సమాచార గని కంటెంట్
కార్పొరేషన్
ఏపీలో సమాచార విప్లవం
సమాచార సాంకేతిక రంగంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఇ-ప్రగతి
ప్రభుత్వంలోని అన్ని శాఖలకు విస్తరిస్తోంది. ‘ఈ-ప్రగతి’
మొదటిదశ కింద
ముందుగా 14 శాఖల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండు-మూడు దశల్లో మిగిలిన శాఖలను అనుసంధానిస్తారు.
ఇన్నోవేషన్
హ్యాక్‌థాన్, ఆర్టీజీ, ఫైబర్‌గ్రిడ్, ఐవోటీ పురోగతిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
డెవలప్‌మెంట్
ప్లాట్‌ఫామ్, బిగ్ డేటా ప్లాట్‌ఫామ్
పూర్తయ్యాయి. ‘ఈ-ప్రగతి’
ద్వారా
ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పరిపాలన
తదితర శాఖలలో ఇ-ప్రగతి ప్రవేశపెట్టడంతో పనులలో వేగం పెరిగింది. ప్రజల సంతృప్తిని కొలిచేందుకు కూడా
‘ఈ-ప్రగతి’
దోహదపడుతుంది. ఇదంతా ఒక
ఎత్తయితే సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో ఎత్తు. అన్ని శాఖల
సమాచారం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాచార
విప్లవానికి స్వాగతం పలుకుతోంది. అన్ని ప్రభుత్వ శాఖలలో వివిధ
అంశాలకు సంబంధించిన సమాచారం, అభివృద్ధికి దారి తీసిన అంశాలు, అభివృద్ధి
క్రమం, వ్యవసాయం, పరిశ్రమలు,
సేవల రంగాలలో
నూతన పోకడలకు సంబంధించి సమగ్ర సమాచారం అటు ప్రభుత్వ అధికారులకు, ఇటు ప్రజలకు
అందుబాటులోకి తీసుకురావడానికి కంటెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.
2018 ఫిబ్రవరి 2న జరిగిన మంత్రి మండలి సమావేశం ఏపీ
కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.
ఏపీ రాష్ట్ర
ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)కు అనుబంధంగా దీనికి ఏర్పాటు చేశారు. దీనికి
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతోపాటు సీఈఓని కూడా ప్రభుత్వం నియమించింది.
ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ కంటెంట్ కార్పోరేషన్ కు చైర్మన్,
మేనేజింగ్
డైరెక్టర్ గా ఉంటారు. ఆర్థిక,
విద్యుత్, మౌలిక
సదుపాయాలు, పెట్టుబడులు, విద్య,
వైద్య, వ్యవసాయ, సహకార శాఖల
అదనపు కార్యదర్శి లేక జాయింట్ సెక్రటరీ లేక డిప్యూటీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ , సమాచార పౌరసంబంధాల శాఖల నుంచి ఒక్కొక్కరిని
నామినేట్ చేస్తారు. కార్పోరేషన్ సీఈఓ కూడా డైరెక్టర్ గా ఉంటారు.
ప్రతి మనిషికి సమాచారం,
విషయ
పరిజ్ఞానం ప్రాథమిక అవసరంగా ప్రభుత్వం గుర్తించింది. నవంబర్ 30న జరిగిన 18వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటెంట్ కార్పొరేషన్ రూపొందించిన పోర్టల్‌ను ప్రారంభించారు. కొద్ది
రోజుల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914
No comments:
Post a Comment