Jun 21, 2019


  జిల్లా కలెక్టర్ల సమావేశ వేదిక మార్పు
         సచివాలయం, జూన్ 21 : ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం స్థలంలో మార్పు జరిగినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో జరగవలసిన ఈ సమావేశం ఉండవల్లి సమీపంలోని కరకట్ట పక్కన ఉన్న ప్రజావేదిక వద్ద జరుగుతుందని ఆయన  పేర్కొన్నారు.

Jun 20, 2019


మానవేంద్రనాథ్ రాయ్, వెంకట రమణలు
హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం
     అమరావతి, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం చీకటి మానవేంద్రనాథ్ రాయ్, మఠం వెంకట రమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించగా,  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. 

Jun 12, 2019


శాసనసభాపతిగా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవం
మంత్రి బొత్స సత్యనారాయణ
          సచివాలయం, జూన్ 12: శాసన సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. శాసన సభాపతి పదవికి తమ్మినేని సీతారామ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదించి సుదీర్ఘ  రాజకీయ అనుభవం కలిగిన సీతారామ్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. సీతారామ్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మూడు సార్లు మంత్రిగా పని చేశారని చెప్పారు. సభ విలువలు, గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరొకరు ఎవరూ నామినేషన్ వేయనందున నిబంధనల ప్రకారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని చెప్పారు. మంత్రి బొత్స వెంట ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.  ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీతారామ్ కు మంత్రి బొత్స, చీఫ్ విప్ శ్రీకాంత్ లు  అభినందనలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
      
      సచివాలయం, జూన్ 12:  ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి బుధవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో ని తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆయన బ్లాక్ వద్దకు రాగానే వేద పండితులు, సంబంధిత శాఖల అధికారులు స్వాగతం పలికారు. తన పేషీలో పూజా కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సంఖ్య పెంపు ఫైల్ పైన, తరువాత కమర్షియల్ టాక్స్ విభాగంలోని ఒక ఉద్యోగి మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు ఫైల్  పైన సంతకాలు చేశారు.  ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు ఆయనకు పుష్ప గచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Jun 11, 2019


సమాచార శాఖ కమిషనర్ గా విజయ కుమార్ రెడ్డి
       
         సచివాలయం, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా తుమ్మా విజయకుమార్ రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్ కు చెందిన విజయ కుమార్ రెడ్డి డిప్యుటేషన్ పై రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది.  దాంతో ఆయన ఈ నెల 10వ తేదీన సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయడంతో మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు.

Jun 10, 2019

ఆంధ్రప్రదేశ్ మంత్రులు - శాఖలు- ఫోన్ నెంబర్లు


ఉపముఖ్యమంత్రులు

పిల్లి సుభాష్ చంద్రబోస్ -  రెవెన్యూ శాఖ   -9440522229

అంజాద్ బాషా - మైనారిటీ సంక్షేమ శాఖ   -9948020786

ఆళ్ల నాని - వైద్య ఆరోగ్య శాఖ  -9848509999

నారాయణ స్వామి - ఎక్సైజ్ ,వాణిజ్య పన్నుల శాఖ  -9849034091

పాముల పుష్ప శ్రీవాణి- గిరిజ సంక్షేమ శాఖ -7674084463

మంత్రులు
మేకతోటి సుచరిత - హోం,విపత్తు నిర్వహణ -9908355663

బొత్స సత్యంన్నారాయణ - మున్సిపల్,పట్టణాభివృద్ధి -7997511999

ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు-  పర్యాటక,సాంస్కృతిక -9849555252

