Feb 13, 2013
ప్రజా రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర సమాచారం, పౌర సంబంధాల శాఖ(ఐ అండ్ పీఆర్) పీఆర్‌ఓ(ఓఎస్) శిరందాసు నాగార్జున రావు రాసిన ‘ప్రజారాజధాని’ అమరావతి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం ఒకటవ బ్లాక్‌లో బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుండి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల ఏర్పాటు, ల్యాండ్‌పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటివరకు జరిగిన జరుగుతున్న ప్రభుత్వ, ప్రవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నింటిని ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫొటోలను ఇందులో పొందుపరిచారు. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పీఎస్ శ్రీనివాసరావు, పీఆర్వో పారుపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment