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా  ఉండటానికి ముక్యంగా ధరిస్తారు.  అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు.  నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భర్త, భార్యను ఎప్పుడు తాకాలి?

వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి  బ‌ట్ట‌లు ఇవ్వాలి. అన్ని వైపుల నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి.  అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.

భార్య, భర్తకు ఏ వైపుగా  ఉండాలి?

సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.   కన్యాదాన సమయాన, విగ్రహ ప్ర‌తిష్ఠ‌ల స‌మ‌యంలో   కుడి వైపున ఉండాలి. 

బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి.   శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు. 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...