మేకపాటి గౌతం రెడ్డి-ఐటీ, పరిశ్రమల శాఖ -9849020556

కురసాల కన్నబాబు -వ్యవసాయ,సహకార శాఖ -9848172411

తానేటి వనిత -మహిళ ,శిశు సంక్షేమ శాఖ-9490032112

కొడాలి నాని -పౌర సరఫరాల శాఖ -9100229567

వెలంపల్లి శ్రీనివాసరావు - దేవాదాయశాఖ -9440611111

మోపిదేవి వెంకటరమణ -పశు సంవర్ధన,మత్స్య శాఖ -9849122337

అనిల్ కుమార్ -జలవనరుల శాఖ -7873456789

పినిపే విశ్వరూప్ -సాంఘిక సంక్షేమ శాఖ-8106990234

శ్రీరంగనాథ -గృహనిర్మాణ శాఖ   -9848135555

పేర్ని నాని - రవాణా,సమాచార శాఖ -9440227099

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి-9010158888

ధర్మాన కృష్ణదాస్ - రోడ్డు,భవనాల శాఖ -9440195666

బుగ్గన రాజేంద్రనాథ్ - ఆర్ధిక,ప్రణాళిక శాఖ -9000526788

ఆధిమూలపు సురేష్ - విద్య శాఖ -9440383942

గుమ్మునురు జయరాం - కార్మిక శాఖ  -9849939171

బాలినేని శ్రీనివాసరెడ్డి - విద్యుత్,అటవీ, పర్యావరణ శాఖ             -9885999666

శంకర నారాయణ - బీసీ సంక్షేమ శాఖ   -9391745699

మంత్రుల ఛాంబర్లు



2వ బ్లాక్
మేకతోటి సుచరిత - హోం శాఖ మంత్రి  - 136
పిల్లి సుభాష్ చంద్రబోస్‌ - డిప్యూటీ సీఎం -215
కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) -208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -  135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) – 137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)-2111
బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)- 212
3వ బ్లాక్
పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)-2111
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్‌(పర్యాటక శాఖ)- 210
4వ బ్లాక్
నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌)- 127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)- 130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)- 132
అనిల్ కుమార్ యాదవ్‌(జలవనరుల శాఖ)-212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)-208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131
5వ బ్లాక్
ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)- 191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)- 193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)-210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పంచాయతీ రాజ్,  రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188

Jun 8, 2019

మంత్రుల బయోడేటా


మోపిదేవి వెంకటరమణారావు
పేరు : మోపిదేవీ వెంకటరమణారావు
పుట్టిన తేదీ : 06-08-1964
స్వగ్రామం : నిజాంపట్నం
తల్లిదండ్రులు : నాగులమ్మ, వీరరాఘవయ్య
విద్యార్హత : బీఏ
భార్య  : అరుణాభాస్కరి
సంతానం : రాజీవ్, జస్మిత
నియోజకవర్గం : రేపల్లె
రాజకీయ నేపథ్యం : కాంగ్రెస్ తరఫున 1984లో ఎంపీపీగా ఎన్నిక. 1989, 1994లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున కూచినపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009లో రేపల్లే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలుపు. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున రేపల్లెలో పోటీ ఓటమి. 2019లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపు.
మేకతోటి సుచరిత

