v
34 వేల ఎకరాల భూ సమీకరణ
v
తాత్కాలిక శాసనసభ,
సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణం
v
రూ.40వేల కోట్ల వ్యయంతో
కొనసాగుతున్న 36 ప్రాజెక్టుల నిర్మాణాలు
v
65 ప్రభుత్వ, ప్రైవేటు
సంస్థలకు 13 వందల ఎకరాల కేటాయింపు
v
రాజధాని తరలింపు భారీ
వ్యయంతో కూడిన పని
v
అనుకూలంగా లేని రాష్ట్ర
ఆర్థిక పరిస్థితి
v
అభివృద్ధి వికేంద్రీకరణకు
కొన్ని ముఖ్య నగరాలపై దృష్టి
v
రాయలసీమలో హైకోర్టు బెంచ్
ఏర్పాటుకు అవకాశం
v
కొంత భూమి రైతులకు తిరిగి
ఇచ్చే ఆలోచన

గుంటూరు జిల్లా తుళ్లూరు,
మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని 29 గ్రామాలను కలుపుకొని 217.23 చదరపు కిలోమీటర్ల
విస్తీర్ణాన్ని రాజధాని అమరావతిగా ప్రకటించారు. ఈ గ్రామాలకు చెందిన 28,158 మంది
రైతుల నుంచి 34 వేలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతులకు
చాలా వరకు ప్లాట్లు పంపిణీ చేశారు.
తాత్కాలిక శాసనసభ, శాసనమండలి,
సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అక్కడ నుంచే చట్టాలు రూపొందించండం, పరిపాలన,
కోర్టు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు 65 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 13
వందలకు పైగా ఎకరాల భూమి కేటాయించారు. కొన్ని సంస్థలకు అప్పగించారు. వందల ఎకరాలలో
ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అనేక నిర్మాణాలు
జరుగుతున్నాయి. విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలు ఇక్కడ క్యాంపస్‌లు
నిర్వహిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర
అధికారులకు సంబంధించి ప్రభుత్వ వసతి గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. రాజధానిలో
ప్రతి పేదకు కట్టించే ఇళ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి అయింది. కొన్నిటి నిర్మాణం
పూర్తి కాగా, కొన్నిటి నిర్మాణం చివరి దశలో ఉన్నాయి.
రాజధానిలో రూ.40వేల కోట్ల
విలువైన 36 ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు
35 రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తి అయ్యాయి. పది వంతెనలు
నిర్మించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. గత
ఏడాదే దానిని ప్రారంభించారు. మౌలిక వసతులకు సంబంధించిన పలు పనులు మధ్యలో
ఆగిపోయాయి. కొద్దిపాటి వ్యయంతో పలు భవనాల నిర్మాణం పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఆ
భవనాలన్నిటినీ ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఇక్కడ ఇంత వ్యయం చేసి, ఇన్ని నిర్మాణాలు
జరిగిన తరువాత రాజధానిని తరలించే ఆలోచన ప్రభుత్వం చేయదన్న అభిప్రాయం పలువురు
వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గానీ, బీజేపీ ఎంపీ గానీ మాట్లాడుతున్న మాటల ప్రకారం అభివృద్ధి
వికేంద్రీకరణకు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. 1. రాజధాని
అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలను నిదానంగా పూర్తి చేయడం. 2. రాజధానికి
ఇంత భూమి వద్దనుకుంటే కొంత భూమి రైతులకు తిరిగి ఇచ్చే అవకాశం. దానికి విధి
విధానాలు రూపొందించండ. 3.అధికార వికేంద్రీకరణలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యత
ఆధారంగా విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి, కర్నూలులలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు
ఏర్పాటు చేయడం. 4. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం. 5.పారిశ్రామిక
వికేంద్రీకరణ కోసం విశాఖ, తిరుపతి, దొనకొండ, అనంతపురంలపై ప్రత్యేక శ్రద్ధ. 6.రాష్ట్రమంతటితోపాటు
సముద్ర తీరం వెంట పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం.... వంటి నిర్ణయాలు తీసుకునే
అవకాశం ఉంది. రాజధానిని తరలించడం గానీ, రెండు మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేయడం
గానీ అత్యంత వ్యయంతో కూడుకున్న పని. ప్రస్తుతం రాజధాని కోసం అంత వ్యయం చేసే
పరిస్థితిలో రాష్ట్రం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు
‘నవరత్నాల’ అమలుకు భారీ వ్యయం అవుతుంది. ప్రభుత్వం దృష్టంతా నవరత్నాలపైనే ఉంది.
అయితే రాజధాని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరిగే సమయంలో త్వరలో ప్రభుత్వం
ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
- శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914
No comments:
Post a Comment