Aug 23, 2018


వైద్య ఆరోగ్యశాఖకు ప్రపంచ బ్యాంక్ నిధులు

              సచివాలయం, ఆగస్ట్ 22: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలలో వివిధ వ్యవస్థల బలోపేతానికి నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకరించింది. మోహినీ కాక్ నాయకత్వంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసింది. సచివాలయం 5వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో వారు సమావేశమై నిధులు మంజూరుకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు నిధులు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...