ఎమ్మెల్యే పేరు : మేకతోటి సుచరిత
స్వస్థలం : ఫిరంగిపురం
పుట్టిన తేదీ : 25:12:1972
విద్యార్హత  :  బాచిలర్ ఆఫ్ సైన్స్ , డిస్టెంట్ ఎడ్యుకేషన్ , మదురై కామరాజు యూనివర్సిటీ, మదురై.
భర్త పేరు : మేకతోటి దయాసాగర్
వివాహం : 21:05:1995
సంతానం :  హర్షిత (కుమారుడు), రితిక (కూతురు)
రాజకీయ ప్రవేశం : 2006 లో ఫిరంగిపురం జడ్పీటీసీ గా చేశారు.
2006 నుంచి 2009 వరకు జడ్పీటీసీగా పని చేశారు.
ఎమ్మెల్యేగా తొలి ప్రస్థానం :
2009 రాష్ట్రంలో జరిగిన పునర్విభజనలో  ప్రత్తిపాడు నియోజకవర్గం   ఎస్సీ రిజర్వుడు అయింది. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం లో  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 2042 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టారు. 2012లో వైకాపా ఆవిర్భావంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 16781 ఓట్ల భారీ మెజారిటీతో రెండో సారి  గెలుపొందారు. 2014లో వైకాపా తరుపున మరోసారి పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో 7405 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
తిరిగి 2019లో వైకాపా తరఫున మరోసారి పోటీ చేసి 7398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బాలనేని శ్రీనివాసరెడ్డి  :
పేరు : బాలినేని శ్రీనివాసరెడ్డి
స్వస్థలం : కొణిజేడు గ్రామం, ఒంగోలు
పుట్టిన తేదీ : 12-12-1964
విద్యార్హత : బీఎస్సీ
తల్లిదండ్రులు : బాలినేని రమాదేవి, వెంకటేశ్వరరెడ్డి
భార్య : శచీ దేవి
సంతానం : ప్రణీత్ రెడ్డి,కావ్య(కోడలు)
రాజకీయ ప్రస్థానం : జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009 ఎన్నికల తరవాత రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, చేనేత జైళి శాఖ మాత్యులు బాధ్యతల నిర్వహణ. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో వైసీపీ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలుపు.

మేకపాటి గౌతమ్ రెడ్డి  :
పేరు : మేకపాటి గౌతమ్ రెడ్డి
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్ రెడ్డి(మాజీ ఎంపి), మణిమంజరి
పుట్టిన తేదీ : 02-11-1971
విద్యార్హత : ఎమ్మెస్సీ
భార్య :  శ్రీకీర్తి,
సంతానం : సాయి అనన్య(కుమార్తె), కృష్ణార్జున్ రెడ్డి(కుమారుడు)
సోదరులు : ఫృద్విరెడ్డి, విక్రమ్ రెడ్డి
వ్యాపార ప్రవేశం : 1997లో కేఎంసీ కనస్ట్రక్షన్ కంపెనీలో
రాజకీయ నేపథ్యం : 2014లో వైసీపీ తరఫున ఆత్మకూరు శాసనసభ్యునిగా గెలుపు. 2019లోనూ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా    ఎన్నిక.
అనిల్ కుమార్ యాదవ్ :
పేరు : అనిల్ కుమార్ యాదవ్
తండ్రి : తిరుపాలయ్య
విద్యార్హత : బీడీఎస్
భార్య : జాగృతి
సంతానం : సమన్వి, దర్శనందన్
రాజకీయ నేపథ్యం : 2008 లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా ఎన్నిక. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 2014, 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపు.

డాక్టర్ ఆదిమూలపు సురేష్ :
పేరు : డాక్టర్ ఆదిమూలపు సురేష్
విద్యార్హత : బీఈ, ఎంటెక్, పీహెచ్డీ
భార్య : విజయలక్ష్మి( కమిషనర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్, ఏపీ, టీఎస్)
సంతానం : విశాల్(కుమారుడు), శ్రీస్టి(కుమార్తె)
రాజకీయ నేపథ్యం : 2009లో కాంగ్రెస్ తరఫున ఎర్రగుండపాలెం నుంచి ఎమ్మెల్యే గెలుపు. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో ఎర్రగుండపాలెం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు. ఏపీ అసెంబ్లీ కమిటీల్లో సభ్యునిగా పనిచేసిన అనుభవం. వైసీపీలో క్రియాశీలక నేతగా గుర్తింపు.

Jun 5, 2019

సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజేయ్ కల్లం


  
  సచివాలయం, జూన్ 5:  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం సచివాలయం మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం  పదవీబాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన  సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన(రాజకీయ వ్యవహరాలు) ముఖ్య కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా, ఏపీ ట్రాన్స్ కో ముఖ్య కార్యదర్శి  శ్రీకాంత్ నాగులాపల్లి, పలువురు ఇతర అధికారులు  అజేయ్ కల్లంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...